నారాయణ, చైతన్యల కాలేజ్ ల‌కు వ్యతిరేకంగా TVV ధర్నా


నారాయణ, చైతన్యల కాలేజ్ ల‌కు వ్యతిరేకంగా TVV ధర్నా

నారాయణ,

ఫీజులు, ర్యాంకుల పేరుతో విద్యార్థుల జీవితాల‌ను బ‌లితీసుకుంటున్న శ్రీ చైత‌న్య‌, నారాయ‌ణ కాలేజీల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యార్థి వేదిక ప్ర‌చార క్యాంపెయిన్ నిర్వ‌హిస్తోంది. శుక్ర‌వారం లోయ‌ర్ ట్యాంక్‌బండ్ అంబేద్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద టీవీవీ హైద‌రాబాద్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో శ్రీ చైత‌న్య‌, నారాయ‌ణ సంస్థ‌ల దిష్టిబొమ్మ‌ను ద‌గ్ధం చేశారు. ఈ సంద‌ర్భంగా సిటీ క‌మిటీ అధ్య‌క్షుడు మాట్లాడుతూ కార్పోరేట్ విద్యా సంస్థ‌లు విద్యార్థుల నుంచి ల‌క్ష‌ల రూపాయ‌ల ఫీజులు వ‌సూలు చేస్తూ, ర్యాంకుల కోసం వారిని తీవ్ర మాన‌సిక ఒత్తిడికి గురిచేస్తున్నాయ‌ని ఆరోపించారు. ఫ‌లితంగా వేలాది మంది విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు. ప్ర‌భుత్వం శ్రీ చైత‌న్య‌, నారాయ‌ణ లాంటి కార్పోరేట్ కాలేజీల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల్ని కార్పోరేట్ కాలేజీల్లో చేర్పించ‌వ‌వ‌ద్ద‌ని కోరారు. మార్చి 27వ తేదీని టీవీవీ చేప‌ట్టిన ఇంట‌ర్మీడియెట్ బోర్డు ముట్ట‌డిని విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు. టీవీవీ చేప‌ట్టిన నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని పోలీసులు అడ్డుకున్నారు. 144 సెక్ష‌న్ అమ‌లులో ఉన్నందున అనుమ‌తి లేనిదే నిర‌స‌న తెలిపే హ‌క్కులేందంటూ విద్యార్థుల‌ను అక్క‌డినుంచి త‌ర‌లించారు. పోలీసుల తీరు ప‌ట్ల టీవీవీ నేత‌లు అభ్యంతరం వ్య‌క్తం చేశారు. తెలంగాణ‌లో నిర‌స‌న తెలిపే హ‌క్కును కూడా ప్ర‌భుత్వం హ‌రిస్తోందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Keywords : narayana, chaitanya, telangana, TVV,
(2019-06-18 09:37:56)



No. of visitors : 627

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.

మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

ఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్‌ ముట్టడి, పెరేడ్‌ గ్రౌండ్స్‌లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్‌ ఉద్యమాలు నిర్వహించారు.

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

ʹనీ బాంచెన్ దొరా కాల్మొక్తʹ

జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ఖిల్లాలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పాదాభివందనం చేస్తున్నానంటూ ...

మహాజనాద్భుత సాగరహారానికి నాలుగేళ్ళు

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపుత్రుల దేహాల సంరంభాన్ని అనుభవించవలసిన సందర్భం అది....

Search Engine

ఆదివాసుల జీవించే హక్కును కాలరాసున్న తెలంగాణ పాలకులు
This TV reporter is winning praise for relentlessly questioning an errant BJP leader
ఇవ్వాళ్ళే సభ..అందరికి ఆహ్వానం
తమ‌ను జంతువుల్లా చూశారన్న ఆదివాసులు.. తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
ఆ 67 మంది ఆదివాసులను మా ముందు హాజరుపర్చండి...హైకోర్టు ఆదేశం
ʹవ్యక్తిత్వమే కవిత్వం..వరవరరావు కవిత్వ విశ్లేషణʹ ...17 న సభ‌
83 ఏండ్ల స్టాన్ స్వామి ఇంటిపై పోలీసుల దాడి.. విరసం ఖండన
ʹచోళ రాజుల కాలం దళితులకు చీకటి యుగంʹ అన్నందుకు డైరక్టర్ పా రంజిత్ పై కేసు !
అనారోగ్యంతో నడవ‌లేకపోతున్నా వైద్య సహాయం ఇవ్వడం లేదు....జైలు నుండి అనూష లేఖ‌ !
యోగీ ʹరామరాజ్యంʹలో... జర్నలిస్టు నోట్లో మూత్రం పోసి కొట్టిన పోలీసులు..!
పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టు నాయకులు కిరణ్, నర్మదలను వెంటనే కోర్టులో హాజరుపరచాలి
యోగీ ఆదిత్యనాథ్‌పై సుప్రీం ఆగ్రహం.. ఆ జర్నలిస్ట్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశం
పచ్చని కొండల్లో మైనింగ్ చిచ్చు.. తమ జీవనం దెబ్బతీయొద్దంటూ ఆదివాసీల నిరవధిక దీక్ష
నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారు..సుప్రీంను ఆశ్రయించిన జర్నలిస్టు భార్య‌
భావ ప్రకటనా స్వేచ్చపై కత్తి...యోగి పాలనలో జర్నలిస్టుల అరెస్టులు
One Year of Bhima Koregoan Arrests: Protest Held in Delhi
మానవత్వం యూ టర్న్ తీసుకుంది..!
Condemn the criminal intimidation and threats made on activist Dr. Ram Puniyani
iʹm not sure that I would survive in this Solitary cell during this gruelling summer:prof. Saibaba
ఈ ఎండాకాలం...ఈ అండాసెల్ లో...బతకగలుగుతాననే నమ్మకం లేదు...ప్రొ.సాయిబాబా
రైతు విత్తన హక్కుపై విదేశీ కార్పోరేట్ల దాడి !
నీ వల్లే గెలిచి... నీ వల్లే ఓడి...
పుణె కోర్టులో తాజాగా – అమానుష తాత్సారం
తెలంగాణ ఎటు పోతోంది.. 32.5 శాతం నిరుద్యోగంతో దేశంలో 5వ స్థానం
క్రీడా మైదానంలో10 మంది చిన్నారుల నెత్తురు ఏరులై పారించిన పోలీసులు...జర్నలిస్టు సీ.వనజ గ్రౌండ్ రిపోర్ట్
more..


నారాయణ,