గొట్టిపాడు దళితులపై దాడులు చేసిన కమ్మోళ్ళందరిని అరెస్టు చేయాలి... అరెస్టు చేసిన ప్రజాసంఘాల కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలి


గొట్టిపాడు దళితులపై దాడులు చేసిన కమ్మోళ్ళందరిని అరెస్టు చేయాలి... అరెస్టు చేసిన ప్రజాసంఘాల కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలి

గొట్టిపాడు

(విప్లవ రచయితల సంఘం పత్రికా ప్రకటన పూర్తి పాఠం)

పెదగొట్టిపాడు దళితులకు న్యాయం చేయాలి
అరెస్టు చేసిన ప్రజాసంఘాల కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలి

గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పెదగొట్టిపాడులో ఆధిపత్య కమ్మ కులస్తుల దాడులకు, అవమానాలకు గురైన దళితుల న్యాయపోరాటానికి మద్దతుగా ఏర్పడిన అఖిలపక్ష కమిటీ సభ్యులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పెదగొట్టిపాడులో డిసెంబర్‌ 31 రాత్రి ఇద్దరు దళిత యువకులు బైక్‌ మీద వస్తూ ఒక చాకలివాళ్ల ఇంటి ముందు ముగ్గుపై జారిపడ్డారు. అక్కడి మహిళలు వారిని కోప్పడితే క్షమాపణలు చెప్పారు. ఇంతలో కమ్మ ఇళ్ల నుండి మగవాళ్లు కూడా వచ్చి ఆ యువకులను కోప్పడి కొట్టారు. అంతటితో వాళ్లు ఆగదలచుకోలేదు. ఎప్పటి నుండో దళితుల మీద పెంచుకున్న కసిని ఈ ఘటన సాకుగా తీర్చుకోవాలనుకున్నారు. ఆ ఊరిలో కొంతకాలంగా దళితులు పొలం పనులను కాదని పట్టణానికి పోయి పనులు చేసుకుంటున్నారు. గ్రామ పంచాయితీ అభివృద్ధి పనుల్లో దళితవాడకు కేటాయించవలసిన వాటా అడుగుతున్నారు. దళిత యువకులు బైకుల్లో తిరుగుతున్నారు. ఇటువంటివన్నీ ఆ ఊరి ఆధిపత్య కులం వాళ్లకు కంటగింపయ్యాయి. కారంచేడు, చుండూరులు ఇక్కడ మనకు గుర్తొస్తాయి. ఈ నేపథ్యంలో కమ్మ కులం వాళ్లు ఆ రాత్రి ట్రాక్టరులో ఆయుధాలేసుకొని వచ్చి చర్చిలో ప్రార్థనలు చేసుకుంటున్న దళితులపై దాడి చేశారు. పరమ అసభ్యంగా మహిళల ముందు లుంగీలెత్తి చూపించారు. దళితులు తమను తాము కాపాడుకోడానికి రాళ్లు విసురుతూ ప్రతిఘటించారు. ఈ దాడిలో నలుగురు దళితులకు గాయాలవ్వగా వారిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు జోక్యం చేసుకొని ఘర్షణను అదుపుచేసి ఇరువైపులా కేసులు పెట్టినట్టు చూపారు. కమ్మవాళ్లు ముగ్గురి మీద ఎస్‌.సి.,ఎస్‌.టి అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే ఉద్దేశపూర్వకంగా దాడి చేసిన వాళ్లందరి మీద హత్యాయత్నం కేసు నమోదు చేయాలని, ముఖ్యులు సహా, ముద్దాయిలందర్నీ అరెస్టు చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

మంత్రులు, అధికారులు బాధిత దళితులమీద ఒత్తిడి తెచ్చి రాజీ ప్రయత్నాలు చేశారు. రాజీపడినట్లుగా కూడా ప్రకటించారు గానీ దీనిని చాలా మంది, ముఖ్యంగా ఆ ఊరి దళిత మహిళలు అంగీకరించడం లేదు. ఆ మహిళల పట్టుదల, సంఘటిక పోరాట శక్తి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నది. పెదగొట్టిపాడు దళితులకు న్యాయం జరగాలని ముందుకొచ్చిన దళితసంఘాలు, వామపక్షాలు, ప్రజాసంఘాలతో పెదగొట్టిపాడు దళిత న్యాయపోరాట కమిటి ఏర్పడి ఆందోళనలు జరుగుతున్నాయి. కమిటీ జనవరి 25న చలో పెదగొట్టిపాడు పిలుపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కమ్మవారి పక్షాన ఉద్యమాన్ని అణచివేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. పెదగొట్టిపాడులోనూ, ఆ ఊరిని చేరుకునే దారుల వెంట, పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌, 30యాక్ట్‌ విధించి వేలాది పోలీసులను మోహరించింది. నిన్నటి నుండి ప్రజాసంఘాల నాయకులను, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నది. ఐక్య కార్యాచరణ కమిటి కన్వీనర్‌, న్యాయవాది శాంతకుమార్‌, కోకన్వీనర్‌ కొరివి వినయ్‌కుమార్‌, సి.పి.యం రాష్ట్ర కార్యదర్శి మధు, న్యాయవాది వై.కె, కులనిర్మూలనా పోరాట సమితి నాయకులు కృష్ణ, విజయ్‌భాస్కర్‌, పౌరహక్కుల సంఘం కార్యదర్శి చిలకా చంద్రశేఖర్‌, చైతన్య మహిళా సంఘం నాయకురాలు రాజేశ్వరి, ప్రగవిశీల కార్మిక సంఘం నాయకుడు కొండారెడ్డి తదితరులను అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని పెదగొట్టిపాడు దళిత మహిళలు చాటిచెబుతున్నారు. పోలీసు బలగాల మోహరింపుల మధ్యనే అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేయాలని, తమకు న్యాయం చేయాలని ధర్నా చేస్తున్నారు. గతంలో ఆ ఊరిని సందర్శించిన ఆడ్వకేట్‌ వై.కెను పోలీసులు అరెస్టు చేస్తే ఆయన్ని వదిలే వరకు ఆందోళన చేసిన మహిళలు న్యాయం కోసం దృఢంగా పోరాడుతున్నారు. వారికి జేజేలు చెబుదాం. పెదగొట్టిపాడు దళితులకు న్యాయం చేయాలని, అరెస్టు చేసిన ప్రజాసంఘాల కార్యకర్తలందరినీ విడుదల చేయాలని విరసం డిమాండ్‌ చేస్తోంది.

పాణి (కార్యదర్శి)
వరలక్ష్మి, కాశీం, అరసవిల్లి కృష్ణ, కిరణ్‌ (కార్యవర్గ సభ్యులు)

Keywords : andhrapradesh, kamma cast, dalit, chndrababu
(2018-05-21 16:17:59)



No. of visitors : 484

Suggested Posts


Shocking video of two naked ‘Dalit women’ being thrashed by ‘upper caste’ women

A shocking video of two ʹDalit womenʹ being subjected to merciless thrashing and public humiliation allegedly women from upper caste has gone viral on social media platforms....

ముస్లింల రక్షణ కోసం కత్తులు దూసిన సిక్కులు,చేతులు కలిపిన దళితులు ‍- పరారైన శివసేన మూక

పంజాబ్ లోని పగ్వారా పట్టణంలో ముస్లింల మీద దాడి చేయడానికి ప్రయత్నించిన శివసేన గుంపును సిక్కులు, దళితులు, ముస్లింలు ఐక్యంగా ఎదుర్కొన్నారు. కాశ్మీర్ కు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు బుధవారంనాడు ర్యాలీ నిర్వహించారు ఈ సంధర్భంగా...

గోముసుగు దౌర్జన్యాలపై దళితుల యుద్దభేరి - భగ్గుమంటున్న గుజరాత్

దళితులు భగ్గుమంటున్నారు... తమపై హిందుత్వ శక్తులు చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా కదం తొక్కుతున్నారు. గుజరాత్ లో గోరక్షకులు చేస్తున్న అమానుష అరాచకలాను ఎదిరిస్తూ ఆందోళనలకు దిగారు. గిరి సోమనాథ్ జిల్లాలోని ఊనాలో చనిపోయిన ఆవు చర్మాన్ని ఒలిచిన...

గోరక్షకుల రాజ్యంలో.. ఆకలితో 500 ఆవులు మృత్యువాత !

బీజేపీ పాలిత రాజస్తాన్ లోని గోసంరక్షణ శాలలో పట్టించుకునే వారు కరువై ఆకలి, అపరిశుభ్రంతో రెండు వారాల్లో దాదాపు 500 ఆవులు మృత్యువాతపడ్డాయి. జైపూర్‌లోని హింగోనియా గోశాలలో దాదాపు 250 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు.

చెట్టుకు కట్టేసి మత్తు సూదులేసి.. పెట్రోల్ పోసి.. దళిత బాలుడి పై అగ్రకుల అమానుషం !

కొంతమంది అగ్రకులస్థులు ఓ దళిత బాలుడికి నరకం చూపించారు. చెట్టుకుకట్టేసి బట్టలూడదీసి దారుణంగా కొట్టారు. అతడి మర్మాంగాలపై పెట్రోల్ పోసి హింసించారు. ఈ ఘటన ఆగ్రా జిల్లాలోని బర్హాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల బాస్ కేసీ....

నీళ్ళు తాగనివ్వని అగ్రకుల అహంకారం - బావిలో పడి దళిత బాలుడి మృతి

మధ్యప్రదేశ్ దమోహ్ జిల్లా ఖమరియా కలాన్ గ్రామంలో మూడవతరగతి చదువుతున్న వీరన్ అనే దళిత బాలుడు మధ్యాహ్న భోజనం తర్వాత నీళ్ళు తాగడానికి....

ఢిల్లీ లో దళితులపై హిందుత్వ సంస్థల దాడి !

ఢిల్లీలో శాంతి యుత ప్రదర్శన నిర్వహిస్తున్న దళితులపై హిందుత్వ శక్తులు దాడి చేశాయి. గుజరాత్ లో దళితులపై దాడికి నిరసనగా ఆదివారంనాడు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద యూత్ ఫర్ బుద్దిస్ట్ ఇండియా అనే సంస్థ అద్వర్యంలో దళితులు ధర్నా.....

వాళ్ళకు కమ్మోళ్ళ రక్తమే కావాలట !

హైదరాబాద్ మాక్స్ క్యూర్ హాస్పటల్ లో చికిత్సపొందుతున్న ఓ మూడేళ్ళ చిన్నారికి రక్తం అవసరం వచ్చింది. బ్లడ్ డోనర్స్ ఇండియా అనే ట్విట్టర్ లో ఓ కుల గజ్జి మహానువుడు కమ్మోళ్ళ రక్తం కావాలని ట్వీట్ చేశాడు....

ముందుకు సాగుతున్న ʹఛలో ఉనాʹ - కదం తొక్కుతున్న గుజరాత్ దళితులు

గుజరాత్ దళితులు కదం తొక్కుతున్నారు. వారితో ముస్లింలు చేతులు కలుపుతున్నారు. అన్ని వర్గాల ప్రజాస్వామికవాదులు, విప్లవ, ప్రజా సంఘాలు ఒక్కటై కదులుతున్నారు. ఆగస్టు 5 న అహ్మదాబాద్ లో బయలు దేరిన ఛలో ఉనా ర్యాలీ అనేక పల్లెలు, పట్టణాలు....

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుండి దళిత విద్యార్థుల గెంటివేత

వాళ్ళు దళితులు.... రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంభాల నుండి వచ్చిన నిరుపేద విద్యార్థులు... ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు వాళ్ళు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే చ‌దువుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు చ‌దువు రావడం లేదని పదో తరగతికి ప్రమోట్ చేయకుండా 34మంది విద్యార్థులను స్కూల్ నుండి గెంటేశారు....

Search Engine

కథువా నిందితులకు అనుకూలంగా మళ్ళీ ర్యాలీ తీసిన బీజేపీ నేతలు - మెహబూబా ముఫ్తీపై బూతుల వర్షం
కాలుష్యకారణ కంపెనీపై ప్రజల పోరాటం...పోలీసు కాల్పులు.. 11 మంది మృతి !
RDF Kerala Speaking Against Operation Green Hunt and Gadricholi Massacre
Long live Ibrahim Kaypakkaya in the 45th anniversary of his assasination!
చారిత్రాత్మక కమ్యూనిస్టు ప్రణాళిక (రెండవ భాగం) - ఎ.నర్సింహరెడ్డి
చారిత్రాత్మక కమ్యూనిస్టు ప్రణాళిక (మొదటి భాగం) - ఎ.నర్సింహరెడ్డి
తెలంగాణపై కాగ్ నివేదిక‌
కొంచెం ఆలోచించి మాట్లాడుదాం - ఎ.సునిత‌, తేజ‌స్విని మాడ‌భూషి
వ‌న‌రుల దోపిడీ కోస‌మే గ‌డ్చిరోలి హ‌త్యాకాండ - మావోయిస్టు అధికార ప్ర‌తినిధి శ్రీనివాస్‌
మ‌తం మీద విమ‌ర్శ రాజ‌కీయాల మీద విమ‌ర్శే - మార్క్స్‌
ఐసిస్ చేరాలంటూ బ్యానర్లు కట్టిన బీజేపీ కార్యకర్తల అరెస్టు !
అమరులైన మన బిడ్డలను యాజ్జేసుకుందాం రండి !
అమరులైన మన బిడ్డలను యాజ్జేసుకుందాం రండి !
పోలీసులు ఎన్ని కుట్రలు చేసినా రేపు అమరుల సభ జరిపి తీరుతాం
మార్క్స్ నుంచి నేర్చుకుందాం - సి. కాశీం
గడ్చిరోలీలో జరిగింది ఎన్కౌంటర్ కాదు,సామూహిక‌ హత్యలు - నిజ నిర్దారణ బృందం రిపోర్ట్
పేదోళ్ల కైనా,ఉన్నోళ్ల కైనా ఒకే బడి ఒకే చదువు కోసం తెలంగాణ‌ విద్యార్ధి వేదిక (TVV) పల్లె బాట
Gadchiroli Encounter, a Fake and Cold-blooded Mass Murder, Says Fact-finding Teamʹs Report
దళితుడు ప్రేమించడం నేరమా? కూతురు ప్రేమించిన‌ దళిత యువకుణ్ణి కాల్చి చంపిన తండ్రి !
రాణా ప్రతాప్ జయంతి ఉత్సవాల సందర్భంగా..భీమ్ ఆర్మీ నాయకుడి సోదరుణ్ణి కాల్చి చంపిన దుర్మార్గులు
అవును... మేమిద్దరం కలిసే పోటీ చేస్తాం - సీపీఎం, బీజేపీ నేతల ప్రకటన‌
కథువా చిన్నారి కేసు పంజాబ్ కు బదిలీ..సిబీఐ విచారణకు నో..సుప్రీంతీర్పు
ఆ దుర్మార్గులు బైటికొస్తే మమ్మల్నీ చంపేస్తారు...కథువా చిన్నారి తల్లి ఆందోళన‌
వైజాగ్ లో ఇండస్ట్రియల్ కోస్టల్ కారిడార్ నిర్మాణ వ్యతిరేక సదస్సు
మార్క్స్‌ శాస్త్రీయ సిద్ధాంత వారసత్వానికి పదునుపెడదాం
more..


గొట్టిపాడు