అమరుడు రాజన్నకు జోహార్లు - తెలంగాణ ప్రజా ఫ్రంట్


అమరుడు రాజన్నకు జోహార్లు - తెలంగాణ ప్రజా ఫ్రంట్

అమరుడు

ఈ రోజు మార్చ్ 26 నాడు మధ్యాహ్నం డ్యూటీ నుండి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో లారీ ఢీకొనడంతో మృతి చెందిన భాతలా రాజన్న (47)మృతికి తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కమిటీ ప్రగడంగా సానుభూతి తెలుపుతుంది.
అమరుడు రాజన్నకు జోహార్లు అర్పిస్తున్నది.
25 సంవత్సరాలుగా కార్మిక ఉద్యమం లో పనిచేస్తున్న రాజన్న అమరత్వం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు.
నిరంతర కష్ట జీవి అలుపెరగని కార్యకర్తగా,నాయకునిగా ప్రజఅభిమానం చూరగొన్నా రాజన్న జ్ఞాపకాలు మరువలేము.
దోపిడీ పాలక వర్గ ట్రేడ్ యూనియన్ , రివిజనిస్టు ట్రేడ్ యూనియన్ విధానాలకు వ్యతిరేకంగా జీవితకాలం పోరాడినడు.
ఇల్లందుదు లో సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పోరాడినాడు.
సింగరేణి ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక నాయకుని గా నాటి నుండి నేటి వరకు పనిచేస్తున్నాడు.
ప్రస్తుతం కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గా కొనసాగుతున్నారు.
మొదటి నుండి ఉద్యమ స్పూర్తితో నిరంతరం ఆలోచించే రాజన్న తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రారంభం నుండి నేటి వరకు భూపాలపల్లి జిల్లాలో ముఖ్య భూమిక పోషించారు.
ఈ నెల 22 నాడు టి పి ఎఫ్ భూపాలపల్లి జిల్లా కమిటీ పునర్నిర్మాణం కోసం రాజన్న కోఆర్డినేట్ చేసి జిల్లా తెలంగాణ ప్రజా ఫ్రంట్ అభివృద్ధి కోసం కృషి చేశారు.
టి పి ఎఫ్ భూపాలపల్లి జిల్లా కమిటీ సభ్యుడు గా ఎన్నుకోబడినాడు.
అట్టడుగు కులంలో పుట్టిన రాజన్న తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘము లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ,కార్మికుల హక్కుల కోసం పోరాడుతూ ,కార్మికుల పట్ల ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పని చేశారు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర ఏర్పాటు కోసం క్రియాశీల పాత్ర పోషించి, ప్రజాస్వామ్య తెలంగాణ పోరాటం లో నాయకత్వం వహించారు.
సింగరేణి ఓపెన్ కాస్ట్ లకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల్లో ముందు భాగాన ప్రజల అందరిని ఏకం చేసి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఓపెన్ కాస్ట్ రద్దు కోసం చివరి శ్వాస వరకు పోరాటం చేసాడు.
ఈ క్రమంలో రాజ్యం నిర్బందాలు, బెదిరింపులు లెక్క చేయలేదు.
ఉద్యమమే ఊపిరిగా, నమ్మిన సిద్ధాంతం వెలుగులో చివరిదాకా నిలిచి మన నుండి దూరమైనాడు రాజన్న .

రాజన్న అమరత్వం కార్మిక ఉద్యమానికి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు.
తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాజన్నకు వినమ్రంగా జోహార్లు అర్పిస్తున్నది.
రాజన్న ఆశయ సాధనకోసం పోరాడుతామని శపథం చేస్తున్నది.
రాజన్న అంత్యక్రియలు రేపు ఉదయం 10 గంటలకు భూపాలపల్లి పట్టణంలో కృష్ణా నగర్ లో జరుగుతాయి.
-జోహర్ రాజన్నకు..
-రాజన్న ఆశయాల -సాధనకై పోరాడుదాం.

ఉద్యమభివందనాలతో..
తెలంగాణ ప్రజా ఫ్రంట్ .
రాష్ట్ర కమిటీ.
మెoచురమేష్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి

Keywords : rajanna, tpf, illendu, acsident, telangana, singareni
(2018-09-17 10:22:32)No. of visitors : 716

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.

మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

ఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్‌ ముట్టడి, పెరేడ్‌ గ్రౌండ్స్‌లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్‌ ఉద్యమాలు నిర్వహించారు.

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

ʹనీ బాంచెన్ దొరా కాల్మొక్తʹ

జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ఖిల్లాలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పాదాభివందనం చేస్తున్నానంటూ ...

మహాజనాద్భుత సాగరహారానికి నాలుగేళ్ళు

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపుత్రుల దేహాల సంరంభాన్ని అనుభవించవలసిన సందర్భం అది....

Search Engine

దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది-ఒడిషాలో బలపడ్డాం..విస్తరిస్తున్నాం: మావోయిస్టు పార్టీ
నన్నో దేశద్రోహిగా చిత్రీకరించాలని పోలీసులు ప్రయత్నించారు..!
ఓటమిని అంగీకరించలేక బీభత్సం సృష్టించిన ఏబీవీపీ.. గూండాలతో లెఫ్ట్ విద్యార్థులపై దాడి
హక్కుల కార్యకర్తల అక్రమ అరెస్టుల కేసులో పిటిషనర్ల లాయర్ సుప్రీంకు చెప్పిన నిజాలు ఇవే
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
ఆంటీ! చంపేసారాంటీ..నా ప్రణయ్‌ను చంపేసారు
జేఎన్‌యూపై ఎర్రజెండా రెపరెపలు.. మతోన్మాదులను మట్టి కరిపించి లెఫ్ట్‌ను మళ్లీ గెలిపించిన విద్యార్థులు
నీ కోసం వేలాది మంది వచ్చారు.. ఒక్కసారి లే ప్రణయ్..
ప్రొఫెసర్ సాయిబాబకు చిన్నారి సాహస్ లేఖ.. ప్రశ్నించడమే నువ్వు చేసిన తప్పా..?
ఇవి పరువు హత్యలు కావు.. దేశం పరువు తీసే హత్యలు
అమృత తండ్రి దుర్మార్గపు చరిత్ర.. కూతురు కంటే పరువే ముఖ్యమంటున్న కులోన్మాది
ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదే.. పెద్దలను కూడా ఈడ్చిపడేయటమే
ప్ర‌శ్నించ‌డ‌మే నేర‌మైన‌ప్పుడు : క్రాంతి
తలపాగా ధరించాడని ఎస్సీ వర్గీయుడి తల ఒలిచేసిన అగ్రకుల ఉన్మాదులు
ʹక్రాంతి కోస‌మే ఈ ప్ర‌యాణంʹ
SUSPEND AGREEMENTS WITH INDIA UNTIL THE HUMAN RIGHT ACTIVISTS ARE RELEASED : MEP TO EUROPEAN COMMISSION
స్వచ్చమైన హిందీ, సంస్కృత భాషలో ఉన్న ఉత్తరం వరవరరావు రాసిందేనా.?
మొదటి అర్బన్ నక్సల్ భగత్ సింగ్
ʹజీవితాన్ని ధారపోయడమే నక్సలిజం అయితే, నక్సలైట్లు చాలా మంచి వాళ్లుʹ
70 ఏండ్ల చరిత్రను తిరగరాసిన విద్యార్థిని.. మతోన్మాద శక్తులపై లెఫ్ట్ విజయం
ప్రజల సభంటే.. ఇట్లుంటది
Punjab:Dalit bodies protest arrest of 5 human rights activists
Why are the Indian authorities afraid of a ʹhalf-Maoistʹ?
ʹప్రధాని హత్యకు కుట్రʹ కేసు ఓ కుట్ర..మేదావుల అరెస్టు దుర్మార్గం..మావోయిస్టు పార్టీ ప్రకటన‌
హిందూత్వ తీవ్రవాదుల హిట్‌ లిస్టులో దభోల్కర్‌ కుమార్తె
more..


అమరుడు