ముంబై కదిలింది.. అన్నదాతకు అన్నం పెట్టింది..


ముంబై కదిలింది.. అన్నదాతకు అన్నం పెట్టింది..

ముంబై

జనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడంలో ముందుంటామని ముంబైవాసులు మళ్ళీ నిరూపించారు. తమకు అన్నంపెట్టే రైతుల పోరాటానికి ముంబై నగరం అండగా నిల్చింది. తినీ, తినక 200 కిలోమీటర్లు నడిచి వచ్చిన 50 వేల రైతుల ఆకలి తీర్చేందుకు ముంబై నగరం నడుం బిగించింది. సమస్యల పరిష్కారం కొరకు ఎగిసి పడుతున్న సముద్ర కెరటాల వలే ఎర్ర జెండాల రెప రెపల మధ్య ఆదివారం అర్ధరాత్రి తండోపతండాలుగా వస్తున్న రైతులకు నీళ్ల బ్యాటిళ్లు, బిస్కట్‌ ప్యాకెట్లు, పండ్లు, ఫలహారాలు, పొంగలి పొట్లాలను పంచిపెట్టారు. ఈ సామాజిక కార్యక్రమంలో తర తమ భేదం లేకుండా వ్యక్తులు, నివాసితుల సంఘాలు, మతాలు, రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి.
కొన్ని చోట్ల సిక్కులు, ముస్లింలు ఈ సహాయక కార్యక్రమాల్లో ప్రత్యేకంగా పాల్గొన్నారు. సిక్కులు తమ సంప్రదాయం ప్రకారం రొట్టెలు, పప్పును పంచి పెట్టగా, బైకుల్లా జంక్షన్‌ వద్ద ముస్లింలు బిస్కట్లు, ఖర్జూరాలు, వాటర్‌ ప్యాకెట్లు పంచిపెట్టారు. ఓ చోట ఓ సంస్థకు చెందిన కార్యకర్తలు రైతులకు చెప్పుల జోళ్లను కూడా పంచి పెట్టారని ముంబై మిర్రర్‌ తెలియజేసింది. సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది పేదలు, మధ్య తరగతి ప్రజలే.
నగరంలోని ఆజాద్‌ మైదాన్‌కు చేరుకున్న దాదాపు 50 వేల మంది రైతులుకు సోమవారం ఉదయం పలు ఎన్జీవో సంఘాలు అల్పాహారాన్ని పంచిపెట్టాయి. తమ‌ పట్ల ముంబై వాసులు చూపిన ఆదరణను తామెన్నటికీ మరువలేమని, తాము ట్రక్కులో వెంట తీసుకొచ్చుకున్న ఆహార దినుసులు ఆదివారం వరకు సరిపోతాయో, లేదో అని ఆందోళన చెందామని, అయితే మార్గమధ్యంలో ప్రజలు ఆహార పొట్లాలు, మంచి నీళ్లు అందించడం వల్ల తమ వద్ద ఇంకా నాలుగు రోజుల వరకు సరిపోయే స్టాక్‌ మిగిలిందని అఖిల భారత కిసాన్‌ సభ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ గుజార్‌ తెలిపారు.
వృద్ధాప్యం కారణంగా వడలు కంగి, ఒంట్లో సత్తువ నశించినా ఆశయ సాధన కోసం 180 కిలోమీటర్లు కాలి నడకన వచ్చిన రైతుల స్ఫూర్తియే స్థానిక ముంబై వాసులను కదిలించింది. ఉడతా భక్తిగా తమవంతు సహాయాన్ని అందించారు. 180 కిలోమీటర్లు సాగిన యాత్రలో ఎక్కడా విధ్వంసానికి అవకాశం ఇవ్వకుండా క్రమశిక్షణ పాటించిన రైతులు ముంబై నగరానికి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ ప్రతిపాదనకు స్పందించిన తీరు కూడా అద్భుతం. ఆదివారం అర్ధరాత్రి సోమయ్య మైదానానికి చేరకున్న రైతులు ఈ రోజు ఉదయం పది గంటల ప్రాంతంలో విధాన భవన్‌ను ముట్టడించాల్సి ఉంది.
అలా చేస్తే ఎక్కడికక్కడే ట్రాఫిక్‌ స్తంభించిపోయి టెన్త్, ఇంటర్‌ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని, అందుకుని ఆజాద్‌ మైదాన్‌కు వెళ్లాల్సిందిగా ప్రభుత్వం సూచించింది. సోమయ్య మైదాన్‌ నుంచి ఆజాద్‌ మైదాన్‌కు మధ్యన దూరం 18 కిలోమీటర్లు. అలసి సొలిసి కదిలేందుకు మొండికేస్తున్న దేహాలకు కాస్త విశ్రాంతినిద్దామనుకుంటున్న తరుణంలో రైతులు మళ్లీ అర్ధరాత్రి రెండు గంటలకు బయల్దేరాల్సి వచ్చింది

Keywords : maharashtra, farmers, mumbai, bjp, fadnaves
(2018-03-22 20:25:08)No. of visitors : 2141

Suggested Posts


Media ignores...35 Thousands of farmers long march from Nashik to Mumbai

Farmers taking out a protest march under the banner of All India Kisan Sabha en route from Nashik to Mumbai in Maharashtra Besides pressing for their long-standing demands, the agitating farmers have also been opposing acquisition ...

గడ్చిరోలిలో 5గురు మహిళలతో సహా 7 గురు మావోయిస్టులను చంపేసిన పోలీసులు

మహారాష్ట్ర గడ్చరోలి జిల్లా జిగ్ణూరు వద్ద జరిగిన ఎన్కౌంటర్ లో 7 గురు మావోయిస్టులు చనిపోయినట్టు పోలీసులు ప్రకటించారు. చనిపోయినవారిలో గడ్చిరోలి జిల్లా అహిరి తాలూకా లింగంపల్లి గ్రామానికి చెందిన అయితు అలియాస్ అశోక్ (దళ కమాండర్) , చత్తీస్ గడ్, బీజాపూర్ జిల్లా కవాండే గ్రామానికి చెందిన‌ సరిత, మహారాష్ట్ర సిరొంచకు చెందిన చంద్రు, అహిరి తాలూకా....

రైతుల పోరాటానికి దిగి వచ్చిన ఫడ్నవీస్ సర్కార్ !

ఎర్రటి ఎండలో విరామమెరుగక నడుస్తూ ఎముకలు కొరికే చలిలో రొడ్డు పక్కనే సగం నిద్ర పోయి. జనం పెట్టింది తింటూ అర్దాకలితో... పాదాలు బొబ్బలెక్కి, చర్మాలు ఊడిపోయి నెత్తురోడే కాళ్ళతో, మహిళలు, వృద్దులు చేసిన పోరు యాత్రకు మహారాష్ట్ర ఫడ్నవీస్ సర్కార్ దిగిరాక తప్పలేదు....

After arrest of seven ʹCPI (Maoist) membersʹ, teacher questioned on ʹNaxal linksʹ ends life

DAYS AFTER he was questioned by the Maharashtra Anti Terrorism Squad (ATS) in connection with the arrests of seven alleged members of the banned Communist Party of India (Maoist), Mumbai schoolteacher Prabhakar Macha committed suicide on January 23....

Search Engine

నగ్నంగా 2 కిమీ నడిపించి..పసివాళ్ళపై అమానుషం !
Atrocities against Dalits at 17-year high in Gujarat
Baiga Adivasis March Against Displacement Due to Tiger Corridor, Demand Forest Rights
సోవియట్ రష్యాలో ఏం జరిగింది ?
Hindu Mahasabhaʹs calendar refers to Mecca as Macceshwar Mahadev temple
కామ్రేడ్ మారోజు వీరన్న స్థూపాన్ని కాపాడుకుందాం - విరసం
Why it is important to support the Spring Thunder Tour?- International Committee to Support the Peopleʹs War in India
చందమామని చూడని వెన్నెల -బి.అనూరాధ
సారూ.... అమ్మాయిలంటే ఎందుకంత వివ‌క్ష? ‍ ప్రిన్సిప‌ల్ కు ఓయూ విద్యార్థినిల లేఖ
నిర్బంధాల నడుమ మావోయిస్టుల భారీ భహిరంగ సభ‌
న్యాయం గుడ్డిదని తెలుసు కానీ మరీ ఇంత గుడ్డిదా ?
మహా రాష్ట్రలో రైతుల లాంగ్ మార్చ్ లు..కేరళలో రైతులపై దాడులు..ఇవేనా సీపీఎం రాజకీయాలు ?
జన హృదయాల్లో విప్లవ ప్రభాకరుడు - వరవరరావు
శ్రీ చైత‌న్య, నారాయ‌ణ కాలేజీల‌ను బ‌హిష్క‌రించండి : టీవీవీ
పేదలకు అంబులెన్స్ లూ కరువే...తోపుడు బండిపై భార్య శవంతో...
Dalit girl ends life in T.N. village after boys tear up her Class XII exams hall ticket
Bhima-Koregaon violence: Hindutva leader Milind Ekbote held
UP: Two Dalit youths brutally thrashed, one lost his thumb
ప్ర‌జ‌ల‌పై యుద్ధం : పాఠ‌శాలలను ధ్వంసం చేస్తున్న పోలీసులు !
రైతుల పోరాటానికి దిగి వచ్చిన ఫడ్నవీస్ సర్కార్ !
మిలియన్ మార్చ్ స్పెషల్ -బమ్మిడి జగదీశ్వరరావు
మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌
రైతులపై బీజేపీ నేత‌ దాడి !
లెనిన్‌ ఎవరూ..!?
more..


ముంబై