ఫిబ్రవరి 5న తెలంగాణ, దండకారణ్యం బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు


ఫిబ్రవరి 5న తెలంగాణ, దండకారణ్యం బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

ఫిబ్రవరి

దోపిడీ పాలకులైన కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుపార్టీని నిర్మూలించే లక్ష్యంతో గ్రీన్ హంట్ 3వ దశలో భాగంగా సమాధాన్, ప్రహార్-2 పేరుతో కొనసాగిస్తున్న ఫాసిస్టుదాడికి వ్యతిరేకంగా, కొత్త భూ సేకరణ చట్టానికి, నిర్వాసితత్వానికి వ్యతిరేకంగా,ఇసుక మాఫియా హత్యలకు, దళితులు ఆదివాసులపై దాడులు, హత్యలు, మహిళలపై లైంగిక అత్యాచారాలు, విద్యార్థుల పై దాడులు, అరెస్టులకు వ్యతిరేకంగా...

ఫిబ్రవరి 5వ తారీఖు 2018న తెలంగాణ- దండకారణ్యాలలో సంయుక్తంగా బంద్ ను పాటించి విజయవంతం చేయండి

బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు సంఘపరివార్ బిజెపి మోడీ, చంద్రశేఖరరావు, రమణసింగ్, ఫడ్నవిస్, చంద్రబాబుల ప్రభుత్వాలు దేశ - విదేశీ కార్పోరేట్ శక్తులకోసం సామ్రాజ్యవాదుల ఎజెండాను అమలుచేస్తూ, ప్రపంచబ్యాంకు ఆదేశాలమేరకు సామ్రాజ్యవాదుల, దళారీ పెట్టుబడిదారుల భూస్వాముల ప్రయోజనాలను నెరవేరుస్తూ పాలన కొనసాగిస్తున్నాయి. అందుకు వ్యతిరేకంగా రైతులు, కార్మికులు, ఉద్యోగులు, ఆదివాసులు, దళితులు, మహిళలు, విద్యార్శలు, ప్రజాస్వామికవాదులు పోరాడుతుంటే వాళ్లపై ఫాసిస్తుదాడిని కొనసాగిస్తున్నాయి.

దండకారణ్యం, తెలంగాణలో ఉన్న అమూల్యమైన ఖనిజసంపదను పెట్టుబడిదారులకు అప్పగించడానికి ప్రత్యేకంగా బస్తర్ ప్రాంతానికి ఒకలక్ష యాభైవేల అర్ధ సైనికబలగాలను దించారు. తెలంగాణలో గ్రేహౌండ్స్ బలగాలకు తోడు అర్ధ సైనికబలగాలు, సీఆరపీఎఫ్ బలగాలను దించి క్యాంపులను, ఆదివాస్ బెటాలియన్లను ఏర్పాటు చేస్తున్నారు. మావోయిస్టు రహిత తెలంగాణ, మావోయిస్టు రహిత బస్తర్ పేరుతో ఫాసిస్టుదాడి కొనసాగుతున్నది. తెలంగాణ, ఛత్తీస్గడ్, ఆంధ్ర, మహారాష్ట్ర, పోలీసుబలగాలు సంయుక్తంగా దాడులు కొనసాగిస్తూ గ్రామాల పై దాడులు చేస్తూ శాళ్లను లూటీ చేస్తున్నాయి. మహిళలపై అత్యాచారాలు కొనసాగిస్తున్నాయి. దండకారణ్యంలో, భద్రాద్రి కొత్తగూడెం, తూర్పుగోదావరి జిల్లాలలో వందలాదిమంది సాధారణ ప్రజలను మావోయిస్టుల పేరుతో అరెస్టులు చేసి చిత్రహింసలకు గురిచేస్తూ డైళ్లలో బంధిస్తున్నారు. బూటకపు ఎనకౌంటర్లలో పదులసంఖ్యలో సాధారణ ప్రజలను రోజువారీగా హత్యలు గావిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కెసిఆర్ ఉద్యమకాలంలో మావోయిస్టుఎజెండానే మా ఎజెండా అని ప్రకటించి, అధికారం చేపట్టగానే పోలీసువ్యవస్థను బలోపేతం చేయడానికి కోట్లరూపాయలు ఖర్చు పెట్టాడు. పౌరహక్కులసంఘం అధ్యక్షుడు కావడమే మిన్నగా భావిస్తానన్న చంద్రశేఖరరావు రాష్ట్రంలో ఆట, పాట, మాట బంద్ అంటున్నాడు. పౌరహక్కులను కాలరాస్తున్నాడు. మావోయిస్టులను, ముస్లింయువకులను, శృతి సాగర్ వివేక్ వంటి విద్యావంతులైన తెలంగాణ బిడ్డలను బూటకపు ఎన్కౌంటర్లలో హత్యలు చేసాడు. డిసెంబర్ 6, 2017న తెలంగాణ బార్డర్, మహారాష్ట్రలోని గడ్ చిరోలి జిల్లా కల్లెడ గ్రామసమీపంలో తెలంగాణ గ్రేహౌండ్స్, మహారాష్ట్ర స్-60 కమెండో బలగాలు సంయుక్తంగా దొంగదాడి చేయడంతో అహిరి ఎస్ కార్యదర్శి కామ్రడ్ ఐతు, ఆదిలాబాదు జిల్లా దళం కామ్రడ్స్ విమల, సీత, పద్మలతో సహా 11 మంది అమరులైనారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం మేడమడుల, చింతోనిచెల్క సమీపంలో సిపిఐఎంఎల్ (సప్ బాట) కు సంబంధించిన 9 మందిని పట్టుకొని బూటకపు ఎన్కౌంటర్లో హత్యచేసాడు. భద్రాద్రి కొత్తగూడెం నుండి ఆదిలాబాదు వరకు గోదావరి పరీవాహక ప్రాంతమంతా నిరంతరం కూంబింగ్ కొనసాగిస్తున్నాడు. చత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో కలిసి సంయుక్తదాడులు కొనసాగిస్తూ మరింత రాజ్యహింసకు పూనుకున్నాడు. చత్తీస్గడ్లో ఆదివాసుల పై కొనసాగుతున్న హత్యాకాండలను నిజనిర్ధారణ చేయడానికి పోతున్న టి.డి.ఎఫ్ నాయకులను కెసిఆర్, రమఐసేంగ్ల ప్రభుత్వాలు కుమ్మక్కై అక్రమంగా అరెస్టుచేసి తప్పుడు కేసులు బనాయించి సుక్మా జైల్లో బంధించారు. ప్రజాఉద్యమాలు, ప్రజాస్వామిక శక్తుల కృషివలన వారు ఆరునెలల తర్వాత బెయిలుపై విడుదలయ్యారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రజాసంఘాలను, ప్రజాస్వామికవాదులను పోలీసులద్వారా, హంతకముఠాల ద్వారా బెదిరించడం మరింత పెరిగింది. రాష్ట్రమంతటా సీసీ కెమెరాలతో నిఘానేత్రాలను బిగించింది. హైదరాబాద్లో ధర్నాచౌకను ఎత్తేసారు. కొలువులకోసం ఆందోళన చేపట్టిన నిరుద్యోగ యువత పై, విద్యార్శలపై అణచివేత దాడులు కొనసాగిస్తున్నాడు. చైతన్య, నారాయణ, వెలాసిటి కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడికి, విద్యార్శల ఆత్మహత్యలకు వ్యతిరేకంగా కెసిఆర్ వానం చేసిన కెజి టు పీజి కామన్ విధానాన్ని అమలుచేయాలని న్యాయంగా పోరాడుతున్న విద్యార్థులను అరెస్టుచేసి, చిత్రహింసలు పెట్టి జైళ్లలో బంధించారు. అడవిలో పుట్టి అడవినే నమ్ముకొని బతుకుతున్న ఆదివాసులను హరితహారం పేరుతో వాళ్ల భూభాగం నుండి గెంటివేయడానికి పోలీసులు ఫారెస్టువాళ్లతో దాడులు చేయించి, గ్రామాలను తగులబెట్టడం, పంటచేలను దహనం చేయడం చేస్తున్నారు. చివరికి జలగలంచ గ్రామంలో గుత్తికోయ మహిళలపై దాడితో తెలంగాణ సమాజమంతా కెసిఆర్ ప్రభత్వానికి వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టింది. ఆదివాసులు రిజర్వేషన్ల కోసం న్యాయంగా పోరాడుతుంటే అక్రమ అరెస్టులు చేసి కేసులు పెడుతున్నారు. ఏజెన్సీ ఏరియాలో 144 సెక్షన్, కరెంట్ కట్, ఇంటర్నెట్ కనెక్షన్ తొలగింపు కూడా అమలవుతున్నవి.

టిఆర్ఎస్ ప్రభుత్వం, దాని మంత్రులు, ఎంఎల్ఎలు వాళ్ల బంధుగణమే ఇసుకమాఫియాగా మారి కోట్లరూపాయలను ఆర్జిస్తూ అక్రమాలను ప్రశ్నించిన ప్రజలను, ఇసుకలారీలతో గుద్ది చంపారు. నేరెళ్లలో ప్రజలు తిరుగుబాటు చేస్తే దళిత యువకులను అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ చిత్రహింసలకు గురిచేసి జైల్లో పెట్టారు. దీన్ని తెలంగాణ సమాజమంతా తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోరాటాలు కొనసాగించారు. జనవరి 5వ తారీఖున నిజామాబాద్ జిల్లాలో కోరగాం గ్రామంలో విఆర్ఎ సాయిలు అక్రమ ఇసుక తరలింపును వ్యతిరేకించినందుకు ఇసుకమాఫియా ట్రాక్టర్తో గుద్ది చంపేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వమే ఇసుకమాఫీయా కాబట్టి ప్రజలకు న్యాయం జరగడంలేదు. పైగా న్యాయం కావాలని ముందుకువచ్చిన ప్రజలను అధికార, అంగబలంతో జైల్లో చేస్తున్నారు. నేరెళ్ల, అభంగపట్నంలలో పోలీసులు అగ్రవర్ణాలవాళ్లు దళితులపై దాడులు కొనసాగించారు. మూడు ఎకరాల భూమి పంపకంలో జరుగుతున్న అక్రమాలకు దళితుల్లో చెలరేగిన అసంతృప్తి వారి ఆత్మహత్యలకు దారితీసింది. పై కులాల అమ్మాయిలను దళిత యువకులు ప్రేమించి పెళ్లిచేసుకుంటామని నిర్ణయించుకుంటే హత్యలు చేస్తున్నారు.

దళితులలో సామాజికన్యాయం కోసం ఎబిసిడి వర్గీకరణ చేయాలని, ఆత్మగౌరవపోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగను కెసిఆర్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టుచేసి జైల్లో పెట్టి, చాలాకాలం బెయిల్ రాకుండా అడ్డుపడింది. ఓఎస్ ఐపాస్ పేరిట హైటెక్ పరిశ్రమలకు, ప్రైవేట్ పరిశ్రమలకు పెద్దపీట వేస్తున్నాడు. ప్రపంచబ్యాంకు విధానాలను అమలు చేయడంలో ఉమ్మడిరాష్ట్రంలో 13 వ స్థానంలో ఉంటే విడిపోయాక తెలంగాణ కెసిఆర్ పాలనలో మొదటిస్థానానికి వచ్చింది. అందుకే జీఈఎస్ ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సుకు ఇక్కడ అవకాశం కల్పించారు. సామ్రాజ్యవాదుల లాభానికి అడ్డూ అదుపూ లేకుండా ఈడూయింగ్ పద్ధతికి సంబంధించిన 10 అంశాలలో ఏడింటిని కెసిఆర్ ప్రభుత్వం నూరుశాతం అమలుచేసే యధేచ్చగా దోపిడీకి తెరతీసింది. పెట్టుబడిదారులు విదిల్చే ఎంగిలిమెతుకులకు ఆశపడి సదస్సులో ప్రధాని మోడీ, సీఎం కెసిఆర్ ఒకరితో ఒకరు పోటీపడి మన సంపదను కొల్లగొట్టడానికి కార్పోరేట్లకు అనేక రాయితీలు కల్పించారు. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం పేరిట రాష్ట్రవనరులను దేశదేశాల పెట్టుబడిదారులకు , సంపన్నులకు ఉచితంగానూ, కారుచౌకగానూ కట్టబెట్టడానికి ఎర్రతివాచీ పరిచాడు. ఈ సదస్సుకు సంపన్నవర్గం మహిళలు 50శాతం హాజరైనప్పటికీ సామాన్యమహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు సదస్సుకు పట్టలేదు. మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు, వేధింపులు, అమ్మకాలు, మహిళలపై పోలీసుల అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.

నయా నిజాం గా మారిన కెసిఆర్ ముస్లింల ఓట్లను కొల్లగొట్టడానికి తెలంగాణ ప్రజల మాన, ధన, ప్రాణాలను తీసిన, దోచిన నైజాం రాజును తెలంగాణను అభివృద్ధిచేసిన గొప్పరాజు అనీ పొగుడుతూ ముస్లింలను మోసం చేస్తున్నాడు.
గత మూడున్నర సంవత్సరాలలో 4వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గిట్టుబాటుధరలు కావాలని మిర్చి రైతులు పోరాడితే అరెస్టుచేసి చిత్రహింసలు పెట్టి బేడీలు వేసి జైల్లో పెట్టింది కెసిఆర్ ప్రభుత్వం.

ప్రభుత్వ శాసనాన్ని బందోబస్తు చేసి ప్రజలపై కంట్రోల్ తెచ్చుకోవడానికి 10 జిల్లాల తెలంగాణను 31 జిల్లాలుగా విభజించాడు. ఒకేరోజు తెలంగాణ అంతా నిర్వహించిన కుటుంబ సర్వే, ఇప్పుడు సాగిస్తున్న భూసర్వే లాంటి విధానాల ద్వారా బలమైన అడ్మినిస్ట్రేషన్లను తయారుచేసుకుంటూ తమ ఫాసిస్టు పాలనను కొనసాగించడానికి అనువైన విధానాలుగా మలచుకుంటున్నాడు. కమాండ్ కంట్రోల్ ద్వారా నూతన టెక్నాలజీని ఉపయోగించుకునే పేరుతో జనజీవితాన్ని పోలీసుబాసుల చేతిలో పెడుతూ ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను హరించివేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించినపుడు 50 వేల కోట్ల మిగులుతో ఉన్న రాష్ట్రం ఇప్పుడు ఒకలక్ష ముప్పై వేల కోట్ల అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. ఈ ప్రపంచబ్యాంకు అప్పు అవిభక్త ఆంధ్రప్రదేశ్ కన్నా రెండున్నర రెట్లు ఎక్కువ..

ఇలా సంపన్నవర్గాలకు సేవలు చేస్తూ కెసిఆర్ అన్నివర్గాల ప్రజలను బంగారుతెలంగాణ పేరుతో మోసం చేస్తూ ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచుకుంటున్నాడు. తన నియంతృత్వ పరిపాలనతో స్వేచ్ఛ లేని తెలంగాణంగా మార్చివేస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం మరియు కెసిఆర్ ప్రజల కంట్లో నలుసుగా మారాడు. అయినా మళ్లీ అధికారంలోకి రావడానికి అనేక మోసపు ఎత్తుగడలతో ముందుకు వస్తున్నాడు.

మూడున్నర సంవత్సరాల కెసిఆర్, టిఆర్ఎస్ పాలన గుట్టును అర్థంచేసుకున్న తెలంగాణ ప్రజలారా! మీరు ఒకతాటి పైకి వచ్చి పోరాటాన్ని కొనసాగించండి, కెసిఆర్ పాలనకు నిరసనగా ఫిబ్రవరి 5న తెలంగాణబంద్ ను పాటించండి.

దండకారణ్యంలో రమతిసింగ్, ఫడవీస్ ప్రభుత్వాలు ఫాసిస్టుదాడిని కొనసాగిస్తున్నాయి. చత్తీస్గడ్ మహారాష్ట్ర తెలంగాణ పోలీసుబలగాలు బార్లర్లో నిరంతరం సంయుక్తంగా కూంబింగ్స్ కొనసాగిస్తున్నాయి. బస్తర్ ఐజి చెప్పిన ప్రకారం డికె లో 2017లో 1200 సార్లు కూంబింగ్స్ కొనసాగించారు. అంటే ప్రతిరోజు ఒక గ్రామం పై మూడుసార్లు దాడికి పాల్పడ్డారన్నమాట! 2017లో 5 నెలల్లో బస్తరప్రాంతంలోని 5 జిల్లాల్లో, రాజనందగాం, గడ్చరోలి జిల్లాల్లో ఎన్కౌంటర్ పేరుతో పోలీసులు 50 మంది సాధారణ ప్రజలను, పార్టీ కార్యకర్తలను హత్యచేసారు. డిసెంబర్ 6వ తేదీన గడచిరోలి జిల్లా కల్లెడ గ్రామసమీపాన తెలంగాణ గ్రేహౌండ్స్ - మహారాష్ట్ర సి-60 పోలీసులు సంయుక్తంగా దాడి చేయడంతో అహిరి ఎస్ఎస్ తోపాటు 11 మంది కామ్రడ్స్ అమరులైనారు. అక్టోబర్ 2017 నుండి జనవరి 2018 వరకు సుక్మా జిల్లాలో 20 మంది కామ్రను బూటకపు ఎన్కౌంటర్లలో హత్యచేసారు. బి.ఎన్ కామ్రడ్స్ సోడిసీత, సోడి లక్మాలను సివిల్లో గ్రామానికి పోయినపుడు పట్టుకొని హత్యచేసారు. రాసంతోంగు గ్రామందగ్గర కామ్రడ్ దీపక్, కాట్రేడ్ పాక్షాలను కాల్చి చంపారు. మెట్టగూడెంలో సోమదాలు అనే రైతును కాల్చిచంపారు. కేడ్వాయి గ్రామంలో గ్రామ మహిళను కాల్చి చంపారు. ఇత్తన్పార, గొంపాడు, డబ్చుకోంట, ఓరమ్బట్టి గ్రామాల్లో సాధారణ ప్రజలను కాల్చిచంపారు. గొమ్ముగూడెం గ్రామం అడవిలో భార్యాభర్తలు పోలీసుబలగాలకు తారసపడినపుడు భర్తముందే భార్యపై అత్యాచారం చేసారు. ఆమె ఇప్పుడు పిచ్చిదై తిరుగుతున్నది. దండకారణ్యంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. అక్రమాలను అడిగేవాళ్లే లేరు. ఆగడాలకు అడ్డే లేదు

బీజాపూర్ జిల్లాలో కుటు, వెదెర, పర్సాగర్, ఆవుపల్లి, మిర్జూర్, బైరంగడ్, గంగులూరు, బాసగూడెం, పామేడ్ ఊసూరు స్టేషన్ల పరిధిలో నిరంతరం పోలీసులు గ్రామాలను చుట్టుముట్టి కార్ధన్, సెర్చింగ్ అభియాన్లు కొనసాగిస్తున్నారు. సెప్టెంబర్లో మూకపెల్లి గ్రామ సమీపంలో ఒక వ్యక్తిని, జారామొగితో గ్రామసమీపంలో ఒక రైతును హత్యచేసారు. నవంబర్ 12వ తారీకున పెదకోర్మ గ్రామసమీపంలో ముగ్గురు జనమిలీషియా సభ్యులను హత్య చేసారు. డిసెంబర్లో కొర్చిల్ గ్రామం దగ్గర ఒక గ్రామీణున్ని హత్య చేసారు. జనవరి 4వ తారీకు నుండి 9వ తారీకు 2018 వరకు లగాతార్ ఒక వారంరోజుల వరకు దంతేవాడలోని కోందుల్, బచే, బీజాపూర్ జిల్లాలో గంగులూర్, మీరూర్, తూమకూర్, హండ్రి, తామోడి, ఇనమ్గొండ, మొదుమ్, పూనార్, కరకా, పురంగెల్, గంపూర్ గ్రామాల పై సిఆర్పీఎఫ్ కోబ్రా, ఓఆర్డి, ఎస్టియస్ పోలీసు బలగాలు దాడులు చేసి ఇండ్లను దోచుకున్నారు. మహిళలను బట్టలు విప్పి కొట్టారు. వందలాది కోళ్లను తిన్నారు. జనవరి 5వ తారీకున మొదుమ్ గ్రామసమీపంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో కామ్రడ్స్ బుదరామ్ ఎస్ఎమ్, కామ్రడ్ క్రాంతి ఎసిఎమ్ లు అమరులైనారు. కర్కు గ్రామంలో ప్రజల పై కాల్పులు జరిపితే ఒక యువకుడు చనిపోయాడు. ఇద్దరు గ్రామస్తులు గాయపడ్డారు. దంతేవాడ జిల్లా కేట్టె కళ్యాణ్, రానపూర్, పామోర్, కువకొండ, బస్తర్ జిల్లాకు సంబంధించిన పక్ నార్, దర్భా, కొలెంగ్, పూస్పాల్, ఉరమ్గాటీ పోలీసుక్యాంపుల నుండి పోలీసులు నిరంతరం గ్రామాల పై దాడులు కొనసాగిస్తూ ప్రజలను అరెస్టులు చేసి జైళ్లలో బంధిస్తున్నారు. కెట్టె కళ్యాణ్ ఏరియాలోని మురుంగా గ్రామ సమీపంలో మడ్కమ్ దుర్ల అనే రైతును హత్యచేసారు.

మరోపక్క దోపిడి పాలకవర్గాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో పీడితప్రజల్లో పెరుగుతున్నఅసంతృప్తిని విప్లవంవైపు మర్లకుండా చేయడానికి బూటకపు సంస్కరణలు, పేదరిక నిర్మూలన , బంగారు తెలంగాణ, నయా ఛత్తీస్గఢ్, నవభారతనిర్మాణం పేర్లతో కార్యక్రమాలు చేసినా, అధికధరలు, నిరుద్యోగం, నిర్భంధం, రైతాంగ ఆత్మహత్యలు, అత్యాచారాలు, హత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

మోది - చంద్రశేఖరరావులు, రమణ్ సింగ్, ఫడ్న‌వీస్ ప్రభుత్వాలు కలిస్ మావోయిస్టుపార్టీ కార్యక్రమాలు కొనసాగుతున్న జిల్లాల్లో సంయుక్తంగా దాడులు కొనసాగిస్తున్నాయి. ఆపరేషన్ గ్రీన్హంట్లో భాగమైన సమాధాస్ అనే వ్యూహంతో 2022 నాటికి మావోయిస్టుపార్టీ ఉద్యమాన్ని నిర్మూలిస్తామని ప్రతీఘాతుకదాడిని కొనసాగిస్తూ మానవహక్కులను కాలరాస్తున్నాయి.

అందుకని ఈ దమనకాండకు వ్యతిరేకంగా తెలంగాణ, దండకారణ్యంలో అన్ని సెక్షన్ల ప్రజలు రైతులు, కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, వ్యాపారులు 2018 ఫిబ్రవరి 5వ తారీఖున తెలంగాణ, దండకారణ్యాలలో సంయుక్తబంద్ ను విజయవంతం చేయాలని తెలంగాణరాష్ట్ర కమిటి, దండకారణ్య స్పెషల్జోనల్ కమిటీ పిలుపునిస్తున్నాయి. బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు సంఘపరివార్ భాజపా- టిఆర్ఎస్ ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడండి. అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం, నిర్వాసితత్వానికి వ్యతిరేకంగా, పర్యావరణ పరిరక్షణ కోసం, ఇసుకమాఫియా హత్యలకు వ్యతిరేకంగా ప్రజాందోళనలు కొనసాగించండి.

దోపిడి పాలకుల కిరాయి సైనికులు కూంబింగ్ల పేరుతో గ్రామాల పై దాడులు చేయడం, మహిళలపై అత్యాచారాలు చేయడం, సాధారణ ప్రజలను బూటకపు ఎన్కౌంటర్లలో హత్యలు చేయడాన్ని ఖండించండి.

నరేంద్రమోడీ, చంద్రశేఖరరావు, రమణసింగ్, ఫడ్నవీస్, చంద్రబాబుల దళారీ ఫాసిస్టుల ద్వారా కొనసాగుతున్న కూంబింగ్లు, సంయుక్త ఆపరేషన్లకు వ్యతిరేకంగా పీడితప్రజలంతా ఒక్కటై పోరాడాలి.

కల్లెడ, పెందోడి, కన్నాయిపాడ్, రాసంతోగు, ఇర్వనార్, కోరా మొదుమ్, కేడ్వాలు, మేడమడుగుల, ఎన్కౌంటర్లలో అమరులైన జనమోర్చ కామ్రేడ్స్ అందరికీ లాల్ లాల్ జోహార్లు.

ప్రజాయుద్ధాన్ని ముందుకు తీసుకపోదాం! ఆపరేషన్ గ్రీన్హంటిను, సమాధానాను ఓడిద్దాం! అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దాం.

- విప్లవాభినందనలతో
జగన్, అధికార ప్రతినిధి, తెలంగాణ రాష్ట్ర కమిటీ,
సీపీఐ (మావోయిస్టు)
వికల్ప్, అధికార ప్రతినిధి, దండకారణ్య్ స్పెషల్ జోనల్ కమిటీ,
సీపీఐ (మావోయిస్టు)

Keywords : maoist, bandh, telangana, dandakaranya, jagan, vikalp, kcr, modi, raman sing, fadnavees
(2018-02-23 09:40:28)No. of visitors : 1677

Suggested Posts


A Powerful Reply from Maoist Leaderʹs Daughter to Home Minister

When I was 10, my four-year-old sister Savera and our mother were unreasonably taken into police custody. Due to the unending harassment from your force....

జంపన్న పార్టీకి ద్రోహం చేశాడు..ఏడాది క్రితమే ఆయనను సస్పెండ్ చేశాం..మావోయిస్టు పార్టీ

మొన్నటిదాకా మావోయిస్టు పార్టీలో పని చేసి ఇటీవల పోలీసులకు లొంగిపోయిన జినుగు నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న మావోయిస్టు పార్టీకి ద్రోహం చేశాడని సీపీఐ మావోయిస్టు పార్టీ మండిపడింది. ఆయనను ఏడాది క్రితమే పార్టీ సస్పెండ్ చేసిందని ఆ తర్వాత కూడా ఆయన తప్పులను సరిదిద్దుకోకపోగా ఇప్పుడు శత్రువుకు లొంగిపోయాడని

జగదల్ పూర్ జైలు నుండి మావోయిస్టు పద్మక్క లేఖ

ఏళ్లతరబడి జైలులో ఉన్నతరువాత, విడుదలయ్యే రోజున స్వేచ్ఛ నుంచి వంచితురాల్ని చేసి పాత, అబద్ధపు వారంట్లతో అరెస్టు చేయడం అనేది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. ఇలాంటి స్థితిలో నా అరెస్టుని చట్టవ్యతిరేకమైనదిగా ప్రకటించడానికి ఈ వినతిని ఉన్నత న్యాయ స్థానానికి తీసుకెళ్ళండి.....

మావోయిస్టు పార్టీకి ప‌న్నెండేళ్లు

సెప్టెంబ‌ర్ 21... భారత విప్లవోద్యమంలో చారిత్రక ప్రాధాన్యం గ‌ల రోజు. మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌ ఆఫ్‌ ఇండియా, సీపీఐ ఎంఎల్‌ (పీపుల్స్‌వార్‌) విలీనమై....

మావోయిస్టు మున్నా స్తూపాన్ని కూల్చేయాల‌ట‌ !

ఏఓబీ ఎన్‌కౌంట‌ర్‌లో మృతి చెందిన మున్నా స్మార‌కార్థం కుటుంబ స‌భ్యులు ప్ర‌కాశం జిల్లా ఆల‌కూర‌పాడులో నిర్మించిన స్తూపాన్ని తొల‌గించాలంటూ కొంది మందిని డ‌బ్బులు తీసుకొచ్చిన జ‌నాల‌తో పోలీసులు ర్యాలీ తీయించారు. జిల్లా క‌లెక్ట‌ర్‌, టంగుటూరు త‌హ‌సీల్దార్‌కు విన‌తిప‌త్రం ఇచ్చారు. మావోయిస్టులు హింస‌కు పాల్ప‌డుతున్నార‌ని, పోలీసులు చ‌ట్ట‌బ‌ద్ద పోరాటంలో ప్రాణాలు కోల్

రాజుకుంటున్న మన్యం

విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం ఊపందుకుంది. ʹదేశ ఖనిజ సంపదను విదేశాలకు దోచి పెట్టే ఏ చర్యలను మేం ఒప్పుకోబోంʹ అంటూ ప్రకటించిన మావోయిస్టు పార్టీ బాక్సైట్ పోరాటాన్ని ఉదృతం చేసింది. మన్యం ప్రాంతంలో సభలు, సమావేశాలు....

Govt lost mercy petition of 4 Maoist convicts on death row

Four death row convicts in Bihar have been waiting for a decision on their mercy petition for more than a decade because their plea to be spared.....

ఆజాద్, హేమచంద్రపాండేల ఎన్కౌంటర్లో పాల్గొన్న 29 మంది పోలీసుల లిస్ట్

మావోయిస్టు పార్టీ నేత ఆజాద్, జర్నలిస్టు హేమచంద్రపాండేల ఎన్కౌంటర్లో పాల్గొన్న 29 మంది పోలీసులప విచారణ కొనసాగించాలని ఆదిలాబాద్ కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో ఆ 29 మంది పోలీసుల లిస్టు

రేపటి నుండి అమరుల సంస్మరణ వారోత్సవాలు.. మావోయిస్టు పార్టీ ప్రకటన‌

తెలంగాణ ప్రజలు నీళ్లు, నిధులు, నియామ‌కాలు, ఎన్‌కౌంట‌ర్ లు లేని, ప్రజాస్వామిక తెలంగాణ కొరకు దశబ్దాల పాటు పోరాడి సాధించుకున్న తెలంగాణలో నేడు కనీసం ప్రజాస్వామిక హక్కులు కూడా కరువయ్యాయి. చంద్రశేఖర్ రావు అధికారంలోకి వచ్చినప్పటి నుండి బంగారు తెలంగాణ పేరుతో పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడం,ఆయుధాలు, వాహానాలు, సెల్ఫోన్లు, సి.సి. కెమెరాలు, పోలీస్ స్టేషన్లు, క

Maoist Himadri Sen Roy alias Somen dead

Himadri Sen Roy alias Somen - maoist whom CID arrested from Hridaypur police station in North 24 Parganas in February 2008 died in a city hospital on Wednesday morning. This 59 year old who handled the Bengal operations at the time of his arrest...

Search Engine

జైలు కథలు...ఏక్ చాదర్ మైలీసీ -బి. అనూరాధ
Condemn arrest of Damodar Turi by Jharkhand Police - PPSC
RELEASE ANTI-DISPLACEMENT ACTIVIST DAMODAR TURI
మార్చ్8: దండకారణ్యం క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంగఠన్ పిలుపు !
ఆజాద్ ఎన్ కౌంటర్ కేసు తీర్పు – న్యాయ పర్యావసనాలు
In Himachal Pradesh School, Dalit Students Told To Sit Outside And Watch PM Modiʹs ʹPariksha Par Charchaʹ
demanding the immediate release of Damodar Turi
ఆజాద్, హేమచంద్రపాండేల ఎన్కౌంటర్లో పాల్గొన్న 29 మంది పోలీసుల లిస్ట్
Azad encounter: Adilabad Lower courtʹs order set aside
ఆజాద్ ఎన్కౌంటర్ లో పాల్గొన్న‌ 29 మంది పోలీసులపై కేసు నమోదు చేసి విచారించాలి - ఆదిలాబాద్ కోర్టు తీర్పు
20 ఏళ్ల వరంగ‌ల్ డిక్ల‌రేష‌న్ స‌భ‌పై పోలీసుల ద‌మ‌న‌కాండ - ప్రొ. ల‌క్ష్మ‌ణ్
నరహంతక పాలన.. మహిళా గెరిల్లాల మర్మాంగాల్లో కాల్చండని ఆర్మీకి ఆదేశం !
Honduras protests continue as U.S. puppet sworn in
Widespread violence after killing of Dalit student, bus torched; Opposition hits out at BJP govt
UP: Dalit Student beaten up with hockey sticks and bricks dies in Allahabad
ముస్లిం మహిళలపై ప్రభుత్వం కపట ప్రేమ‌ - డానీ
జైలు కథలు...ఏది జైలు? -బి. అనూరాధ
నయీంతో సంబంధాలున్న టీఆరెస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలి !
గూగీ వా థియాంగో...జి.ఎన్‌. సాయిబాబా...యుద్దకాలంలో స్వప్నాలు
రోహిత్‌ వేముల.. విలాస్‌ గోఘ్రే..ప్రభాకర్‌ మచ్చ...పాలకుల హత్యలు -వరవరరావు
తెలంగాణలో పౌర హక్కులు - బహిరంగ లేఖ‌
జైలు కథలు..వంటే నేరమైన చోట -బి.అనూరాధ
7 Policemen Given Life Sentence In Dehradun Fake Encounter Case
International Solidarity with the political prisoners in India - young revolutionaries, Brazil
జైలు కథలు...బలి -బి.అనూరాధ
more..


ఫిబ్రవరి