ముస్లిం మహిళ వేళ్ళు నరికేసి ఆమె కొడుకు చేతులు విరగ్గొట్టిన భజరంగ్ దళ్ మూకలు !


ముస్లిం మహిళ వేళ్ళు నరికేసి ఆమె కొడుకు చేతులు విరగ్గొట్టిన భజరంగ్ దళ్ మూకలు !

ముస్లిం

గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌లో ఓ వృద్ధ ముస్లిం మహిళ, ఆమె కొడుకుపై భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు దుర్మార్గంగా దాడి చేశారు. మహిళ చేతి వేళ్ళను నరికేసిన భజరంగ్ దళ్ ముష్కరులు ఆమె కొడుకు చేతులను విరగొట్టారు.

గుజరాత్ లోని గాంధీనగర్ జిల్లా ఛత్రాల్‌ గ్రామంలో కొన్ని రోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గతేడాది డిశంబర్ 6 వతేదీన బాబ్రీ మసీదు విధ్వంసం విజయోత్సవ ర్యాలీని ఆ గ్రామంలో హిందుత్వ మూకలు నిర్వహించాయి. ముఖ్యంగా ముస్లింలు నివసించే ఏరియాల్లో రెచ్చగొట్టే నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఆ రోజు నుండి ఆ గ్రామంలో ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి.

వారం రోజులుగా ముస్లింలెవరూ ఇండ్లనుండి బైటికి రావద్దని భజరంగ్ దళ్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారంనాడు రోషన్ బీవీ అనే మహిళ మేకలు కాసుకోవడానికి బైటికి రావడంతో భజరంగ్ దళ్ మూకలకు కోపమొచ్చింది. ఆ మహిళను అడ్డగించి. కత్తులతో ఆమె చేతి వేళ్ళను నరికేశారు. ఆమెను రక్షించడానికి పరిగెట్టిన ఆమె కొడుకు ఫర్జాన్‌ సయ్యద్ పై ఆ మూకలు దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. ఆ దాడిలో ఫర్జాన్ రెండు చేతులూ విరిగిపోయాయి. తలకు తీవ్ర గాయాలయ్యాయి.
అటుగా వెళ్తున్న గిరిజన తెగకు చెందిన కొందరు వ్యక్తులు భజరంగ్ మూకల దాడిని అడ్డుకొని రోషన్ బీవీని, ఫర్జాన్‌ సయ్యద్ ను రక్షించి ఆస్పత్రికి తరలించారు.

Keywords : gujarat, Bajrang Dal, men chop, womanʹs fingers, break sonʹs hands, hindutva
(2018-06-18 23:47:34)No. of visitors : 606

Suggested Posts


After JNU,HCU & DU, ABVP Loses Gujarat Central University Polls

Akhil Bharatiya Vidhyarthi Parishad (ABVP) has lost the student body election held in Gujarat Central University by a big margin, reports National Herald. This loss comes ahead of a hotly-contested Assembly elections in Gujarat....

ʹNot Joining Congress, But Aim To Bring BJP Down,ʹ Says Gujarat Dalit Leader Jignesh Mevani

The 36-year-old lawyer and activist, who has led protests in Gujarat against attacks on Dalits after four men were stripped and brutally thrashed with iron rods by cow vigilantes in the stateʹs Una last year, declined an invitation to meet Congress president Rahul Gandhi in Ahmedabad today....

ఓ ఆదివాసీని కొట్టి చంపారు..ప్రశ్నించిన వారిపై కాల్పులు జరిపి మరొకరిని చంపేశారు

గుజరాత్‌లోని దాహోద్‌ జిల్లా జేసావాడా పట్టణ పోలీసు స్టేషన్ లో కమేశ్ గమారా అనే ఆదివాసీని పోలీసులు కొట్టి చంపారు. దీనిని ప్రశ్నించడానికి వచ్చిన 500 మంది ఆదివాసులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రామాసు మొహానియా అనే అదివాసీ ప్రాణాలు కోల్పోయాడు.

Search Engine

ముస్లిం ఇంజనీర్ మాట్లాడాడని.. మతోన్మాదంతో రెచ్చిపోయిన మహిళ
బంధాలను నాశనం చేసిన నేటి వ్యవస్థ.. ఆర్థిక బంధాలకే ప్రాధాన్యం..!
Long live the national truck driversʹ strike!
గుర్రంపై ఊరేగుతున్న దళిత పెండ్లి కొడుకుపై అగ్రకులస్థుల దాడి
చెడ్డీ గ్యాంగ్ బరి తెగింపు.. లౌకికవాదులపై అనుచిత వ్యాఖ్యలు
సినిమాల్లో ʹస్త్రీʹ పాత్ర మారుతోంది..!
రాజ్యమే కుట్ర చేస్తే...
ఉద్యమ స్పూర్తి రగిలించిన ʹచేʹ
ఇదో దుర్మార్గం.. మతోన్మాదం ఒక ఆడపిల్లని పిచ్చిదానిలా చిత్రించింది..!
ఈ హత్యలకు అంతే లేదా..?
Bengaluru techie arrested for Maoist links
ఇక్కడ కవిత్వం కూడా తీవ్రవాదమేనా..?
Leftist Publisher Shot Dead as Blogger Deaths Return to Haunt Bangladesh
ʹదుర్గాప్రసాద్‌ను మధ్యాహ్నంలోగా కోర్టులో హాజరుపరచాలిʹ
ప్రధాని మోడీపై హత్యకు కుట్ర నిజంగానే జరిగిందా..?
పేదవాడి నిజమైన సమస్యను చర్చించిన ʹకాలాʹ..!
వరవరరావుపై ప్రభుత్వం కుట్ర.. ప్రజా, హక్కుల సంఘాల అణచివేతలో భాగమే - విరసం
ʹమోడీ హత్యకు కుట్రʹ అనేది ఓ బూటకం.... ప్రజా ఉద్యమాలను అణచడానికి పాలకులాడే నాటకం
రాజకీయ నాయకులా..? వీధి రౌడీలా..?
హక్కుల కార్యకర్తల అక్రమ అరెస్టులపై దేశవ్యాప్త నిరసనలు
పౌర హక్కుల నాయకుల అక్రమ అరెస్టుపై వెల్లువెత్తుతున్న నిరసన
భీమా కోరేగావ్ లో దళితులకు మద్దతుగా నిలబడ్డందుకు ప్రజా సంఘాల నాయకుల‌ అక్రమ అరెస్టు
Maharashtra Governmentʹs terror trail to protect HINDUDTVA TERRORISTS
నేటి భారతదేశం : ఆడపిల్లలకే కాదు.. ఆడపిల్ల తండ్రికి కూడా రక్షణ లేదు..!
తిరుమలలో పోగుబ‌డ్డ ఆస్తులెవరివి ?
more..


ముస్లిం