గృహదహనాలు, హత్యలు, విగ్రహ విధ్వంసాలు.. త్రిపురలో చెడ్డీ గ్యాంగ్ అరచకాలు


గృహదహనాలు, హత్యలు, విగ్రహ విధ్వంసాలు.. త్రిపురలో చెడ్డీ గ్యాంగ్ అరచకాలు

అక్కడ హింస రాజయమేలుతున్నది... వందలమంది కత్తులు, రాడ్లు పట్టుకొని మతోన్మాద నినాదాలతో గ్రామాల మీద దాడులు చేస్తున్నారు.... ఇండ్లు తగలబెటుతున్నారు. హత్యలు చేస్తున్నారు... విగ్రహాలను విధ్వంసం చేస్తున్నారు.
ఇది నాలుగు రోజులుగా త్రిపురలో చెడ్డీ గ్యాంగ్ పాల్పడుతున్న అరాచక హింసోన్మాదం.

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన నాటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ, ఐపీఎఫ్‌టీ కార్యకర్తల విధ్వంసకాండతో అట్టుడుకుతున్నది. లెఫ్ట్‌ కార్యకర్తలు, ప్రత్యేకంగా సీపీఐ(ఎం) కార్యాలయాలను లక్ష్యంగా చేసుకొని హిందూత్వవాదులు, వేర్పాటువాదులు మూకుమ్మడిగా రెచ్చిపోతున్నారు. ధలై జిల్లాలోని కమల్పూర్‌లో 19 మంది సీపీఐ(ఎం) కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. అక్కడ సీపీఐ(ఎం) కార్యదర్శి నివాసంతో సహా అనేక‌ ఇండ్లను తగులబెట్టారు. ఫలితాలు వెలువడిన ఒక్క శనివారం రోజునే తమ కార్యకర్తలతోపాటు, పార్టీ కార్యాలయాలపై విధ్వంసానికి సంబంధించిన 200లకు పైగా కేసులు నమోదైనట్టు సీపీఐ(ఎం) తెలిపింది. సోమవారం నాటికి 415 మంది సీపీఐ(ఎం) కార్యకర్తలు, మద్దతుదారులపై ʹభౌతిక దాడులుʹ జరిగాయని, 1.539 మంది కార్యకర్తలు, మద్దతుదారుల ఇండ్లను ధ్వంసం చేశారనీ, 196 ఇండ్లకు నిప్పుపెట్టారనీ, 134 పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారనీ, 64 కార్యాలయాలు తగులబెట్టారని, బీజేపీ, దాని భాగస్వామ్య పక్షం ఐపీఎఫ్‌టీ మద్దతుదారులు కలసి 208 కార్యాలయాలను ʹబలవంతంగా ఆక్రమించుకున్నారనిʹ సీపీఐ(ఎం) త్రిపుర రాష్ట్ర కార్యదర్శి బిజన్‌ ధర్‌ చెప్పారు.

బెలోనియా పట్టణంలో భారత్‌ మాతాకీ జై నినాదాలు చేస్తూ... హిందూత్వవాదులు లెనిన్‌ విగ్రహాన్ని జేసీబీని ఉపయోగించి మరీ కూల్చివేసిన ఘటన వారి విధ్వంసకాండకు పరాకాష్టగా మారింది. అక్కడితో ఆగని వారి విధ్వంస కాండ మంగళవారం దక్షిణ త్రిపురలోని సబ్‌రూమ్‌ పట్టణంలో మరో లెనిన్ విగ్రహాన్ని ధ్వంస చేశారు. అనేక ప్రాంతాల్లో జరుగుతున్న దాడులు ఇంకా బయటకురావడంలేదు. త్రిపురలో ఒక చిన్న పట్టణమైన జిరానియాలో ఇద్దరు లెఫ్ట్ కార్యకర్తలను హత్య చేశారు. బాంబుపేలుడు ఘటనలో ఒక మహిళ మృతిచెందగా, మరో కార్యకర్తను అతి కిరాతకంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. ధలై జిల్లాలోని కమల్పూర్‌లో 19 మంది సీపీఐ(ఎం) కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. అక్కడ సీపీఐ(ఎం) కార్యదర్శి నివాసం సహా నాలుగు ఇండ్లను తగులబెట్టారు. బీజేపీ-ఐపీఫ్‌టీ బెదిరింపులతో సీపీఐ(ఎం) కార్యకర్తలు ఇండ్లకు కూడా వెళ్ళలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నదని సీపిఐ(ఎం ) నేత బిజన్‌ ధర్ ఆందోళన వ్యక్తం చేశారు.


Keywords : tripura, rss, bjp, cpim, lenin, attacks
(2019-03-23 12:35:52)No. of visitors : 658

Suggested Posts


హంతకుల‌ రాజ్యం...మరో జర్నలిస్టు హత్య...ఇదీ బీజేపీ ప్రాయోజితమేనన్న‌ సీపీఎం

స్థానిక జర్నలిస్టుల కథనం ప్రకారం మొదట దుండగులు కర్రలతో భౌమిక్ కాళ్ళపై కొట్టారు. అతను కిందపడిపోగానే తలపై కొట్టారు. ఆ తర్వాత అతన్ని దగ్గరలోని స్టేడియంలోకి..

Search Engine

The worse health deterioration of Prof G.N. Saibaba
ముస్లిం కుటుంబంపై మూక దాడి.... పాకిస్తాన్ వెళ్ళిపోండి అని బెదిరింపు
అన్నీ దోపిడీ దొంగ పార్టీలే - బూటకపు ఎన్నికలను బహిష్కరించండి : మావోయిస్టు పార్టీ
ఒక సంఘీభావ ప్రదర్శన – ఒక విచారం – ఒక ఉత్తేజం
జమ్మూ కాశ్మీర్ - ʹపండితులుʹ
పుణె తాజా నివేదిక – ఆశాభంగాలూ విద్యుల్లతలూ..!
ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...
యూపీలో కాశ్మీరీలపై దాడులకు తెగబడ్డ కాషాయ మూక‌
నిరుద్యోగం గురించి మాట్లాడినందుకు విద్యార్థిని చితకబాదిన ʹదేశభక్తʹ మూక‌ !
Why is the operation ʹgreen huntʹ a genocidal operation?
ఉన్మాదుల దృష్టిలో గంగూలీ కూడా దేశ ద్రోహేనా..?
లైన్ ఆఫ్ నో కంట్రోల్ - భారత మీడియా
వెనుజులా సంక్షోభానికి అమెరికా ఆజ్యం - ఎ.నర్సింహ్మారెడ్డి
భగ్న సభోత్తేజం ‍- పాణి
చత్తిస్ గడ్ ఎన్కౌంటర్ లో చనిపోయింది మావోయిస్టులు కాదు గ్రామస్తులే
మోడీ కాళ్ళు కడుగుతాడు..యోగీ దేశద్రోహం కేసు పెడతానని బెదిరిస్తాడు
కనకాభిషిక్తులు ఇనాక్‌గారు | పాణి |
సామూహిక గాయానికి 29 ఏండ్లు...
సంఘ్ పరివార్ ఆగడాలను ఖండించినందుకు విద్యార్థులపై దేశద్రోహం కేసు పెట్టిన సీపీఎం ప్రభుత్వం
బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
more..


గృహదహనాలు,