ఆదివాసులు, లంబాడాల సమస్య పరిష్కారానికి....సూచనలు... విఙప్తి


ఆదివాసులు, లంబాడాల సమస్య పరిష్కారానికి....సూచనలు... విఙప్తి

ఆదివాసులు,

ఆదివాసి, లంబాడాల ఘర్షణల నేపధ్యంలో:

ప్రజాసంఘాల రౌండు టేబుల్ సమావేశం గుర్తించి, ఇరు వర్గాలకు చేసిన సూచనలు, పరిశీలనలు:

విజ్ణప్తి.

ఆదివాసీ-లంబాడా ఘర్షణ లపై విజ్ఞప్తి ప్రకటన.
ఈ నెల 21 వ తేదీన తెలంగాణ ప్రజా ఫ్రంట్ (tpf ) కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ప్రజా సంఘాలు, ప్రజా స్వామిక వాదులు అలాగే ఆదివాసీ, లంబాడా సామాజిక వర్గాల ప్రతినిదులు అదిలాబాద్ జిల్లాలో రెండువర్గాల మద్య పెరుగుతున్న ఉద్రిక్తత పట్ల తమ ఆందోళనను వ్యక్త పర్చారు.సమావేశంలో రెండు సామాజిక వర్గాల అభిప్రాయాలు, అనుభవాలు , అనుమానాలు, అన్యాయాలు అన్నీ విషయాలు చర్చకు వచ్చాయి.ఇందులో మూడు అంశాలు ఘర్షణకు దారి తీస్తున్నట్లు రౌండ్ టేబుల్ గుర్తించింది.
1. రెండు వర్గాల సంస్కృతి అస్తిత్వం జీవన విధానం వీశ్వాసాల్లో అనవసర జోక్యం
2. భూమి హక్కుల అంశంలో ప్రభుత్వాలు తీసుకున్న లోప భూయిష్టమైన విధానాలే కాక రాజ్యాంగం కల్పించిన హక్కులను విస్మరించి ఉల్లంగన‌లవల్ల....
3. విద్య ఉద్యోగాల విషయంలో భిన్న చారిత్రక కారణాల వల్ల ఒక సామాజిక వర్గమే ఎక్కువ లాభ పడి మరొక సామాజిక వర్గంకు సమ న్యాయము జరగక పోవడం రౌండ్ టేబుల్ సుదీర్ఘ చర్చ తర్వాత ఈ క్రింది విజ్ణప్తిని రెండు వర్గాలకు అలాగే విశాల సమాజానికి చేయ నిర్ణయించింది.
1. పాలకులు పీడిత వర్గ ప్రజలను ఉద్వేగలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేసి రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు సామాజిక వర్గాల్లో పరస్పర జీవన విధానంలో వీశ్వాసాల్లో జోక్యం చేసుకోకూడదు.ఇంత వరకు జరిగిన పొరపాట్లను అంగీకరించి ఇక భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ కు సంపూర్ణ అధికారాలు ఆదివాసులవే.
ఆయా సామాజిక వర్గాలకు గల ప్రత్యేకమైన సంసృతిక ఆచార వ్యవహారాలపట్ల పరస్పరం గౌరవం కలిగి ఉండాలి.
2. భూ ఆక్రమణ విషయంలో రాజ్యాంగంలో పొందు పరచిన 5షెడ్యూల్డ్ , అలాగే 1/70చట్టం ఆదివాసీ హక్కుల చట్టం భూ సేకరణ చట్టం పకడ్బందీగా అమలు చేయాలి.గతంలో అక్రమాలను గుర్తించి న్యాయ బద్దంగా భూ యాజమాన్య హక్కులను కాపాడేలా ప్రభుత్వం మీద ఒత్తిడీ తేవడం తేవాలి.గిరిజనేతరుల చేతిలో గల భుమెంత,లంబాడీల చేతిలో ఉన్నదెంత అనేది తేల్చాలి.ఇందుకు ప్రభుత్వం ఒక అధ్యయన కమిటీ వేయాలి.
3. విద్య ఉద్యోగ విషయంలో న్యాయ బద్దంగా ఎవరికి చెందవలసిన వాటా వారికి చెందేలా ఇంత వరకు జరిగిన పొరపాట్లను సరిదిద్ది ఆదివాసీలకు చెందవలసిన అవకాశాలను వాళ్ళు అనుభవించేలా విధాన నిర్ణయం తీసుకోవాలి.
4.అలాగే తమకు జరిగిన అన్యాయంకు లంబాడా సామాజిక వర్గమే ప్రత్యక్షంగా భాద్యులు అని కాక ప్రభుత్వ తప్పుడు విధానాలు చిత్తశుద్ధి లేక పోవడమేనని గుర్తించాలి.
ఈ నేపథ్యంలో జీవో 5.నెంబర్ 3 ను పటిష్టంగా అమలు చేయాలి. జరిగిన ఉల్లంఘన లపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి.1976 తర్వాత ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ST హోదా పొందుతున్న వారికి ఆ హోదా రద్దు చేయాలి.

రౌండ్ టేబుల్ సమావేశం ఆదివాసీ పోరాటం లోని ఆకాంక్షను గుర్తించి ఆ వర్గానికి న్యాయం జరిగే చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేసింది.అలాగే లంబాడ సామాజిక వర్గం తమ సోదరులకు జరిగిన వివక్షను గుర్తించి ప్రజాస్వామ్యంగా ఆలోచించాలని ఆ దిశగా తీసుకునే వివిద నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని విజ్ణప్తి చేస్తున్నది.
ఈ సమస్య లోతు పాతూలను అధ్యయనం చేసి క్షేత్ర స్తాయి వాస్తవాలను తెలుసుకుని ఒక నివేదికను రూపొందించాలి అని నిర్ణయించింది.
ఈ మద్య కాలంలో రెండు సామాజిక వర్గాల్లో సంయయనం పాటించాలని ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో సామరస్యంగా సమస్య పరిష్క రించుకోవాలని ఈ క్రమంలో ప్రజా సంఘాలు సహక రించాలని నిర్ణయించడం జరిగింది.
జరిగిన అన్యాయాలకు ప్రభుత్వాన్ని నిలదీసి సరియైన న్యాయమైన నిర్ణయం చేసేలా ప్రజల నుండి ఒత్తిడి పెట్టాలని నిర్ణయించడమే కాక ఏ పరిస్తితుల్లో భౌతిక దాడులకు దిగ వద్దని రౌండ్ టేబుల్ రెండు వర్గాలకు విజ్ణప్తి చేస్తున్నది.
ఈ సమావేశం ఉసా మరియు ప్రో.హరగోపాల్ అధ్యక్షత న జరిగింది.
దీనిలో పాల్గొన్నవారు.
వరవరరావు.
ప్రో.గాలి వినోద్ కుమార్.
ప్రో.భంగ్యా భూక్య.
రామనాల లక్ష్మయ్య.
వట్టం ఉపేందర్.
ప్రో.ఆప్కా నాగేశ్వరరావు.
బెల్లయ్య నాయక్.
రవీంద్ర నాయక్.
అమర్సింగ్ తిలవత్.
సాయన్న.
ప్రో.కాసీం.
విమలక్క.
గోవర్దన్.
ప్రో.కోదండరామ్.
జీవన్ కుమార్.
గురజాల రవీందర్.
ప్రో.శిడెం కిషోర్.
రవి చంద్ర.
నలమాస కృష్ణ.
మొదలైన వారు పాల్గొన్నారు.
పై విజ్ఞప్తి ని ఏకీభవించినవారు.
ప్రో.సురేపల్లి సుజాత.
ప్రో.జయదీర్ తిరుమల రావు.
ప్రో.pl విష్వస్వర్ రావు.
జస్టిస్ చంద్ర కుమార్.
చుక్క రామయ్య.
పొత్తూరి వెంకటేశ్వరరావు.
జహీర్ ఆలీఖాన్.
పాశం యాదగిరి.
ప్రో.పద్మజా షా

Keywords : adivasi, lambada, adilabad, utnoor, telangana prajafront
(2018-01-18 11:47:27)No. of visitors : 349

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.

మహాజనాద్భుత సాగరహారానికి నాలుగేళ్ళు

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపుత్రుల దేహాల సంరంభాన్ని అనుభవించవలసిన సందర్భం అది....

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

ʹనీ బాంచెన్ దొరా కాల్మొక్తʹ

జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ఖిల్లాలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పాదాభివందనం చేస్తున్నానంటూ ...

తెలంగాణ ఉద్యమకారుడి కిడ్నాప్ !

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా లోంచి ఎగిసిన విద్యార్థి నాయకుడు... తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడుగా ఉద్యమంలో అనేక సార్లు లాఠీ దెబ్బలు తిన్నవాడు. జైలుకు పోయినవాడు. సమైక్యాంధ్ర పోలీసులను ఎధిరించి, బరిగీసి నిలబడ్దవాడు....

Search Engine

చేగువేరా కూతురు డాక్టర్ అలీదా గువేరా తో ఇంటర్వ్యూ
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు.... అసలు కథ‌ !
Full text of letter: Four senior judges say situation in SC ʹnot in orderʹ
ʹఐలవ్ ముస్లిమ్స్ʹ అన్నందుకు ఓ అమ్మాయిని వేధించి, వేధించి చంపేసిన మ‌తోన్మాదులు...బీజేపీ నేత అరెస్టు
On BheemaKoregaon, Media Is Criminalising Dalits: 4 Things That Are Wrong With The Coverage
Maoists raise its head again, form people’s committees in Kerala
తెలంగాణలో పెచ్చుమీరుతున్న ఇసుక మాఫియా ఆగడాలు.. ట్రాక్టర్ తో గుద్ది వీఆరేఏ హత్య‌ !
న్యూఇయర్ వేడుకలు జరుపుకున్నందుకు దళితులపై అగ్రకుల ఉగ్రమూక దాడులు ... ఇండ్లు కూల్చి వేత‌
కోరేగావ్ అప్డేట్స్ : దళితులపై దాడులు చేసినవారిని వదిలేసి జిగ్నేష్, ఉమర్ లపై కేసులు !
హిందుత్వశక్తుల అరాచకాలపై గళమెత్తిన దళిత శక్తి... మహారాష్ట్ర బంద్ సక్సెస్
భీమాకోరేగావ్ స్పూర్తి... హిదుత్వ దాడులపై గర్జించిన దళితలోకం.. ముంబై బంద్ విజయవంతం
ఉన్మాదుల ఇష్టారాజ్యానికి సమాజాన్ని వదిలేస్తారా?
OPPOSE THE BAN IMPOSED BY JHARKHAND GOVERNMENT ON MAZDOOR SANGATHAN SAMITI
A Close Encounter With A Modi-Bhakt
Down with the shameful betrayal and surrender of Jinugu Narasinha Reddy - Maoist Party
ABVP కి తెలంగాణ విద్యార్థి వేదిక సవాల్ !
జంపన్న పార్టీకి ద్రోహం చేశాడు..ఏడాది క్రితమే ఆయనను సస్పెండ్ చేశాం..మావోయిస్టు పార్టీ
దాస్యాన్నే ఆత్మగౌరవంగా ప్రకటించుకున్న తెలుగు మహాసభలు - వరవరరావు
విప్లవ రచయితల సంఘం 26వ మహా సభలను విజయవంతం చేద్దాం
మావోయిస్టు మున్నా స్తూపాన్ని కూల్చేయాల‌ట‌ !
Letter of Inquilab family rejecting Sahitya Akademi award !
పోలీసు సంస్కృతి చెల్ల‌దు : టీవీవీ మ‌హాస‌భ‌ల్లో ప‌్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్‌
నిర్బంధాలు గ‌డ్డిపోచ‌తో స‌మానం : టీవీవీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి మ‌ద్దిలేటి
జైల్లోనైనా స‌భ‌లు జ‌రుపుతాం : TVV అధ్య‌క్షుడు మ‌హేష్‌
ఆంక్ష‌ల వ‌ల‌యాల్ని చేధించుకొని ఎగిసిన ఆశ‌యాల జెండా
more..


ఆదివాసులు,