నీదీ నాదీ ఒకే కథ
అందరిలాగే నేనూ ఈ సినిమా నిన్ననే చూసాను పిల్లలతో కలిసి .ఈ సినిమా ఎమోషనల్ గా మనల్ని ఎంత మైమర్పింస్తుందంటే ప్రతి ఒక్కళ్లకి అది తమ కథేమో అన్పించేంత . ఈ కధ లో లూస్ ఎండ్స్ ఉన్నాయి అయినా ఫర్లేదులే అనుకుందామని కూడా అన్పిస్తుంది . అయినా కథలోచాలా అంశాల్ని లింక్ లేకుండా కలిపినట్లుగా అన్పించింది .
1. మొదటిది సైకిల్ ప్రేమ గా నేర్పిన తండ్రి , లెక్చరర్ గా కూడా ఉన్న తండ్రి కొడుకుకి మాథ్స్ లో సున్నా మార్కులు ఎందుకు వచ్చాయో తెలుసుకోకుండా నిరసించి వెళ్లిపోతాడంటే నమ్మశక్యంగా లేదు .
2. ఆ అబ్బాయికి చిన్నప్పుడు కానీ పెద్దయ్యాక కానీ చదువుమీద అయిష్టమా లేదా చదువురాలేదా అనేది మనకు అర్ధం కాదు . తండ్రి ఎలాటి సహాయాలు చేసాడో , చేయలేదో మనకి చూపించలేదు . కొన్ని రకాలయిన లెర్నింగ్ ప్రోబ్లేమ్స్ ఉన్న పిల్లలకి మిగతా రోజువారీ ఆటలు , పాటలు సరదాలు మామూలుగానే నడిచినా పొట్టకోస్తే అక్షరం ముక్క రాదన్నట్లు చదువు రాదంటే చదువురాదు అలాటిది ఉన్నదా అంటే అదీ అర్ధం కాదు .
3. తండ్రి exams లో తప్పుతున్నందుకు తిడుతుంటే exams బాగా రాస్తే తండ్రికి నచ్చే కొడుకుగా మారొచ్చు అనేది మందబుద్ధి లేని ఏ కొడుకుకైనా అర్ధమయ్యే విషయం . ఆ హీరోయిన్ కూడా కథలో హీరో ఏ ఒక్కసారిExams పాస్ అవటానికి సహాయం చెయ్యదు , తనకి తెలిసింది చెప్పటానికి ప్రయత్నం చెయ్యదు . Personolity development క్లాస్ కి తీసుకువెళుతుంది . ఇద్దరూ కలిసి personolity development క్లాస్ కి వెళ్ళటం అనేది మందబుద్దికి సంబంధించిన వ్యవహారం .
4. ఇందులో చూపించిన పెర్సొనోలిటీ డెవలప్మెంట్ క్లాస్లకి సంబంధించిన వ్యవహారం అంతా కరక్టే అయినా మళ్ళీ తెలుగు నవలా , కథా రచయితల్లాగే , ఒక సమస్య ని ఒక కథ కి అంటుకట్టి రాసినట్లుగా ఈ సినిమా కథకి దాన్ని కృత్రిమంగా అతికించినట్లుగా అన్పించింది .
5 . ఇక హీరో , హీరోయిన్ల ప్రేమ వ్యవహారం అంత్యంత సీరియస్ గా నడుస్తున్న కథలో యద్దనపూడి మార్క్ ఎస్కేపిసం . ఆనందంగా వుండి , పదివేలతో బతికేవాడి జీవితాన్ని పంచుకునేందుకు తెలివిగల , చదువుకున్న ఏ అమ్మాయి రాదనేది వాస్తవం . ఇందులో ప్రేమ ఈ సినిమాని కాసేపు నడిపేందుకు పనికొచ్చే ఫిక్షన్ .
6. సమాజంలో లెక్చరర్ అంటే సామాజికంగా హయ్యర్ మిడల్ క్లాస్ .కానీ ఆ తండ్రీ కొడుకుల సామాజిక జీవితం లోయర్ మిడిల్ క్లాస్ గా చూపించారు . కనీసం ఆ తండ్రిని ఏ మెకానిక్ గానో చూపించినా కానీ కథ రక్తి కట్టేది .
7. ఈ కధ అర్బనో , రూరలో కూడా అర్ధం కాదు . మీ నాన్న ఊరందరికీ చదువు గురించి చెబుతాడు అంటే రూరల్ లోనే అది సాధ్యం . కానీ అవకతవక అర్బన్ వాతావరణంలో కథ నడుస్తుంది .
8. అయినా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది . క్లాసులో బాగా చదివి మంచిమార్కులు తెచ్చుకునే 13 ఏళ్ల మా అమ్మాయి కూడా మనల్ని మనం చూసుకున్నట్లుగా వుంది కదు మమ్మీ ఈ సినిమాలో అన్నది . చదువుపేరుతో మనం పోగొట్టుకున్న ఆనందాల్ని శక్తివంతంగా చూపించటంలో, దాన్ని మనం ఫీల్ అయ్యేట్లు చేయటంలో ఈ సినిమా సక్సెస్ అయ్యింది .
9. ఆనందం అనేది డబ్బు తో ముడిపడకపోయినా మినిమం guarantee ఆనందాలకి మినిమం guarantee ఆదాయాలు అనేది చాలా అవసరం . చదువుకోకపోయినా , చదువురాకపోయినా ఇష్టమయిన పని చేసుకుని అవి సాధించటం ఎట్లా అనేది చాలా విస్తృతంగా చర్చించాల్సిన విషయం.
10 . అంత పెద్ద సమస్యని తండ్రి అహంకారానికి అంతకట్టి , easy పరిష్కారాలని వెతక చూడటం అనేది మళ్ళీ తెలుగు సినిమాల పైత్యంలాటిదే . పాపం ఆ తండ్రి దర్శకుడి కోసం విలన్ అయ్యాడు .
(పద్మావతి బోడపాటి ఫేస్బుక్ టైమ్ లైన్ నుండి)
Keywords : needi naadi oke katha, film, review
(2023-09-28 09:42:33)
No. of visitors : 2839
Suggested Posts
| ʹగుజరాత్ ఫైల్స్ʹ అనే మూవీ తీస్తాను, అడ్డుకోబోమని మోడీ హామీ ఇవ్వగలరా ? ప్రముఖ దర్శకులు వినోద్ కప్రీఈ నేపథ్యంలో తాని ʹగుజరాత్ ఫైల్స్ʹ పేరుతో గుజరాత్ అల్లర్లపై సినిమా తీస్తానని, ప్రధాని ఆ మూవీని అడ్డుకోబోనని హామీ ఇస్తారా అని ప్రముఖ దర్శకులు వినోద్ కప్రీ ప్రశ్నించారు. |