విప్లవ రచయితల సంఘం 26వ మహా సభలను విజయవంతం చేద్దాం

విప్లవ

ఫాసిజానికి, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం
మానవ చైతన్యాన్ని ఉన్నతీకరించే నూతన సమాజాన్ని నిర్మించుకుందాం
విప్లవ రచయితల సంఘం 26వ మహా సభలను విజయవంతం చేదాం
జనవరి 13, 14 - 2018 శని, ఆదివారాలు, మహబూబ్ నగర్

ప్రజలారా, సాహితీ మిత్రులారా,

శ్రీకాకుళ రైతాంగ పోరాటం నుంచి విరసం ఆవిర్భవించింది. రచయితలారా మీరెటువైపు అనే విప్లవ విద్యార్థుల ప్రశ్నను స్వీకరించిన రచయితలు దేశవ్యాప్తంగా సాగుతున్న ప్రజా పోరాటాలను సాంస్కృతిక రంగంలో ప్రచారం చేయడానికి విప్లవ రచయితల సంఘాన్ని ఏర్పాటు చేశారు. రచయితలు ప్రజాపక్షం వహించాలనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తిని, భూస్వామ్య బ్రాహ్మణీయ ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా ఈ దేశంలో సాగిన ధిక్కార వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటూ విప్లవ మార్గాన్ని ఎంచుకున్నారు. సాహిత్యం, కళలు ప్రజా జీవితాన్ని ఉన్నతీకరించే సాధనం కావాలని గత నలభై ఎనిమిదేళ్లుగా విరసం కృషి చేస్తున్నది. శ్రీశ్రీ, కుటుంబరావు, చెరబండరాజు, అబ్రహాం, ఎంటీ ఖాన్, కేవీఆర్, త్రిపురనేని మధుసూదనరావు, చలసాని ప్రసాద్లాంటి తొలి తరం విప్లవ రచయితలు భూస్వామ్య బ్రాహ్మణీయ సంస్కృతిని, మనుధర్మ భావజాలాన్ని, సామ్రాజ్యవాద మార్కెట్ సంస్కృతీ రాజకీయాలను వ్యతిరేకిస్తూ ఈ దేశ ప్రజల పోరాట మార్గాన్ని జీవితమంతా సాహిత్యీకరించారు. విప్లవ దృక్పథంతో పాట, కథ, వచన కవిత్వం, నవల, సాహిత్య విమర్శ, ప్రసంగం తదితర ప్రక్రియను సరికొత్తగా తీర్చిదిద్దారు. ఈ వారసత్వాన్ని సముజ్వలంగా కొనసాగిస్తూ విరసం ఇప్పటికి 25 మహాసభలు జరుపుకొని 26వ మహా సభలను మహబూబ్ నగర్లో తలపెట్టింది.

మహబూబ్ నగర్ అంటే వలస గుర్తుకొస్తుంది. దేశంలోని మహా నిర్మాణాల కింద ఒలికిన పాలమూరు లేబర్ నెత్తురూ చెమటా గుర్తుకు వస్తుంది. బాల్యంతో సహా ధ్వంసమైపోతున్న జీవితమంతా గుర్తుకు వస్తుంది. ఏరంచులో నల్లమల కొండల్లోని చెంచుల అమాయకపు జీవితేచ్ఛ కనిపిస్తుంది. అంతేకాదు.. చెంచులతో సహా పాలమూరు ప్రజల తరతరాల పోరాటతత్వం స్ఫురణకు వస్తుంది. భూస్వామ్యానికి, సంస్థానాధీశుల ఆగడాలకు, నైజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఎగరేసిన ధిక్కార పతాకాల రెపరెపలు కనిపిస్తాయి. తెలంగాణ రైతాంగ సాయుధపోరాట కాలం నుంచి తొలి విడత తెలంగాణ రాష్ట్ర ప్రజా పోరాటాలు, నక్సల్బరీని స్వాగతించిన సాహసోపేతమైన త్యాగాలు కూడా గుర్తుకు వస్తాయి. మలిదశ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలోని తెగువ, ప్రశ్నాతత్వం స్ఫురణకు వస్తాయి. వ్యవస్థకు ప్రత్యామ్నాయాన్ని నిర్మించడానికి దేశ ప్రజలందరితో భుజం కలిపిన మహబూబ్ నగర్ ఉద్యమ సంచలనాలు గుర్తుకు వస్తాయి. ప్రత్యేక రాష్ట్రంలో కూడా కడగొట్టు బిడ్డడిలా మరి నా మాటేమిటనే న్యాయ, ధర్మాగ్రహాలు తలపుకు వస్తాయి.

గతంలా కనిపించే వర్తమానపు జీవన్మరణ పెనుగులాట మహబూబ్ నగర్కు అనివార్యమవుతున్నది. చైతన్యవంతమైన విస్తృత ప్రజా కార్యక్షేత్రాన్ని మహబూబ్ నగర్ నిత్యం నిర్మించుకుంటున్నది. అన్ని రకాలుగా కోల్పోయిన వాటిని పునస్సమీకరించుకుంటున్నది. సాహిత్యమూ, కళలు, సకల మేధో రంగాలను ప్రజాస్వామికీకరించేందుకు, విప్లవీకరించేందుకు అలవిగాని ఆరాటం అనుభవిస్తున్నది. ఒక సుదీర్ఘ ప్రయాణం మహబూబ్నగర్ సొంతం. ప్రతి అడుగులో తనదే అయిన సొంత ముద్రతో, కంఠస్వరంతో స్థానీయతను, దేశీయతను, అంతర్జాతీయ కార్మిక వర్గ తాత్వికతను ప్రతిబింబిస్తున్నది. సంస్థాన, బ్రాహ్మణీయ సాహిత్యాన్ని కాదని ఒక గొప్ప కాగడాను ధరించి ఆధునిక ప్రగతిశీల సాంస్కృతిక రంగస్థలంలోకి వివిధ సాంఘిక జీవన అస్తిత్వ చైతన్యంతో విస్తరిస్తున్నది. దళిత కులం నుంచి వచ్చిన దున్న ఈద్దాసు వంటి వాళ్లు బ్రాహ్మణేతర సాహిత్యానికి ఆద్యులయ్యారు. కుల మతాలను ఎదిరించాలనే సంకీర్తనా సాహిత్యం కూడా ఇక్కడి నుంచి వచ్చింది. పండగ సాయన్న, మియాసాబు, నక్కలపల్లి రాముడు, మండ్ల కురుమన్నలాంటి వాళ్లు భూస్వామ్య, సంస్థానాధీశుల ఆధిపత్యంపై ధిక్కార ప్రతీకలుగా నిలిచారు. వాళ్ల గురించి జానపదులు పాడుకునే పాటలు నేటికీ సజీవంగా ఉన్నాయి. సురవరం ప్రతాపరెడ్డి గోల్కండ పత్రిక, గోల్కండ కవుల సంచిక, ఆ కాలపు కథా సాహిత్యం, ముఖ్యంగా 1964లో గడ్డిపూలు కథా సంకలనం సామాజిక, సాహిత్య రంగాల్లో కొత్త వెలుగులు అందించాయి. తొలి పత్రిక హితబోధిని ప్రజాహితబోధినిగా 1910లోనే వెలుబడింది. ఆధునిక సాహిత్య వేదికగా సృజన మాస పత్రిక మహబూబ్ నగర్ జిల్లాలోనే ఆరంభమైంది. పి. యశోదారెడ్డి కథల్లో ప్రయోగించిన పాఠకులకు, మాండలికం సాహిత్యకారులకూ తెలిసిందే. ఇలా నక్సల్బరీకి ముందే మహబూబ్ నగర్ జిల్లా సామాజిక, సాహిత్య సాంస్కృతిక రంగాలు అనేక తలాల్లో ఘర్షణ అనుభవించి ఒక వారసత్వాన్ని చాలుబోశాయి.

ఈ దారిని నక్సల్బరీ మేలి మలుపు తిప్పింది. భాషా సాహిత్యాలలో ఇది స్పష్టంగానే కనిపిస్తుంది. విప్లవ రచయితల సంఘం తొలి తరం సభ్యుల కృషి దీనికి దోహదపడింది. ముఖ్యంగా 1985 గద్వాల విరసం సాహిత్య పాఠశాల రెండు మూడు రంగాల్లో తెలుగు సాహిత్య, మేధో రంగాల ముందు అద్భుతమైన ప్రతిపాదనలు పెట్టింది. పాలమూరు లేబర్ సమస్యను తొలిసారి ఆ సభల్లో రాజకీయార్థిక పునాది నుంచి విశ్లేషించి రాష్ట్ర వ్యాప్తంగానే చర్చనీయాంశం చేసింది. అలాగే మతాన్ని సంస్కృతిలో, భావజాలంలో, నమ్మకాల్లో భాగంగా చూసే దశ నుంచి మతాన్ని తొలిసారి వర్గ పునాది నుంచి పరిశీలించి మత వర్గతత్వమనే ప్రతిపాదన చేసింది. స్థానిక సంస్థానాల సాహిత్యాన్ని రాజకీయార్థిక దృక్పథం నుంచి ఎత్తి చూపుతూ దాని వర్గ స్వభావాన్ని ఈ పాఠశాల విశ్లేషించింది. ఒక రకంగా గత కాలపు పాలక వర్గ సాహిత్య సారాన్ని గుర్తించే సంవిధానం అందించే ప్రయత్నమిది. ముప్పైరెండేళ్ల తర్వాత ఇప్పుడు మహబూబ్ నగర్లో విరసం మహా సభలు జరగబోతున్నాయి.

అంతర్జాతీయ పెట్టుబడి ప్రయోజనాలు, మన పాలకుల దళారీ ప్రయోజనాలు, బ్రాహ్మణీయ భావజాలం, కుల వ్యవస్థ గుండెకాయగా ఉన్న హిందుత్వ, పార్లమెంటరీ రాజకీయాల్లోని మెజారిటీ వాదం అన్నీ కలిసి ఇవాళ మతం ఇలా తయారైంది. పాలకవర్గం దీన్ని తన ప్రయోజనాల కోసం వాడుకుంటున్నది. సారాంశంలో ఇది బ్రాహ్మణీయ హిందూ ఫాసిజంగా పని చేస్తున్నది. ఇది ఈ దేశంలోని ముస్లింలకు, దళితులకు, ఆదివాసులకు, బలహీనవర్గాలకు, మహిళలకు తీవ్ర ప్రమాదంగా మారింది. మన సమాజంలో తరతరాలుగా మత భావజాలానికి వ్యతిరేకంగా సాగిన ప్రత్యామ్నాయ భావనలను దెబ్బతీస్తున్నది. భిన్నాభిప్రాయాలు ప్రకటించేవాళ్లను నిర్మూలిస్తున్నది. నరేంద్ర దబోల్కర్, పన్సారే, కల్బుర్గిలాంటి వాళ్లను మతతత్వం భరించలేకపోయింది. తాజాగా ప్రముఖ పాత్రికేయురాలు, రచయిత గౌరీలంకేష్ను ఫాసిస్టు శక్తులు హత్య చేశాయి.

చార్వాకుల నుంచి బ్రాహ్మణేతర ప్రజాస్వామిక సంప్రదాయాలను, సహ జీవన సంస్కృతిని ప్రతిపాదిస్తూ ఎందరో ముందుకు వచ్చారు. వేమన, వీరబ్రహ్మం, నారాయణగురు, పెరియార్, ఫూలే, సావిత్రీబాయి ఫూలే, అంబేద్కర్ ఇటీవలే అమరుడైన సీవీ దాకా ఒక గొప్ప వొరవడిని అందించారు. అయితే దేశవ్యాప్తంగా అనేక రూపాల్లో జరిగిన సంఘర్షణలు, ప్రజాపోరాటాల నేపథ్యంలో తయారైన భారత రాజ్యాంగంలోని లౌకిక విలువలను కూడా ఇవాళ ఫాసిజం దెబ్బతీస్తోంది. మనుషుల సహజీవనాన్ని దెబ్బతీసి వైరుధ్యాలను సృష్టిస్తున్నది. పుట్టుకతో వచ్చిన మతం ప్రాతిపదిక మీద ప్రజలను పాలకవర్గం విభజిస్తోంది. ఒకరి మీదికి ఒకరిని ఉసిగొల్పి మతతత్వాన్ని పెంచుతున్నది. ఏ మతమైనా వ్యక్తిగత విషయంగా ఉండాల్సిందేగాని సామాజికంగా మారడానికి వీల్లేదనే లౌకికతత్వాన్ని ఎవరూ ఉల్లంఘించడానికి వీల్లేదు.

ఈ విలువలకు వ్యతిరేకంగా ఫాసిజం మానవ వ్యతిరేకంగా విరుచుకుడుతోంది. వేర్వేరు ప్రజాతంత్ర భావజాలాల వైపు నుంచి ఈ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న శక్తులు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. మానవి, మనిషి కేంద్రంగా అందరూ ఐక్యమై ఫాసిజాన్ని ఎదుర్కోవాలనే ప్రయత్నం సాగుతున్నది. మానవతను ధ్వంసం చేస్తున్న మతతత్వాన్ని ఎదుర్కోడానికి మనిషి, మానవ సంబంధాలే గీటురాయి కావాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది సృజనాత్మకమై, వైవిధ్యభరితమైన మనిషిని కాపాడుకొనే పోరాటంగా విస్తరించ వలసి ఉన్నది.

మనిషి సాంస్కృతిక జీవి. అది మనుషులను కలపాలి. మనుషుల మధ్య వైరుధ్యాలను పరిష్కరించే సాధనం కావాలి. చరిత్ర పొడవునా సంస్కృతి ఇంత గొప్ప మానవీయ, సామాజిక పాత్ర వహించింది. ఇలాంటి సంస్కృతిని ఆధిపత్య శక్తులు వివక్షకు, పీడనకు, అణచివేతకు, అంతిమంగా మానవ వ్యతిరేకతకు వాడుకుంటూ వచ్చాయి. ఇది కూడా చరిత్రే. మానవ చైతన్యాన్ని ఉన్నతీకరించడానికి, సున్నిత మానవ సంస్పదనలు రేకెత్తించి నిలబెట్టడానికి దోహదపడాల్సిన సంస్కృతి విద్వేష రాజకీయాల్లో, ఓట్ల రాజకీయాల్లో విషపు కత్తిగా మారడం అందోళన కలిగిస్తోంది. మతాన్ని మత వర్గతత్వంగా, సాంస్కృతిక ఆధిపత్య శక్తిగా పాలకులు చరిత్ర పొడవునా వాడుకుంటూ వచ్చారు. భారతదేశంలో కులం దీనికి ఉపయోగపడుతున్నది. నిజానికి అంతరాల కులవ్యవస్థ లేకుండా హిందూమతం లేదు. ప్రజాశక్తులు వీటన్నిటికి వ్యతిరేకంగా మానవ జీవితమంతా అత్యంత సహజంగా ఆవరించి ఉన్న సంస్కృతిని నిలబెట్టడానికి, పాలకవర్గ సాంస్కృతిక ఆధిపత్యాన్ని ఓడించడానికి అలుపెరగని పోరాటాలు చేస్తూ వచ్చాయి. శరత్ కాలపు వెన్నెల వలె సంస్కృతి భూ మండలమంతా వెల్లివిరిసే రోజు కోసం ఉద్యమిస్తూ వచ్చాయి. అయితే ఆధునిక యుగంలో పాలకవర్గ శక్తులు ఎన్నడూ వాడుకోనంత విచ్చలవిడిగా ఇప్పుడు సంస్కృతిని, భావజాలాన్ని వాడుకుంటున్నాయి. సమాజం మొత్తాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే కుట్ర ఇందులో ఉన్నది. అందువల్ల ఇది అతి పెద్ద విపత్తుగా మారింది. మనిషిని మతం పేరుతో విషతుల్యం చేయడానికి, విద్వేష పూరితం చేయడానికి పాలకవర్గం అతి పెద్ద ఎత్తున సాంస్కృతిక, భావజాల యుద్ధం ఆరంభించింది. భావాల అణచివేతకు, వ్యక్తుల నిర్మూలనకు మతశక్తులు ఒక రకమైన ముసుగు వ్యూహం అమలు చేస్తున్నాయి. చాలా లోతైన, సంక్లిష్టమైన ఈ సమస్య గురించి ఉద్వేగపూరితంగా ఆలోచిస్తే పరిష్కారాలు దొరకవు. నిజానికి మతం, కులం, సంస్కృతిలాంటి విషయాల్లో ఆధిపత్యశక్తులు ఉద్వేగాలు, ఉద్రేకాలను వాడుకుంటాయి. వీటికి శాస్త్రీయమైన, మానవీయమైన పరిష్కారం వెతకాల్సిన వాళ్లు ఓపికగా, హేతుబద్ధంగా ఆలోచించవలసి ఉన్నది. దీర్ఘకాలిక దృష్టిగల ఆచరణే ఈ సమస్యల పరిష్కారం దిశగా ప్రజలను నడిపిస్తుంది.

ఈ తరుణంలో విప్లవ రచయితల సంఘం జనవరి 13, 14 తేదీల్లో జరిగే మహా సభలకు ఈ అంశాన్నే కేంద్రంగా తీసుకుంది. తన దృక్పథంలో బ్రాహ్మణీయ హిందూ ఫాసిజాన్ని మరోసారి మన మహబూబ్ నగర్లో విశ్లేషించబోతోంది. మనమంతా ఈ ప్రయత్నానికి అండగా ఉందాం. సహకరిద్దాం. ప్రజాస్వామిక ఆలోచనలు విస్తరించడానికి విరసం చేస్తున్న ప్రయత్నం మనందరిదని భావిద్దాం. ఈ సభలను విజయవంతం చేద్దాం.

ఆహ్వాన సంఘం:

అధ్యక్షుడు: ప్రొ.జి హరగోపాల్ (పాలమూరు అధ్యయన వేదిక)
ఉపాధ్యక్షుడు: రాజేంద్రబాబు
కార్యదర్శి: పి.వరలక్ష్మి
సభ్యులు
జహీర్అలీఖాన్ (సియాసత్ ఎడిటర్)
కె. శ్రీనివాస్ (ఆంధ్రజ్యోతి ఎడిటర్)
బూర్గుల నరసింగరావు
ప్రొ. టి. మోహన్ సింగ్
ప్రొ. కె. చక్రధరరావు
ప్రొ. లక్ష్మీనారాయణ (విద్యాపరిరక్షణ కమిటీ)
ప్రొ. కెవై రత్నం
ప్రొ. ముత్యంరెడ్డి
ప్రొ. పద్మజా షా
డా. ముదునూరు భారతి
ప్రొ. కె.ఆర్. చౌదరి
జలజం సత్యనారాయణ (చైర్మన్, టి.మాస్, మహబూబ్నగర్)
జి. రాజేంద్రరెడ్డి (చైర్మన్, టి.జెఎసి, మహబూబ్నగర్)
జి. అంపయ్య
హిమజ్వాల
సి. రామ్మోహన్
డా. ఎ. మధుసూదన్రెడ్డి
డా. పి. ప్రతిమ
డా. ఎల్. మురళీధర్ (జన విజ్ఞాన వేదిక)
వి. బాలపీరు (జాషువా సాహిత్య వేదిక)
పి. చెన్నయ్య (జాషువా సాహిత్య వేదిక)
డా. భగవంతు
విరజాజి రామిరెడ్డి
నాగవరం బాల్రాం
సుభాష్ కోటి
అయ్యన్న (నాస్తిక సమాజం)
జి. యాదగిరి
జనజ్వాల
మహ్మద్ సాదఖుల్లా
సాదిఖ్అలీ ఫరీది
హలీమ్ బాబర్
రషీద్ రహబర్
ప్రొ. సుభాషిణి
పుష్పలత, అధ్యాపకురాలు
జి. వేణుగోపాల్, న్యాయవాది
లక్ష్మణశర్మ, న్యాయవాది
జి. పరమేశ్వర్గౌడ్, న్యాయవాది
ఎం. కాళేశ్వర్, న్యాయవాది
ఆర్ఆర్. మన్యం, న్యాయవాది
గుడిపల్లి నిరంజన్
కె. మధుసూదనరావు
సంతపూడి కృష్ణారావు
ఎస్. జగపతిరావు
కె. లక్ష్మణ్ గౌడ్
హనీఫ్ అహ్మద్, ఎంఆర్జేఎసీ
మహమ్మద్ ఖలీల్, టిఎఫ్టీయు
బైరెడ్డి సతీష్రెడ్డి, అధ్యాపకుడు
డి. నర్సయ్య
కె. నవీన్
సిసి
ఎం మురళీధర్గుప్త
ఎన్. సుధాకరశర్మ
శివాజీ, జడ్చర్ల
విమల (అరుణోదయ)
రామారావు (అరుణోదయ)
ఎం.గంగాధర్ (డీటీఎఫ్, తెలంగాణ, ఆధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకుడు)
పి. క్రిష్ణయ్య (అధ్యక్షుడు, డిటిఎఫ్, ఏపీ)
చిట్టిబాబు (అధ్యక్షుడు, సీఎల్సీ, ఏపీ)
ప్రొ. లక్ష్మణ్ (అధ్యక్షుడు, సీఎల్సీ, తెలంగాణ)
జాన్ (అధ్యక్షుడు, ప్రజాకళామండలి)
అంజమ్మ (అధ్యక్షరాలు, అమరుల బంధుమిత్రుల సంఘం)
మద్దిలేటి (అధ్యక్షుడు, తెలంగాణ విద్యార్థి వేదిక)
బద్రి (అధ్యక్షుడు, డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్)
బల్ల రవీందర్ (రాజకీయ ఖైదీల విడుదల పోరాట కమిటీ)
మహమ్మద్ లతీఫ్ఖాన్ (సివిల్ లిబర్టీస్ మానిటరింగ్ కమిటీ)
ప్రదీప్, (ఇఫ్టూ)
ఎం. కృష్ణ (ఏఐకెఎంఎస్, మహబూబ్నగర్)
పి. నారాయణమ్మ (టీపీటీఎఫ్, మహబూబ్నగర్)
సి. వెంకటేష్ (ఇఫ్టూ, మహబూబ్నగర్)
చంద్రన్న (అరుణోదయ, మహబూబ్నగర్)
కె. కాశీనాథ్ (పివైఎల్, మహబూబ్నగర్)
ఎస్. కిరణ్ (బీవోసీ, మహబూబ్నగర్)
గురజాల రవీందర్ (రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ విద్యావంతుల వేదిక)
చిక్కుడు ప్రభాకర్ (రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక)
బోయిన్పల్లి రాము (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పిడిఎస్యు, తెలంగాణ)
రవిచంద్ర (రాష్ట్ర అధ్యక్షుడు, పిడిఎస్యు, ఏపీ)
అనిత (అధ్యక్షురాలు, చైతన్య మహిళా సంఘం)
నలమాస కృష్ణ (అధ్యక్షుడు, తెలంగాణ ప్రజా ఫ్రంట్)
దుడ్డు ప్రభాకర్ (అధ్యక్షుడు, కులనిర్మూలనా పోరాట సమితి, ఏపీ)
అభినవ్ (ప్రధాన కార్యదర్శి, కులనిర్మూలనా పోరాట సమితి, తెలంగాణ)
రాజు (అధ్యక్షుడు, దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం)
కొండారెడ్డి (కార్యదర్శి, ప్రగతిశీల కార్మిక సమాఖ్య)
బంటు శ్రీనివాస్ (అధ్యక్షుడు, అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య)
జక్కుల వెంకటయ్య (ఉపాధ్యక్షుడు, తెలంగాణ రైతాంగ సమితి)

Keywords : virasam, mahabubnagar, telangana, andhrapradesh, revolution
(2024-03-31 10:17:10)



No. of visitors : 1993

Suggested Posts


కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్

నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ‌ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్.

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ

అందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు.

కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామి

ఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది....

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


విప్లవ