పేదలకు అంబులెన్స్ లూ కరువే...తోపుడు బండిపై భార్య శవంతో...


పేదలకు అంబులెన్స్ లూ కరువే...తోపుడు బండిపై భార్య శవంతో...

పేదలకు

ఈ సమాజం ఎంత దుర్మార్గంగా తయారయ్యిందో...పాలకులు ప్రజలపట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో నిరూపించడానికి ప్రతిరోజూ ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. ఒడిశాలో అంబులెన్స్ కు డబ్బులు చెల్లించలేక ఓ వ్యక్తి కిలోమీటర్ల దూరం తన భార్య శవాన్ని మోసుకొని నడవడం దేశవ్యాప్తంగా ప్రజలను కదిలించింది. ప్రధాన మీడియా, సోషల్ మీడియా ఆ సంఘటనపై మండిపడింది. పాలకులు అధికారులను సస్పెండ్ చేసి, మరో సారి ఇలాంటి సంఘటన జరిగితే తాము మనుషులము కామని ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ఆరోజు నుండి ఇప్పటి వరకు అటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ దేశపు పేదలు తమకు అంబులెన్స్ లు అందుబాటులో లేక . డబ్బులు లేక తమ భార్యలను, భర్తలను, తల్లులను, తండ్రులను, పిల్లలను కోల్పోతూనే ఉన్నారు. ఆ శవాలను మోసుకొని ఈ సమాజపు గుండెలపై నడుస్తూనే ఉన్నారు. అట్లాంటి అనేకానేక సంఘటనలో ఉత్తరప్రదేశ్ లో మంగళవారం జరిగింది ఒకటి.

మంగళవారం నాడు ఉత్తరప్రదేశ్ లోని మెయిన్‌పురి జిల్లాకు చెందిన 36 ఏళ్ల కన్హయ్యలాల్‌ తన భార్య సోనీ అస్వస్థతకు లోనవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లడానికి అంబులెన్స్‌కు ఫోన్‌ చేశాడు. గంటలు గడిచిన అంబులెన్స్‌ రాకపోవడంతో భార్యను తోపుడు బండిపై తోసుకుంటూ ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మెయిన్‌పురి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే చనిపోయిందని చెప్పారు. దాంతో భార్య శవాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలని కన్హయ్యలాల్ అడిగాడు. ఆస్పత్రి వర్గాలు అందుకు ఒప్పుకోలేదు.

దినసరి కూలీగా పనిచేస్తున్నకన్హయ్యలాల్ కు డబ్బులిచ్చి అంబులెన్స్ బుక్ చేసుకునే స్తోమత లేదు. ఇక‌ చేసేదేమీ లేక దుంఖాన్ని దిగమింగుకొని భార్య శవాన్ని గుడ్డలతో చుట్టి తోపుడు బండిపై తోసుకుంటూ వెళ్లాడు. ఈ దృశాన్ని చూసిన అక్కడి ప్రజల కళ్లు చెమ్మగిల్లాయి కానీ ఆస్పత్రి వర్గాలకు మాత్రం చీమకుట్టినట్టైనా కాలేదు.

ఇంత దుర్మార్గమైన సంఘటన జరిగితే దీనిపై స్పందించిన అధికారులు అంతకన్నా దుర్మార్గంగా స్పందించారు. పేదవాడైన కన్హయ్య దగ్గర అసలు ఫోనే లేదు. ఫోనే లేని ఆయన అంబులెన్స్ కు ఫోన్ ఎలా చేస్తాడని ఎదురు ప్రశ్నించాడు యూపీ వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి ప్రశాంత్‌ త్రివేది. ఒకవేళ ఫోన్‌ చేసినా ఇంకెవరికో చేసి‍ఉంటాదని వక్కాణించారు.

Keywords : No Ambulance, For Poor Man, Carries Wifeʹs Body, Handcart, UP
(2018-12-06 19:05:02)



No. of visitors : 398

Suggested Posts


అది రామరాజ్యం... ఆవులకేమో అంబులెన్సులు... పిల్లల‌కేమో చావుకేకలు !

ఆవులకు ఏమైనా అయితే రక్షించడానికి, వాటిని ఆఘమేఘాలమీద ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ లు ప్రారంభించారు. ఇంత గొప్పగా జరుగుతున్న యోగీ మహరాజ్ పాలనలో గోరఖ్ పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలోఆక్సీజన్ లేక‌ 63మంది చిన్నారుల‌ ప్రాణాలు పోయాయి. ప్రభుత్వం బాకీ పడ్డ 60 లక్షల రూపాయలు ....

అది మనువాదపు కసాయి రాజ్యం ‍‍- ప్రేమంటే నరనరాన ద్వేషం

ఓ యుతి, ఓ యువకుడు జంటగా రోడ్డు మీద వెళ్తున్నారు. నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న వాళ్ళను చూసి యాంటీ రోమియో స్క్వాడ్ ముసుగేసుకున్న మనువులకు మండింది. సంఘ్ పరివార్ పాలనలో మగ ఆడ కలిసి తిరగడ ఎంత పాపం ! ఆ పాపానికి ఒడిగట్టిన ఆ ఇద్దరినీ పట్టుకొని కొట్టారు, పోలీసులతో కలిసి యువకుడికి గుండు గీసి అవమానించారు....

యోగీ రాజ్యం: ఆవును కాపాడటం కోసం మహిళను చంపేసిన పోలీసు

అది ఉత్తర ప్రదేశ్ లోని హర్రియా పట్టణం శనివారం నాడు వేగంగా వెళ్తున్న ఓ పోలీసు జీబు డ్రైవర్ కంట్రోల్ తప్పింది. ఆ జీబుకు ఎదురుగా ఓ ఆవు వస్తోంది. డ్రైవర్ కు ఆ సమయంలో తమ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, ఆయన శిష్యులైన గోరక్షకులు....

యోగీ రాజ్యంలో దారుణం... ఆక్సిజన్ లేక 30 మంది చిన్నారుల మృతి !

ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్న కంపెనీకి ప్రభుత్వం కట్టాల్సిన 66లక్షల రూపాయల బాకీ కట్టకపోవడం వల్ల ఆ కంపెనీ ఆక్సిజన్‌ పంపిణీని ఆపేసింది. ఫలితంగా ఇంతమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో పోయాయి....

పరీక్షలు రాసింది 12 వేల మంది... పాసయ్యింది 20 వేల మంది

12,800 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. కానీ పాసయ్యింది మాత్రం 20,089 మంది. చివరి నిమిషంలో ఈ అంకెలు చూసిన అధికారులు షాకయిపోయారు. ఏం చేయాలో అర్దం కాక తలలు పట్టుకొని ఆలోచించి చివరకు పరీక్షా ఫలితాల....

అది విషాదంకాదు నరమేధం... 63 కు చేరిన చిన్నారుల మరణాలు

యోగీ ఆదిత్యానాథ్ రాజ్యంలో చిన్నారుల నరమేధం కొనసాగుతోంది. ప్రభుత్వం నిర్లక్ష్యం 63 మంది చిన్నారులను బలితీసుకుంది. గోరఖ్ పూర్ లోని బాబా రాఘవ్‌దాస్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆక్సిజన్ లేక నిన్న 31 మంది చిన్నారుఅ ఊపిరి ఆగిపోగా ఇవ్వాళ్ళ ఆ సంఖ్య 63 కు...

అమానుషంగా అమ్మాయిలను కొట్టారు...వాళ్ళ మీదే కేసులు పెట్టారు...బేటీ బచావ్...బేటీ పడావ్..అంటే ఇదేనా ?

విద్యార్థినులపై దాడి చేసి నెత్తురోడేట్టు అమానుషంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ లోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన 1000 మంది విద్యార్థులపై ఇవ్వాళ్ళ కేసు నమోదయ్యింది....

నరహంతకుల రాజ్యంలో న్యాయానికి దిక్కేది ?

మురికివాడలో నివసించే పేదలపై బలం ప్రయోగించి, పోష్ కాలనీలోని సంపన్నులకు వత్తాసు పలుకుతున్నారు నేతలు. కేసు ఎలాంటిదయినా, ఒక మంత్రి బెయిలు దొరక్కుండా చేస్తానని బెదిరించడం ప్రజాస్వామ్యం ఏ స్థాయికి పతనమైందో చెప్పే సంఘటన....

గూండాలను అరెస్టు చేసినందుకు యోగీ సర్కార్ ఆమెను అడవుల్లోకి ట్రాన్స్ఫర్ చేసింది

ఉత్తర ప్రదేశ్‌లో అక్రమాలకు పాల్పడుతున్న బీజేపీ కార్యకర్తలకు ఝలక్‌ ఇచ్చిన‌ పోలీస్‌ అధికారిణీ శ్రేష్ట ఠాకూర్ ను యోగీ సర్కార్ అడవుల్లోకి బదీలీ చేసింది.. ఆమె ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న స్యానా సర్కిల్‌ నుంచి బహ్రైచ్‌కి బదీలీ చేశారు. లోకల్‌ బీజేపీ కార్యకర్తల నుంచి ఒత్తిడే ఆమె బదీలీకి కారణమని ప్రచారం జరుగుతోంది....

Posters in Bareilly village ask Muslims to leave

Just days after the Bharatiya Janata Party (BJP) secured a massive victory in the Uttar Pradesh Assembly elections, posters have appeared in a village in Bareilly district asking Muslim residents to ʹleave immediately,ʹ reports the

Search Engine

కాశ్మీర్ ఉజ్వలమైన చరిత్ర, పోరాట గాథ...మాజీ కేంద్ర మంత్రి సఫుద్దీన్ సోజ్ కాశ్మీర్ పై రాసిన పుస్తకం గురించి..
మత రాజకీయాల్లో యూపీ సీఎం యోగీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ..
సర్జికల్ స్ట్రైక్స్ రాజకీయం... ప్రమాదకరమన్న ఆర్మీ అధికారి
ఏవోబీలో పీఎల్జీఏ వారోత్సవాలు..ఆడియో రిలీజ్ చేసిన మావోయిస్టులు
బీజేపీకి రాజీనామా చేసిన దళిత మహిళా ఎంపీ - సమాజంలో బీజేపీ విభజనలు సృష్టిస్తోందని ఆరోపణ‌
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 3
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 2
ఎన్నికలపై మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్-1
దళితులపై తప్పుడు కేసులు బనాయించి చితకబాదుతుంటే నాకు గర్వంగా ఉంటుంది.. ఒక ఐపీఎస్ వ్యాఖ్యలు
ʹఅఖ్లక్ హత్యపై దర్యాప్తు చేశాడనే ఇన్‌స్పెక్టర్ సుబోధ్‌ను హిందుత్వవాదులు అంతం చేశారుʹ
Isolate the fish from the water: a genocidal practice in India - Adolfo Naya
18 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
కేసీఆర్ ఓ నియంత : మావోయిస్టు జ‌గ‌న్‌
భీమాకోరేగావ్ విప్ల‌వ, ద‌ళిత శ‌క్తుల ఐక్య‌త‌కు ప్ర‌తీక : పాణి
CPI (Maoist) appoints military strategist Basavraju as its next general secretary
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బసవరాజు...అనారోగ్య కారణాలతో స్వచ్చందంగా విరమించుకున్న‌ గణపతి
పుణెలో రెండు రోజులు
కిషన్ జీ... పీడితుల యుద్ద గీతి !
చీకటి గదిలో ఒంటరిగా.. ఊపిరి పీల్చుకోలేని స్థితిలో వరవరరావు
గృహ నిర్బంధం అంటే ? - వరవరరావు
పోరాడి తమ హక్కులు సాధించుకున్న గిరిజన రైతులు.. ముంబైలో మహాపాదయాత్ర
ప్రజా గొంతుకల అక్రమ అరెస్టులపై పోరాడుదాం
నేల చెర విడిపించే అక్షరాలు - అశోక్ కుంబము
రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే
నా ప్రమాదకర వ్యక్తిత్వం ప్రభావమంతా కవిత్వ రహస్యమే
more..


పేదలకు