ఆంక్ష‌ల వ‌ల‌యాల్ని చేధించుకొని ఎగిసిన ఆశ‌యాల జెండా


ఆంక్ష‌ల వ‌ల‌యాల్ని చేధించుకొని ఎగిసిన ఆశ‌యాల జెండా

ఆంక్ష‌ల

రాజ్య‌ నిర్బంధాన్ని దిక్క‌రించి తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర మ‌హా స‌భ‌ల్ని ప్రారంభించుకుంది. రాష్ట్ర న‌లుమూల నుంచి వ‌చ్చిన వంద‌లాది మంది విద్యార్థుల‌తో గురువారం క‌రీంన‌గ‌ర్‌లోని టీఎన్‌జీవో హాల్‌లో టీవీవీ రాష్ట్ర 5వ మ‌హాస‌భ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. టీవీవీ రాష్ట్ర అధ్య‌క్షుడు మ‌హేష్ ప‌తాకావిష్క‌ర‌ణ చేసి స‌భ‌ల‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన బ‌హిరంగ‌స‌భ‌లో డెమోక్ర‌టిక్ టీచ‌ర్స్ ఫెడ‌రేష‌న్ రాష్ట్ర అధ్య‌క్షుడు రఘు శంక‌ర్‌రెడ్డి ప్రారంభోప‌న్యాసం చేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం నిరంకుశ పాల‌న సాగిస్తుంద‌ని ఆరోపించారు. ప్ర‌శ్నించే గొంతుల‌ను అణ‌చివేసేందుకు య‌త్నిస్తుంద‌న్నారు. అందులో భాగంగానే టీవీవీ స‌భ‌ల‌ను అడ్డుకునేందుకు య‌త్నించింద‌న్నారు. పోరాడి తెలంగాణ‌ను సాధించుకున్న‌ది ఇందుకేనా? అని ప్ర‌శ్నించారు. తెలంగాణ విద్యార్థి వేదిక స‌మాన విద్య కోసం, ప్ర‌జాస్వామిక తెలంగాణ కోసం, మంచి స‌మాజం కోసం పోరాడుతోంద‌ని గుర్తుచేశారు. సామాజిక అస‌మాన‌త‌లు తొల‌గాల‌ని, కామ‌న్ స్కూల్ విద్యా విధానం అమ‌లు కావాల‌ని కొట్లాడుతున్న సంస్థ నిర్బంధాన్ని ప్ర‌యోగించ‌డం అప్ర‌జాస్వామిక‌మ‌న్నారు. విద్యారంగానికి బ‌డ్జెట్ కెటాయింపులు త‌గ్గిస్తూ ప్రైవేటు రంగాన్ని ప్రోత్స‌హిస్తోంద‌న్నారు. అధికారంలో ఉన్న‌వాళ్లే వెలాసిటీ లాంటి కార్పోరేట్ సంస్థ‌ల‌ను నిర్వ‌హిస్తున్నార‌ని ఆరోపించారు. మ‌రోవైపు కేంద్రంలో బీజేపీ విశ్వ‌విద్యాల‌యాల‌ను మ‌తోన్మాద రాజ‌కీయాల‌కు కేంద్రంగా మార్చుతోంద‌ని ఆరోపించారు. సామ్రాజ్య‌వాదానికి మ‌తం తోడ‌వ‌డం ఇవాళ విద్యారంగానికి పొంచివున్న పెద్ద ప్ర‌మాద‌మ‌న్నారు. పాల‌క విధానాల మూలంగా ద‌ళిత‌, ఆదివాసీ, మైనార్టీ, అట్ట‌డుగు వ‌ర్గాల‌కు విద్య దూర‌మ‌య్యే ప్ర‌మాద‌ముంద‌న్నారు. ఈ విధానాల‌కు వ్య‌తిరేకంగా ఐక్యంగా ఉద్య‌మించాల‌ని పిల‌పునిచ్చారు. స‌భ‌ల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్ మాట్లాడుతూ ప్ర‌భుత్వాలు తాము రాసుకున్న రాజ్యాంగానే తామే గౌర‌వించ‌డం లేద‌న్నారు. ప్రొఫెస‌ర్ వ‌న‌మాల మాట్లాడుతూ మ‌హిళ‌ల‌కు స‌మానావ‌కాశాలు క‌ల్పిచ‌ని ఏ స‌మాజ‌మైనా రోగ‌గ్ర‌స్త‌మైన స‌మాజ‌మే అన్నారు. విద్యా ప్రైవేటీక‌ర‌ణ వ‌ల్ల ఎక్కువగా న‌ష్ట‌పోయేది మ‌హిళ‌లే అని, వాళ్లకు విద్య దూర‌మ‌వ్వ‌డంతో పాటు, గౌర‌వ ప్ర‌ద‌మైన జీవితం కూడా దూర‌మ‌వుతుంద‌న్నారు. ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెడుతున్న కళ్యాణి ల‌క్ష్మి వంటి ప‌థ‌కాలు అర్థం లేనివ‌ని, జీవితానికి పెళ్లే ప‌ర‌మావ‌ధికాద‌ని, ప్ర‌భుత్వాలు వాళ్ల ఆకాంక్ష‌లు తెలుసుకొని వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. ఆకుల భూమ‌య్య రాసిన శాస్త్రీయ విద్యా విదానం పుస్త‌కాన్ని ఈ సంద‌ర్భంగా ప్రొఫెస‌ర్ సూరేప‌ల్లి సుజాత ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో టీపీఎఫ్ రాష్ట్ర అధ్య‌క్షుడు న‌ల‌మాస కృష్ణ‌, టీవీవీ ప్రధాన కార్య‌ద‌ర్శి మ‌ద్దిలేటి, రాజేంద‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా టీవీవీ, ప్ర‌జాక‌ళామండ‌లి క‌ళాకారులు సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు కొత్త ఉత్తేజాన్ని నింపాయి.

Keywords : tvv, telangana, police
(2018-12-11 19:35:03)No. of visitors : 906

Suggested Posts


ʹపోలీసులు నన్ను చంపాలని చూస్తున్నారు, రక్షించండిʹ - హోం మంత్రికి విద్యార్థి నాయకుడి వినతి

తెలంగాణ పోలీసులు తనను హత్య చేయడానికి చూస్తున్నారని, తనను కాపడమని ఓ విద్యార్థి నాయకుడు రాష్ట్ర హోం మంత్రికి మొరపెట్టుకున్నాడు. తెలంగాన ఉధ్యమంలో ఆక్టీవ్ గా పాల్గొన్న ఆజాద్ అనే ఒస్మానియా యూనివర్సిటీ....

జైల్లోనైనా స‌భ‌లు జ‌రుపుతాం : TVV అధ్య‌క్షుడు మ‌హేష్‌

టీవీవీ రాష్ట్ర అధ్య‌క్షుడు మ‌హేష్ ఉద్వేగపూరిత ఉప‌న్యాసం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా టీవీవీ త‌న ల‌క్ష్య సాధ‌న‌లో ఇంచుకూడా వెన‌క్కి జ‌ర‌గ‌ద‌ని ప్ర‌క‌టించారు. అవ‌స‌ర‌మైతే జైళ్లోనైనా స‌భ‌లు జ‌రుపుతాం త‌ప్ప ఆగే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. టీవీవీ గ‌త ద‌శాబ్ద కాలంలో ఎన్నో మైలు రాళ్లు దాటుకొచ్చింద‌ని, మిలియ‌న్ మార్చిని రూప‌క‌ల్ప‌న చేసిన ఘ‌న‌త టీవీవీద‌ని గుర

పోలీసు సంస్కృతి చెల్ల‌దు : టీవీవీ మ‌హాస‌భ‌ల్లో ప‌్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్‌

మెజార్టీ ప్ర‌జ‌లు పేద‌రికంలో మ‌గ్గుతుంటే కొద్ది మంది గుప్పిట్లో మొత్తం సంప‌ద‌ను పోగుచేసుకున్న అస‌మ స‌మాజంలో టీవీవీ స‌మాన‌త్వం కోసం పోరాడుతోంద‌న్నారు. అలాంటి సంస్థ‌పై నిర్బందాల‌ను ప్ర‌యోగించ‌డం వ‌ల్ల శాంతి నెల‌కొన‌ద‌ని, పోరాటాలు మ‌రింత తీవ్ర‌మ‌వుతాయ‌ని అన్నారు.

నిర్బంధాలు గ‌డ్డిపోచ‌తో స‌మానం : టీవీవీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి మ‌ద్దిలేటి

టీవీవీ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మాట్లాడుతూ రాజ్యాంగంలోని ప్ర‌థ‌మిక హ‌క్కుల‌ను కాల‌రాస్తున్న ప్ర‌భుత్వం ప్ర‌జాస్వామ్య ద్రోహి అని ఆరోపించారు. అంద‌రికీ విద్య అందించ‌మ‌ని, అంట‌రానిత‌నాన్ని రూపుమాపాల‌ని, ఉద్యోగాలు క‌ల్పించాల‌ని అడుగుతున్న విద్యార్థుల‌పై నిర్బంధాన్ని ప్ర‌యోగించడం రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కుల్ని ఉల్లంఘించ‌డ‌మే అన్నారు. ప్ర‌భుత్వ నిర్బందాలు త‌మ‌కు

Search Engine

ఆనాటి ఎన్నికల సన్నివేశమే మళ్లీ పునరావృతమైనట్టుంది..!
కాశ్మీర్ ఉజ్వలమైన చరిత్ర, పోరాట గాథ...మాజీ కేంద్ర మంత్రి సఫుద్దీన్ సోజ్ కాశ్మీర్ పై రాసిన పుస్తకం గురించి..
మత రాజకీయాల్లో యూపీ సీఎం యోగీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ..
సర్జికల్ స్ట్రైక్స్ రాజకీయం... ప్రమాదకరమన్న ఆర్మీ అధికారి
ఏవోబీలో పీఎల్జీఏ వారోత్సవాలు..ఆడియో రిలీజ్ చేసిన మావోయిస్టులు
బీజేపీకి రాజీనామా చేసిన దళిత మహిళా ఎంపీ - సమాజంలో బీజేపీ విభజనలు సృష్టిస్తోందని ఆరోపణ‌
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 3
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 2
ఎన్నికలపై మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్-1
దళితులపై తప్పుడు కేసులు బనాయించి చితకబాదుతుంటే నాకు గర్వంగా ఉంటుంది.. ఒక ఐపీఎస్ వ్యాఖ్యలు
ʹఅఖ్లక్ హత్యపై దర్యాప్తు చేశాడనే ఇన్‌స్పెక్టర్ సుబోధ్‌ను హిందుత్వవాదులు అంతం చేశారుʹ
Isolate the fish from the water: a genocidal practice in India - Adolfo Naya
18 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
కేసీఆర్ ఓ నియంత : మావోయిస్టు జ‌గ‌న్‌
భీమాకోరేగావ్ విప్ల‌వ, ద‌ళిత శ‌క్తుల ఐక్య‌త‌కు ప్ర‌తీక : పాణి
CPI (Maoist) appoints military strategist Basavraju as its next general secretary
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బసవరాజు...అనారోగ్య కారణాలతో స్వచ్చందంగా విరమించుకున్న‌ గణపతి
పుణెలో రెండు రోజులు
కిషన్ జీ... పీడితుల యుద్ద గీతి !
చీకటి గదిలో ఒంటరిగా.. ఊపిరి పీల్చుకోలేని స్థితిలో వరవరరావు
గృహ నిర్బంధం అంటే ? - వరవరరావు
పోరాడి తమ హక్కులు సాధించుకున్న గిరిజన రైతులు.. ముంబైలో మహాపాదయాత్ర
ప్రజా గొంతుకల అక్రమ అరెస్టులపై పోరాడుదాం
నేల చెర విడిపించే అక్షరాలు - అశోక్ కుంబము
రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే
more..


ఆంక్ష‌ల