పోలీసుల దుర్మార్గం - విద్యార్థులు, ప్రొఫెసర్లపై దుర్మార్గమైన దాడి.. ఫోటోలు తీసిన‌ మహిళా జర్నలిస్టుకు లైంగిక వేదింపులు


పోలీసుల దుర్మార్గం - విద్యార్థులు, ప్రొఫెసర్లపై దుర్మార్గమైన దాడి.. ఫోటోలు తీసిన‌ మహిళా జర్నలిస్టుకు లైంగిక వేదింపులు

పోలీసుల

విద్య ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా, విద్యార్థినులపై లైంగికవేధింపులకు పాల్పడుతున్న‌ ప్రొఫెసర్‌ అతుల్‌ జోహ్రీని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ జేఎన్‌యూ విద్యార్థులు, ఉపాధ్యాయులు చేపట్టిన పార్లమెంట్‌ మార్చ్‌పై పోలీసులు దుర్మార్గంగా విరుచుకుపడ్డారు. వాటర్‌ కెనాన్స్‌ ఉపయోగించి విద్యార్థులను, ప్రొఫెసర్లను చెల్లా చెదురు చేశారు. అంతటితో ఆగకుండా విద్యార్థులు, ప్రొఫెసర్లపై పోలీసులు లాఠీచార్జీకి పాల్పడ్డారు. విద్యార్థినులని కూడా చూడకుండా లాఠీలతో వివక్షణా రహితంగా చితకబాదారు. పోలీసులు చేసిన ఈ దుర్మార్గపు దాడిలో దాడిలో అనేకమంది విద్యార్థులు, ప్రొఫెసర్లు తీవ్రంగా గాయపడ్డారు.

విద్య ప్రయివేటీకరణ ఆపేయాలంటూ, విద్యార్థినులపై లైంగికవేధింపులకు పాల్పడుతున్న‌ ప్రొఫెసర్‌ అతుల్‌ జోహ్రీని సస్పెండ్‌ చేయాలంటూ
కొద్ది రోజులుగా జేఎన్‌యూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దాంతో వీద్యార్థులు పార్లమెంట్‌ మార్చ్‌కు సిద్ధమయ్యారు. ఈ నిరసనప్రదర్శనలో పాల్గొనాలని జేఎన్‌యూ స్టూడెంట్‌ యూనియన్‌ పలు వర్సిటీల విద్యార్థులను కోరింది. దీంతో అనేక‌ వర్సిటీలకు చెందిన విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థులు,ప్రొఫెసర్లు వర్సిటీ క్యాంపస్‌ నుంచి పార్లమెంటు వరకూ ర్యాలీ చేపట్టారు. మధ్యాహ్నం రెండుగంటలకు ర్యాలీ మొదలైంది. సుమారు రెండువేలకు పైగా విద్యార్థులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రదర్శన పార్లమెంట్‌ మార్చ్‌కు బయలుదేరటంతో.. పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీగా వస్తున్న నిరసనకారులను రోప్‌ టీమ్‌లతో అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా.. విద్యార్థిసంఘ నేతలు మాట్లాడుతూ.. తాము చేస్తున్న ఆందోళనకు పరిష్కారం చూపాలంటూ నినాదాలు చేశారు. పలువురు విద్యార్థినులను కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్న జోహ్రీని వెంటనే సస్పెండ్‌ చేయాలని, విద్య ప్రయివేటీకరణను ఆపాలని, స్వయం ప్రతిపత్తి పేరుతో ప్రభుత్వ విద్యను నాశనం చేసే ప్రక్రియ రద్దు చేయాలి. విద్యా ప్రైవేటీకరణ, కాషాయికరణకు వ్యతిరేకించాలన్న నినాదాలతో ఆ ప్రాంతంలో మారుమోగింది.

జెఎన్‌యు నార్త్‌ గేట్‌ వద్ద నుంచి వేలాది మందితో ప్రారంభమైన లాంగ్‌ మార్చ్‌ శాంతి యుతంగా వివిధ ప్రధాన ప్రాంతాల మీదుగా కాలిబాటన విద్యార్థులు, ప్రొఫెసర్ల నినాదాల చేసుకుంటూ ఐఎన్‌ఎ మార్కెట్‌ ప్రాంతంలో సంజరు పార్క్‌ వద్దకు చేరుకున్నారు. ఢిల్లీ పోలీసులు అక్కడ రోడ్డును బ్లాక్‌ చేసి లాంగ్‌ మార్చ్‌ను ముందుకు సాగనివ్వలేదు. దీంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రతిఘటించారు. పోలీసులు ఏకంగా వాటర్‌ కెనాన్స్‌ ఉపయోగించి విద్యార్థులను, ప్రొఫెసర్లను చెల్లా చెదురు చేశారు. అంతటితో ఆగకుండా విద్యార్థులు, ప్రొఫెసర్లపై మోడీ సర్కార్‌ పోలీసులు లాఠీచార్జీకి పాల్పడ్డారు. విద్యార్థినులని కూడా చూడకుండా లాఠీలను ఝులిపించారు. చదువుల చెప్పే గురువులపై పోలీసులు తమ ప్రతాపం చూపించారు. పోలీసుల దాడిలో పలువురు విద్యార్థులు, ప్రొఫెసర్లు తీవ్రంగా గాయపడ్డారు. 23 మంది విద్యార్థులను అరెస్టు చేసి స్థానిక లైసెన్సింగ్‌ కాలనీ డిఫెన్స్‌ యూనిట్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అరెస్టు అయిన వారిలో ఎనిమిది మంది విద్యార్థినిలు కూడా ఉన్నారు. అరెస్టు చేసిన విద్యార్థినీ, విద్యార్థులను పోలీస్‌ స్టేషన్లోనే చితకబాదారు.

మరో వైపు జేఎన్ యూ విద్యార్దుల ఆందోళన సందర్భంగా ఫోటోలు తీసేందుకు వచ్చిన లేడీ ఫోటో జర్నలిస్టును పోలీసులే వేధించారంటూ కంటోన్మెంట్ పోలీసులకు ఆ జర్నలిస్ట్ ఫిర్యాదు చేసింది. ఈ ఆందోళనను ఫోటోలు తీసేందుకు వచ్చిన తనను పోలీసులు అడ్డుకొని లైంగికంగా వేధించి, కొట్టి కెమెరా లాక్కొన్నారని మహిళా జర్నలిస్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై జర్నలిస్టులు ఢిల్లీ పోలీసు హెడ్ క్వార్టర్స్ ముందు తమ కెమరాలను కుప్పగా పోసి నిరసనకు దిగారు. జర్నలిస్టు పై దాడి చేసి, లైంగికంగా వేదించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Keywords : JNU, Delhi, students, police, bjp, modi
(2019-07-15 17:54:26)



No. of visitors : 2256

Suggested Posts


మనిషిని వెతుక్కుంటూ అతను వెళ్ళి పోయాడు...

విద్రోహి సాధారణ విద్యార్థి మాత్రమే కాదు.. అతనో కవి.. సాంస్కృతిక కార్యకర్త. క్యాంపస్ లోప‌ల, బయట... ఎక్కడ ఏ పోరాటం జరిగినా అక్కడ ప్రత్యక్షమవుతాడు. కవితా ప్రవాహాన్ని వెంట మోసుకెళ్తాడు. అలుపెరగని ఆ కవితాఝురికి ʹబ్రెయిన్ డెడ్ʹ బ్రేక్ వేసింది....

Solidarity with the women complainants of SRFTI,JNU in their fight against sexual harassment

On behalf of JNUSU and undersigned organizations we extend our solidarity and revolutionary greetings to the women complainants of SRFTI Kolkata, who have been fighting against cases

జ‌నం ప‌క్షాన నిల‌బ‌డ్డవాడు దేశ‌ద్రోహి అయ్యాడా : ఉమ‌ర్ ఖలీద్ తండ్రి ఎస్‌క్యూఆర్ ఇల్యాసీ

ఏ మ‌నిషి త‌న జీవిత‌మంతా దేశం కోసం ఆలోచించాడో... ఏ మ‌నిషి ద‌ళితుల కోసం, ఆదివాసీల కోసం నిల‌బ‌డ‌డ్డాడో... ఏమ‌నిషి దేశం కోసం ప‌నిచేయాల‌ని విదేశీ స్కాల‌ర్‌షిప్ ని సైతం వ‌దులు కున్నాడో... ఏమ‌నిషైతే పాస్‌పోర్ట్ కూడా తీసుకోలేదు.. ఇప్పుడా మ‌నిషి పాకిస్తాన్‌కి వెళ్లాడ‌ని నింద‌లు వేస్తున్నారు. ఏ మ‌నిషి ద‌ళితుల ప‌క్షాన పోరాడుతున్నాడో... ఏ మ‌నిషి రైతుల కోసం..

దేశద్రోహం కేసు : JNU విద్యార్థి నేతలపై చార్జ్ షీట్ తిరస్కరించిన కోర్టు

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) విద్యార్థి సంఘం మాజీ నాయకుడు కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య మరో ఏడుగురు కశ్మీరీ విద్యార్ధులపై రాజద్రోహం కేసులో ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన చార్జ్ షీట్ ను కోర్టు తిరస్కరించింది.

Proud of Kanhaiya, Khalid, Anirban, says Prof Saibaba

ʹI am proud of my students Kanhaiya Kumar, Umar Khalid and Anirban Bhattacharya, who are striving for the people of the countryʹ beamed alleged naxal think-tank Prof G N Saibaba...

మీడియా దుర్నార్గం: జేఎన్యూ విద్యార్థి ఐసిస్ సింపతైజర్ అని మొదటిపేజీలో.. అది ఫేక్ న్యూస్ అని లోపలి పేజీల్లో..

మీడియా ద్వారా సంఘ్ పరివారం మరో నీచమైన కుట్రకు తెరలేపింది. నజీబ్ వ్యక్తిత్వ హననానికి పాల్పడింది. జీ టీవీ , టైమ్స్ ఆఫ్ ఇండియా మరికొన్ని మీడియా సంస్థలు నజీబ్ గురించి అబద్దపు కథనాలు ప్రచురించి బురదచల్లే ప్రయత్నం చేశాయి. లేని పోలీసు రిపోర్ట్ ను ఉన్నట్టు నమ్మించే ప్రయత్నం చేశాయి....

COPS FORCED AUTO DRIVER TO SAY HE DROPPED NAJEEB AT JAMIA

The CBI today submitted a status report on its probe into the mysterious disappearance of Najeeb Ahmed in the Delhi High Court, and is believed to have said that the auto-rickshaw driver who the Delhi Police claimed to have dropped the JNU student at Jamia Millia Islamia has retracted his statement....

CBI carried out ʹbiasedʹ investigation, says JNU student Najeeb Ahmedʹs mother; claims probeʹs purpose was to shield assaulters

The mother of JNU student Najeeb Ahmed, who went missing from the university nearly two years ago, accused the CBI on Monday of carrying out a "biased" investigation into the case.

A Statement by Umar Khalid and Anirban Bhattacharya in the context of the Chargesheet

the people of the country have been dealing with these sanghi Thugs of Hindustan long enough now. Itʹs been five years, nearly. They know by now that it would be raining lies as it gets closer to the elections

కన్నయ్య, ఉమర్‌, అనీర్బన్‌ లపై మూడేళ్ళ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు

ఢిల్లీలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ (జేఎన్‌యూ) విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ విద్యార్థి సంఘం నాయకులు ఉమర్‌ ఖలీద్‌, అనీర్బన్‌ బట్టాచార్య లపై మూడేళ్ళ తర్వాత పోలీసులు 1200 పేజీలతో కూడిన ఛార్జ్‌షీట్ దాఖలుచేశారు.

Search Engine

తనకు నచ్చ‌ని పెండ్లి చేసుకుందని... కన్న బిడ్డను నరికి చంపిన దుర్మార్గపు తండ్రి
ఆ జంటకు సపోర్ట్ చేస్తే దేశవ్యతిరేకమే....యూపీ బీజేపీ నేత కూతురు పెండ్లి వ్యవహారంపై మరో నేత‌ కామెంట్ !
The "SINE-DIE" Suspension of academic activities in TISS HYD is oppressive and tyrannical.
అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది
ఆ త్యాగానికి ఐదు దశాబ్దాలు...జూలై18న సభ‌
ఏపీ సీఎం జగన్‌కు ʹఅర్బన్ నక్సలైట్లʹ లేఖ..!
దొరసాని.. ఓ స్వాప్నికుడి దృశ్య కావ్యం
ʹదొరసానిʹ ఏం చెప్తోంది.. తెలంగాణ జీవనం వెండితెరపై ఆవిష్కరించిందా..?
ʹనక్సలైట్ల పేరిట అక్రమంగా నిర్బంధించిన వారిని వెంటనే విడుదల చేయాలిʹ
యోగీ రాజ్యం.. ʹఏపీ, యూపీ పోలీసులు అర్దరాత్రి మా ఇంటిపై దాడి చేసి అక్రమంగా అరెస్ట్ చేశారుʹ
మారుతీరావునే మించిండు..కూతురు దళితుడిని పెండ్లి చేసుకుందని అల్లుడిని పోలీసుల ముందే చంపిండు..!
వేయిరూపాయల అప్పు తీసుకున్న పాపానికి పదేళ్ళుగా భానిస జీవితం..వృద్దుడి హృదయవిదారక గాథ‌
అమ్మ‌ కోసం అల్లాడుతున్న చిన్నారులు... జైలు ముందే పడిగాపులు
రండి... ఏ గుర్తింపూ లేని జీవితాల్లోకి చూపుసారిద్దాం
దళిత యువకుడిని పెళ్ళి చేసుకున్న బీజెపి ఎమ్మెల్యే కూతురు.. ʹనాన్నా ప్లీజ్ మమ్మల్ని చంపకండిʹ అంటూ వేడుకోలు
మావోయిజం నేరంకాదు, మావోయిస్టు భావజాలాన్ని విశ్వసించేవాళ్ళు నేరస్తులు కాదు..కేరళ హైకోర్టు
Kerala High Court says Maoism not a crime, upholds Rs 1 lakh fine on police
నిత్య పోరాట యోధుడు, ప్రజాస్వామిక తెలంగాణ స్వాప్నికుడు రాఘవులు సార్ కు జోహార్లు !
ʹʹఅంబేద్కర్, వరవర రావు గాక మాకోసం నిలబడినోళ్లు ఎవురున్నారు సార్ʹʹ
రాయలసీమకు జరిగిన అన్యాయాలను జగన్‌ సరిదిద్దుతాడా ?
చెర‌సాలలో చెలికాడికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు
వరవరరావు పై మరో కేసు - పూణే జైలు నుండి కర్ణాటకకు తీసుకెళ్ళిన పోలీసులు
పోడు భూముల సమస్య శాంతి భద్రతల సమస్యగా మార్చొద్దు...టీడీఎఫ్
ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్‌ చేయండి.. బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీత
మళ్ల గదే ప్రశ్న: తెలంగాణొస్తే ఏమొచ్చింది?...ఎన్.వేణుగోపాల్
more..


పోలీసుల