include 'men';
?>
మిలియన్ మార్చ్ స్పెషల్ -బమ్మిడి జగదీశ్వరరావు
బుల్పికలు
మిలియన్ మార్చ్ సక్సెస్!
ʹమొత్తానికి మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభ పది లక్షల మందితో విజయవంతమయ్యింది!ʹ
ʹప్రభుత్వం అనుమతి నిరాకరించింది కదా?ʹ
ʹపది లక్షల మంది ట్యాంకుబండ్ మీదికి చేరుకున్నారు..ʹ
ʹట్యాంకుబండ్ మీదికి రాకపోకలు నిషేధించారు కదా?ʹ
ʹపది లక్షల మంది పోలీసులు చేరుకోవడంతో అలనాటి మిలియన్ మార్చ్ నిఘనంగా గుర్తుకు తెచ్చారు..ʹ
* * *
వారసుడొచ్చాడు!
ʹఆంధ్రా పాలకుల కన్నా మన కేసీఆరే బెస్టుగున్నాడు!ʹ
ʹఏ విష్యముల?ʹ
ʹమిలియన్ మార్చ్ జరపకుంట యెక్కడి వాళ్ళని అక్కడ ముందస్తు అరెస్టులు జేసిన్రా? విలేజిల నుండి రాకుంట అడ్డుకున్నరా? ట్యాంకుబండు యెక్కకుంట ఆంక్షలు వెట్టిన్రా? దొరికినోల్లని దొరికినట్టు అదుపులోకి తీసుకున్నరా? హౌస్ అరెస్టులు జేసిన్రా? ఉస్మానియాని ముళ్ళకంచెల సుట్టిన్రా? తుపాకులూ లాఠీలూ పట్టుకు పోలీసులు దిగిన్రా? బార్బడు వైరు వుండలు సుట్టి సుట్టుపక్కల పరిసిన్రా?ʹ
ʹతెలంగాణ రాక ముందటికీ యిప్పటికీ యేమీ తేడా తెలుస్త లేదు..!ʹ
ʹమరేమనుకున్నవ్.. మన కేసీఆరు సారు ఆంద్రోల్ల నాయకులకు యేమాత్రం తీసిపోకుంట వున్నడు మల్ల!ʹ
* * *
అదే దారి!
ʹమిలియన్ మార్చ్ స్పూర్తి సభకి అనుమతి లేదని వద్దంటే యెట్లనే?ʹ
ʹశాంతిభద్రతల సమస్య అస్తదని అంటున్నడు..ʹ
ʹతెలంగాణని యేకం చేసిందిగదనేమిలీనియం మార్చ్?ʹ
ʹప్రజలందరు వొక చోట చేరితే యేలేటోళ్ళకి తమ పీఠాలు కదులుతాయని భయం!ʹ
ʹవారి.. రేపు అమరవీరుల స్థూపాల దగ్గర నివాళి అయినా జెయ్యనిస్తరో లేదో..?ʹ
ʹకతంతా యిని రామునికి సీతేటవుతాదని అడిగితే యేo జెప్పాల?ʹ
ʹగిట్ల వొక్కొక్కటి బేన్ జేస్తరు గావల్ల.. ప్రతొక్కటి అడ్డుకుంటరు గావల్ల.. ఆంద్ర పాలకుల లెక్కʹ
ʹగప్పుడు సక్కగఆంద్ర పాలకుల్ని సాగనంపినట్టే జనం సాగనంపుతరు..ʹ
* * *
కొత్త ముచ్చట!
ʹమిలియన్ మార్చ్..ʹ
ʹఅది ముగిసిన ముచ్చట..ʹ
ʹమరేం ముచ్చట మాట్లడల్నే?ʹ
ʹథర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడు.. కేసీఆరు దేశానికి దారి చూపిస్తుండు!ʹ
ʹముందుగాల తెలంగాణ ప్రజలకి దారి సూపించమను, ఆ యెనక..ʹ
* * *
భవిష్యత్ దర్శనం!
ʹకేసీఆరు థర్డ్ ఫ్రంట్ పెట్టి దేశానికి ప్రధానమంత్రి అయితడు!ʹ
ʹమరి తెలంగాణల?ʹ
ʹకేటీఆరు ముఖ్యమంత్రి అయితడు!ʹ
ʹమరి కవితక్క?ʹ
ʹఅటు దేశంల యిటు రాష్ట్రంల యెక్కడ గావాల్నంటే అక్కడ బతుకమ్మలు ఆడుతది!ʹ
ʹమరి జనం యేమి చేస్తరు?ʹ
ʹమిలియన్ మార్చ్ లో పాల్గొనడానికి సిద్ధమయితరు!ʹ
* * *
నయా చరిత్ర!
ʹకేసీఆరు ఉద్యమ నాయకుడు గదనె?ʹ
ʹమల్లʹ
ʹటీఆరెస్ ఉద్యమ పార్టీ గదనె?ʹ
ʹమల్లʹ
ʹఉద్యమాలతోనే ప్రత్యేక తెలంగాణ అచ్చింది గదనె?ʹ
ʹమల్లʹ
ʹమరి ప్రభుత్వమే మిలియన్ మార్చి స్ఫూర్తి సభను యెందుకు జరిపిస్త లేదు?ʹ
ʹప్రజలు మిలియన్ మార్చ్ జరపడానికి ముందుకు అచ్చిన్రు గద?ʹ
ʹమల్లʹ
ʹప్రజల ప్రోగ్రామ్ వేరు.. ప్రభుత్వం ప్రోగ్రామ్ వేరు..ʹ
ʹఅంటే ప్రజల చరిత్ర వేరు.. పాలకుల చరిత్ర వేరు.. అన్నట్టేగదʹ
ʹమల్ల.. చరిత్రని మల్ల రాయిస్తమని.. తిరగ రాయిస్తమని నిజాము సాక్షిగ ముందే చెప్పిండు.. గిదన్నమాట!ʹ
* * *
రాజ్యం ముడ్డి కింద పీట!
ప్రభుత్వం హోం శాఖని అభినందించింది. హోం శాఖని మల్లొకపాలి పోలీసుల్ని అభినందించింది!
అలనాడు మిలియన్ మార్చ్ జరిగిందంటే పోలీసుల వైఫల్యమే కారణం. ఈనాడు మిలియన్ మార్చ్ జరగలేదంటే పోలీసుల వ్యూహమే కారణం- అని హోం మంత్రి మెచ్చుకున్నాడు.
ʹలేద్సార్.. అప్పటి ప్రభుత్వాలు మాకు సపోర్ట్ యివ్వడంలో వీకు. ఇప్పటి ప్రభుత్వం సపోర్ట్ యివ్వడంలో చాకుʹ బాకు దిగినట్టు చెప్పాడు డిజిపి.
ʹగత ముఖ్యమంత్రి కన్నా మన ముఖ్యమంత్రి గ్రేటుʹ అని అందరూ కలిసి అభినందనలు పంపాల్సిన వాళ్ళకే పంపారు.
* * *
Keywords : kcr, telangana, million march, kodandaram
(2024-03-19 23:30:24)
No. of visitors : 2011
Suggested Posts
| జైలు కథలు...ఏది జైలు? -బి. అనూరాధ సునిత బీహార్ కి చెందిన సంపన్న రాజపుత్రుల ఉమ్మడి కుటుంబంలో పెద్ద కోడలు. అత్తగారు లేదు. ఆమె ʹదేవరానిʹ (తోటికోడలు) ఉరేసుకొని చనిపోయింది. చనిపోయినామె పుట్టింటివాళ్ళు సునీతమీదా, ఆమె భర్త మీద, మామగారిమీద, కొడుకుమీద కేసుపెట్టారు. |
| జైలు కథలు...ఏక్ చాదర్ మైలీసీ -బి. అనూరాధసాయంత్రం పూట సాధారణంగా ఎవ్వరూ వార్డుల్లో వుండరు. ఖాళీగా వుంటాయవి. నేను వాకింగ్ చేస్తుండగా ఎవరో చాలా కడుపునొప్పిగా ఉందని, ఒక టేబ్లెట్ కావాలని అంటే మందుల డబ్బా కోసం వార్డులోకి వచ్చాను. |
| జైలు కథలు...బేబీస్ డే అవుట్ - బి. అనూరాధ చాచా నెహ్రూ అంటే ఎవరు?ʹ ʹసోనియా గాంధీ కా బాప్ʹ (సోనియా గాంధీ వాళ్ళ అయ్య) అంది జూలీ! మొట్టికాయ వేసింది నిర్మల. పిల్లలందరూ నవ్వారు. |
| జైలు కథలు...మున్నీ బద్ నామ్ హుయీ - బి. అనూరాధ ఆమె పేరు మున్నీ కాదు. కానీ అందరూ ఆమెని మున్నీ అనే అంటారు. మహిళావార్డులో గానీ పురుషుల వార్డులో గానీ ఆమెని తెలియనివారు లేరు. తెలియడం అంటే ఆమె అందరికీ పరిచయస్తురాలని కాదు. ఆమెని గమనించనివాళ్ళు లేరు అని. |
| చందమామని చూడని వెన్నెల -బి.అనూరాధ ʹనా పుట్టిన రోజు గురించి నాకో కొత్త విషయం తెలిసింది. తిథిల ప్రకారం అయితే నేను బుద్ధ పూర్ణిమ రోజు పుట్టానట. తెలుసుగా అది చలం పుట్టిన రోజు కూడా. నువ్వు ఇన్నేళ్ళ తరవాత వచ్చావు కనక ఆరోజు ఒక చిన్న గెట్ టు గెదర్ ఏర్పాటు చేస్తున్నా. |
| జైలు కథలు...బలి -బి.అనూరాధ
పల్సగూడా నియోజకవర్గం మొత్తం పోస్టర్లు పడ్డాయి.
ʹఈసారి కాషాయజెండా ఎగరడానికి ఈ చిన్న ఆటంకాన్ని తొలగిస్తే అంతా సజావుగా సాగిపోతుందనుకొన్నాను. ఇప్పుడదే మన మెడకు చుట్టుకునేటట్టుందే!ʹ అతను సాలోచనగా దూరంగా చూస్తూ అన్నాడు.... |
| జైలు కథలు... నేరమూ – శిక్ష -బి.అనూరాధచిన్న పిల్లల్లో వుండే ఉత్సాహంకాని, కళ్ళల్లో వెలుగు కానీ ఆమెలో ఎక్కడా కనపడలేదు. ఇంత చిన్నపిల్లని మహిళావార్డుకి ఎందుకు పంపారో? జువనైల్ వార్డుకి పంపక అనికూడా అనిపించింది. |
| జైలు కథలు... సత్రా. సి. ఎల్ - బీ.అనురాధ జైల్లో పేరు కన్నా ముందు అడిగేది ఏం కేసు అని? నా విషయంలో నేను తేలికగా అర్థమయ్యేది అదే కాబట్టి మావోవాది అని చెప్పేదాన్ని. ʹరాజనైతిక్ బందీʹ అంటే ఎవ్వరికీ అర్థం కాదు. అయితే తరవాత నన్ను ఎవరికన్నా పరిచయం చెయ్యాలంటే వాళ్ళు నన్ను సత్రా సి.ఎల్ అనడం గమనించాను. అదే విషయం ఒకామెని అడిగాను.ఆమె నా అజ్ఞానానికి నవ్వి ʹఅంత చదువుకొన్నావు నీకు తెలవదా భలే మజాక్.... |
| జైలు కథలు..మనిషీ వర్సెస్ జంతువు -బి.అనూరాధ జైలుకి వచ్చిన మొదటి రోజున సాధారణంగా ఎవరైనా ఏడుస్తుంటారు. కానీ ఆమె ఏడుపు చాలా దైన్యంగా వుంది. ఎంత మంది పలకరించినా పలకలేదు. కొంతమంది భాషా సమస్య అనుకోని వేరు వేరు భాషల్లో కూడా ప్రయత్నించారు. |
| జైలు కథలు: లాఠీ బుడియా - -బి. అనూరాధ.ʹఏయ్ మేడం! ఇధర్ ఆవ్!ʹ
ఆ గొంతు కంచులా ఖంగున మోగింది. ఆ కంఠంలో పలికిన అథార్టీ, మైకు అక్కర్లేనంత బిగ్గరగా పలికిన ఆ స్వరం విన్నాక – ఆ కంఠం కలిగిన మనిషిని చూసి బిత్తర పోయాను. ఆ స్వరానికీ, ఆ మనిషికీ ఏం సంబంధం లేదు. ʹఒక్క నిమిషం ఇలా రా!ʹ నన్ను చూస్తూ చేతిలో లాఠీని తాటిస్తూ పిలిచింది |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..