ABVP కి తెలంగాణ విద్యార్థి వేదిక సవాల్ !


ABVP కి తెలంగాణ విద్యార్థి వేదిక సవాల్ !

ABVP

శాతవాహన యూనివర్సిటీలో ఈ నెల 25 న మనుధర్మశాస్త్రం ప్రతులను తగులబెట్టిన విద్యార్థులపై ఏబీవీపీ, బీజేపీ కార్యకర్తలు దాడి , విద్యార్థులపై ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతపై దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ విద్యార్థి వేదిక ఎబీవీపీ కి 16 పాయింట్లతో ఓ సవాల్ విసిరింది.

పూర్తి పాఠం..


★ TVV పై మీరు చేస్తున్న ఆరోపణలకు బహిరంగంగా చర్చకు రావాలి.
★ అంబేద్కర్ కు నిజమైన వారసులు ఎవరో తేల్చుకుందాం.
★ఈ దేశానికి రాజ్యాంగం కావాలో, మనుధర్మం కావాలో? తేల్చుకుందాం..
★ శాతవాహన యూనివర్సిటీలో దుర్మార్గంగా దాడి చేసిన వాళ్ళు ఎవరో విద్యార్థులకు, ప్రజలకు తెలుసు. మళ్ళీ అన్ని ఆధారాలతో ప్రజలముందు తేల్చుకుందాం..
★ మేము భరతమాత చిత్రపటాన్ని తగలపెట్టలేదు. దైర్యంగా చెబుతున్నాం మేము మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టినం. మళ్ళీ మళ్ళీ తగలబెడుతాం..
★ శాతవాహన యూనివర్సిటీ ఘటనకు సంబంధించిన CC TV ఫుటేజీలు బయట పెట్టాలి. ఎవరు దోషులో ,ఎవరు రౌడిల్లా ప్రవర్తించారో తెలుస్తుంది.. తేల్చుకుందాం..
★ దేశంలో, రాష్ట్రలలో శాంతియుత వాతావరణానికి ఎవరు భంగం కలిగిస్తున్నారో తేల్చుకుందాం..
★ TVV తన ప్రాణాళికలోనే రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరుతుంది. పోరాడుతుంది. అది మా లక్ష్యం..
★ TVV ప్రజాస్వామిక తెలంగాణ, శాస్త్రీయ విద్యా విధానం ఎందుకు కావాలనుకుంటుందో తేల్చుకుందాం..
★ TVV అంబేద్కర్, ఫూలే , భగత్ సింగ్ ఆశయాలు కొనసాగిస్తూ, వారు కలలు కన్న సమాజం కోసం పోరాటం చేస్తుంది. మీరు ఏ రాజకీయల కోసం పని చేస్తున్నారో తేల్చుకుందాం..
★ అంబేద్కర్ , పూలే , భగత్ సింగ్ పెరియార్ లు హిందూ మతం గురించి ఏం చెప్పారో తెలుసుకోండి. తెలియకపోతే చర్చకు రా తేల్చుకుందాం..
★మహనీయుల చరిత్ర కనుమరుగు చేసి పాఠ్యపుస్తకాలలో మత ఉన్మాదాన్ని ఎవరు చొప్పిస్తూ, సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారో తేల్చుకుందాం..
★ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రి బాయి పూలే, భగత్ సింగ్ ల ఆశయాలు, స్వప్నాలను,చరిత్రను తొక్కిపట్టి ఎవరు మతం రంగు పులుముతున్నారో తేల్చుకుందాం..
★ SC,ST,BC, మైనారిటీలు దేశవ్యాప్తంగా ఎవరి మత ఉన్మాదానికి బలయ్యారో, బలవుతున్నారో తేల్చుకుందాం..
★తరతరాలుగా దళితులు, ఆదివాసీలు, బహుజనులు,మహిళల ను కనీసం మనుషులుగా గుర్తించని మనుధర్మ శాస్త్రాన్ని దహనం చేస్తున్న మేము నిజమైన దేశభక్తులం.అసలైన అంబేద్కర్ వారసులం. ఇప్పుడు నీ దేశభక్తిని నిరూపించుకో. దమ్ముంటే మనుధర్మ శాస్త్రాన్ని తగులబెట్టు..
★చర్చల ద్వారా సమాజానికి మంచి సందేశం పంపుదామనుకుంటే బహిరంగ చర్చకు సిద్దంకండి.
కాదు, లేదు, మా ఇష్టం అని అడ్డంగా మాట్లాడితే దానికి తగ్గట్లే సమాధానం చెప్తాం.

తెలంగాణ విద్యార్థి వేదిక(TVV)

Keywords : telangana vidyarthi vedika, ABVP, telangana, shathavahana university
(2018-06-18 23:43:59)No. of visitors : 501

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.

మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

ఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్‌ ముట్టడి, పెరేడ్‌ గ్రౌండ్స్‌లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్‌ ఉద్యమాలు నిర్వహించారు.

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

మహాజనాద్భుత సాగరహారానికి నాలుగేళ్ళు

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపుత్రుల దేహాల సంరంభాన్ని అనుభవించవలసిన సందర్భం అది....

ʹనీ బాంచెన్ దొరా కాల్మొక్తʹ

జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ఖిల్లాలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పాదాభివందనం చేస్తున్నానంటూ ...

Search Engine

ముస్లిం ఇంజనీర్ మాట్లాడాడని.. మతోన్మాదంతో రెచ్చిపోయిన మహిళ
బంధాలను నాశనం చేసిన నేటి వ్యవస్థ.. ఆర్థిక బంధాలకే ప్రాధాన్యం..!
Long live the national truck driversʹ strike!
గుర్రంపై ఊరేగుతున్న దళిత పెండ్లి కొడుకుపై అగ్రకులస్థుల దాడి
చెడ్డీ గ్యాంగ్ బరి తెగింపు.. లౌకికవాదులపై అనుచిత వ్యాఖ్యలు
సినిమాల్లో ʹస్త్రీʹ పాత్ర మారుతోంది..!
రాజ్యమే కుట్ర చేస్తే...
ఉద్యమ స్పూర్తి రగిలించిన ʹచేʹ
ఇదో దుర్మార్గం.. మతోన్మాదం ఒక ఆడపిల్లని పిచ్చిదానిలా చిత్రించింది..!
ఈ హత్యలకు అంతే లేదా..?
Bengaluru techie arrested for Maoist links
ఇక్కడ కవిత్వం కూడా తీవ్రవాదమేనా..?
Leftist Publisher Shot Dead as Blogger Deaths Return to Haunt Bangladesh
ʹదుర్గాప్రసాద్‌ను మధ్యాహ్నంలోగా కోర్టులో హాజరుపరచాలిʹ
ప్రధాని మోడీపై హత్యకు కుట్ర నిజంగానే జరిగిందా..?
పేదవాడి నిజమైన సమస్యను చర్చించిన ʹకాలాʹ..!
వరవరరావుపై ప్రభుత్వం కుట్ర.. ప్రజా, హక్కుల సంఘాల అణచివేతలో భాగమే - విరసం
ʹమోడీ హత్యకు కుట్రʹ అనేది ఓ బూటకం.... ప్రజా ఉద్యమాలను అణచడానికి పాలకులాడే నాటకం
రాజకీయ నాయకులా..? వీధి రౌడీలా..?
హక్కుల కార్యకర్తల అక్రమ అరెస్టులపై దేశవ్యాప్త నిరసనలు
పౌర హక్కుల నాయకుల అక్రమ అరెస్టుపై వెల్లువెత్తుతున్న నిరసన
భీమా కోరేగావ్ లో దళితులకు మద్దతుగా నిలబడ్డందుకు ప్రజా సంఘాల నాయకుల‌ అక్రమ అరెస్టు
Maharashtra Governmentʹs terror trail to protect HINDUDTVA TERRORISTS
నేటి భారతదేశం : ఆడపిల్లలకే కాదు.. ఆడపిల్ల తండ్రికి కూడా రక్షణ లేదు..!
తిరుమలలో పోగుబ‌డ్డ ఆస్తులెవరివి ?
more..


ABVP