నయీంతో సంబంధాలున్న టీఆరెస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలి !


నయీంతో సంబంధాలున్న టీఆరెస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలి !

నయీంతో

గ్యాంగ్ స్టర్ నయీంతో సంబంధాలున్న టీఆరెస్, ఇతర‌ పార్టీల నాయకులందరినీ అరెస్టు చేయాలని నయీండైరీని బహిర్గతం చేయాలని నరహతక నయీం ముఠా బాధితుల పరిరక్షణ సమితి డిమా‍ండ్ చేసింది. నయీంబాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నరహతక నయీం ముఠా బాధితుల పరిరక్షణ సమితి అద్వర్యంలో హైదరాబాద్ లోని సోమాజీ గూడా ప్రెస్ క్లబ్ లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నరహంత నయీం బాధితులతోపాటు విప్లవ రచయిత వరవరరావు, సీపీఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి. సీపీఐ న్యూడెమాక్రసీ నేత గోవర్ధన్, సీపీఎం, ప్రజాఫ్రంట్, ప్రజా తెలంగాణ ఆరెస్పీ, ఫార్వర్డ్ బ్లాక్, ఎమ్సీపీఐ, న్యూడెమాక్రసీ పౌరహక్కుల సంఘం నాయకులు పాల్గొన్నారు.

ʹʹనయీ అనే నరహంతకుడ్ని తయారు చేసింది రాజ్యం. ప్రజా సంఘాల నేతలను, కార్యకర్తలను హత్యలు చేయడానికి పాలకులు నయీంను ఉపయోగించుకున్నారు. పోలీసుల కనుసన్నలో నయీం తన కార్యకలాపాలు సాగించాడు. నన్ను హత్యచేయదానికి కూడా నయీం అనేక సార్లు రెక్కీ చేశాడు.ఇప్పటి టీఆరెస్ ముఖ్య నేతలనేక మంది నయీంతో సంబంధాలు కొనసాగించారు. నరహంతక నయీంతో సంబంధాలున్న రాజకీయ నాయకులందరినీ అరెస్టు చేయాలి. నయీం డైరీని బహిర్గతం చేయాలి. నయీ ముఠా వల్ల నష్టపోయిన వారందరినీ ప్రభుత్వం ఆదుకోవాలిʹ
ʹ-వరవరరావు

ʹʹనయీo బాధితులకు న్యాయం చేయాలి.ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయింది. సిట్ వల్ల ఒక్క బాధితుడి కి కూడా న్యాయం జరగలేదు.చిన్న చేపలను పట్టుకుని పెద్ద వాళ్ళను విడిచి పెట్టారు. కొంత మంది రాజకీయ నాయకులు టీఆరెస్ లో జాయిన్ అయ్యారు.నేరేళ్ళ ఇసుక మాఫియాలో నష్ట పోయిన కుటుంబాలకు , నయీమ్ బాధిత కుటుంబాలకు కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేసింది
-చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

ʹʹనయీమ్ నుండి వచ్చిన రికవరీ మనీ ద్వారా మాకు నష్ట పరిహారం చెల్లించాలిʹʹ.
.-కళావతి, నయీ బాధితురాలు

.ʹʹనన్ను కూడా కిడ్నాప్ చేసాడు మా గోకుల్ కార్పొరేట్ అర్బన్ బ్యాంక్ లో వాళ్ళను ముగ్గురిని ని చంపాడు. మాయాంకు నుండి 3కోట్ల 50లక్షలు బలవంతంగా తీసుకపోయాడు. ఆ బ్యాంక్ 13,000 మందిది .. 3లక్షల 50 వేల మంది బాధితులు ఉన్నారు వాళ్ళందరికీ న్యాయం చేయాలిʹʹ
-జగదీష్..నయీం బాధితుడు.

ʹʹనయీమ్ సర్కారీ గుండా.నల్గొండ జిల్లా కమ్యూనిస్ట్ లకు పుట్టిన ఇల్లు ఇలాంటి ప్రదేశంలో సమoతర వ్యవస్థ ను ఏర్పాటు చేశారు.బెల్లి లలిత ను చంపాడు.వామపక్ష ఉద్యమాన్ని అణచివేతకు నయీమ్ ని తయారు చేశారు.నయీమ్ పోలీస్ లు,ప్రభుత్వం సహకారంతో ఇదంతా చేసాడు. నయీమ్ బ్రతికి ఉంటే అమిత్ షా లోపల ఉండేవాడు.
సోహ్రద్దున్ కేస్ లో ప్రదాన సూత్రధారి. కేంద్రం నుండి ఇన్ వాల్వ మెంట్ ఉంది. వ్యవస్థీకృత పాలన నుండి పుట్టున వాడే నయీమ్.ఉన్నత స్థాయి విచారణ చేయాలి. సిట్ అధికారులు కేసీఆర్ ఇంటి మనుషుల లాగా వ్యవహరిస్తున్నారు.
నయీమ్ కేస్ పై నేను వేసిన రిట్ పై ఇప్పటి వరకు దర్యాప్తు ఎందుకు చేయడం లేదు.నయీమ్ డైరీ ఏది. టీఆరెస్ వాళ్ళు కూడా ముద్దాయిలే
-నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి.

Keywords : nayeem, trs, telangana, kcr, ktr, varavararao, maoists
(2018-02-23 09:31:51)No. of visitors : 490

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.

మహాజనాద్భుత సాగరహారానికి నాలుగేళ్ళు

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపుత్రుల దేహాల సంరంభాన్ని అనుభవించవలసిన సందర్భం అది....

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

ʹనీ బాంచెన్ దొరా కాల్మొక్తʹ

జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ఖిల్లాలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పాదాభివందనం చేస్తున్నానంటూ ...

తెలంగాణ ఉద్యమకారుడి కిడ్నాప్ !

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా లోంచి ఎగిసిన విద్యార్థి నాయకుడు... తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడుగా ఉద్యమంలో అనేక సార్లు లాఠీ దెబ్బలు తిన్నవాడు. జైలుకు పోయినవాడు. సమైక్యాంధ్ర పోలీసులను ఎధిరించి, బరిగీసి నిలబడ్దవాడు....

Search Engine

జైలు కథలు...ఏక్ చాదర్ మైలీసీ -బి. అనూరాధ
Condemn arrest of Damodar Turi by Jharkhand Police - PPSC
RELEASE ANTI-DISPLACEMENT ACTIVIST DAMODAR TURI
మార్చ్8: దండకారణ్యం క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంగఠన్ పిలుపు !
ఆజాద్ ఎన్ కౌంటర్ కేసు తీర్పు – న్యాయ పర్యావసనాలు
In Himachal Pradesh School, Dalit Students Told To Sit Outside And Watch PM Modiʹs ʹPariksha Par Charchaʹ
demanding the immediate release of Damodar Turi
ఆజాద్, హేమచంద్రపాండేల ఎన్కౌంటర్లో పాల్గొన్న 29 మంది పోలీసుల లిస్ట్
Azad encounter: Adilabad Lower courtʹs order set aside
ఆజాద్ ఎన్కౌంటర్ లో పాల్గొన్న‌ 29 మంది పోలీసులపై కేసు నమోదు చేసి విచారించాలి - ఆదిలాబాద్ కోర్టు తీర్పు
20 ఏళ్ల వరంగ‌ల్ డిక్ల‌రేష‌న్ స‌భ‌పై పోలీసుల ద‌మ‌న‌కాండ - ప్రొ. ల‌క్ష్మ‌ణ్
నరహంతక పాలన.. మహిళా గెరిల్లాల మర్మాంగాల్లో కాల్చండని ఆర్మీకి ఆదేశం !
Honduras protests continue as U.S. puppet sworn in
Widespread violence after killing of Dalit student, bus torched; Opposition hits out at BJP govt
UP: Dalit Student beaten up with hockey sticks and bricks dies in Allahabad
ముస్లిం మహిళలపై ప్రభుత్వం కపట ప్రేమ‌ - డానీ
జైలు కథలు...ఏది జైలు? -బి. అనూరాధ
గూగీ వా థియాంగో...జి.ఎన్‌. సాయిబాబా...యుద్దకాలంలో స్వప్నాలు
రోహిత్‌ వేముల.. విలాస్‌ గోఘ్రే..ప్రభాకర్‌ మచ్చ...పాలకుల హత్యలు -వరవరరావు
తెలంగాణలో పౌర హక్కులు - బహిరంగ లేఖ‌
జైలు కథలు..వంటే నేరమైన చోట -బి.అనూరాధ
7 Policemen Given Life Sentence In Dehradun Fake Encounter Case
International Solidarity with the political prisoners in India - young revolutionaries, Brazil
జైలు కథలు...బలి -బి.అనూరాధ
ʹపరుష పదజాలంʹ జీవోపై వెనక్కి తగ్గిన కేసీఆర్ !
more..


నయీంతో