హిందుత్వశక్తుల అరాచకాలపై గళమెత్తిన దళిత శక్తి... మహారాష్ట్ర బంద్ సక్సెస్


హిందుత్వశక్తుల అరాచకాలపై గళమెత్తిన దళిత శక్తి... మహారాష్ట్ర బంద్ సక్సెస్

హిందుత్వశక్తుల

భీమా ‍ కోరేగావ్ వద్ద దళితులపై హిందుత్వ శక్తుల దాడులకు నిరసనగా ఇవ్వాళ్ళ మహారాష్ట్ర బంద్ విజయవంతమైంది. వివిధ దళిత సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా జన జీవనం తీవ్ర ప్రభావితమైంది.

ముంబై, పూనే, నాగ్ పూర్ లలో రైళ్ళు, బస్సులు పూర్తిగా ఆగిపోయాయి.
స్కూల్స్ కు సెలవు ప్రకటించారు.
ముంబైలో ఆటో రిక్షా యూనియన్లు కూడా బందకు మద్దతు తెలిపాయి. క్యాబ్ లు కూడా ఎక్కడివక్కడ ఆగిపోయాయి.
వేలాది మంది దళితులు రోడ్లమీదికి వచ్చి ర్యాలీలు నిర్వహించారు.
ముంబై, పూనే, ముంబై, నాగ్ పూర్ హైవేలపై అనేక చోట్ల దళితులు బైటాయించారు.
పూనేలోని ప్రధాన కూడళ్ళలో వేలాదిగా దళిత ఉద్యమకారులు రోడ్లు బ్లాక్ చేశారు.
ముంబైలో బాంద్రా, ధారావి, కామ్ రాజ్ నగర్, సంతోష్ నగర్, హనుమాన్ నగర్ ప్రాంతాల్లో ఆందోళనకారులు 13 బస్సులను ధ్వంసం చేసినట్టు అధికారులు ప్రకటించారు.
నాగ్ పూర్ లో అనేక చోట్ల పోలీసులకు ఉద్యమకారులకు ఘర్షణలు జరిగాయి. వేలాదిగా రోడ్లమీదికి వచ్చిన దళిత ఉద్యమకారులు మహారాష్ట్ర ప్రభుత్వానికి, ఆరెస్సె కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సినిమా, టీవీ సీరియల్ షూటింగ్ లు ఆగిపోయాయి.
దక్షిణ ముంబై ప్రాంతలో మెడికల్ షాపులు తప్ప ఏ ఒక్క షాపు తెరుచుకోలేదు.
ఉద్యమకారులు చంద్రాపూర్ లో బీజేపీ శాసనసభ్యుడు నానా సంకులే పై దాడి చేశారు
కొల్హాపూర్ తో సహా పలు జిల్లాల్లో భీమ్ సైనికులపై హిందుత్వ శక్తులు దాడులకు పాల్పడంతో ఘర్షణలు జరిగాయి. పలు చోట్ల దళితులకు వ్యతిరేకంగా హిందూ సంస్థలు కర్రలు, రాడ్లు పట్టుకొని ర్యాలీలు నిర్వహిచాయి.
ముంబైలో లోకల్ ట్రైన్ లు పొద్దున కొద్ది సేపు నడిచినప్పటికీ ఆందోళనలు ఉదృతమవడంతో 11 గంట్లనుండి సాయంత్రం 5 గంటలవరకు ఆగిపోయాయి.
ముంబై ఎయిర్ పోర్ట్ నుండి బయలు దేరాల్సిన , వేరే ప్రాంతాలనుండి అక్కడికి రావాల్సిన 12 విమానాలు రద్దుకాగా 235 విమానాలు ఆలస్యంగా నడిచాయి.
పూనే, నాశిక్, కొల్హాపూర్, పర్భానీ, కల్యాన్ నగరాల్లో దళిత ఉద్యమకారులకు హిందుత్వ గుంపులకు మధ్య ఘర్షణలు జరిగాయి.
భామాకోరేగావ్ లో దళితులపై దాడులకు తెగబడి ఒక దళితుడిని హత్య చేసిన సంఘట్న కుట్రదారులైన శంబాజీ బీడే, మిలింద్ ఏక్బోటేలను తక్షణం అరెస్టు చేసి వారిపై హత్యకేసుతో పాటు యాకూబ్ మెమన్ పై పెట్టిన అన్ని సెక్షన్లను పెట్టాలని ప్రకాష్ అంబేద్కర్ డిమాండ్ చేశారు.

Keywords : maharashtra, mumbai, dalit, rss, hindutva, Bhima-Koregaon
(2018-06-18 23:42:41)No. of visitors : 552

Suggested Posts


Shocking video of two naked ‘Dalit women’ being thrashed by ‘upper caste’ women

A shocking video of two ʹDalit womenʹ being subjected to merciless thrashing and public humiliation allegedly women from upper caste has gone viral on social media platforms....

ముస్లింల రక్షణ కోసం కత్తులు దూసిన సిక్కులు,చేతులు కలిపిన దళితులు ‍- పరారైన శివసేన మూక

పంజాబ్ లోని పగ్వారా పట్టణంలో ముస్లింల మీద దాడి చేయడానికి ప్రయత్నించిన శివసేన గుంపును సిక్కులు, దళితులు, ముస్లింలు ఐక్యంగా ఎదుర్కొన్నారు. కాశ్మీర్ కు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు బుధవారంనాడు ర్యాలీ నిర్వహించారు ఈ సంధర్భంగా...

గోముసుగు దౌర్జన్యాలపై దళితుల యుద్దభేరి - భగ్గుమంటున్న గుజరాత్

దళితులు భగ్గుమంటున్నారు... తమపై హిందుత్వ శక్తులు చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా కదం తొక్కుతున్నారు. గుజరాత్ లో గోరక్షకులు చేస్తున్న అమానుష అరాచకలాను ఎదిరిస్తూ ఆందోళనలకు దిగారు. గిరి సోమనాథ్ జిల్లాలోని ఊనాలో చనిపోయిన ఆవు చర్మాన్ని ఒలిచిన...

గోరక్షకుల రాజ్యంలో.. ఆకలితో 500 ఆవులు మృత్యువాత !

బీజేపీ పాలిత రాజస్తాన్ లోని గోసంరక్షణ శాలలో పట్టించుకునే వారు కరువై ఆకలి, అపరిశుభ్రంతో రెండు వారాల్లో దాదాపు 500 ఆవులు మృత్యువాతపడ్డాయి. జైపూర్‌లోని హింగోనియా గోశాలలో దాదాపు 250 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు.

చెట్టుకు కట్టేసి మత్తు సూదులేసి.. పెట్రోల్ పోసి.. దళిత బాలుడి పై అగ్రకుల అమానుషం !

కొంతమంది అగ్రకులస్థులు ఓ దళిత బాలుడికి నరకం చూపించారు. చెట్టుకుకట్టేసి బట్టలూడదీసి దారుణంగా కొట్టారు. అతడి మర్మాంగాలపై పెట్రోల్ పోసి హింసించారు. ఈ ఘటన ఆగ్రా జిల్లాలోని బర్హాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల బాస్ కేసీ....

నీళ్ళు తాగనివ్వని అగ్రకుల అహంకారం - బావిలో పడి దళిత బాలుడి మృతి

మధ్యప్రదేశ్ దమోహ్ జిల్లా ఖమరియా కలాన్ గ్రామంలో మూడవతరగతి చదువుతున్న వీరన్ అనే దళిత బాలుడు మధ్యాహ్న భోజనం తర్వాత నీళ్ళు తాగడానికి....

ఢిల్లీ లో దళితులపై హిందుత్వ సంస్థల దాడి !

ఢిల్లీలో శాంతి యుత ప్రదర్శన నిర్వహిస్తున్న దళితులపై హిందుత్వ శక్తులు దాడి చేశాయి. గుజరాత్ లో దళితులపై దాడికి నిరసనగా ఆదివారంనాడు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద యూత్ ఫర్ బుద్దిస్ట్ ఇండియా అనే సంస్థ అద్వర్యంలో దళితులు ధర్నా.....

వాళ్ళకు కమ్మోళ్ళ రక్తమే కావాలట !

హైదరాబాద్ మాక్స్ క్యూర్ హాస్పటల్ లో చికిత్సపొందుతున్న ఓ మూడేళ్ళ చిన్నారికి రక్తం అవసరం వచ్చింది. బ్లడ్ డోనర్స్ ఇండియా అనే ట్విట్టర్ లో ఓ కుల గజ్జి మహానువుడు కమ్మోళ్ళ రక్తం కావాలని ట్వీట్ చేశాడు....

ముందుకు సాగుతున్న ʹఛలో ఉనాʹ - కదం తొక్కుతున్న గుజరాత్ దళితులు

గుజరాత్ దళితులు కదం తొక్కుతున్నారు. వారితో ముస్లింలు చేతులు కలుపుతున్నారు. అన్ని వర్గాల ప్రజాస్వామికవాదులు, విప్లవ, ప్రజా సంఘాలు ఒక్కటై కదులుతున్నారు. ఆగస్టు 5 న అహ్మదాబాద్ లో బయలు దేరిన ఛలో ఉనా ర్యాలీ అనేక పల్లెలు, పట్టణాలు....

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుండి దళిత విద్యార్థుల గెంటివేత

వాళ్ళు దళితులు.... రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంభాల నుండి వచ్చిన నిరుపేద విద్యార్థులు... ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు వాళ్ళు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే చ‌దువుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు చ‌దువు రావడం లేదని పదో తరగతికి ప్రమోట్ చేయకుండా 34మంది విద్యార్థులను స్కూల్ నుండి గెంటేశారు....

Search Engine

ముస్లిం ఇంజనీర్ మాట్లాడాడని.. మతోన్మాదంతో రెచ్చిపోయిన మహిళ
బంధాలను నాశనం చేసిన నేటి వ్యవస్థ.. ఆర్థిక బంధాలకే ప్రాధాన్యం..!
Long live the national truck driversʹ strike!
గుర్రంపై ఊరేగుతున్న దళిత పెండ్లి కొడుకుపై అగ్రకులస్థుల దాడి
చెడ్డీ గ్యాంగ్ బరి తెగింపు.. లౌకికవాదులపై అనుచిత వ్యాఖ్యలు
సినిమాల్లో ʹస్త్రీʹ పాత్ర మారుతోంది..!
రాజ్యమే కుట్ర చేస్తే...
ఉద్యమ స్పూర్తి రగిలించిన ʹచేʹ
ఇదో దుర్మార్గం.. మతోన్మాదం ఒక ఆడపిల్లని పిచ్చిదానిలా చిత్రించింది..!
ఈ హత్యలకు అంతే లేదా..?
Bengaluru techie arrested for Maoist links
ఇక్కడ కవిత్వం కూడా తీవ్రవాదమేనా..?
Leftist Publisher Shot Dead as Blogger Deaths Return to Haunt Bangladesh
ʹదుర్గాప్రసాద్‌ను మధ్యాహ్నంలోగా కోర్టులో హాజరుపరచాలిʹ
ప్రధాని మోడీపై హత్యకు కుట్ర నిజంగానే జరిగిందా..?
పేదవాడి నిజమైన సమస్యను చర్చించిన ʹకాలాʹ..!
వరవరరావుపై ప్రభుత్వం కుట్ర.. ప్రజా, హక్కుల సంఘాల అణచివేతలో భాగమే - విరసం
ʹమోడీ హత్యకు కుట్రʹ అనేది ఓ బూటకం.... ప్రజా ఉద్యమాలను అణచడానికి పాలకులాడే నాటకం
రాజకీయ నాయకులా..? వీధి రౌడీలా..?
హక్కుల కార్యకర్తల అక్రమ అరెస్టులపై దేశవ్యాప్త నిరసనలు
పౌర హక్కుల నాయకుల అక్రమ అరెస్టుపై వెల్లువెత్తుతున్న నిరసన
భీమా కోరేగావ్ లో దళితులకు మద్దతుగా నిలబడ్డందుకు ప్రజా సంఘాల నాయకుల‌ అక్రమ అరెస్టు
Maharashtra Governmentʹs terror trail to protect HINDUDTVA TERRORISTS
నేటి భారతదేశం : ఆడపిల్లలకే కాదు.. ఆడపిల్ల తండ్రికి కూడా రక్షణ లేదు..!
తిరుమలలో పోగుబ‌డ్డ ఆస్తులెవరివి ?
more..


హిందుత్వశక్తుల