పెరిగిపోతున్న ఫాసిస్టు సాంస్కృతిక ఉన్మాదం - అరణ్య

పెరిగిపోతున్న

(అరణ్య రాసిన ఈ వ్యాసం వీక్షణం మాసపత్రిక‌ డిసంబర్, 2017 సంచికలో ప్రచురించబడినది)

ఒక జాతికి, సారూప్య మానవ సముదాయాలు కలిగిన భౌగోళిక ప్రాంతానికి సంస్కృతి అనేది జీవన విధానపు ప్రధాన సూచిక. సంస్కృతిని కలిగి ఉండడం, దాన్ని తయారు చేసుకోవడం, దానిలో మార్పులు చేసుకోవడం, దాన్ని రక్షించుకోవడం వంటి సాంస్కృతిక గమనంలోని అంశాలన్నీ తరతరాలుగా అనేక మానవ సముదాయాలలో కొనసాగుతూ వస్తున్నవి. ఏ ప్రాంతానికాప్రాంతం, ఏ జాతికాజాతి, ఏ అస్తిత్వానికా అస్తిత్వం విభిన్న సంస్కృతులను కలిగి ఉండే క్రమంలో సంస్కృతుల మధ్య ఏకరూపత, సారూప్యత ఉండడం సాధ్యం కాదు. సంస్కృతి ఆ విధంగా అనేక వేర్వేరు ఖండాలుగా ఉంటుంది కనుకే సంస్కృతి అఖండం కాదని అంటుంటాం. ఈ వివిధ సంస్కృతులు అవి మనుగడ సాగించే ప్రదేశాలలో నిరంతరం మార్పు చేర్పులకు గురవుతూనే ఉంటారుు. ఈ చలన శీలతవల్ల కొన్నిసార్లు తాత్కాలికం గాను, మరికొన్నిసార్లు శాశ్వతంగాను ప్రజల జీవన విధానాలలోను మార్పు సంస్కృతులను (చేంజ్‌ కల్చర్‌) సృష్టిస్తుంటారుు. ఈ మార్పు సంస్కృతులను ప్రభావితం చేసే విషయంలోని ప్రత్యేక సందర్భాలపై ఆధారపడి ఉంటుంది. మార్పు సంస్కృతులు స్థిరపడడం వల్ల ప్రధాన సంస్కృతిలో జరిగే మార్పులు ఒక దీర్ఘకాలాన్ని పరిశీలించి చూస్తే ప్రగతిశీలంగా ఉంటాయని, అవి అభ్యుదయం వైపే సాగుతుంటాయనేది మార్క్సిజం ప్రధాన సూత్రీకరణ. అరుుతే ఈ ప్రగతిశీల మార్పులు సాఫీగాను, రేఖామాత్రంగాను జరగవు. ఎప్పటికప్పుడు ప్రతి సందర్భం లోనూ తిరోగమన శక్తులు వాటిని అడ్డుకుంటూ వస్తారుు. ప్రగతి నిరోధకంగా మార్చాలని చూస్తుంటారుు. ఈ నిరోధక శక్తులు అనేక రూపాలలో అనేక లక్ష్యాల కోసం పనిచేస్తుంటారుు. అసలు సంస్కృతిలో ఎలాంటి మార్పులూ అవసరం లేదని, జరిగిన మార్పులన్నీ మూల సంస్కృతిని విఘాత పరుస్తాయని, కనుక మూల సంస్కృతిని పునఃస్థాపించాలని కొన్ని శక్తులు పనిచేస్తుంటారుు. మళ్లీ వాటిలో కూడా హెచ్చుతగ్గుల ఆలోచనలుంటారుు. లక్ష్యాలుంటారుు. ఇక మరికొన్ని శక్తులు మార్పులు అవసరమేగానీ అవి మూల సంస్కృతికి అనుబంధంగా ఉండాలని, అట్లా ఉంటూ ఎన్ని మార్పులకు గురైనా సమ్మతమేనని భావించే శక్తులుంటారుు. ఇంకొన్ని శక్తులు మార్పులు సమూలంగా జరిగినా ఫర్వాలేదుగానీ అవి ప్రగతిశీలంగా అంటే సామ్యవాదం, కమ్యూనిజం వంటి లక్ష్యాల దిశగా మాత్రం ఉండకూడదని ఇతర లక్ష్యాలకు లోబడి ఉంటే ఏమీ అభ్యంతరం లేదని భావిస్తుంటారుు. ఈ ధోరణులే కాకుండా ఇంకా అనేకానేక ధోరణులు సందర్భానుగుణంగా మార్పులను నిరోధించడానికి ప్రయత్నిస్తుంటారుు. ఈ ఒడిదుడుకు లన్నింటి మధ్య జరిగే ప్రయాణంలో విభిన్న సంస్కృతుల అస్తిత్వాలు సంక్షోభాలకు గురవుతూ ముందుకు పోతుంటారుు. సాధారణంగా ఈ సమయంలోనే ఒక సంస్కృతి మీద మరో సంస్కృతి పెత్తనం నెరిపే సాంస్కృతిక ఆధిపత్యాలు తలెత్తుతుంటారుు. ఇక అప్పటినుండి ఈ సాంస్కృతిక ఆధిపత్యం కూడా ప్రగతిశీల మార్పులకు ఒకానొక ప్రతిబంధకంగా ఉంటూ వస్తుంది.

సాంస్కృతిక ఆధిపత్యం ప్రధానంగా సాధించే అంతిమలక్ష్యం ఏమిటంటే ఒక సంస్కృతిని అనుసరించే మనుషులపై దోపిడి నెరపడం. ఒక మానవ సముదాయంపై దోపిడి సాగించడం అనేది అనేక రూపాలలో జరుగుతుంది. యుద్ధాలలో చంపడం, భౌతిక దోపిడి, ప్రాంతాలు దేశాలను ఆక్రమించుకోవడం, అవసరానికి మించి ఆస్తులు సంపాదించడం వంటి ఎన్నో రూపాలలో దోపిడి జరుగుతుంది. ఇంకా లోతులో చెప్పుకోవాలంటే పరిణామక్రమంలో మానవ సమాజంలో భూస్వామ్యం ఏర్పడడం, పెట్టుబడిదారీ వ్యవస్థ ఏర్పడడం, సామ్రాజ్య వాదానికి దారితీయడంతో పాటు అసలు మొత్తంగా రాజ్యం ఆవిర్భావమే దోపిడి కొరకు దోపిడిని స్థిరపరిచే లక్ష్యం కొరకు జరిగిందనే కోణం కూడా ఉంది. ఇవన్నీ దోపిడి రూపాలుగా కొనసాగుతూ చరిత్ర పొడుగునా దోపిడి నిరాఘాటంగా సాగడానికి ఈ రూపాలన్నీ మానవ సముదాయా లను నియంత్రించి గుప్పిట్లో పెట్టుకునే ఆధిపత్య సాధనాలుగా పనిచేస్తూ వచ్చారుు. అది ఏ రూపాంలో ఉన్నాసరే, ఆధిపత్యం అనేది మాత్రమే దోపిడికి అవకాశమివ్వగలదనే ప్రధాన మార్గం అవుతూ వచ్చింది.

ఈ ఆధిపత్యం అన్ని ఇతర అంశాలలో వలెనే సంస్కృతి విషయం లోనూ బలహీన సముదాయాలను, జాతులను, ప్రాంతాలను, కులాలను, మతాలను వెనక్కినెడుతుంది. సాంస్కృతిక ఆధిపత్యం ఆయా వర్గాల సంస్కృతులను ప్రత్యక్షంగానో పరోక్షంగానో అణిచివేస్తుంటుంది. ఒక సంస్కృతి లోపల అంతర్గతంగా ఉండే విభిన్న పురోగామి తిరోగామి శక్తుల మధ్య పోరాటం లేదా పోటి కొనసాగుతూనే వేర్వేరు సంస్కృతుల మధ్య జరిగే పోరాటం లేదా పోటి రూపంలో ఈ సాంస్కృతిక ఆధిపత్యం బహిర్గతమవుతుంది. సాంస్కృతిక ఆధిపత్యం కొనసాగే సమయంలో కొన్ని ముఖ్యమైన ఫలితాలు చోటుచేసుకుంటారుు. ఒక సంస్కృతిలో తిరోగామి శక్తుల భావజాలం బలోపేతమైనపుడు ఆ సంస్కృతి ప్రగతి నిరోధక సంస్కృతిగాను పురోగామి శక్తుల భావజాలం బలోపేతమైనపుడు ప్రగతిశీల సంస్కృతిగాను అప్పటి సందర్భంలో లక్షణాన్ని కనబరు స్తుంటుంది. అలాంటి లక్షణాలు సంతరించుకున్న సంస్కృతుల మధ్య పోటీలో ప్రగతిశీల సంస్కృతి ప్రగతి నిరోధక సంస్కృతిపై ఆధిపత్యం నెరిపే సందర్భంలో తాత్కాలికంగా వాటిమధ్య జరిగే ఘర్షణల్లో ప్రగతిశీల అంశాలే ఇరు సంస్కృతులనూ ఆవహిస్తారుు. కనుక ఆ మార్పు ఆధిపత్య ఫలితంగా జరిగిననూ అది ఒక మేలైన ఫలితాన్నే ఇస్తుంది. ఇక ప్రగతి నిరోధక సంస్కృతి ప్రగతిశీల సంస్కృతిపై ఆధిపత్యం నెరిపేటప్పుడు ప్రగతి నిరోధ లక్షణాలు పైచేరుు సాధిస్తారుు. అది ఒక తిరోగమన ఫలితాన్నిస్తుంది. అరుుతే ఈ రెండు ఆధిపత్యాల సందర్భాలలోను ప్రగతిశీల సంస్కృతి జరిపే ఆధిపత్యం లేదా అస్తిత్వ పోరాటం ప్రగతిశీల లక్ష్యం కోసం జరిగేది కాబట్టి ఒక ఆవశ్యకరూపంగాను, ప్రగతి నిరోధక సంస్కృతి చేసే ఆధిపత్యం లేదా పోరాటం ప్రగతిశీల స్వభావాన్ని దెబ్బతీసే లక్ష్యం కోసం కనుక ఒక ఉగ్రవాదరూపంగాను మానవ సముదాయం ముందుకు వస్తారుు. ఆ ఉగ్రవాదం సాంస్కృతిక ఉగ్రవాదంగా ప్రజల సంస్కృతుల మీద ప్రభావం చూపిస్తుంది.

ఇటలీ, జర్మనీలలో సాంస్కృతిక ఉగ్రవాదం

పైన చర్చించిన సాంస్కృతిక ఉగ్రవాదం ఒక భౌగోళిక ప్రాంతంలోని జాతుల మధ్య ఏవిధంగా పనిచేస్తుందో, మానవ సంస్కృతుల హననానికి ఏ విధంగా పాల్పడుతుందో ఇటలీ, జర్మనీ ఉదాహరణలుగా చూద్దాం!

సాంస్కృతిక ఉగ్రవాదం మొదట తన సంస్కృతి పట్ల మితిమీరిన అభిమానాన్ని ప్రజలలో ప్రేరేపిస్తుంది. ఇటలీలో ముస్సోలిని కంటే ముందు పరిపాలించిన ఇటాలియన్‌ పార్లమెంటరీ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి, కార్మికులకు ఎలాంటి అభివృద్ధిని అందించలేదు. దాంతో ప్రజలలో ప్రభుత్వం పట్ల నిరాశ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో వలస రాజ్యాలను పొందేందుకు మొదటి ప్రపంచ యుద్ధంలోకి ఇటలీని దింపింది. కానీ యుద్ధం తర్వాత జరిగిన ఒప్పందాలు ఇటలీకి ఆశావహంగా లేకపోయే సరికి సోషలిస్టు భావాలు ప్రజలలో పెరిగారుు. ఇటలీ సమాజంలో అట్టడుగు వర్గాల్లో సోషలిస్టు చైతన్యం పెరుగుతూ వచ్చింది. ఓవైపు శ్రామికవర్గ సంస్కృతి మరోవైపు ఇటలీలో భూస్వాముల వలస రాజ్యాలను కోరుకునే పెట్టుబడిదారుల సంస్కృతి స్పష్టమైన విభజన రేఖను తీసుకునే వైపు ఆ చైతన్యం కొనసాగుతూ వస్తున్న సమయంలో పెట్టుబడిదారి వర్గమంతా ప్రజాస్వామ్య వ్యతిరేక సోషలిస్టు వ్యతిరేక ఉద్యమ నాయకత్వాన్ని కోరుకున్నారు. ముస్సోలిని నాయకత్వంలో సోషలిస్టు ప్రాతిపదికన అధికారానికి వచ్చిననూ ఆ తర్వాత ఆ సిద్ధాంతాన్ని వదిలిపెట్టి విపరీతమైన హింసతో, గూండారుుజంతో నియంతృత్వ ఏకఛత్రాధిపత్య అధికార వ్యవస్థతో ముస్సోలిని ఇటలీలో తిరుగులేని నియంత అయ్యాడు. సోషలిస్టు చైతన్యాన్ని, చిగురిస్తున్న శ్రామికవర్గ సంస్కృతిని నాశనం చేశాడు. ఈ హామీని పొందింది కనుకే అధికారాన్ని ముందు పెట్టుబడిదారి వర్గమంతా ముస్సోలినిని తీవ్రంగా బలపరించింది.

అలాగే ఫాసిస్టు సంస్కృతిలో దేశాన్ని వృత్తి సంఘ సిండికల్‌ రాజ్యంగా మార్చడం ఒక దశ అని హామీ ఇచ్చి అధికారానికి ముందు ఫాసిస్టులు మధ్య తరగతి వర్గం, చిన్న స్థారుులోని వృత్తుల ప్రజలు, దుకాణ యజమానులు మొదలైన పెటిబూర్జువా వర్గ మద్దతును కూడగట్టింది. ఓవైపు తమను పీడించే పెట్టుబడిదారి వర్గం ఫాసిస్టులకు మద్దతిస్తున్ననూ మధ్యతరగతి వర్గం అదే ఫాసిజాన్ని బలపరచే పరిస్థితి ఇక్కడి వైరుధ్యం. తర్వాత సామాజిక మేధావి వర్గంగా గుర్తింపుకోసం తాపత్రయపడే బొహిమీలు అనే మేధావులు ఫాసిజానికి ఆకర్షితులైనారు. జర్నలిస్టులుగా, కవులుగా, నాటక కర్తలుగా, ప్రచురణ కర్తలుగా గుర్తింపు కోరుకునే స్వార్థపూరిత ఈ బొహిమీలను ఫాసిజం చేరదీసింది. మరోవైపు దేశభక్తి, జాతీయవాదం అంటూ పదేపదే మాట్లాడే మాజీ సైనికోద్యోగులు వాలంటీర్లను ఫాసిజం తనవైపుకు తిప్పుకుంది. ఉద్యమాలంటే స్వతహాగానే నచ్చని సైన్యం కూడా మొత్తంగా ఫాసిజం వైపుకు వచ్చింది. ఆ విధంగా వివిధ వర్గాల మద్దతుతో ముస్సోలిని అధికారాన్ని పొందాడు. ఫాసిస్టులు అనుసరించిన సంస్కృతిలో మతానికి విధేయులుగా ఉన్నారు. అధికారంలోకి రాకముందు, వచ్చాక కొంతకాలం చర్చిపట్ల విధేయులుగా ఉన్నారు. కానీ ఆ తర్వాత ముస్సోలిని మతాన్నే తలదన్నే నియంతగా ఎదిగిపోయాడు. కేథలిక్‌ పార్టీని తొలగించే దశకు చేరుకున్నాడు. అంటే అతని ఫాసిజం ఇటలీకి ఏకవ్యక్తి నియంతృత్వాన్ని అందించింది.

ఈ చర్యలన్నింటిని ఫాసిస్టు సంస్కృతి అన్నాడు ముస్సోలిని. ఫాసిస్టు సాంస్కృతిక మూలాలు ఈ మితిమీరిన జాతిభావనలో ఉన్నాయని అన్నాడు. అందుకే ఈ సంస్కృతిని అమలుపరిచే క్రమంలో ఇటలీలో శ్రామికవర్గ సంస్కృతులు ధ్వంసమైనారుు. ప్రాచీన రోమ్‌ సామ్రాజ్య వైభవాన్ని పునరుద్ధరించాలని, అందుకు మొదటగా పరారుు భూములను ఆక్రమించుకుని వారి సంస్కృతులను ధ్వంసం చేయాలని ఫాసిస్టులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం అంతటినీ ఉగ్రజాతీయవాద సంస్కృతిగా ఫాసిస్టు సంస్కృతిగా ముందుకు తెచ్చి ఇటలీలోని అన్ని ప్రజాసమూహాలు సాంస్కృతిక సమూహాలు దీన్ని ఖచ్చితంగా అనుసరించాలని లేకుంటే వారంతా ద్రోహులుగా పరిగణించబడి శిక్షింపబడతారని హెచ్చరించారు. అట్లా ఫాసిజాన్ని అనుసరించని సమూహాలపైన ఫాసిస్టులు హింసలకు, దాడులకు తెగబడ్డారు. అధికార బలంతో వారిని తీవ్రంగా అణగదొక్కారు. ఒక ప్రజా సమూహానికి ఫాసిజం తప్ప మరేవిధమైన సాంస్కృతిక అస్తిత్వం లేనంతగా ఆ అణచివేత కొనసాగింది. సోషలిజం కమ్యూనిజం అనే మాటలే వినపడకూడనంతగా భయానక వాతావరణాన్ని ఫాసిజం సృష్టించింది. అట్లా ఇతర సంస్కృతులను నిర్మూలించేందుకు ఫాసిజం ఇటలీలో సాంస్కృతిక ఉగ్రవాదాన్ని ప్రారంభించి కొనసాగించింది.

సరిగ్గా ఇదే సాంస్కృతిక సారూప్యతను కూడా నాజిజం కూడా ప్రదర్శించింది. సున్నిత మనస్కులైన జర్మన్‌లను తీవ్ర జాతీయవాద భావాలతో హిట్లర్‌ ఆకట్టుకున్నాడు. నేషనలిజానికి మిలిటరికి తేడా తొలగిపోయేంత తీవ్రంగా జాతీయవాద స్వరూపాన్ని హిట్లర్‌ మార్చివేశాడు. 1928-45 మధ్య జపాన్లో, ముస్సోలిని నాటి ఇటలీలో కూడా ఈ తేడాలు తొలగిపోయే పరిస్థితి ఏర్పడింది. ʹజర్మన్‌ ప్రజలు స్వచ్ఛమైన ఆర్యజాతికి చెందినవారు. అలాంటివారు నివాస స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారు.ʹ అని మీన్‌కాంఫ్‌లో హిట్లర్‌ ప్రజలను రెచ్చగొట్టాడు. ʹపరారుు వారి పట్ల శాంతి విధానం ప్రమాదకరమైంది. ఎందుకంటే అది జాతిని నిర్వీర్యం చేస్తుందిʹ అన్నాడు. జర్మన్‌ సర్వోన్నత జాతి కోసం పరారుు జాతులను తుడిచిపెట్టే దుర్మార్గ పథకాలను హిట్లర్‌ రచించాడు. యూదులను అన్యజాతీయులని, హీనజాతీయులని చెప్తూ వారిని సంపూర్ణంగా నిర్మూలించాలంటాడు.

వేలాది మంది యూదులపై హత్యలు, అత్యాచారాలకు పాల్పడ్డారు నాజీలు. యూరప్‌ సంస్కృతిని, యురోపియన్‌ నాగరికతను రక్షించే పరిరక్షకులం తామేనంటూ కమ్యూనిజాన్ని దానికి శత్రువుగా చూపుతూ సోవియట్‌ యూనియన్‌ పైన దండెత్తారు. ఇటలీలో లాగానే దేశంపట్ల, అలాగే జాతిపట్ల తీవ్రజాతీయ భావాలను రెచ్చగొట్టారు. సంకుచిత భావాలను ప్రజలలో ప్రేరేపించారు. జాతీయవాదమంటే కేవలం మన జాతిపై ప్రేమ ఉండడమే కాదు, ఇతర జాతుల కంటే మనజాతే గొప్పదనే నిరూపణ ఉండాలని, అందుకుగాను ఇతర జాతులను నాశనం చేయమని ప్రచారం చేశారు. దేశం కోసమే వ్యక్తి ఉన్నాడు తప్ప వ్యక్తి కోసం దేశం కాదన్నారు. ఇది వ్యక్తి స్వేచ్ఛావ్యతిరేకవాదం.

ఇటలీలో ఫాసిస్టులు అధికారంలోకి రాకముందు మధ్యతరగతి వర్గంతో, చర్చితో రాజీ చేసుకుని అధికారానికి వచ్చాక వారిని శత్రువులుగా చూసినట్లే జర్మనీలో నాజీలు అధికారానికి ముందు సోషల్‌ డెమోక్రటిక్‌లు బలపడుతున్న దశలో జర్మన్‌ కమ్యూనిస్టులతో, సోవియట్‌ యూనియన్‌తో స్నేహం పెంచుకుని, అధికారం వచ్చాక కమ్యూనిస్టులను శత్రువులుగా చెప్తూ హింసలకు గురిచేశారు. సెమెటిక్‌ జాతి సంస్కృతిని, దాన్ని అనుసరించే యూదులను జర్మనీ సమస్యలన్నింటికీ కారణంగా చూపి వారిపై నరమేధం సృష్టించారు. జర్మనీ పాడైపోవడానికి ఈ సంస్కృతే కారణమని నిందిస్తూ పూర్వ జర్మన్‌ సంస్కృతి పునరుద్ధరణ కోసం యూదు నిర్మూలన గావించాలంటూ జర్మనీలోనే కాక యూరప్‌ మొత్తంలోనూ లక్షలాది మంది యూదులను నాజీలు హత్యచేశారు. జర్మనీలో నాజీ పార్టీలో జీవితంలో విఫలమైనవారు, పురాతన సంపన్నవర్గాలు, పూజారులు, పట్టణ ప్రజలు, పెటిబూర్జువాలు, వర్తకులు మొదలైనవారు చేరారు. జర్మనీ సామాజిక వ్యవస్థలోని సమస్యలకు పరిష్కారాలుగా ఆత్మగౌరవం, వ్యక్తిపూజ, యూదు వ్యతిరేకత, కమ్యూనిస్టు వ్యతిరేకతలను చూపారు. నోర్డిక్‌ జాతి ఆర్య సంస్కృతిని జర్మనీ అంతా విస్తరించాలని, యూదు, స్లావ్‌, జిప్సి వంటి జాతులను రోమన్‌ కాథలిక్‌ మతాల వారిని సంహరించాలని నాజీలు పిలుపునిచ్చారు.

ఈ చర్యలన్నింటిని జర్మనీలో నాజీ సంస్కృతి పేరిట ప్రచారం చేసి ఇటలీలో వలెనే నాజి సంస్కృతిని వ్యతిరేకించిన వారిని నాజీలు క్రూరంగా చంపేవారు. జర్మనీలో నాజీ సంస్కృతి అంటే అన్యజాతుల వ్యతిరేకమైన ఆర్యజాతి సంస్కృతి.

ఇక్కడ ఒక ప్రధానమైన విషయాన్ని చెప్పుకోవాలి. వాస్తవానికి ఇటలీలో ఫాసిజానికి, జర్మనీలో నాజీజానికి స్వంతంగా సంస్కృతిగా ఏర్పడే ప్రాతిపదిక లక్షణాలు లేవు. అంటే సంస్కృతి పుట్టుకకు, పెరుగుదలకు, మనుగడకు, గమనానికి ఆధారభూతమైన లక్షణాలు వాటికి లేవు. అరుునా వాటిని సంస్కృతులుగా చెప్తూ, ఆ సంస్కృతులను ఇతర సంస్కృతులకు శత్రువుగా చూపుతూ ఆ ఇతర సంస్కృతులను ధ్వంసం చేసే నిర్మూలించే కార్యాచరణగా సాంస్కృతిక ఉగ్రవాదాన్ని ఫాసిస్టులు నాజీలు ప్రయోగించారు. వారి కృత్రిమ సంస్కృతులు ఆయా పార్టీల సిద్ధాంతాలు, వ్యక్తులు నిర్దేశించిన సూత్రాలేనని ఆధునిక చరిత్రకారులు, సోషల్‌ ఆంత్రోపాలజిస్టులలో కొందరు భావిస్తున్నారు.

సంఘ్‌ పరివార్‌ సాంస్కృతిక ఉగ్రవాదం

ఫాసిజం, నాజీజంల వలెనే హిందూరుుజం లేదా హిందుత్వలకు సహజ సంస్కృతి లక్షణాలు లేవు. ఒక ఉమ్మడి ప్రజా సమూహంగా ప్రజలు హిందూ ప్రజలుగా జీవించినట్లు చారిత్రక ఆధారాలు లేవు. ఈనాడు కూడా హిందూ సంస్కృతి అనే ఉమ్మడి సంస్కృతి లేదు. అందులో వివిధ కులాల, వృత్తుల, శ్రమల సంస్కృతులు వేర్వేరుగా ఉన్నారుు గానీ అవన్నీ కలగలిసిన ఉమ్మడి హిందూ సంస్కృతి ఊహామాత్ర మైనదే గానీ అస్తిత్వంలో మాత్రం ఎక్కడా ఏనాడు లేదు. కానీ సంఘ్‌ పరివార్‌ మాత్రం హిందూ సంస్కృతి గురించి మాట్లాడుతుంది. దాన్ని పరిరక్షించాలని గొడవలు చేస్తుంది. లేని సంస్కృతి కోసం దశాబ్దాలుగా మారణకాండలు సృష్టిస్తున్నది. ఇదంతా హిందూ సంస్కృతి ముసుగులో బ్రాహ్మణీయ సంస్కృతిని అమలుపరచడం కోసమేనని మనం గుర్తించాలి.

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ను 1925లో హెగ్డేవార్‌ స్థాపించాడు. కాంగ్రెస్‌ భావాలు నచ్చక బైటకు వచ్చి సావర్కర్‌ అతివాద బోధనలతో ప్రభావితమై ఆర్‌ఎస్‌ఎస్‌ను స్థాపించాడు. ఈ సావర్కర్‌ జిన్నాకంటే పదిహేనేళ్ల ముందే 1923లో ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. తర్వాత 1938లో గోల్వాల్కర్‌ సంఘ్‌ ప్రధాన కార్యదర్శిగా నియమించ బడ్డాక ఈ సిద్ధాంతాన్ని బలపరిచాడు. ఈ సిద్ధాంతంలో ప్రధాన అంశం ఏమిటంటే హిందూ-ముస్లిం సంస్కృతులు పూర్తిగా వేర్వేరు సంస్కృతులు కనుక అవి కలిసి ఉండలేవు అనేది ప్రధాన సూత్రీకరణ. అందుకుగాను హిందూ సంస్కృతి గురించి, ʹహిందుస్తాన్‌లో జీవిస్తున్న పరారుు జాతులు అనివార్యంగా హిందూ సంస్కృతిని, భాషను అలవర్చుకోవాలి. హిందూ జాతిని, సంస్కృతిని అంటే హిందూ జాతి ఘనతను కీర్తించడం తప్ప మరో ఆలోచనే వారు మనసులోకి రానివ్వకూడదు. వారందరూ హిందూ జాతిలో విలీనమయ్యేందుకు వీలుగా తమ ప్రత్యేక అస్తిత్వాలను విడనాడాలి. ఈ దేశంలో వారు జీవించాలంటే పూర్తిగా హిందు జాతికి లోబడి ద్వితీయ శ్రేణి పౌరులుగా ఎలాంటి హక్కులు, అధికారాలు, గుర్తింపులు, చివరకు పౌరహక్కులు కూడా అడగకుండా బతకాలి. వారికి అంతకంటే గత్యంతరం లేదు. మనది అత్యంత ప్రాచీన జాతి.

అందువల్ల మనదేశంలో నివసించే పరారుు జాతుల పట్ల ప్రాచీన జాతులు వ్యవహరించాల్సిన విధంగా వ్యవహరిద్దాంʹ అన్నాడు. ఈ క్రమంలో ఆయన తమ సంస్థ ముస్లింలను సమూలంగా నిర్మూలించాలని జర్మనీ ఉదాహరణగా చెప్పాడు. ʹతన జాతి సంస్కృతుల పవిత్రతలను కాపాడుకునేందుకు గాను జర్మనీ మధ్య ప్రాచ్య జాతీయులైన యూదులను సమూలంగా నిర్మూలించి ప్రపంచానికి దిగ్భ్రాంతి కలిగించింది. అది అత్యున్నత స్థారుులో జాతీయాభిమానాన్ని ప్రదర్శించిన అంశం ఇదే. అనేక ప్రాథమికాంశాలలో తేడాలున్న జాతులు ఒక దేశంలో కలిసిమెలిసి ఐక్యంగా ఉండడం అసాధ్యమని జర్మనీ చక్కగా నిరూపించింది. మనం కూడా ఈ గుణపాఠాన్ని అనుసరించి లబ్ది పొందవలసి ఉంటుంది.ʹ

అంటే ఆర్‌ఎస్‌ఎస్‌, సంఘ్‌ పరివార్‌ దృష్టిలో సంస్కృతి అంటే హిందూ సంస్కృతే, ముస్లింలను సమూలంగా నిర్మూలించే సంస్కృతే, ఆ సంస్థల ఆచరణీయ సంస్కృతి అని చాలా స్పష్టంగా చెప్పుకున్నారు. అంతేగాక ముస్లింలను ఏకోశాన సమర్థించిననూ అలాంటి వ్యక్తులను నిర్మూలించే సంస్కృతి సంఘ్‌ పరివార్‌ది. దేశ విభజన సమయంలో గాంధి ముస్లింలకు మద్దతిచ్చాడనే ఆరోపణతో గాంధీని కాల్చి చంపారు. వల్లభ్‌భాయ్‌ పటేల్‌ శ్యాంప్రసాద్‌ ముఖర్జీకి రాసిన లేఖలో ʹగాంధిని ఆర్‌ఎస్‌ఎస్‌ చంపిందన డానికి నా దగ్గర ఆధారాలున్నారుుʹ అని రాశాడు. గాంధీ హత్య సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌ స్వీట్లు పంచుకున్నది డెబ్భై ఏళ్ల తర్వాత ఇవ్వాళ గౌరీలంకేశ్‌ను చంపి కూడా స్వీట్లు పంచుకున్నది. అధికారికంగా, చట్టబద్ధంగా మనుషులను నిర్మూలించే స్థారుుకి చేరడం ఈ హత్యా సంస్కృతిలో ఆర్‌ఎస్‌ఎస్‌ సాధించిన దుర్మార్గమైన పరిణతి.

మొదటి నుంచీ ఆర్‌ఎస్‌ఎస్‌, సంఘ్‌ పరివార్‌లు అనేక చారిత్రక వక్రీకరణలతో వాదిస్తున్నదేమిటంటే ఈ దేశం హిందువులదేనని. తవ్వకాల్లో సింధు నాగరికత ఆనవాళ్లు బయటపడే నాటిదాకా భారతదేశ చరిత్ర ఆర్య నాగరికతతోనే ప్రారంభమయ్యేది. కానీ ఆర్య నాగరికత కంటే ముందే అభివృద్ధి చెందిన నాగరికతగా సింధు నాగరికత నిదర్శనాలు బయటపడ్డాక కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘ్‌ పరివార్‌లు తమ ఆలోచనా సరళిని మార్చుకోలేదు. పైగా సింధు ప్రజలు కూడా ఆర్యులేనన్నారు. ఆర్యుల వలస సిద్ధాంతాన్ని అంగీకరించకుండా ఈ దేశస్థులే అరుున ఆర్యులు బయటి ప్రాంతాలకు వెళ్లి మళ్లీ తిరిగివచ్చారని బుకారుుంచారు.

ఈ దేశం ఆర్యుల, హిందువుల మూల నివాసం కనుక ఇప్పుడు కూడా ఈ దేశం హిందువులదేనని, ఇతరులకు ఇక్కడ చోటు లేదని వాదిస్తున్నారు. కాలమధ్యంలో దండెత్తిన ముస్లిం రాజుల వల్ల ఈ దేశ సంస్కృతి, వారసత్వాలు దెబ్బతిన్నాయని వాటిని తిరిగి స్థాపించేందుకు దేశంలో ఉన్న ముస్లిం సంస్కృతిని, వారసత్వాలను నిర్మూలించే పని ప్రారంభించాలని చూస్తున్నారు. ఇస్లాం, క్రైస్తవాలు విదేశీ మతాలు కనుక వాటికి ఇక్కడ చోటు లేదంటున్నారు. ఈ దేశంలోనే పుట్టి ఆర్య బ్రాహ్మణతత్వాన్ని హిందూ మతాన్ని ప్రశ్నించిన బౌద్ధాన్ని జైనాన్ని హిందూ మతంలో దుర్మార్గంగా కలిపేసుకున్నారు. హిందు ధర్మాన్ని వ్యతిరేకించిన బుద్ధున్ని అదే హిందు అవతారాలలో ఒక అవతారంగా మార్చేశారు. ఇదీ సంఘ్‌ పరివార్‌ సంస్కృతి. వాస్తవాలతో సంబంధం లేకుండా చరిత్ర హిందువులదేనని దబారుుంచడం, వీలున్న ప్రతిచోట ఆ వాస్తవా లను తమకనుకూలంగా మార్చివేయడం. ప్రతిచోటా ఇదే ఫార్ములా.

అసలు ఇస్లాం, క్రైస్తవ, బౌద్ధ మతాల లాగా హిందూ సంస్కృతి స్వతంత్రమైన సంస్కృతి కాదు. ఇందులో ఒకే ఒక హిందూ సంస్కృతి అనే సింగిల్‌ ఐడెంటిటి రూపం లేదు. ఎందుకంటే హిందూ మతంలో కులాలున్నారుు. ఆ కులాలకు స్వంత అస్తిత్వాలున్నారుు. స్వంత సంస్కృతు లున్నారుు. కానీ ఈ కులాలన్నీ కలిసి ఆ కులాలన్నింటికీ ఉమ్మడిగా ఒక సారూప్య సంస్కృతిని సృష్టించుకోవడం అనేది ఎక్కడా జరగలేదు. అందుకే హిందు మతానికి ప్రామాణిక సంస్కృతి ఏది? అని ప్రశ్నించు కున్న ప్రతిసారి వాళ్ల సాహిత్యం, చరిత్ర స్పష్టంగా చెప్తున్న సమాధానం - బ్రాహ్మణీయ సంస్కృతి అని. అంటే ఉన్న కులాల్లోనే ఒక కులం సంస్కృతి, మొత్తం హిందుమతం సంస్కృతిగా స్థిరీకరించబడింది. అసలైతే దీన్ని విపులంగా చెప్పుకోవాలి.

బ్రాహ్మణీయ సంస్కృతి సమాజంలో స్థిరపడిన తర్వాత వాళ్లు దూరంగా ఉంచిన ఇతర ప్రజా సమూహాలు వాళ్ల జీవన విధానాల ఆధారంగా కాలక్రమంలో స్వతంత్ర సంస్కృతులను ఏర్పరచుకున్నారుు. అవి శ్రమ సంస్కృతులు, ఉత్పత్తి సంస్కృతులు అయ్యారుు. సహజంగానే తమను బానిస సంస్కృతులుగా మార్చిన సంస్కృతిని అవి ప్రశ్నిస్తున్నారుు. తిరుగుబాటు చేస్తున్నారుు. ఇక్కడ చెప్పుకోవాల్సిందేమిటంటే బ్రాహ్మణీయ సంస్కృతి హిందూ మతానికి మూల సంస్కృతిగా మారినప్పటి నుండి ఇతర సంస్కృతులను దెబ్బకొట్టడానికి సాంస్కృతిక ఉగ్రవాదాన్ని ప్రయోగిస్తూ వచ్చింది. వాటిని అనాగరిక సంస్కృతులుగా ప్రచారం చేస్తూ ఆ సంస్కృతిలో భాగాలైన కట్టుబాట్లు భాష, సాంప్రదాయాలు, ఆహార అలవాట్లు వంటి ప్రతిభాగంపైనా అంటరాని ముద్రవేసి ఆ సంస్కృతులను వెలివేసి వాటిని ఎదగనీయకుండా వాటన్నింటిపైనా బ్రాహ్మణీయ సంస్కృతి ఆధిపత్యం నిరంతరం ఉండేలా చూడడానికి సాంస్కృతిక ఉగ్రవాదాన్ని హిందూ సంస్కృతి సాధనంగా చేసుకుని వాడుతూ వచ్చింది. ఇప్పటికీ ఆ సాంస్కృతిక ఉగ్రవాదం అనేక రూపాలలో కనిపిస్తూనే ఉన్నది.

ఏనాడూ ఉత్పత్తిలో పాల్గొనని వర్గం ఉత్పత్తి సాధనాలను గుప్పెట్లో ఉంచుకుని సామాజిక ఆధిపత్యం నెరపుతున్న క్రమంలో ప్రజా సమూహాలు మిగతావి మనుగడ కోసమే పోరాటాలు చేస్తుండడం వల్ల వాళ్ల సంస్కృతులు విస్తరించడానికి, అద్భుతమైన వృత్తి, కుల సంస్కృతులు మరింత ఉజ్వలంగా మారడానికి అవకాశం లేకుండా పోరుుంది. ఈనాటికీ వాళ్లవి దాదాపు అస్తిత్వ పోరాటాలే కావడంతో ఇంకనూ ఆ సంస్కృతులపై ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది.

అందుకే ఈరోజు ఆవు సాంస్కృతిక ఉగ్రవాదాన్ని అమలు పరిచే సాధనం అరుుంది. పవిత్రత పేరుతో సాంస్కృతిక ఉగ్రవాదం స్వామీజీలు, బాబాలు, విశ్వహిందు పరిషత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ల రూపంలో బట్టబయలవు తున్నది. నిజ జీవితంలో ఆవు, ఎద్దులతో మమేకమైన ప్రజల వ్యవసాయ పశు సంబంధిత సంస్కృతులను పవిత్రత అనేది సాంస్కృతిక ఉగ్రవాద సాధనంగా దెబ్బకొడుతూ వస్తున్నది. తాము చెప్పినట్లే చరిత్రను రికార్డు చేసుకోవాలనే నియంతృత్వ ధోరణి ఓవైపు ప్రదర్శిస్తూనే సాంస్కృతిక ఉగ్రవాదంలో భాగంగా చరిత్రను తప్పుగా వక్రీకరించి రాస్తూ వస్తున్నారు.

అల్లాఉద్దీన్‌ ఖిల్జి ముస్లిం కనుక అతన్ని చరిత్రలో తక్కువ చేసి చూపడానికి చరిత్రలో లేని పద్మావతి అనే రాణిని సృష్టించి పుస్తకాలు రాసి ఆ పాత్రను సినిమాలో ఎలా చూపించాలో మేమే నిర్ణరుుస్తామంటూ, మాట వినకుంటే ముక్కులు కోస్తామని, తలలకు కోట్ల రూపాయల వెలలు నిర్ణరుుంచి తెగకోస్తామని బెదిరిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా తీసే ఏ సినిమాను ఆడనివ్వబోమని బెదిరిస్తున్నారు. సెన్సార్‌ పూర్తరుున మెర్సల్‌ సినిమాకు రీసెన్సార్‌ చేయాలని దాడులకు దిగారు. ఇదేమిటని ప్రశ్నించిన కమల్‌హాసన్‌, ప్రకాశ్‌రాజ్‌ లాంటి వాళ్లను చంపుతామని బెదిరిస్తున్నారు.

ఇక ముస్లింలు కట్టిన కట్టడాలైతే ఆ ప్రతికట్టడం వెనుకా ఒక గుడి చరిత్రను సృష్టించి ఈ కట్టడాలను కూలగొడతామంటున్నారు. తాజ్‌మహల్‌ను తేజోమహాలయంగా పదే పదే చెప్తూ గోబెల్స్‌లాగా అబద్ధాన్ని నిజం చేద్దామనుకున్న ఉదంతాన్ని ఇటీవల మనం చూసి ఉన్నాం. ముస్లింల ప్రార్థనా స్థలాలు వేటినీ వదలబోమని అయోధ్యలో బాబ్రీ మసీదు తరహాలోనే మధుర, వారణాసిల్లోని మసీదులను కూలగొడ తామని బాహాటంగా చెప్తున్నారు. ఆక్రమించుకున్న దేశం ముస్లింలది, ఆక్రమిత ప్రాంతంలో ప్రజలు ముస్లింలే కనుక వాళ్ల దృష్టిలో దేశానికి అతిపెద్ద సమస్య కశ్మీర్‌ సమస్య అరుుంది. చదివే పిల్లలు ముస్లిం పిల్లలు కనుక మదరసాలను నిషేధించాలంటున్నారు.

ఈ సాంస్కృతిక ఉగ్రవాదం విస్తృతమవడానికి అధికారం తోడ్పడుతూ రావడాన్ని కూడా మనం గమనించాల్సి ఉంది. హిందూ సంస్కృతిలో ప్లాస్టిక్‌ సర్జరీలు ఉన్నాయంటూ గణపతిని చూపిస్తాడు సాక్షాత్తు ప్రధానమంత్రి. స్టెమ్‌సెల్స్‌ విజ్ఞానం ఉందంటూ వందమంది కౌరవులను చూపిస్తాడు. ఇవి మూఢ విశ్వాసాలని వాళ్లకు ఏ కోశానా అనిపించవు.

యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రి కాకముందే ఎంపిగా ఉన్నపుడే గోరఖ్‌పూర్‌లోని మియాబజార్‌ను మయాబజార్‌గా, ఉర్దు బజార్‌ను హింది బజార్‌గా, అలీనగర్‌ను ఆర్యనగర్‌గా పేర్లు మార్చివేశాడు. ʹబానిసత్వాన్ని గుర్తు చేసుకునే చిహ్నాలు నా నియోజకవర్గం లో ఉండడానికి వీల్లేదుʹ అన్నాడు. ముఖ్యమంత్రి అయ్యాక తాజ్‌మహల్‌ను ఏకంగా పర్యాటక స్థలాల జాబితాలోంచే తొలగించి పారేశాడు. ఈయనను రేపటి ప్రధానమంత్రి అభ్యర్థి అంటున్నారు. టిప్పుసుల్తాన్‌ను, అక్బర్‌, షాజహాన్‌ లను ఇంకా చెప్పాలంటే దేశంలోని ఏ ముస్లిం పాలకుడినైనా రేపిస్టు అనో, హంతకుడనో నిందిస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తూ వస్తున్నారు. దేశంలో ఇన్ని మతాలుండగా హిందు మత గ్రంథమైన భగవద్గీతను జాతీయ గ్రంథంగా చేస్తామంటున్నారు.

సమస్యలను పరిష్కరించాల్సిన కోర్టులను అప్రధానం చేస్తూ రవిశంకర్‌ లాంటి వాళ్లకు అయోధ్య లాంటి సమస్యలను అప్పగిస్తున్నారు. మరోవైపు సాంస్కృతిక రంగంలో ప్రత్యామ్నాయ సంస్కృతుల కోసం కృషి చేస్తున్న దభోల్కర్‌, గోవింద్‌ పన్సారే, కల్బుర్గీ, గౌరీలంకేష్‌ లాంటి వాళ్లను చంపేస్తున్నారు. పెరుమాళ్‌ మురుగన్‌, కంచ ఐలయ్య లాంటి వారిపై భౌతికదాడులకు దిగుతున్నారు.

ప్రజలు పేదరికంలో మగ్గినా, సమాజంలో అంతరాలు పెరుగుతున్నా నిరుద్యోగం, ఆకలి చావులు, హక్కుల హననాలు, హింసలు, అణిచివేతలు ఎన్ని ఉన్నా దేశమంటే ప్రేమ, భక్తి ఉండాల్సిందేనని, దేశభక్తి వదులుకోవ డానికి వీలుకాని, ప్రశ్నించడానికి వీలులేనిదిగా ఉండాలని, ఉంటుందని మితిమీరిన దేశభక్తిని నిరంకుశంగా ప్రజల మీద రుద్దుతున్నారు. తాము చెప్పినట్లు చెప్పినచోట్ల ప్రదర్శించేదే దేశభక్తి అంటున్నారు. సినిమా హాళ్లలో తప్పనిసరిగా జనగణమన పాడాలని, లేచి నిల్చోవాల్సిందేనని అంటున్నారు. అట్లా చేయకపోతే మీదపడి కొడుతున్నారు. తాము నిర్దేశించిన సంస్కృతినే స్త్రీలైనా, దళితులైనా అనుసరించి తీరాలని తమ హిందూ మతంలోని వివిధ సెక్షన్‌ల ప్రజలపై ఒత్తిడి తెస్తూ, అంగీకరించక పోతే దాడులకు దిగుతున్నారు.

స్త్రీలపట్ల వీళ్లకు ఎంత చులకన భావమంటే, స్త్రీలకు అసలు వ్యక్తిత్వమే లేదని, వాళ్లు బానిసలని చెప్తుంటారు. మోహన్‌ భగవత్‌ అంటాడు - ʹఅత్యాచారాలు పల్లెటూర్లలో జరగవు. పట్నాల్లో జరుగుతాయి. ఎందుకంటే పట్నాలలో ఆడవాళ్లు రెచ్చగొట్టే దుస్తులు ధరిస్తారు కాబట్టిʹ. ఈ మాటలను పట్టుకొని రెచ్చగొట్టే దుస్తులే రేప్‌లకు కారణమని అరుస్తూ ఆధునిక దుస్తులు ధరించే అమ్మాయిలపై దాడులకు దిగుతారు హిందూ ఉన్మాదులు. ఎంత దారుణం ఇది? వస్త్రధారణ పైనా ఇంత మోరల్‌ పోలిసింగా? ఇదే మోహన్‌ భగవత్‌ మరోసారి అంటాడు - ʹభార్య భర్తల మధ్య ఉండే సోషల్‌ కాంట్రాక్ట్‌లో భాగంగా ఆడవాళ్ల పని మగవాళ్లకు సేవలు చేస్తూ గృహిణిగా ఉండడంʹ అని. హిందూ ధర్మాన్ని బోధించే వాళ్లూ ఇలాగే మాట్లాడతారు. ʹఆడవాళ్ల పని మగవాళ్ల తుండు గుడ్డలు పిండడంʹ అంటాడు చాగంటి కోటేశ్వర్రావు. ఎంత దిగజారుడు మాటలు ఇవి? పద్మావతి సినిమా గురించి మాట్లాడమంటే, ʹఫిల్మ్‌ మేకర్‌ల భార్యలు రోజుకో భర్తను మారుస్తారుʹ అంటాడు రాజస్థాన్‌ ఎంపి చింతామణి మాలవ్య. ఇట్లా అనడం తప్పుకదా అంటే, ʹనిజమే! తెలుగు సినిమాల వాళ్ల భార్యలూ అంతేʹ అంటాడు రాజాసింగ్‌. ఇవి మీడియా చర్చలో పాల్గొని చెప్పిన మాటలు.

ఆర్‌ఎస్‌ఎస్‌, విఎచ్‌పి వాళ్ల ప్రకారం స్త్రీ పురుషులు ఒకరినొకరు ఇష్టపడకూడదు, ప్రేమించుకోకూడదు. అది మన సంస్కృతి కాదంటారు. వాలంటైన్స్‌ డే రోజు పార్కుల వెంటపడి, సినిమా హాళ్ల వెంటపడి దాడులు చేస్తుంటారు. ఒకవేళ తప్పనిసరిగా ప్రేమించాల్సి వస్తే ముస్లింలను మాత్రం ప్రేమించకూడదంటారు. దానికి లవ్‌ జిహాద్‌ అని పేరుపెట్టి దాడులు చేస్తారు, కేసులు పెడతారు.

ఆవుకు పవిత్రతను జోడించి ఆవును ముట్టుకోవడానికి వీల్లేదంటారు. తరతరాల వృత్తిలో భాగంగా దళితులు తోలు పనులు చేస్తుంటే గో హత్య చేశారనే కారణం చూపి వాళ్లను హత్య చేస్తారు. ఉనాలో చూసి ఉన్నాం. కేరళలో పినరయి విజయన్‌ దళితులను ఆలయ పూజారుల పోస్టులలో నియమిస్తే రాద్ధాంతాలు చేశారు. దళితుల పట్ల వీళ్ల కన్‌సర్న్‌ ఇది. వీళ్లు అధికారంలో ఉన్న ఛత్తీస్‌గడ్‌లో తొలకరి పండుగ జరుపుకుంటున్న ఆదివాసుల మీద మావోయిస్టులకు సహకరించారనే కోపంతో కాల్పులు జరిపించారు. బాసగూడ లాంటి మారణ హోమాలు తరచూ జరుపుతుంటారు. స్త్రీని కేవలం లింగపరంగానే చూస్తూ ఆ రాష్ట్రంలో ఆదివాసులపై అత్యాచారాన్ని అణచివేత సాధనంగా వాడుతుంటారు. వీళ్లు నమ్మే, ఆచరించే సంస్కృతే అంటరానితనాన్ని సృష్టించింది. సామాజిక అసమానతలను, వివక్షలను సృష్టించింది. కాలానుగుణంగా మారకుండా వీళ్లు ఇంకా అదే సంస్కృతిని ఆచరిస్తున్నారు. అదే సంస్కృతిని నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. అందుకోసం దొంగదారులను ఆశ్రయిస్తున్నారు. ఆదివాసి సంస్కృతులకు ప్రతిరూపమైన సమ్మక్క - సారలమ్మలను అమ్మవారి అంశలుగా ఈ మధ్య ప్రచారం ప్రారంభించారు. జాతర గద్దెల దగ్గర కొబ్బరి కాయలు, కుంకుమలు, అగరుబత్తుల సంస్కృతిని తీసుకువచ్చారు. దళిత ప్రత్యామ్నాయ సంస్కృతిని దెబ్బతీయడానికి హిందూ సంస్కృతిని వ్యతిరేకించిన అంబేద్కర్‌ లాంటి వాళ్లను హిందుత్వ శక్తులు తమలో కలుపుకోవడానికి చూస్తున్నాయి.

ఇదంతా చేప్పే ఉద్దేశం ఏమంటే పరాయి సంస్కృతులను, బ్రాహ్మణేతర సంస్కృతులను సంఘ్‌పరివార్‌ ఏ విధంగా ద్వేషిస్తున్నది, వాటిని నియంత్రించి, గుప్పెట్లో పెట్టుకుని సమాజంపై బ్రాహ్మణీయ సంస్కృతిని రుద్దడానికి ఏ విధంగా ప్రయత్నిస్తున్నది, ఈ పనులను భయోత్పాతంతో ఏ విధంగా సాధిస్తున్నది అనే విషయాన్ని మనం గమనించాలి. సాంస్కృతిక ఉగ్రవాదానికి భౌతిక దాడులను జోడించి వాళ్లనుకుంటున్న సంస్కృతిని నిరంకుశంగా అమలు చేయాలనుకుంటున్న వాళ్ల కుట్రలను అర్థం చేసుకోవాలి.

ఒక్కమాటలో చెప్పాలంటే సంఘ్‌ పరివార్‌ ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చాలనుకుంటున్న

Keywords : rss, hindutva, India, aranya, fascism, Germany, modi
(2024-03-09 06:34:13)



No. of visitors : 1345

Suggested Posts


గోరక్షకులా ? దోపిడి దారులా ? - NDTV స్టింగ్ ఆపరేషన్ లో వెలుగు చూసిన నిజాలు !

ఆవులనే కాదు ఎద్దులను, బర్రెలను, దున్నపోతులను... వేటినైనా సరే వాహనాల్లో తీసుకెల్తే వీళ్ళు ఆపుతారు. పోలీసుల సహకారంతో గోశాలలకు తరలిస్తారు. అక్కడి నుంచి వాటిని అమ్ముకుంటారు. పశువులను తరలించేవారు వీరితో ముందే ఒప్పందానికి వచ్చి డబ్బులు ముట్టజెప్తే ఆ వాహనాలను ఆపరు....

బాలికల అక్రమ తరలింపు - బైటపడ్డ ఆర్‌ఎస్‌ఎస్‌ అసలు రంగు

ఆర్‌ఎస్‌ఎస్‌ అసలు ఎజెండా ఏంటి అనేది బహిర్గతమైంది. తన మతోన్మాద ఎజెండాను అమలుచేయడంలో భాగంగా బాలికల అక్రమ తరలింపుకు సిద్దపడింది. జాతీయ, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఆదివాసీ బాలికలను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న వైనాన్ని ఔట్ లుక్ పత్రిక బహిర్గతపర్చింది....

బీఫ్‌ తినడం నేరం కాదు - మద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పు

గో మాంసంపై మద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బీఫ్‌ తినడం నేరం కాదని, ప్రజల ఆహార అలవాట్లలో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. పళని ఆలయ పరిసరాల్లో ముస్లింలు నిర్వహిస్తున్న దుకాణాలను తొలగించాలని దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది...

హిందూ మతోన్మాదం మోడి,యోగి - డా. కత్తి పద్మారావు

ఆర్ఎస్ఎస్ మూలవాసుల సంస్కృతికి వ్యతిరేకి. ముస్లిం మైనార్టీలకు శత్రువు. ఎంతో నెత్తురు హిందూ, ముస్లిం ఘర్షణల్లో భరత ఉపఖండంలో ఇంకిపోరుుంది. అందుకే అంబేడ్కర్ దళితులను బౌద్ధ మత స్వీకారం చేయమని బోధించాడు. బౌద్ధ మత స్వీకారం ఒక్కటే హిందూ మతం పునాదులను కదిలించగలుగుతుందని అంబేడ్కర్ విశ్వసించాడు....

HCU లో ఏబీవీపీ అరాచకం - విద్యార్థిపై దాడి

హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో మ‌తోన్మాద గుండాల అరాచ‌కాల‌కు అంతులేకుండా పోతోంది. రోహిత్ వేముల మృతికి కార‌ణ‌మైన సుశీల్ కుమార్, బీజేపీ నాయ‌కుడైనా అత‌ని సోద‌రుడు మ‌రో ముప్పై మందితో క‌లిసి నిన్నరాత్రి యూనివ‌ర్సిటీలో విద్యార్థుల‌పై దాడుల‌కు పాల్ప‌డ్డారు. గ‌త వారం ప‌ది రోజులుగా

ఫిదా సినిమా... జాతీయ గీతం - తుమ్మేటి రఘోత్త‌మ్ రెడ్డి

నేను తెలుగు సినిమా చూడాల్సి వచ్చింది! చాలా కాలం తరువాత! సంవత్సరాల తరువాత.... ఏం చెయ్యను? ఖర్మ! నాలుగురోజుల క్రితం, మాదగ్గరి బంధువు పోన్ చేసాడు! ఒకసారిʹఫిదాʹసినిమా చూడగలరా? మీతో చర్చించాలని ఉంది అన్నాడు! దగ్గరి బంధువు! సినిమా రంగంలో భవిష్యత్తును నిర్మించుకుంటున్నవాడు! కాదనలేని స్ధితి!

ఇప్పటి దేశ పరిస్థితుల్లో రాడికల్ ఉద్యమ అవసరం ఉందా?

వ‌ర్త‌మాన సామాజిక‌, రాజ‌కీయ‌, ఆర్థిక విష‌యాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడూ స‌రైన అవ‌గాహ‌నను అందిస్తూ, ప్ర‌జ‌ల ప‌క్షాన గొంతును వినిపించే లామ‌కాన్, ముగ్గురు ప్ర‌ముఖ ఉద్య‌కారుల‌ను ఒకే వేదిక‌మీదికి తీసుకువ‌స్తోంది. ఆగ‌స్టు 15 సాయంత్రం 7 గంట‌ల‌కు లామ‌కాన్‌లో నిర్వ‌హించే.....

ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్ బాకీ హై

22 రాష్ట్రాలు, 44 ప‌ట్ట‌ణాలు, 50 ప్ర‌ద‌ర్శ‌న‌లు... ఇది బాహుబ‌లి సినిమా కాదు... మ‌తోన్మాద రాజ‌కీయాల్నిన‌గ్నంగా నిల‌బెట్టిన డాక్యుమెంట‌రీ చిత్రం. వ‌ర్త‌మాన చ‌రిత్ర‌కు సాక్ష్యం.....

మోడీలు, మోహన్ భగవత్ లు బూట్లు తొడుక్కొని జెండాలు ఎగరేయొచ్చు... అదే ఓ ముస్లిం చేస్తే దాడులు చేస్తారా !

మోడీ, అమిత్ షాలు బూట్లు తొడుక్కొని స్వాతంత్ర్య దినోత్సవం రోజు జాతీయ జెండాకు వందనాలు చేయొచ్చు. మోడీ అయితే ఏకంగా జాతీయ జెండాతో చెమటను తుడుచుకోవచ్చు.... కానీ ఓ కాలేజీ ప్రిన్సిపాల్... ముస్లిం అయినందుకు జెండా ఎగరేయ కూడదు. ఎగిరేసినందుకు ఆయన కాశాయ మూక చేతుల్లో దాడికి గురవుతాడు.....

వాళ్ళు హంతకులు : మనుషులనే కాదు గోవులనూ చంపుతారు.

ఛత్తీస్‌గడ్‌లోని దుర్గ్‌ జిల్లాలోని జమూల్‌ నగర్‌ నిగమ్‌ గ్రామానికి చెందిన బీజేపీ నేత హరీశ్‌ వర్మ ప్రభుత్వం ఇచ్చే సొమ్ముతో ఏడు సంవత్సరాలుగా రాజ్‌పూర్‌ గ్రామంలో ఓ గోశాలను నడుపుతున్నారు. అయితే ఆయన సొమ్మును దిగమింగి ఆ ఆవులను ఊరి మీదికి వదిలేస్తాడనే ఆరోపణలు

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


పెరిగిపోతున్న