ఎట్ట‌కేల‌కు టీవీవీ మ‌హాస‌భ‌ల‌కు అనుమ‌తి - 21,22 తేదీల్లో స‌భ‌లు


ఎట్ట‌కేల‌కు టీవీవీ మ‌హాస‌భ‌ల‌కు అనుమ‌తి - 21,22 తేదీల్లో స‌భ‌లు

ఎట్ట‌కేల‌కు

తెలంగాణ విద్యార్థి వేదిక మ‌హాస‌భ‌ల‌కు ఎట్ట‌కేల‌కు అనుమ‌తి ల‌భించింది. డిసెంబ‌ర్ 20, 21 తేదీల్లో క‌రీంన‌గ‌ర్‌లో నిర్వ‌హించత‌ల‌పెట్టిన టీవీవీ రాష్ట్ర 5వ మ‌హాస‌భ‌ల‌కు పోలీసులు అనుమ‌తి నిరాక‌రించిన విష‌యం తెలిసిందే. ప్ర‌భుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు మంగ‌ళ‌వారం నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ఉస్మానియా యూనిర్సిటీలో జ‌రిగిన విద్యార్థి సంఘాల రౌండ్‌టేబుల్ స‌మావేశం ప్ర‌భుత్వ తీరును త‌ప్పుబ‌ట్టింది. 50 కోట్ల ప్ర‌జాధ‌నాన్ని ఖ‌ర్చుచేసి తెలుగు మ‌హాస‌భ‌లు నిర్వ‌హించిన ప్ర‌భుత్వం, విద్యార్థి సంఘం నిర్వ‌హించుకునే స‌భ‌ల్ని అడ్డుకోవ‌డం అప్ర‌జాస్వామికం అని విద్యార్థి సంఘాల నాయ‌కులు ఆరోపించారు. ఈ స‌మావేశంలోపాల్గొన్న ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్ తెలంగాణ ప్ర‌భుత్వం నిరంకుశంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నారు. రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్య వాతార‌ణాన్నికాల‌రాసి, కేసీఆర్ ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న సాగిస్తున్నాడ‌ని ఆరోపించారు. మ‌రోవైపు వాక్ సభా స్వాతంత్ర్యాల‌ను కాపాడాల‌ని, స‌భ పెట్టుకునేందుకు త‌మ‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని టీవీవీ సోమ‌వారం హైకోర్టును ఆశ్ర‌యించింది. మంగ‌ళ‌వారం పిటీష‌న్‌పై వాద‌న‌ల సంద‌ర్భంగా క‌రీంన‌గ‌ర్ పోలీసులు న్యాయ‌మూర్తి ముందు తాము స‌భ‌కు అనుమ‌తి నిరాక‌రించ‌లేద‌ని, కేవ‌లం ర్యాలీకి మాత్ర‌మే అనుమ‌తి నిరాక‌రించిన‌ట్లు తెలిపారు. రాష్ట్ర‌ వ్యాప్తంగా విద్యార్థి, యువ‌జ‌న‌, ఉపాద్యాయ‌, ప్ర‌జా సంఘాలు చేసిన ఒత్తిడితో ఎట్ట‌కేల‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం స‌భ‌లకు అనుమ‌తి ఇస్తున్న‌ట్లు పోలీసులు దృవీక‌రించారు. దీంతో 20, 21తేదీల్లో జ‌ర‌గాల్సిన టీవీవీ మ‌హాస‌భ‌ల్ని... 21, 22 తేదీల్లో నిర్వ‌హించేందుకు టీవీవీ నిర్ణ‌యించింది. గురు, శుక్ర‌వారాల్లో జ‌రిగే టీవీవీ 5వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్ని విజ‌యవంతం చేయాల‌ని టీవీవీ నాయ‌కులు విద్యార్థుల‌కు పిలుపునిచ్చారు.

Keywords : telangana, TVV, karimnagar, police, kcr
(2018-04-21 15:54:30)No. of visitors : 455

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.

మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

ఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్‌ ముట్టడి, పెరేడ్‌ గ్రౌండ్స్‌లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్‌ ఉద్యమాలు నిర్వహించారు.

మహాజనాద్భుత సాగరహారానికి నాలుగేళ్ళు

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపుత్రుల దేహాల సంరంభాన్ని అనుభవించవలసిన సందర్భం అది....

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

ʹనీ బాంచెన్ దొరా కాల్మొక్తʹ

జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ఖిల్లాలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పాదాభివందనం చేస్తున్నానంటూ ...

Search Engine

ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టంపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నిర‌స‌న‌ల‌కు మావోయిస్టు పార్టీ పిలుపు
మహిళా జర్నలిస్టులపై బిజెపి నేత అనుచిత వ్యాఖ్యలు - ‍పార్టీ ఆఫీస్ ముందు జర్నలిస్టుల నిరసన‌
క‌థువా, ఉన్నావ్ నుండి చింతగుఫా వ‌ర‌కు
ఇంద్రవెల్లి ఇంగలం - వరవరరావు
Statement of the First Meeting of European Marxist-Leninist-Maoist Parties and Organizations
ఆసిఫా హ‌త్యాచారం: మోడీని ఏకిపడేసిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక‌
ʹమోడి నాట్ వెల్కమ్ʹ ... లండన్ లో భారతీయుల నిరసనలు
“It’s The State That’s Violating the Constitution, Not Us”
Women in People’s War: Past, Present and Future
Expand The Peopleʹs War To Fight Brahmanical Hindu Fascism And Advance The New Democratic Revolution - Varavara Rao
చిన్నారి ఆసిఫా కేసు వాదిస్తే రేప్ చేసి చంపుతారట !
బంద్ సందర్భంగా ముగ్గురు దళితులను కాల్చి చంపింది ఉగ్రకుల మూక‌ !
ఇప్పుడు కావాల్సింది ఇలాంటి జర్నలిస్టులే !
యస్సీయస్టీ చట్టంపై ఎందుకింత అసహనం? - వాహెద్
ఏది ఫేక్ న్యూస్ ? దీనిని ఎవరు ప్రచారం చేస్తున్నారు ?
ఎగిసిన దళితాగ్రహం..బంద్ విజయవంతం...నిరసనపై పోలీసు తూటా.. 9 మంది బలి !
SC,STచట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలకు నిరసనగా రేపు భారత్ బంద్
పృథ్వీరాజ్,చందన్ లు HCU VC పై హత్యా యత్నం చేశారన్న‌ఆరోపణలు ఓ కుట్ర‌ - వరవరరావు
జిగ్నేష్ మేవాని... కొత్త దళిత రాజకీయాలు - ఎన్. వేణు గోపాల్ (2)
జిగ్నేష్ మేవాని... కొత్త దళిత రాజకీయాలు - ఎన్. వేణు గోపాల్ (1)
పోలీసులు కిడ్నాప్ చేసిన విరసం సభ్యుడు పృథ్వీరాజ్,చందన్ లను విడుదల చేయాలి !
దశాబ్దం దాటినా ఆరని కన్నీటి మంట... అయేషా మీరా హంతకులకు పాలకుల అండ‌
ఇంట‌ర్మీడియెట్ బోర్డును ముట్ట‌డించిన తెలంగాణ విద్యార్థి వేదిక - 70 మంది విద్యార్థుల‌ అరెస్టు
Ban Sri Chaitanya & Narayana Corporate Colleges
more..


ఎట్ట‌కేల‌కు