రోహిత్‌ వేముల.. విలాస్‌ గోఘ్రే..ప్రభాకర్‌ మచ్చ...పాలకుల హత్యలు -వరవరరావు


రోహిత్‌ వేముల.. విలాస్‌ గోఘ్రే..ప్రభాకర్‌ మచ్చ...పాలకుల హత్యలు -వరవరరావు

రోహిత్‌

రోహిత్‌ వేముల ఆత్మహత్య స్మృతిబద్ధ హత్య. ఆయన నీలాకాశంపై అరుణకాంతిని కలగన్నాడు. అవాజ్‌ నాట్యమంచ్‌ కళాకారుడు విలాస్‌ గోఘ్రేది రాజ్య ప్రేరేపిత ఆత్మహత్య. ప్రభాకర్‌ మచ్చది టెరరిస్టు రాజ్య ప్రేరేపిత హత్య. వ్యక్తులుగా, వైయక్తిక కారణాలు కూడా తక్షణ ప్రేరణలుగా ఉరి కొయ్యలకు వేలాడిన వారుగానే వీరు కనిపించవచ్చు. కానీ ఆ ఉరి తీయబడిన శిరస్సు చెప్తున్న బహిరంగ రహస్యం ఏమిటి?

భీమాకోరేగాఁవ్‌ అమరుల ద్విశత సంవత్సర సంస్మరణ సందర్భంగా వేలాది మంది ప్రదర్శకులపై సంఘ్‌పరివార్‌ మూకలు రాళ్లతోనూ, సాయుధంగానూచేసిన దాడిలో రాహుల్‌, బతంగ్‌లే అనే ఇద్దరు దళిత యువకులు అమరులయ్యారు. పోలీసులు అరెస్టు చేసిన వివిధ ప్రజాసంఘాల ప్రదర్శకుల్లో ఎనిమిది మందికి మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయని యుఎపీఎ కింద కేసు పెట్టారు. వాళ్లంతా తెలంగాణకు చెందిన దళిత, బడుగు వర్గాల కార్మికులు. రిలయెన్స్‌ ఎలక్ట్రికల్స్‌లో కాంట్రాక్టు వర్కర్స్‌గా పని చేస్తున్నారు. జనవరి 13న అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టి 15న కోర్టులో హాజరుపరచి మళ్లీ రెండు వారాలు పోలీసు కస్టడీకి తీసుకొని మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ కోర్టుకు అప్పగించి జైలుకు పంపారు. వారిలో దాసరి అజయ్‌ (కృష్ణ, మహేశ్‌) ఘోశాఖ లింగయ్య (వేణుగోపాల్‌, వేణు వెల్గోట) మావోయిస్టులని వారిలో మిగతా ఆరుగురు కుట్రలో భాగస్థులని ఆరోపణ.

పోలీసుల కథనం ప్రకారమే మిగతా ఆరుగురు ముద్దాయిలలో కోర్టులో హాజరుపరచని, ప్రభాకర్‌ నారాయణ మచ్చ కూడా ఉన్నాడు. ఆయనే మన అందరికీ తెలిసిన రచయిత మచ్చ ప్రభాకర్‌. ఆయన గురించే జనవరి 23న ఆత్మహత్య చేసుకున్నాడని భావించడం, ప్రచారం చేయడం జరిగింది. మాయేకర్‌ అనే పోలీసు ఆధికారి తాను, తన బృందం ప్రభాకర్‌ను కస్టడీలోకి తీసుకున్నట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నాడు. విచారణాధికారి అసిస్టెంట్‌ పోలీసు కమిషనర్‌ ప్రభాకర్‌ నారాయణ మచ్చాను కస్టడీలోకి తీసుకున్నాం గానీ, ఆ రోజే విడుదల చేసామని పేర్కొన్నాడు. కేసు డైరీలో కూడ ఈ అంశం ఉంది. అయితే మనందరికీ తెలిసిన సుప్రసిద్ధ తెలుగు రచయిత, తెలుగు మరాఠి సమాజ సాహిత్య నాలుగు దశాబ్దాల వారధి, ముఖ్యంగా దళిత, బడుగు వర్గాల, మార్గదర్శి, ప్రజాస్వామిక, విప్లవశక్తుల పరిణత మిత్రుడు ఎప్పుడు అరెస్టయినట్లు? ఏదైనా పోలీసు స్టేషన్‌కు తీసుకపోయారా? ఇంటికే వచ్చి యాంటీ టెరరిస్టు స్క్వాడ్‌ (ఎటీఎస్‌) పోలీసు బృందం ప్రశ్నించిందా? జనవరి 23 ఉదయం ఆయన ఫ్లాట్‌లో ఉరి వేసుకున్నట్లు కొడుకు చెప్పిన ప్రభాకర్‌ మానసిక స్థితి ఏమిటి? పోలీసుల ప్రశ్నలు, వేధింపులు, యుఎపీఎ కేసులో మావోయిస్టు సంబంధాలు చూపినందుకు ఒత్తిడికి గురయ్యాడా?

మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా హింసించారా? తెలియదు. మరీ ముఖ్యంగా నాలుగు దశాబ్దాలు ముంబైలో బట్టల మిల్లు కార్మికుడిగా, ఉపాధ్యాయుడిగా, రచయితగా, సామాజిక కార్యకర్తగా వేలాది మందికి పరిచయమున్న ప్రభాకర్‌ మృతదేహాన్ని పోలీసుల ఒత్తిడితోనే తన స్వస్థలమైన పోత్గుల్‌ (సిరిసిల్ల)కు తీసుకువచ్చి అంత్యక్రియలు చేసారా- అని అనుమానాలు కూడా వస్తున్నాయి. మిగతా ఏడుగురిని పోలీసు కస్టడీకి తీసుకొని ప్రశ్నించినప్పుడు ఒక యువకునితో ఎటీఎస్‌ అధికారి ʹఇంకొక కార్మిక నాయకుడు కూడా ఉన్నాడురా, వాని భార్య చనిపోయి పది రోజులే అయింది కనుక వాణ్ని తీసుకరాలేదుʹ -అని అన్నాడట. ఈ కార్మికులకెవ్వరికీ అప్పుడది తామందరూ టీచర్‌గా భావించే అరవై ఐదేళ్ల మచ్చ ప్రభాకర్‌ సార్‌ అని తట్టలేదు. జనవరి 2న మచ్చ ప్రభాకర్‌ సహచరి అనారోగ్యంతో మరిణించింది. ఆ వియోగం, ఒంటరితనం ప్రభాకర్‌ను ఆత్మహత్యకు పురికొల్పి ఉంటాయని అందరూ భావించారు. భీమాకోరేగాఁవ్‌ సంఘటనల నేపథ్యంలో, ప్రదర్శనల్లో స్వయంగా పాల్గొనక పోయినా ప్రధాన నిందితుల్లో ఒకరిగా యాంటీ టెరరిస్టు స్క్వాడ్‌ ఆరోపించిన మచ్చ ప్రభాకర్‌ మరణాన్ని ఆయన సామాజిక, సాహిత్య, సాంస్కృతిక రాజకీయ చైతన్య నేపథ్యంలో కేవలం ఆత్మహత్యగానే భావించవచ్చా? భార్యా వియోగమన్న తక్షణ వ్యక్తిగత వేదనకు సమకాలీనంగానే భీమాకోరేగాఁవ్‌ ఘటనలు జరిగాయి. అందులో ఇద్దరు దళిత యువకులు అమరులయ్యారు.

సరిగ్గా ఇరవయ్యేళ్ల క్రితం రమాబాయ్‌నగర్‌లో అంబేద్కర్‌ విగ్రహానికి ఎవరో దుండగులు చెప్పుల దండ వేసినప్పుడు చెలరేగిన ఆగ్రహ ప్రదర్శనలపై సీఆర్‌పీఎఫ్‌ కాల్పులు జరిపితే పదకొండు మంది దళితులు మరణించారు. వారి శవాలను పశు కళేబరాల వలె మునిసిపల్‌ ట్రక్కులో వేసుకొని పోయిన దృశ్యాలను చూసి చలించిన విలాస్‌ గోఘ్రే ఉరి పెట్టుకొని చనిపోయాడు.

అవును, అప్పుడు విలాస్‌ గోఘ్రే ఉరిశిక్షకు కూడా ఒక తక్షణ వ్యక్తిగత సమస్య కారణమైంది. బొంబాయి ఘట్కోపర్‌ మురికివాడలో అరవై గజాల తమ ఇరుకు ఇంటికి చేతికెదిగిన కొడుకు నవ వధువును తోడ్కొని వస్తున్నాడు. ఆ యువ జంట ప్రైవసీకి తన ఇంట్లో తావు ఏది? లాల్‌ భీమ్‌లు ఏకం కావాలనే మరణ వాగ్మూలంతో ఆయన ఉరికంబమెక్కాడు. అది వ్యక్తిగతమా?

రోహిత్‌ వేముల ఆత్మహత్య స్మృతిబద్ధ హత్య. ఆయన నీలాకాశంపై అరుణకాంతిని కలగన్నాడు. అవాజ్‌ నాట్యమంచ్‌ కళాకారుడు విలాస్‌ గోఘ్రేది వ్యవస్థ, రాజ్య ప్రేరేపిత ఆత్మహత్య. ప్రభాకర్‌ మచ్చది టెరరిస్టు రాజ్య ప్రేరేపిత హత్య. వ్యక్తులుగా, వైయక్తిక కారణాలు కూడా తక్షణ ప్రేరణలుగా ఉరి కొయ్యలకు వేలాడిన వారుగానే వీరు కనిపించవచ్చు. కానీ ఆ ఉరి తీయబడిన శిరస్సు చెప్తున్న బహిరంగ రహస్యం ఏమిటి?

సిరిసిల్ల యువకుడు మచ్చ ప్రభాకర్‌ను, మహారాష్ట్ర కళాకారుడు విలాస్‌ గోఘ్రేను కలిపింది బొంబాయి బట్టల మిల్లు చరిత్రాత్మక సమ్మె (1981). అది ఒక సంవత్సరంపైగా నడి చింది. అప్పటికి ప్రభాకర్‌ 18 సంవత్సరాల యువకుడుగా సిరిసిల్ల నుంచి నిర్బంధాన్ని తట్టుకోలేక పొట్ట చేతబట్టుకొని బొంబాయి వెళ్లి బట్టల మిల్లులో కార్మికుడుగా చేరాడు. ఒక గుజరాతీ స్కూల్లో అటెండర్‌గా విలాస్‌ గోఘ్రే మిల్లు షిప్టు సమయాల్లో సమ్మె ప్రదర్శనలను ఉత్సాహపరచడానికి ʹనది పుట్టిన గొంతుకʹ అయ్యాడు. ఆ నది ఉరవడి తగ్గి మైదానంలో నిదాన ప్రవాహమైనట్లు టీచర్‌గా, రచయితగా, బుద్ధిజీవిగా పరిణతి చెందినవాడు ప్రభాకర్‌. కాని ఆయనలో ఆ సిరిసిల్ల చేనేత కార్మికుల జీవితమూ- పోరాటమూ కలనేత వలె కలిసి ఉన్నాయి. ఈ బట్టల మిల్లు కార్మికుల సమ్మెకు సంఘీభావం కోసం జగిత్యాల కొచ్చి తెలంగాణ కార్మికులకు కదిలించాలని ఆశించి ఎన్‌కౌంటర్‌లో అమరులైన అంకం నారాయణ, వాసం గజేందర్‌ ఆదర్శం ఉన్నది. ఆయన సిరిసిల్ల ఆంధ్ర మహాసభ మొదలు ముంబైలో ప్రత్యేక తెలంగాణ సంఘీభావ ఉద్యమం వరకు చరిత్రను ఒక గత వర్తమానాల సంభాషణగా చదువు కున్నవాడు, ఆచరించినవాడు. ఆయనకు బుద్ధుని కాలం (తెలంగాణ, ఆంధ్రల మీదుగా హ్యూన్‌త్సాంగ్‌ నూట ముప్పై దేశాలలో చేసిన సాహస యాత్ర గురించి ప్రభాకర్‌ రాసిన పుస్తకం, బహుశ ఆయన ఆఖరి రచన, ఇంకా వెలుగు చూడవలసే ఉన్నది) నుంచీ కరీంనగర్‌ తెలంగాణ చరిత్ర ఎంత తెలుసునో, పూలే అంబేడ్కర్‌ల కాలమే కాదు సంత్‌ల కాలం నుంచి శివాజీ కాలం నుంచి మహారాష్ట్ర చరిత్ర కూడ అంత తెలుసును.

బొంబాయి మహా నగర నిర్మాణానికి తెలుగు వాళ్లు చేసిన దోహదం, సేనల గురించి ఆయన ప్రామాణికమైన గ్రంథం రచించాడు. సిరిసిల్ల, జగిత్యాల పోరాట బాటలో బొంబాయి ప్రవాసానికి వెళ్లిన మచ్చ ప్రభాకర్‌ ఏకకాలంలో బొంబాయి మనిషిగాను, సిరిసిల్ల మనిషిగాను సజీవంగా జీవించాడు. కాని మరణాంతరం వచ్చి మాత్రం తన ఊరి మట్టిలో మమేకమయ్యాడు. ʹఈ ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా దొర ఏందిరా, దొర పెత్తనమేందిరాʹ అన్న దగ్గరే కాకుండా నయీ పేష్వాయీని, దానికి అండగా ఉన్న కార్పొరేట్‌ శక్తులను ప్రశ్నించే శక్తులకు ఈ వ్యవస్థ, ఈ రాజ్యం చూపుతున్న చోటు అది. బుద్ధిజీవులారా ఇది (ఇవి) ఆత్మహత్య(లే) అంటారా.
ఏది హత్య? ఏది ఆత్మహత్య? ఓ మహాత్మా! ఓ ప్రేతాత్మా!
-వరవరరావు

Keywords : telangana, rohit vemula, macha prabhakar, mumbai, police
(2018-02-23 09:33:22)No. of visitors : 283

Suggested Posts


మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం - విరసం

ʹరచయితలందరూ తమ తరానికి జవాబుదారులు; తమకు తాము జవాబు చెప్పుకోవాల్సిన వాళ్ళు... అంతస్సాక్షి ఉన్న రచయిత పీడిత ప్రజల పక్షాన దృఢంగా నిలవాలి. అలా కాకపోతే ఆ రచయితల్ని నిర్దోషులుగా నిర్ణయించే ప్రశ్నే లేదు.ʹ....

ʹఆయన జైల్లోనే చనిపోతారేమోʹ

90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. ఆయనేమైనా యుద్ద ఖైదీనా..? ప్రభుత్వ అనాలోచిత చర్యతో యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ...

చలసాని స్మృతిలో... - కే.కుమార్ వర్మ

బొడ్డపాడు నడిబొడ్డులో అమరవీరులను స్మరిస్తూ ఎర్ర జెండా చేతబట్టి తామాడ గణపతి ఇంటిముందునుండి దండుగా కదులుతున్నట్లుంది...

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ప్రజల కోసం సముద్రం వలె గర్జించిన తారకం - విరసం

తండ్రి దళిత ఉద్యమ వారసత్వాన్ని చిన్న వయసు నుండే స్వీకరించిన తారకం గారు సాంస్కృతిక కార్యకర్తగా, విద్యార్థి ఉద్యమకారుడిగా తన సొంతవూరిలో దళిత యువకుల్ని సంఘటితం చేశారు. వర్గపోరాట రాజకీయాలతో ప్రభావితమై విరసం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైనారు....

తెలంగాణలో దొరల పాలన నడుస్తోంది

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా దొరల పాలన నడుస్తోందని విరసం నేత వరవరరావు ధ్వజ మెత్తారు. నల్లగొండలో జరుగుతున్న డీటీఎఫ్‌ విద్యా వైజ్ఞానిక నాలుగో రాష్ట్ర సభలు సోమవారం ముగిశాయి. చివరిరోజు ముఖ్యఅతి«థిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్‌సహా ఆ నాలుగు కుటుంబాలు మాత్రమే ప్రయోజనం పొందాయన్నారు.....

Search Engine

జైలు కథలు...ఏక్ చాదర్ మైలీసీ -బి. అనూరాధ
Condemn arrest of Damodar Turi by Jharkhand Police - PPSC
RELEASE ANTI-DISPLACEMENT ACTIVIST DAMODAR TURI
మార్చ్8: దండకారణ్యం క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంగఠన్ పిలుపు !
ఆజాద్ ఎన్ కౌంటర్ కేసు తీర్పు – న్యాయ పర్యావసనాలు
In Himachal Pradesh School, Dalit Students Told To Sit Outside And Watch PM Modiʹs ʹPariksha Par Charchaʹ
demanding the immediate release of Damodar Turi
ఆజాద్, హేమచంద్రపాండేల ఎన్కౌంటర్లో పాల్గొన్న 29 మంది పోలీసుల లిస్ట్
Azad encounter: Adilabad Lower courtʹs order set aside
ఆజాద్ ఎన్కౌంటర్ లో పాల్గొన్న‌ 29 మంది పోలీసులపై కేసు నమోదు చేసి విచారించాలి - ఆదిలాబాద్ కోర్టు తీర్పు
20 ఏళ్ల వరంగ‌ల్ డిక్ల‌రేష‌న్ స‌భ‌పై పోలీసుల ద‌మ‌న‌కాండ - ప్రొ. ల‌క్ష్మ‌ణ్
నరహంతక పాలన.. మహిళా గెరిల్లాల మర్మాంగాల్లో కాల్చండని ఆర్మీకి ఆదేశం !
Honduras protests continue as U.S. puppet sworn in
Widespread violence after killing of Dalit student, bus torched; Opposition hits out at BJP govt
UP: Dalit Student beaten up with hockey sticks and bricks dies in Allahabad
ముస్లిం మహిళలపై ప్రభుత్వం కపట ప్రేమ‌ - డానీ
జైలు కథలు...ఏది జైలు? -బి. అనూరాధ
నయీంతో సంబంధాలున్న టీఆరెస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలి !
గూగీ వా థియాంగో...జి.ఎన్‌. సాయిబాబా...యుద్దకాలంలో స్వప్నాలు
తెలంగాణలో పౌర హక్కులు - బహిరంగ లేఖ‌
జైలు కథలు..వంటే నేరమైన చోట -బి.అనూరాధ
7 Policemen Given Life Sentence In Dehradun Fake Encounter Case
International Solidarity with the political prisoners in India - young revolutionaries, Brazil
జైలు కథలు...బలి -బి.అనూరాధ
ʹపరుష పదజాలంʹ జీవోపై వెనక్కి తగ్గిన కేసీఆర్ !
more..


రోహిత్‌