తెలంగాణలో పౌర హక్కులు - బహిరంగ లేఖ‌


తెలంగాణలో పౌర హక్కులు - బహిరంగ లేఖ‌

తెలంగాణలో

(తెలంగాణ ముఖ్య మంత్రికి మానహక్కుల వేదిక రాసిన ఈ బహిరంగ లేఖ వీక్షణం మాసపత్రిక ఫిబ్రవరి, 2018 సంచికలో ప్రచురించబడినది)

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి...

చాలా రోజుల నుంచి మీకు ఈ ఉత్తరం రాయాలనుకుంటున్నాం. 2014 చివర్లోనే మొదటిసారి అనుకున్నాం. కాని మీరు అధికారంలోకి వచ్చి ఆరు నెలలే అరుుంది... తొందరపడినట్లరుుతదని సందేహించినం. 2015 లోనూ అనుకున్నాం. కాని ఇంకా కుదురుకున్నట్టు లేరు ఆగుదామనుకున్నాం. 2016లో ఇక తప్పదు రాద్దామనుకున్నాం. కాని ఎన్నో ఏండ్ల పోరాటం తర్వాత అధికారంలోకి వచ్చిన తొలి తెలంగాణ పార్టీ కనుక ఇంకొక్క సంవత్సరం కూడా ఆగి చూద్దామనుకున్నాం. ఆగినం. చూసినం. ఏ మాత్రం మార్పు లేదు. మిగతా మీ పాలన సంగతెలా ఉన్నా సమాజంలో జరుగుతున్న రకరకాల విషయాల పట్ల తమ అసంతృప్తినో, నిరసననో వ్యక్తం చేయాలనుకునే వారి పట్ల మీ ప్రభుత్వ, పోలీసుల వైఖరి మమ్మల్ని ద్రిగ్భాంతికి గురి చేస్తున్నది. ఏ వర్గం ప్రజలనూ రోడ్డు మీదికి రాకుండా, తమ అభిప్రాయాలను నోరు తెరిచి చెప్పనీయకుండా మీరు తీసుకుంటున్న ʹజాగ్రత్తలుʹ ఒక ప్రజాస్వామ్య దేశంలో కనీ వినీ ఎరగనివని చెప్పక తప్పదు.

మా సంస్థ (మానవ హక్కుల వేదిక) గత 20 ఏళ్లుగా ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న సంస్థ అని మీకు తెలుసు. మరీ ముఖ్యంగా తెలంగాణలో జరిగిన అన్ని రకాల అణచివేతలకు, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చినమని మీకు తెలుసు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో మీరూ మేమూ వేదికలు పంచుకున్న విషయం కూడా మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది.

మీరు బంగారు తెలంగాణను నిర్మిస్తానని వాగ్దానం చేశారు. అందులో భాగంగా కె.జి నుంచి పి.జి వరకు ఉచిత విద్య అందిస్తామన్నారు. దళితుడ్ని తొలి ముఖ్యమంత్రిని చేస్తానన్నారు. భూమి లేని ప్రతి దళిత కుటుంబానికీ మూడు ఎకరాల భూమి ఇస్తానన్నారు. ముస్లింలకు, ఆదివాసులకు రిజర్వేషన్స్‌ పెంచుతామన్నారు. బూటకపు ఎన్‌కౌంటర్స్‌ ఉండవు అన్నారు. ఇంటికొక ఉద్యోగం వాగ్దానం చేశారు. ప్రతి ఎకరాకూ సాగునీరు ఇస్తామన్నారు. బలహీన వర్గాలకు రెండు బెడ్‌ రూముల ఇళ్లు కట్టిస్తామన్నారు. నిరంతరం కరెంటు సరఫరా ఉండేలా చూస్తానన్నారు. ఇంకా చాలా అన్నారు. వాటిలో కొన్ని మొదలు పెట్టి ఉండవచ్చు. కొన్ని పూర్తిగా మరిచిపోరుు ఉండవచ్చు - మిగతా అందరి పాలకుల లాగానే. కాని ఒక విషయంలో మాత్రం మీ ప్రభుత్వం ఇతర ప్రభుత్వాల కంటే పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోందని చెప్పక తప్పదు. దాని గురించే ఇప్పుడీ బహిరంగ లేఖ.

ఉద్యమ పార్టీగా ఉండి అధికారంలోకి వచ్చినందువల్ల మీ పార్టీ ప్రజల ఆకాంక్షలను మరింత గౌరవిస్తుందని చాలామంది లాగే మేము కూడా ఆశించినం. కాని మీరు వాగ్దానం చేసిన ఫ్రెండ్లీ పోలీసింగ్‌ పూర్తి రివర్స్‌లో పని చేస్తుండటం చూసి విస్తుపోరుునం. తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ప్రజలకు ప్రజాస్వామ్యం కొన్ని అవకాశాలు కల్పించిందనే విషయాన్నే మీరు పూర్తిగా మరిచిపోరుు నట్టున్నారు. మీ వైఖరి చూస్తే మీరూ, మీ ప్రభుత్వమూ, మీ పోలీసులూ ఏమి చేసినా ప్రజలకు ʹఎస్‌ʹ తప్ప ʹనోʹ చెప్పే హక్కు లేదనుకుంటున్నట్టు కనిపిస్తున్నది. లేకుంటే ఎవరికీ ధర్నాలకు, ఊరేగింపులకు ఎందుకు అనుమతియ్యరు? సభలకు, సమావేశాలకు ఎందుకు అనుమతి ఇయ్యరు? సంస్మరణ సభలు సైతం ఎందుకు జరుపుకోనివ్వరు? ప్రాజెక్టుల కొరకు నిర్వహించే పబ్లిక్‌ హియరింగులకు బాధిత ప్రజానీకాన్ని ఎందుకు పోనివ్వరు? హాల్‌ మీటింగుల మీద కూడా ఎందుకు ఆంక్షలు పెడతారు?

ఈ విషయంలో మీరెంత నిష్పక్షపాతులంటే సభలు పెట్టుకోవాలను కుంటున్న వారు విద్యార్థులా, నిరుద్యోగులా, లెఫ్టిస్టులా, కాంగ్రెస్‌ వాళ్లా, తెలుగుదేశం వాళ్లా; నిరసన తెలుపుతున్న వారు విత్తనాలు మొలకెత్తలేదన్న ఆవేదనతో రోడ్డెక్కిన రైతులా, గిట్టుబాటు ధరలు అడగడానికి గుమిగూడిన రైతులా, భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతులా; ధర్నా చేస్తున్న వారు హైకోర్టు విభజనను కోరుతున్న న్యాయవాదులా, నేరెళ్ల లాంటి దాడులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న దళితులా, వర్గీకరణ కోరుతున్న మాదిగలా అనే ʹతేడాʹ కూడా చూడరు మీరు. ఏ వర్గమూ మీ పాలసీలను వ్యతిరేకించడానికి వీల్లేదు. మీ పాలన మీద గాని, ఇప్పుడున్న వ్యవస్థ మీద గాని ఎటువంటి నిరసన తెలపడానికి వీల్లేదు. మీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి దేన్నరుునా తొందరగా సాధించుకోవాలని అనుకోవ డానికి వీల్లేదు. అలాంటి ప్రయత్నం ఎవరు చేసినా వెంటనే నిషేధాజ్ఞలు, అరెస్టులు, చిత్రహింసలు, కేసులు పెట్టడానికి పోలీసులు సిద్ధంగా ఉంటున్నారు.

ఏ రకమైన ప్రజాస్వామ్యం ఇది? ప్రజాస్వామ్యం ఇచ్చే అన్ని సదుపాయాలనూ ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చిన పార్టీ చేయాల్సిన పనులేనా ఇవి?

అందరు ముఖ్యమంత్రులూ శంకుస్థాపనలకు, ప్రారంభోత్సవాలకు పోతుంటారు. సభలు, సమావేశాలలో పాల్గొనడానికి జిల్లాలు తిరుగుతుంటారు. కాని తెలంగాణలో మునుపెన్నడూ లేని విధంగా మీ పోలీసులు మీరు ఎక్కడికి వెళుతున్నా ఎందుకు ముందస్తుగా వందల మందిని నిర్బంధంలోకి తీసుకుంటున్నారు? మిమ్మల్ని ఏ రూపంలో విమర్శించినా కేసులు పెట్టడమో, బెదిరించడమో చేస్తున్నారు? ప్రజలకు సమస్యలు ఉండవా? తమ డిమాండ్లు నెరవేర్చువడానికి ధర్నాలో, ఊరేగింపులో చేయరా? మీకో, మీ మంత్రులకో వినతిపత్రాలు ఇవ్వాలనుకోరా?

ప్రజలు ఇవన్నీ చేయకుండానే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందా? ఇవన్నీ చేయకుండానే తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నారా? ఎవరిదాకనో ఎందుకు... ఉద్యమ పార్టీ నాయకుడిగా మీరెన్ని ఆందోళనలు చేయలేదు? మరి ఇప్పుడెందుకు మీ పోలీసులు మాటిమాటికి సెక్షన్‌ 30లు, సెక్షన్‌ 144లు, సెక్షన్‌ 151లు పెడుతున్నట్టు? ఐదుగురు ఒక చోట కలిస్తేనే మీ ప్రభుత్వం కూలిపోతుందని భయపడుతున్నారా? పదిమంది కలిసి ఒక మీటింగ్‌ పెట్టుకుంటేనే మీ అధికారానికి ముప్పు ఏర్పడుతుంది అనుకుంటున్నారా?

ఇటీవలి కాలంలో తెలంగాణలో పోలీసులు ఎందర్ని ముందస్తు అరెస్టులు చేశారో ఒకసారి గుర్తు చేస్తాం... వింటారా!

- మూడు నెలల కిందట అక్టోబర్‌ 10న మీరు సిద్ధిపేట కలెక్టర్‌ కార్యాలయానికి శంకుస్థాపన చేయడానికి వెళ్లినప్పుడు 170 మందిని ముందస్తుగా అరెస్టు చేసి కార్యక్రమం అరుుపోయేదాకా విడుదల చేయలేదు. అక్టోబర్‌ 22న మీరు కాకతీయ మెగా టెక్సటైల్‌ పార్కుకు భూమి పూజ నిర్వహించడానికి వరంగల్‌ వెళ్లినప్పుడు ముందురోజే 200 మందిని అరెస్టు చేసి కార్యక్రమం అరుుపోరుునంక గాని వదిలిపెట్టలేదు.

- మరీ అన్యాయమేమిటంటే కొన్ని ప్రజా సంఘాలు (తెలంగాణ జెఎసి, తెలంగాణ విద్యార్థి వేదిక, తెలంగాణ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌) ఏ కార్యక్రమం తలపెట్టినా ఆ సంస్థ నాయకులను, కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. వారి కార్యక్రమాలను భగ్నం చేస్తున్నారు. వారి ఇంటి తలుపులు పగలగొట్టి మరీ అరెస్టులు చేస్తున్నారు. ఈ జాబితాలో మూడేళ్ల కిందటి వరకు మీతో కలిసి పని చేసిన తెలంగాణ జారుుంట్‌ యూక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ కోదండరామ్‌ ఇల్లు కూడా ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు సైతం చేయడానికి సాహసించని పనిని మీ పోలీసులు చేసారంటే ఏమనుకోవాలి? అలాగే ఒక పాలీసు స్టేషన్‌ వాళ్లు ʹముందస్తుʹ అరెస్టు (12.08.2017) చేసి వదిలిపెట్టిన వ్యక్తిని మరికాసేపటికే మరో పోలీసు స్టేషన్‌ వాళ్లు మరోసారి ʹముందస్తుʹగా అరెస్టు చేయడం ఏమిటి? (కొన్నాళ్లకు ముందస్తు శిక్షలు విధించినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదేమో!) కోదండరాంను మెదక్‌ జిల్లాలో రెండు గంటల వ్యవధిలో, రెండు పోలీసు స్టేషన్‌ల పరిధిలో, రెండు సార్లు అరెస్టు చేసి బలవంతంగా పోలీసు జీపులో ఎక్కించి హైదరాబాద్‌కి తరలించారు.

వీటి గురించి పోలీసులనుకు అడిగితే ఎస్‌.ఐ నుండి డి.ఐ.జి వరకూ అందరిదీ ఒకటే సమాధానం - ʹʹమాకు పై నుంచి ఆదేశాలు ఉన్నారుుʹʹ. ఈ ఆదేశాలు ఇస్తున్న ఆ పై వారు ఎవరో మాత్రం వెల్లడించరు. ఇటువంటి మౌఖిక ఆదేశాలకు చట్టబద్ధత లేదనే విషయం మేము మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా. ఒకవేళ మీ ప్రభుత్వానికి తెలియకుండా పోలీసులు ఈ పనులు చేస్తుంటే (అలా అని నమ్మేంత అమాయకులు ఎవరూ లేరనుకోండి) మీరు ఈ పాటికి వాళ్ల మీద చర్య తీసుకోవాల్సింది. మీరు తీసుకోలేదంటే అర్థం మీ ప్రభుత్వమే వాళ్ల చేత ఈ ముందస్తు అరెస్టులు చేరుుస్తుందనుకోవాలి.

ఈ తరహా ʹఫ్రెండ్లీʹ పోలీసింగ్‌కి ఎక్కువగా బలైనవారు విద్యార్థులు. అన్ని ఘటనల గురించీ రాసేంత చోటు లేదు కాబట్టి కాన్ని ముఖ్యమైన ఘటనలను ఉదహరిస్తాం.

- గత మూడున్నరేళ్లలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు తలపెట్టిన ప్రతి కార్యక్రమానికీ పోలీసులు అడ్డంకులు కల్పిస్తూనే ఉన్నారు. తమ ఆహారపు అలవాట్లను ఇతరులు చిన్నబుచ్చడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు రెండేళ్లలో రెండుసార్లు బీఫ్‌ ఫెస్టివల్స్‌ జరుపుకోవాలని ప్రయత్నిస్తే మీ పోలీసులు జరగనివ్వలేదు (10.12.2015, 10.12.2016). ఆ కార్యక్రమాన్ని తలపెట్టిన దళిత, బహుజన విద్యార్థులను ముందురోజు రాత్రే అరెస్టు చేసి తీసుకెళ్లారు. నిరుద్యోగ జె.ఎ.సి. ర్యాలీ తీద్దామనుకున్నపుడు కాకతీయ యూనివర్సిటీ హాస్టల్స్‌లోని విద్యార్థులను ముందురోజు అర్ధరాత్రే (డిసెంబర్‌ 2016) అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఉస్మానియా విద్యార్థులు, నిరుద్యోగులు కలిసి ర్యాలీ తీద్దామనుకున్నపుడు కూడా అదే పని చేశారు (22.02.2017). ఎక్కడికక్కడ జిల్లాలలోనే అడ్డుకుని రాజకీయ నాయకులతో సహా మొత్తం 750 మందిని ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్నారు.

- భారతదేశ వ్యాప్తంగా రోహిత్‌ వేముల ఆత్మహత్యపై నిరసన సభలు, ఊరేగింపులు జరిగారుు కాని హైదరాబాద్‌లోని మాత్రం మీరు జరగనివ్వలేసదు. తొలి వర్ధంతి సందర్భంగా ఉస్మానియాలో ర్యాలీ తీయడానికి ప్రయత్నిస్తే పర్మిషన్‌ ఇవ్వలేదు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ గేటు బయట పెట్టుకున్న మీటింగ్‌ను సైతం భగ్నం చేశారు. విద్యార్థులను బయటికి రాకుండా అడ్డుకోవడమే కాక మీటింగ్‌లో మూట్లాడడానికి వచ్చిన రోహిత్‌ తల్లి రాధిక వేములను కూడా అరెస్టు చేసి తీసుకపోయారు (07.01.2017). పి.హెచ్‌.డి. కామన్‌ నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ ముఖ్యమంత్రి, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ దిష్టిబొమ్మలు తగలబెట్టినందుకు కాకతీయ విద్యార్థులపై కేసులు పెడతామని బెదిరించారు. మురళి అనే పీజీ విద్యార్థి ఆత్మహత్యపై ఆందోళన చేసినందున ఉస్మానియా విద్యార్థులపై అమానుషంగా లాఠీచార్జి చేసి పలువురిని అరెస్టు చేశారు (04.12.2017) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కూడా ఉస్మానియా విద్యార్థులను ముందస్తు అరెస్టు చేశారు (26.04.2017).

తెలంగాణ రాక ముందు ఉస్మానియాలో కనీసం ఆర్ట్స్‌ కాలేజీ నుంచి ఎన్‌.సి.సి గేటు వరకు అరుునా ఊరేగింపు తీయడానికి అభ్యంతర పెట్టేవారు కాదు. ఇప్పుడదీ లేదు. ఆర్ట్స్‌ కాలేజీ దగ్గరే అరెస్టు చేస్తున్నారు. చాలాసార్లు హాస్టల్స్‌ మీద దాడి చేసి ముందుగానే అరెస్టులు చేస్తున్నారు.

రైతుల పట్ల కూడా మీ వైఖరి ఇంతకంటే మెరుగ్గా ఏమీ లేదు.

- మెదక్‌ జిల్లా చేగుంటలో నిరంతర కరెంటు సరఫరా కోరుతూ ధర్నా చేస్తున్న రైతులను పోలీసులు విచక్షణా రహితంగా కొట్టారు. పాలేరులో గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేస్తుంటే బేడీలు వేసి మరీ అరెస్టు చేశారు. వాళ్లను పరామర్శించడానికి వెళుతున్న కోదండరాంను ముందుగానే అరెస్టు చేశారు. భూ సేకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వేములఘాట్‌ రైతులపై లాఠీ చార్జీయే కాక బాష్పవాయు ప్రయోగం కూడా చేసి 25 మందిని గాయపరిచారు.

రాజీకయ పార్టీల పట్ల కూడా మీరు ఇదే ధోరణిలో ప్రవర్తిస్తున్నారు.

- మావోరుుస్టు పార్టీకి పదేళ్లు పూర్తరుున సందర్భంగా ʹప్రత్యామ్నాయ రాజకీయ వేదికʹ మీటింగ్‌ జరుపుకోవాలని ప్రయత్నిస్తే అడ్డుకోవడమే కాదు, వరవరరావుతో సహా చాలామందిని అరెస్టు చేశారు (21.09.2014). శ్రుతి, సాగర్‌ల బూటకపు ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ప్రజాసంఘాలు ర్యాలీ, బహిరంగ సభ తలపెడితే అనేక మందిని ముందస్తు అరెస్టులు చేశారు. వారిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా ఉన్నారు (30.09.2017). తెలంగాణ డెమొక్రాటిక్‌ ఫోరం 24.05.2016 న వరంగల్‌లో ర్యాలీ, బహిరంగ సభ తలపెడితే పర్మిషన్‌ ఇచ్చినట్టే ఇచ్చి మూడురోజుల ముందు రద్దు చేశారు. నాయకులను యధావిధిగా అరెస్టు చేశారు.

- ఇప్పుడు కాంగ్రెస్‌లోకి మారిన ఒకప్పటి తెలుగుదేశం నాయకుడు రేవంత్‌రెడ్డి మీటింగ్‌లకు కూడా చాలాసార్లు పర్మిషన్‌ నిరాకరించారు. జైలు నుండి విడుదల అరుున సందర్భంలోనూ, ఇటీవల జలవిహార్‌లో మీటింగ్‌ పెట్టాలనుకున్నప్పుడు (30.10.2017) కూడా రేవంత్‌రెడ్డికి అనుమతి ఇవ్వలేదు. పర్మిషన్‌ లేకుండా ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన జనజాతర సభలో (02.06.2016) పాల్గొన్నాడని కేసు కూడా పెట్టారు. కాంగ్రెస్‌ వాళ్లనైతే మీటింగ్‌కి రాక ముందే ముందస్తు అరెస్టులు చేశారు. నేరెళ్ల దళితుల మీద పోలీసుల అమానుష దాడికి నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ బహిరంగ సభ పెట్టాలని ప్రయత్నిస్తే పర్మిషన్‌ ఇవ్వలేదు (03.07.2017). వక్తలలో పార్లమెంట్‌ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ ఉన్నప్పటికీ పోలీసులు ఖాతరు చేయలేదు.

- మునిసిపల్‌ కార్మికుల సమ్మె గురించి మీతో మాట్లాడడానికి ప్రయత్నించినపుడు కూడా చాడ వెంకటరెడ్డిని, తమ్మినేని వీరభద్రంను పోలీసులు అరెస్టు చేశారు (06.08.2015). సిపిఎం అనుబంధ రైతు సంఘం పంటలకు గిట్టుబాటు ధరల కోసం కేంద్రం ఒక చట్టం చేయాలని కోరుతూ మీటింగ్‌ పెట్టుకుంటే దానికీ అనుమతి నిరాకరించారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం రద్దును కోరుతూ వివిధ టీచర్ల సంఘాలు రాష్ట్ర స్థారుు మీటింగ్‌ పెట్టుకుంటే హైదరాబాద్‌కి బయలుదేరక ముందే వారిని నల్గొండ, కోదాడ, సూర్యాపేటలలో అరెస్టు చేశారు (24.11.2017).

- మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి నాయకుడు మంద కృష్ణమాదిగ చేపట్టే ఏ నిరసన కార్యక్రమాన్నీ మీ ప్రభుత్వం అనుమతించడం లేదు. తాజాగా ʹచలో ట్యాంక్‌బండ్‌ʹ పేరుతో ర్యాలీ తీసినందుకూ అరెస్టు చేశారు, తన ఆఫీసులో నిరాహారదీక్షకు కూర్చున్నందుకూ అరెస్టు చేసి జైలుకు పంపించారు.

ఇక హైదరాబాద్‌లో ధర్నా చౌక్‌ ఎత్తేసిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి నిరసనగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి ఇందిరా పార్క్‌ దగ్గరికి 2 కె రన్‌ జరపాలని ప్రయత్నిస్తే 50 మందిని ముందస్తుగా అరెస్టు చేశారు. అన్ని ప్రజాసంఘాలూ కలిసి మగ్దూం భవన్‌లో నెలరోజులు నిరసన దీక్షలు చేసినా మీ ప్రభుత్వం కించిత్‌ కూడా వెనక్కి తగ్గలేదు. జిల్లాలలోనూ ఎక్కడా ధర్నాలు చేయనివ్వడం లేదు. ట్యాంక్‌ బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద కూడా గతంలోలా ఎక్కువసేపు నిరసన తెలపడానికి అనుమతించడం లేదు. పది నిమిషాలు దాటితే అరెస్టు చేస్తున్నారు.

పోలీసులకు అరెస్టు చేసే అధికారం ఉండడం, ఆ అరెస్టు సమర్థనీయమైనది అరుు ఉండడం రెండూ వేరువేరు విషయాలు. దేశంలో చేస్తున్న అరరెస్టులలో అనవసరపు అరెస్టులే ఎక్కువ అని నేషనల్‌ పోలీసు కమీషనే ఉన్నది. నేర విచారణలో భాగంగా చేసే అరెస్టులలోనే అనవసరపు అరెస్టులు ఎక్కువ అంటే ఇక ముందస్తు అరెస్టుల సంగతి చెప్పాల్నా! అన్నీ దాదాపుగా అనవసరపు అరెస్టులే. ఏదైనా నేరం జరగబోతుందనే అనుమానంతో ముందస్తు అరెస్టులకు అవకాశం రుుస్తున్న క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సెక్షన్‌ 151. దీన్ని పోలీసులు రాజకీయ కారణాలతో విపరీతంగా దుర్వినియోగం చేస్తున్నారు.

సెక్షన్‌ 151ను దుర్వినియోగం చెయ్యడం ఒక ఎత్తైతే అసలు సభలు, సమావేశాలు జరుపుకోనీయకపోవడం మరో ఎత్తు. దీనికి సెక్షన్‌ 30ను వాడుకొంటున్నారు. ఇది బ్రిటిష్‌ వాళ్లు వాళ్ల సామ్రాజ్య రక్షణ కోసం, వారి దుర్మార్గపు పాలనను ఎవరూ విమర్శించకుండా, ప్రశ్నించకుండా ఉండేందుకు తయారు చేసుకున్న 1861 నాటి పోలీసు చట్టంలోని సెక్షన్‌. సెక్షన్‌ 30 అసలు ఉద్దేశం సభలూ, సమావేశాలూ అడ్డుకోవడం కాదు, వాటిని నియంత్రించడం మాత్రమే. ఈ సెక్షన్‌ ప్రకారం ఒక ఊరేగింపు జరపాలన్నా, సభ నిర్వహించాలనుకొన్నా ఆ విషయాన్ని సంబంధిత పోలీసు అధికారులకు తెలియచేస్తే సరిపోతుంది. అంతేగానీ అనుమతి కోసం ముందే దరఖాస్తు పెట్టుకోవాలని గానీ, ఆ దరఖాస్తుని పోలీసులు తిరస్కరించవచ్చని గానీ ఈ చట్టం చెప్పదు. మీటింగులనూ, ఊరేగింపులనూ నియంత్రించడం అంలే వాటిని నిషేధించడం కాదని సుప్రీంకోర్టు 1973లో హిమత్‌లాల్‌ కేసులో తీర్పు చెప్పింది. అరుునా ఈ సెక్షన్‌ను వాడుకొని సభలనూ సమావేశాలనూ నిషేధిస్తూనే ఉన్నారు.

ఇప్పుడు తెలంగాణలో సభలు, సమావేశాలు జరుపుకోవాలంటే కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకోవడం తప్ప ఇంకో మార్గం లేకుండా పోరుుంది. కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవడం అందరికీ సాధ్యమవుతుందా? సాధ్యం కాని వాళ్లకు వాక్‌ స్వాతంత్య్ర హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛ ఉండి ప్రయోజనమేమిటి? తెలంగాణ పోలీసులు ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాయడం కోసమే ఈ సెక్షన్‌ను వాడుతున్నారనేది ఏ మాత్రం అతిశయోక్తి కాదు.

అలాగే పోలీసులు ఎక్కువగా దుర్వినియోగం చేస్తున్న ఇంకొక సెక్షన్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని 144 సెక్షన్‌. మనుషుల ప్రాణాలకూ, ఆరోగ్యానికీ లేదా భద్రతకు ప్రమాదం జరగబోతుం దనుకుంటే, శాంతి భద్రతలకు విఘాతం కలగబోతుందనుకకుంటే, లేదా దొమ్మీలు జరిగే ప్రమాదం ఉందనుకుంటే మాత్రమే వాటిని నివారించడానికి మేజిస్ట్రెట్‌ ముందస్తుగా సెక్షన్‌ 144 విధించవచ్చు. విధించడానికి కారణాలను ఆ ఉత్తర్వులలోనే పేర్కొనాలి. కాని తెలంగాణ పోలీసులు ఈ నియమాన్ని ఎన్నడూ పాటించలేదు. నిజానికి ఎటువంటి ప్రమాదం జరిగే పరిస్థితి లేకపోరుునా ఆ పదాలను ఉపయోగించి ఉత్తర్వులను పొందుతున్నారు. ఈ సెక్షన్‌ దుర్వినియోగం ఏ స్థారుులో ఉందో తెలియాలంటే ఒక్క అసెంబ్లీ ఉదాహరణ చెబితే చాలు. అసెంబ్లీ చుట్టుపక్కల గత ముప్పై సంవత్సరాలుగా 144 సెక్షన్‌ అమలులో ఉంది. కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా దాన్ని ఎత్తేయలేదు. ఇటీవలి ఉదాహరణ చెప్పాలంటే వేములఘాట్‌లో గత ఏడాది జూలై 28 నుండి వరసగా 60 రోజులు 144 సెక్షన్‌ అమల్లో ఉంది. హైకోర్టు ఉత్తర్వుల తర్వాతే 27.09.206న దాన్ని తొలగించారు. పాత బస్తీలో ప్రతి ముస్లిం పండగకి రెండు రోజుల ముందు నుండే ఈ సెక్షన్‌ అమల్లోకి వస్తుంది.

పోలీసుల అత్యుత్సాహమో, తాము ఎవరికీ జవాబుదారులం కాము అనే నిర్భీతో గానీ సాధారణ పాలనలో సహితం వారి జోక్యం బాగా పెరిగిపోయరుుంది. మీరు, మీ మంత్రులు జిల్లాలకు వెళ్లినప్పుడు ప్రజలు మీకు అర్జీలు ఇవ్వడానికి గానీ, తమ ఇబ్బందులను చెప్పుకోవడానికి గానీ వాళ్లు ఏ మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. ఎవరైనా పట్టుదలతో ప్రయత్నిస్తే వారిని అదుపులోకి తీసుకొని అక్రమ కేసులు పెడుతున్నారు. మీరు రెండేండ్ల క్రితం వరంగల్‌లో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తుంటై కింద రోడ్డు మీద ట్రాఫిక్‌ ఆపేశారు.... గుర్తుందా! పాదచారులను కూడా నడవనీయలేదు. హన్మకొండ హంటర్‌ రోడ్డులోని ఒక ప్రజాప్రతినిధి ఇంటికి మీరు భోజనానికి వెళితే ఆ ఇంటి పక్కనే ఉన్న స్కూల్‌ పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించడానికి వెళ్లిన తల్లిదండ్రులను సుమారు రెండు గంటల పాటు, అంటే మీ భోజనం అయ్యేంత వరకు, స్కూల్లోకి అనుమతించలేదు.

రెండేండ్ల క్రితం కార్మిక మంత్రిని కలవడానికి బయలుదేరిన అప్పటి వరంగల్‌ జిల్లా కమలాపూర్‌లోని బిల్డ్‌ కర్మాగారానికి చెందిన కార్మికులను పోలీసులు జనగామలోనే ఆవేసి వెనక్కి పంపారు. కార్మిక నాయకులనేమో పోలీసు స్టేషన్‌లో నిర్బంధించారు. పెద్దపల్లి జిల్లా సిరిపురం గ్రామంలో సుందిళ్ల ఆనకట్ట నిర్మాణం కోసం ప్రభుత్వం తీసుకున్న తన భూమికి మిడ్‌ మానేరు నిర్వాసితులకు ఇచ్చినట్లుగా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేసినందుకు చంద్రమోహన్‌ అనే యువ రైతును పోలీసులు మూడు రోజులపాటు అక్రమ నిర్బంధంలో ఉంచి నాలుగు కేసులు పెట్టి జైలుకు పంపారు. వేములవాడలో చాయ్‌ అమ్ముకునే ఒక వ్యక్తిని తీసుకుపోరుు చిత్రహింసలు పెట్టారు. ఎందుకు? ʹపోలీసులు కొన్ని నేరాలలో చూసీచూడనట్లు ఉదాసీనంగా ఉంటున్నారుʹ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టడమే అతను చేసిన నేరం. అక్రమ ఇసుక తవ్వకాలను ప్రశ్నించిన నేరెళ్ల దళితులను పోలీసులు పెట్టిన చిత్రహింసల గురించి ఇప్పుడందరికీ తెలుసు. ఆ సందర్భంగా మీరు పోలీసులను సమర్థించిన తీరు ఏ నాగరికుడికైనా ఏవగింపు కలిగిస్తుంది. అధికారులు లంచం అడిగారని ఫిర్యాదు చేసిన వారిని కూడా పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారంటే ఏమనుకోవాలి? డబుల్‌ బెడ్‌రూమ్‌ పథకానికి తన అసైన్మెంట్‌ భూమి ఇవ్వనని నిరాకరించినందుకూ, తన భూమికి మెరుగైన నష్ట పరిహారం అడిగినందుకూ కూడా పోలీసులు చిత్రహింసలు పెట్టిన సంఘటనలు మా దృష్టికి వచ్చారుు. ప్రతి సమస్యలోనూ పోలీసులు జోక్యం చేసుకుని తమదైన పద్ధతిలో వాటిని ʹపరిష్కరిస్తూʹ పోతే అది చివరికి పోలీసు పాలన అవుతుందే గాని ప్రజాస్వామిక పాలన కాదు. పోలీసులను ఉపయోగించుకుని ఎల్లకాలం ఎవరూ అధికారంలో కొనసాగలేరనేది మీకు తెలియంది కాదు.

కొద్ది రోజుల క్రితం అప్పటి డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ అనురాగ్‌ శర్మ తన పదవీ విరమణ సందర్భంగా పత్రికల వాళ్లతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి అభీష్టం మేరకు పనిచేయడం తనకు చాలా సంతృప్తిగా ఉందని అన్నారు. అంటే చట్టాల సక్రమంగా అమలు చేసినందుకో, రాజ్యాంగబద్ధంగా పోలీసుశాఖను నడిపించినందుకో కాదు ఆయనకు సంతృప్తి. మీరు కోరుకున్నట్టు పని చేసినందుకట! పోలీసులు ఎవరినో సంతృప్తి పరచడం కోసం కాదు పని చేయాల్సింది, చట్టబద్ధంగా నడుచుకుని ప్రజల హక్కుల్ని కాపాడాలని వారికి ఎవరు చెప్పాలి? హక్కుల సంఘాలుగా మేము చాలా కాలంగా ఈ విషయం చెపుతూనే ఉన్నాం. ఈ తరహా పాలనా సంస్కృతికి ప్రజాస్వామ్యంలో చోటు ఉండకూడదని, ఈ ధోరణి ప్రజల హక్కుల్ని దారుణంగా హరిస్తుందని గత పాలకులందరికీ చెప్పినట్టే ఇప్పుడు మీకూ చెపుతున్నాం.

ప్రజాస్వామ్యాన్ని గౌరవించడమంటే అన్నిటి కంటే ముఖ్యంగా ప్రజల అభిప్రాయ స్వేచ్ఛను గౌరవించడం, ఆ అభిప్రాయాల వ్యక్తీకరణకు అవకాశం కల్పించే పద్ధతులను గౌరవించడం. అణచివేత వల్ల సమస్యలు పరిష్కారం కావని మీకు తెలియంది కాదు. ఇకనైనా మీరు దిద్దుబాటు చర్యలు చేపట్టి పోలీసుమయమైన నేటి తెలంగాణ ప్రభుత్వ పాలనా సంస్కృతిలో మార్పులు తీసుకురావాలని కోరుతున్నాం. నూతన సంవత్సరం సందర్భంగా మీ పోలీసు శాఖ విడుదల చేసిన ʹతెలంగాణ కాప్‌ యాప్‌ʹలో ప్రజలకు అవసరమైన 350 సేవలున్నాయని చెప్పారు. ప్రజల అభిప్రాయ స్వేచ్ఛను గౌరవించడం కూడా వాటిల్లో ఒకటిగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.
- మానవహక్కుల వేదిక

Keywords : tealangana, kcr, ktr, kalvakuntla kavitha, manavahakula vedika
(2019-01-21 11:59:01)No. of visitors : 974

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.

మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

ఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్‌ ముట్టడి, పెరేడ్‌ గ్రౌండ్స్‌లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్‌ ఉద్యమాలు నిర్వహించారు.

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

ʹనీ బాంచెన్ దొరా కాల్మొక్తʹ

జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ఖిల్లాలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పాదాభివందనం చేస్తున్నానంటూ ...

మహాజనాద్భుత సాగరహారానికి నాలుగేళ్ళు

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపుత్రుల దేహాల సంరంభాన్ని అనుభవించవలసిన సందర్భం అది....

Search Engine

నల్గొండ‌లో... ఫిబ్రవరి 9,10 తేదీల్లో విరసం సాహిత్య పాఠశాల
COSTISA demands quashing of fabricated FIR against Prof. Anand Teltumbde!
దేశద్రోహం కేసు : JNU విద్యార్థి నేతలపై చార్జ్ షీట్ తిరస్కరించిన కోర్టు
Dragging Anand Teltumbde into ʹterroristʹ allegations and raiding his house is an attack on freedom of expression : Swami Agnivesh
మీ మద్దతు నాకిప్పుడు కావాలి - ఆనంద్‌ తెల్తుంబ్డే
Immediate and Complete Withdrawal of all Charges against Dr. Anand Teltumbde
ʹపాకిస్తాన్ జిందాబాద్ʹ అని అరిచింది ఏబీవీపీ విద్యార్థులే.. సంచలన వాస్తవాలు బయటపెట్టిన మాజీ నాయకులు
మనను ఆక్రమిస్తున్న ఈ వ్యాధిని ప్రతిఘటిద్దాం- అరుంధతీ రాయ్
A Statement by Umar Khalid and Anirban Bhattacharya in the context of the Chargesheet
ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ ను తొలిగించడమే ఆరెస్సెస్‌-బీజేపీ అసలు లక్ష్యం...జిగ్నేష్ మెవాని
కన్నయ్య, ఉమర్‌, అనీర్బన్‌ లపై మూడేళ్ళ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు
కాగితం మీద అక్షరానికి కట్టుబడ్డ కవి
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకం
మానవత్వం మరచి ఆంబులెన్సును అడ్డుకున్న పోలీసులు.. క్షతగాత్రులపై దాడి
కలాల్లో ఇంకిపోని సిరా, టకటకలు మానని కీబోర్డులు...
కలాల్లో ఇంకిపోని సిరా.. అరుంధతీ రాయ్‌కి జైలు జీవితం అనుభవించిన సామాజిక కార్యకర్త రాసిన ఉత్తరం
A ten year Sahas from US written a reply to Professor Saibabaʹs letter.
Varavara Rao written a letter about Nomula Satyanarayana from Pune jail
అగ్రకులాలకు రిజర్వేషన్లు సామాజిక న్యాయభావనకు వ్యతిరేకం, రాజ్యంగ విరుద్ధం
దళిత నటి విషాద గాథ‌ !
కశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మారణహోమాన్ని చూడలేక రాజీనామా చేసిన ఐఏఎస్
ప్ర‌మాదంలో ప్రైవ‌సీ
తొలగించబడిన చట్టం కింద‌ 22 మంది అరెస్టు...సుప్రీం సీరియస్
నాలుగున్నర దశాబ్దాల నిత్య నిర్బధం - ఎన్.వేణుగోపాల్
శ్రీకాకుళం జిల్లా జైలు - వెట్టిచాకిరీకి నిలయం
more..


తెలంగాణలో