ఒక చేత్తో కన్నీరు తుడుచుకొని.. వేరొక‌ చేత్తో ఎర్రజెండా ఎత్తుకొని...


ఒక చేత్తో కన్నీరు తుడుచుకొని.. వేరొక‌ చేత్తో ఎర్రజెండా ఎత్తుకొని...

ఒక

ఎన్కౌంటర్లన్నీ పాలకుల హత్యలే.... అమరుల ఆశయాలను కొనసాగిస్తాం....ఒక వీరుడు మరణిస్తే ఉదయింతురు వేలకొలది... కామ్రేడ్ స్వామి అమర రహే.... పూజారి కాంకేర్ అమరులకు జోహార్లు.... నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలి... అనే నినాదాలతో రాంపేట గ్రామ‍ం మారు మోగింది. అమరుడైన‌ తమ ఆప్తుడు... తమ నాయకుడు.. తమ అన్న కోసం ఆగ్రామం కన్నీటి వరదలైంది... స్వామిని చంపిన ఈ పాలకులను కూల్చి ఆ కామ్రేడ్ కలలుగన్న సమసమాజం స్థాపించి తీరుతామని ఆ ఊరు ప్రతినబూనింది.... ఒక చేత్తో కన్నీరు తుడుచుకొని మరో చేత్తో ఎర్రజెండా ఎత్తుకొని ఊరు ఊరంతా రగల్ జెండా అయ్యింది.

పూజారి కాంకేర్ వద్ద బూటకపు ఎన్కౌంటర్ లో అమరుడైన సీపీఐ మావోయిస్టు పార్టీ నాయకుడు దాడబోయిన స్వామి అలియాస్‌ ప్రభాకర్ అంత్య క్రియలు స్వామి స్వగ్రామం వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేట మండలం రాంపేటలో జరిగాయి. శనివారం రాత్రి నుండే వేలాదిగా విప్లవాభిమానులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి కామ్రేడ్ స్వామికి నివాళులు అర్పించారు. ఆదివారంనాడు జరిగిన కామ్రేడ్ స్వామి అంత్య క్రియల్లో భార్య రేణుక, సోదరుడు సమ్మయ్య బంధువులు, గ్రామస్థులతోపాటు పౌరహక్కుల సంఘం నాయకులు లక్ష్మణ్, నారాయణ రావు, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక నాయకులు చిక్కుడు ప్రభాకర్, దుర్గాప్రసాద్, తెలంగాణ‌ ప్రజాఫ్రంట్ నాయకులు నలమాస కృష్ణ, మెంచు రమేశ్, అమరుల బందు మితృల కమిటీ నేతలు పద్మ కుమారి, అంజమ్మ, పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి రమేశ్‌చందర్‌, టీవీఎస్‌ అధ్యక్షుడు కోట శ్రీనివాస్‌, మాకుల మహేశ్‌, సోమయ్య, బంధుమిత్రుల రాష్ట్ర అధ్యక్షురాలు అంజమ్మ, ఉపాధ్యక్షురాలు కొత్తకొండ శాంత, భారతక్క తదితరులు పాల్గొన్నారు. అమరులపై విప్లవ కళాకారుడు డప్పు రమేశ్ పాడిన పాటలకు వేలాదిమంది కోరస్ పాడారు. ప్రజాకళామండలి కళాకారుల విప్లవ గీతాలతో రాంపేట మారు మోగింది.

ఈ సందర్భంగా అమరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర కార్యదర్శి పద్మకుమారి మాట్లాడుతూ.. ఇదే మార్చిలో గతంలో సృజన, సారక్క, శ్రుతి, సాగర్‌లను బూటకపు ఎన్‌కౌంటర్‌లో ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని అన్నారు. పీడిత ప్రజల పక్షాన భార్యను, తల్లిదండ్రులను వదిలేసి పోరాడిన స్వామిని నేడు కేసీఆర్‌ ప్రభుత్వం హత్య చేసిందన్నారు.
ʹఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌, ఆపరేషన్‌ సమాధాన్‌ʹ పేరిట తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టులను హతమారుస్తుందని ప్రజాస్వామ్య వేదిక నాయకుడు చిక్కుడు ప్రభాకర్‌ అన్నారు. వైద్యం కోసం సేద తీరుతున్న సమయంలో ద్రోహి ఇచ్చిన సమాచారంతో మావోయిస్టులను పట్టుకుని చిత్రహింసలకు గురిచేసి కాల్చి చంపారని ప్రభాకర్‌ ఆరోపించారు.
లక్షలాది మంది పోరాడి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ శ్మశానంగా మారుస్తున్నాడని ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు నలమాస కృష్ణ మండి పడ్డారు. బంగారు తెలంగాణ అంటే మావోయిస్టులను హతమార్చడమా? అని ఆయన ప్రశ్నించారు.
ఆకలి ఉన్నంత కాలం విప్లవోద్యమం కొనసాగుతుందని విప్లవ రచయితల రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాసిత్‌ అన్నారు. ఎదురు కాల్పులంటూ కట్టు కథలు అల్లుతున్న పోలీసులపై హత్య‌ కేసులు నమోదు చేయాలని, సుప్రీంకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తితో ఎన్‌కౌంటర్‌పై విచారణ చేయించాలని పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ డిమాండ్ చేశారు.

విప్లవ కళాకారుల గేయాలతో, ఎర్రజెండాల రెపరెపలతో అంతిమయాత్ర కామ్రేడ్ స్వామి అలియాస్‌ ప్రభాకర్‌ ఇంటి నుంచి రాంపేట ప్రధాన రహదారికి, అక్కడి నుంచి శ్మశానవాటిక వరకు దాదాపు నాలుగు గంట్ల పాటు సాగింది.

Keywords : maoists, fake encounter, warangal, svami
(2018-12-08 20:13:34)No. of visitors : 1479

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.

మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

ఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్‌ ముట్టడి, పెరేడ్‌ గ్రౌండ్స్‌లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్‌ ఉద్యమాలు నిర్వహించారు.

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

ʹనీ బాంచెన్ దొరా కాల్మొక్తʹ

జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ఖిల్లాలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పాదాభివందనం చేస్తున్నానంటూ ...

మహాజనాద్భుత సాగరహారానికి నాలుగేళ్ళు

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపుత్రుల దేహాల సంరంభాన్ని అనుభవించవలసిన సందర్భం అది....

Search Engine

కాశ్మీర్ ఉజ్వలమైన చరిత్ర, పోరాట గాథ...మాజీ కేంద్ర మంత్రి సఫుద్దీన్ సోజ్ కాశ్మీర్ పై రాసిన పుస్తకం గురించి..
మత రాజకీయాల్లో యూపీ సీఎం యోగీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ..
సర్జికల్ స్ట్రైక్స్ రాజకీయం... ప్రమాదకరమన్న ఆర్మీ అధికారి
ఏవోబీలో పీఎల్జీఏ వారోత్సవాలు..ఆడియో రిలీజ్ చేసిన మావోయిస్టులు
బీజేపీకి రాజీనామా చేసిన దళిత మహిళా ఎంపీ - సమాజంలో బీజేపీ విభజనలు సృష్టిస్తోందని ఆరోపణ‌
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 3
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 2
ఎన్నికలపై మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్-1
దళితులపై తప్పుడు కేసులు బనాయించి చితకబాదుతుంటే నాకు గర్వంగా ఉంటుంది.. ఒక ఐపీఎస్ వ్యాఖ్యలు
ʹఅఖ్లక్ హత్యపై దర్యాప్తు చేశాడనే ఇన్‌స్పెక్టర్ సుబోధ్‌ను హిందుత్వవాదులు అంతం చేశారుʹ
Isolate the fish from the water: a genocidal practice in India - Adolfo Naya
18 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
కేసీఆర్ ఓ నియంత : మావోయిస్టు జ‌గ‌న్‌
భీమాకోరేగావ్ విప్ల‌వ, ద‌ళిత శ‌క్తుల ఐక్య‌త‌కు ప్ర‌తీక : పాణి
CPI (Maoist) appoints military strategist Basavraju as its next general secretary
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బసవరాజు...అనారోగ్య కారణాలతో స్వచ్చందంగా విరమించుకున్న‌ గణపతి
పుణెలో రెండు రోజులు
కిషన్ జీ... పీడితుల యుద్ద గీతి !
చీకటి గదిలో ఒంటరిగా.. ఊపిరి పీల్చుకోలేని స్థితిలో వరవరరావు
గృహ నిర్బంధం అంటే ? - వరవరరావు
పోరాడి తమ హక్కులు సాధించుకున్న గిరిజన రైతులు.. ముంబైలో మహాపాదయాత్ర
ప్రజా గొంతుకల అక్రమ అరెస్టులపై పోరాడుదాం
నేల చెర విడిపించే అక్షరాలు - అశోక్ కుంబము
రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే
నా ప్రమాదకర వ్యక్తిత్వం ప్రభావమంతా కవిత్వ రహస్యమే
more..


ఒక