బ్రాహ్మణీయ దాష్టికానికి, దళితుల ఆత్మగౌరవానికి ప్రతిబింబం కోరేగాం భీమా - మావోయిస్టు పార్టీ


బ్రాహ్మణీయ దాష్టికానికి, దళితుల ఆత్మగౌరవానికి ప్రతిబింబం కోరేగాం భీమా - మావోయిస్టు పార్టీ

బ్రాహ్మణీయ


(సీపీఐ మావోయిస్టు పార్టీ పత్రికా ప్రకటన పూర్తి పాఠం)

మహారాష్ట్రలోని కోరేగాం భీమాలో జనవరి ఒకటి నాడు తమ చారిత్రక విజయదినాన్ని జరుపుకోవడానికి చేరిన వేలాది దళిత, ప్రజాస్వామిక, లౌకిక శక్తులపై మతోన్మాద హిందుత్వ శక్తులు మారణాయుధాలతో దాడిచేసి దళితుల ఆత్మగౌరవ ప్రతీకగా సాగే ఉత్సవాన్ని విఘ్నం చేయడాన్ని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. దుష్ట మతోన్మాద బ్రాహ్మణీయ శక్తులపై ధైర్యంగా పోరాడి ఓడించకుండా దళిత, ఆదివాసీ, మతమైనార్టీ ప్రజల అస్థిత్వానికి, ఆత్మగౌరవానికి ముప్పుగా పరిణమించిన హిందుత్వ పెను ప్రమాదాన్ని నివారించలేం.

మహారాష్ట్రలో శివాజీ పాలన 1674-80 మధ్య సాగింది. ఆ తర్వాత మరాఠాల పాలన పీష్వాల నాయకత్వంలో సాగింది. మరాఠాలు మొగల్ రాజుల దాడులను ఓడించినప్పటికీ బ్రిటిష్ సైన్యాలను ఎదుర్కోలేక పోయారు. మరాఠాలను ఓడించిన బ్రిటిష్ వారు పూణేను తమ సైనిక, పరిపాలనా కేంద్రంగా ఏర్పర్చుకున్నారు. 19వ శతాబ్దం మొదటి పాదంలో పీష్వాలు తమ 28వేల సైన్యాలను తీసుకొని పూణేను ఆక్రమించుకోచూడగా బ్రిటిష్ సైన్యాలు 12 గంటలు ప్రతిఘటించి పూణేను వారికి స్వాధీనం కానివ్వలేదు. ఆనాటి బ్రిటిష్ సైన్యంలో ఉండి పీష్వాలను ప్రతిఘటించిన వారంతా భారతీయ దళితులే. దళితుల చేతిలో పీష్వాలు ఓటమి పాలు గావడాన్ని బ్రిటిష్ వారితో ప్రమేయం లేకుండానే తమ విజయదినంగా, ఆత్మగౌరవ చిహ్నంగా జనవరి ఒకటిని దళితులు గత రెండు శతాబ్దాలుగా పాటిస్తున్నారు. ఇలా వారు ఏటేటా పాటించడం బ్రాహ్మణీయ శక్తులకు మింగుడుపడని వ్యవహారంగా ఉంది. రాష్ట్రంలో, కేంద్రంలో తమ సత్తానే నడుస్తోందన్న అధికారమదంతో ఈసారి 1 జనవరి 2013 నాడు హిందుత్వ గుండాలు శంభాజీ ఓడే, మిలింద్ లింబోడీల నాయకత్వంలో వారి గ్యాంగులు కారేగాం భీమాకు చేరిన దళితులపై, వారి సమర్థ‌కులపై మారణాయుధాలతో దాడి చేశారు. పదుల సంఖ్యలో కాషాయ ఉగ్రవాద శక్తులు కుక్కర్ బాంబులను పేల్చి ప్రజల్లో భయోత్పాతాన్ని సృష్టించారు. కోరేగాం ప్రజలలో భయభీతావహాన్ని ఏర్పర్చారు. ఆ దాడుల్లో ఒక దళిత యువకుడు ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడినారు. చాలా ముందు నుండే దళిత సంఘాల నాయకులు తమ వేడుకల నిర్వహణ గురించి ప్రభుత్వానికి, పోలీసులకు తెలిపినప్పటికీ వారు సరైన భద్రతా చర్యలు చేపట్టకుండా హిందుత్వ గుండాల దాడులను ప్రోత్సహించారు. దళితులకు గట్టిగా బుద్దిచెప్పి ఇక ముందు వారు ఎలాంటి ఆత్మగౌరవ విజయదినాలకు పూనుకోకుండా చేయడానికే ప్రభుత్వం, పోలీసులు కాషాయ ఉగ్రవాద గూండాల దాడులను ప్రోత్సహించారు. నిజానికి ఇవన్నీ ఒక సునియోజిత పథకం ప్రకారమే సాగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, వారి ఇంటెలిజెన్స్ వర్గాల, సంగ్ ముఠా శక్తుల సంయుక్త దుష్టపథకాన్నే శంభాజీ, మిలింద్ ల‌ గ్యాంగులు అమలు చేశాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్న‌వీస్ కాషాయ కుటిల ఎత్తుగడలను దేశవ్యాప్తంగా ఎండగట్టాల్సిందిగా మా పార్టీ దళిత, ఆదివాసీ,అల్పసంఖ్యాక ప్రజలను, ప్రజాస్వామ్య, లౌకిక శక్తులను కోరుతోంది.

కోరేగాం భీమాలో దళితులపై జరిగిన దాడులను ఖండిస్తూ పదుల సంఖ్యలో దళిత, ప్రజాస్వామిక, లౌకిక, ప్రగతిశీల, హేతువాద, విప్లవ సంఘాలు జనవరి 3 నాడు మహారాష్ట్ర బందకు పిలుపునిచ్చాయి. రాష్ట్రవ్యాపితంగానే కాకుండా దేశవ్యాప్తంగా హిందుత్వ దాడులకు వ్యతిరేకంగా ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అనేక చోట్ల ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక సమరశీల చర్యలకు దిగారు. బంద్ కు పిలుపునిచ్చిన ముఖ్యులలో ఉన్న కామ్రడ్ ప్రకాష్ అంబేద్కర్, ఆయన నాయకత్వంలోని భారతీయ రిపబ్లికన్ పార్టీ ప్రజల నిరసన చర్యలతో బెంబేలు పడిపోయి బంద్ ను ఉ పసంహరించుకోవడం విచారకరం. కాషాయ ఉగ్రవాదులు బాంబులు, తుపాకులు పేలుస్తూ, కర్రలతో తలలు పగులగొడుతూ, స్త్రీ-పురుష భేదం లేకుండా దాడులు చేసిన విషయాన్ని పక్కనబెట్టి దానికి నిరసనగా ప్రజలు ఉద్యమిస్తే వారి మిలిటెంట్ చర్యలతో కంగారు పడిపోయి, దగుల్భాజీ హిందుత్వ నాయకుల హామీలలో ఆత్మసంతృప్తి చెంది బంద్ ను నిలిపివేయడాన్ని ఎవరూ హర్షించరు.

కోరేగాం భీమాలో దళితులపై దాడికి దిగిన గూండాలు శంభాజీ ఓడే, మిలింద్ లింబోడీలు ఇప్పటికీ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వారు ప్రజల ప్రధాన సేవకుడుʹ మోడీకి ఎంత సన్నిహిత అనుచరులనే విషయం 2014 ఎన్నికల ప్రచార ర్యాలీలను గుర్తు చేసుకుంటే తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా దళితుల ఆత్మగౌరవాన్ని ఎత్తిపడుతూ వారికి అండగా నిల్చిన గుజరాత్ ప్రజల యువనాయకుడు జిగ్నేష్ మేవానీ, జెఎన్యూ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖలీద్ సహా అనేక మందిని మహారాష్ట్ర పోలీసులు ముంబాయిలో అరెస్టు చేసి తప్పుడు కేసులలో ఇరికించడాన్ని మాపార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది.

దళితుల ఉద్దరణ గురించి హిందుత్వ మోదీ మాట్లాడడం, పీడిత ప్రజల పక్షపాతి అంబేద్కర్ ను తన కుటిల‌ ఎత్తుగడలతో ఎత్తిపట్టడం హిందుత్వ కుట్రలో భాగమే తప్ప మరేమీ కాదు. బ్రాహ్మణీయ చాతుర్వర్ణ వ్యవస్థను, కులవ్యవస్థను, అంటరానితనాన్ని భగవద్గీత వలే ఎవరి ʹధర్మంʹ వారు పాంచాలని బోధించే అపర మనువు మోడీకి అంబేద్కర్ ని ప్రశంసించే నైతిక అర్హత లేదని, దళితుల‌ గురించి పల్లెత్తు మాట మాట్లాడితే సహించేది లేదని ముక్తకంఠంతో నినదిద్దాం. రోహిత్ వేముల నుండి కారేగాం భీమాలో దళిత యువకుడి హత్య వరకు నెత్తుటి మరకలతో పాలన సాగిస్తున్న హిందుత్వ శక్తుల ఆగడాలకు వ్యతిరేకంగా పీడిత ప్రజలంతా సమైక్యంగా సంఘటితంగా పోరాడాలని మా పార్టీ కోరుతోంది. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే బ్రాహ్మణవాద అవకాశవాద రాజకీయాల ద్రోహాన్ని ఎండగడుతూ ప్రజాస్వామిక, లౌకిక, ప్రగతిశీల శక్తులన్నీ ప్రజాపోరాటాలకు అండగా నిలవాల్సిన తరుణమిది. ఈ దేశంలో మతానికి, కులానికి తావులేని నవభారతాన్ని 2022 నాటికి నిర్మిస్తానంటూ మోడీ చెప్పేదంతా సొల్లు వాగుడే. ప్రజల కష్టాలను, కడగండ్లను, దోపిడీని నిర్మూలించి, కులమత భేదాలకు, లింగ భేదాలకు అవకాశముండని నూతన ప్రజాస్వామిక సమాజ నిర్మాణానికి పోరాడకుండా ఏ నవభారతం నిర్మాణం కాదని మా పార్టీ స్పష్టం చేస్తున్నది.
అభయ్, అధికార ప్రతినిధి
కేంధ్ర కమిటీ
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)

Keywords : bheema koregav, maharashtra, pune, rss, dalit, ambedkar
(2019-01-21 11:59:00)



No. of visitors : 1928

Suggested Posts


Shocking video of two naked ‘Dalit women’ being thrashed by ‘upper caste’ women

A shocking video of two ʹDalit womenʹ being subjected to merciless thrashing and public humiliation allegedly women from upper caste has gone viral on social media platforms....

ముస్లింల రక్షణ కోసం కత్తులు దూసిన సిక్కులు,చేతులు కలిపిన దళితులు ‍- పరారైన శివసేన మూక

పంజాబ్ లోని పగ్వారా పట్టణంలో ముస్లింల మీద దాడి చేయడానికి ప్రయత్నించిన శివసేన గుంపును సిక్కులు, దళితులు, ముస్లింలు ఐక్యంగా ఎదుర్కొన్నారు. కాశ్మీర్ కు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు బుధవారంనాడు ర్యాలీ నిర్వహించారు ఈ సంధర్భంగా...

గోముసుగు దౌర్జన్యాలపై దళితుల యుద్దభేరి - భగ్గుమంటున్న గుజరాత్

దళితులు భగ్గుమంటున్నారు... తమపై హిందుత్వ శక్తులు చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా కదం తొక్కుతున్నారు. గుజరాత్ లో గోరక్షకులు చేస్తున్న అమానుష అరాచకలాను ఎదిరిస్తూ ఆందోళనలకు దిగారు. గిరి సోమనాథ్ జిల్లాలోని ఊనాలో చనిపోయిన ఆవు చర్మాన్ని ఒలిచిన...

గోరక్షకుల రాజ్యంలో.. ఆకలితో 500 ఆవులు మృత్యువాత !

బీజేపీ పాలిత రాజస్తాన్ లోని గోసంరక్షణ శాలలో పట్టించుకునే వారు కరువై ఆకలి, అపరిశుభ్రంతో రెండు వారాల్లో దాదాపు 500 ఆవులు మృత్యువాతపడ్డాయి. జైపూర్‌లోని హింగోనియా గోశాలలో దాదాపు 250 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు.

చెట్టుకు కట్టేసి మత్తు సూదులేసి.. పెట్రోల్ పోసి.. దళిత బాలుడి పై అగ్రకుల అమానుషం !

కొంతమంది అగ్రకులస్థులు ఓ దళిత బాలుడికి నరకం చూపించారు. చెట్టుకుకట్టేసి బట్టలూడదీసి దారుణంగా కొట్టారు. అతడి మర్మాంగాలపై పెట్రోల్ పోసి హింసించారు. ఈ ఘటన ఆగ్రా జిల్లాలోని బర్హాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల బాస్ కేసీ....

నీళ్ళు తాగనివ్వని అగ్రకుల అహంకారం - బావిలో పడి దళిత బాలుడి మృతి

మధ్యప్రదేశ్ దమోహ్ జిల్లా ఖమరియా కలాన్ గ్రామంలో మూడవతరగతి చదువుతున్న వీరన్ అనే దళిత బాలుడు మధ్యాహ్న భోజనం తర్వాత నీళ్ళు తాగడానికి....

ఢిల్లీ లో దళితులపై హిందుత్వ సంస్థల దాడి !

ఢిల్లీలో శాంతి యుత ప్రదర్శన నిర్వహిస్తున్న దళితులపై హిందుత్వ శక్తులు దాడి చేశాయి. గుజరాత్ లో దళితులపై దాడికి నిరసనగా ఆదివారంనాడు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద యూత్ ఫర్ బుద్దిస్ట్ ఇండియా అనే సంస్థ అద్వర్యంలో దళితులు ధర్నా.....

వాళ్ళకు కమ్మోళ్ళ రక్తమే కావాలట !

హైదరాబాద్ మాక్స్ క్యూర్ హాస్పటల్ లో చికిత్సపొందుతున్న ఓ మూడేళ్ళ చిన్నారికి రక్తం అవసరం వచ్చింది. బ్లడ్ డోనర్స్ ఇండియా అనే ట్విట్టర్ లో ఓ కుల గజ్జి మహానువుడు కమ్మోళ్ళ రక్తం కావాలని ట్వీట్ చేశాడు....

ముందుకు సాగుతున్న ʹఛలో ఉనాʹ - కదం తొక్కుతున్న గుజరాత్ దళితులు

గుజరాత్ దళితులు కదం తొక్కుతున్నారు. వారితో ముస్లింలు చేతులు కలుపుతున్నారు. అన్ని వర్గాల ప్రజాస్వామికవాదులు, విప్లవ, ప్రజా సంఘాలు ఒక్కటై కదులుతున్నారు. ఆగస్టు 5 న అహ్మదాబాద్ లో బయలు దేరిన ఛలో ఉనా ర్యాలీ అనేక పల్లెలు, పట్టణాలు....

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుండి దళిత విద్యార్థుల గెంటివేత

వాళ్ళు దళితులు.... రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంభాల నుండి వచ్చిన నిరుపేద విద్యార్థులు... ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు వాళ్ళు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే చ‌దువుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు చ‌దువు రావడం లేదని పదో తరగతికి ప్రమోట్ చేయకుండా 34మంది విద్యార్థులను స్కూల్ నుండి గెంటేశారు....

Search Engine

నల్గొండ‌లో... ఫిబ్రవరి 9,10 తేదీల్లో విరసం సాహిత్య పాఠశాల
COSTISA demands quashing of fabricated FIR against Prof. Anand Teltumbde!
దేశద్రోహం కేసు : JNU విద్యార్థి నేతలపై చార్జ్ షీట్ తిరస్కరించిన కోర్టు
Dragging Anand Teltumbde into ʹterroristʹ allegations and raiding his house is an attack on freedom of expression : Swami Agnivesh
మీ మద్దతు నాకిప్పుడు కావాలి - ఆనంద్‌ తెల్తుంబ్డే
Immediate and Complete Withdrawal of all Charges against Dr. Anand Teltumbde
ʹపాకిస్తాన్ జిందాబాద్ʹ అని అరిచింది ఏబీవీపీ విద్యార్థులే.. సంచలన వాస్తవాలు బయటపెట్టిన మాజీ నాయకులు
మనను ఆక్రమిస్తున్న ఈ వ్యాధిని ప్రతిఘటిద్దాం- అరుంధతీ రాయ్
A Statement by Umar Khalid and Anirban Bhattacharya in the context of the Chargesheet
ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ ను తొలిగించడమే ఆరెస్సెస్‌-బీజేపీ అసలు లక్ష్యం...జిగ్నేష్ మెవాని
కన్నయ్య, ఉమర్‌, అనీర్బన్‌ లపై మూడేళ్ళ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు
కాగితం మీద అక్షరానికి కట్టుబడ్డ కవి
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకం
మానవత్వం మరచి ఆంబులెన్సును అడ్డుకున్న పోలీసులు.. క్షతగాత్రులపై దాడి
కలాల్లో ఇంకిపోని సిరా, టకటకలు మానని కీబోర్డులు...
కలాల్లో ఇంకిపోని సిరా.. అరుంధతీ రాయ్‌కి జైలు జీవితం అనుభవించిన సామాజిక కార్యకర్త రాసిన ఉత్తరం
A ten year Sahas from US written a reply to Professor Saibabaʹs letter.
Varavara Rao written a letter about Nomula Satyanarayana from Pune jail
అగ్రకులాలకు రిజర్వేషన్లు సామాజిక న్యాయభావనకు వ్యతిరేకం, రాజ్యంగ విరుద్ధం
దళిత నటి విషాద గాథ‌ !
కశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మారణహోమాన్ని చూడలేక రాజీనామా చేసిన ఐఏఎస్
ప్ర‌మాదంలో ప్రైవ‌సీ
తొలగించబడిన చట్టం కింద‌ 22 మంది అరెస్టు...సుప్రీం సీరియస్
నాలుగున్నర దశాబ్దాల నిత్య నిర్బధం - ఎన్.వేణుగోపాల్
శ్రీకాకుళం జిల్లా జైలు - వెట్టిచాకిరీకి నిలయం
more..


బ్రాహ్మణీయ