పృథ్వీరాజ్,చందన్ లు HCU VC పై హత్యా యత్నం చేశారన్న‌ఆరోపణలు ఓ కుట్ర‌ - వరవరరావు


పృథ్వీరాజ్,చందన్ లు HCU VC పై హత్యా యత్నం చేశారన్న‌ఆరోపణలు ఓ కుట్ర‌ - వరవరరావు

పృథ్వీరాజ్,చందన్

విప్లవ రచయితల సంఘం సభ్యుడు పృథ్వీరాజ్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి విద్యార్థి చందన్ మిశ్రాలను అరెస్టు చేసి వారిపై హెచ్సీయూ వైస్ ఛాన్స్ లర్ అప్పారావుపై హత్యాప్రయత్నం చాశారని నేరం మోపడం ఓ కుట్ర. యూనివర్సిటీలలో విద్యార్థిసంఘాలను, ప్రశ్నిచే గొంతులను లేకుండా చేసి యూనివర్సిటీలను ప్రైవేటీకరించే కేంధ్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలో భాగంగానే వీరిద్దరిపై ఈ దుర్మార్గమైన ఆరోపణలు పోలీసులు చేస్తున్నారు.

పృథ్వి, చందన్ లను భద్రాచలం ‍ చర్ల రోడ్డుపై అరెస్టు చేశామని, మావోయిస్టు నేత హరిబూషణ ఆదేశాలమేరకు అప్పారావును చంపేందుకు కుట్ర చేశారని వారిద్దరిపై పోలీసులు ఆరోపణలు చేయడానికి ముందే...వారిద్దరిని ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరంలో ఈ నెల 28న పృథ్వీరాజ్ ఇంటికి దగ్గరలో ఓ వాహనంలో వచ్చిన వారు కిడ్నాప్ చేశారని పృథ్వి తండ్రి ధర్మారావు కు అక్కడున్నవాళ్ళు చెప్పినట్టు ఆయన చెప్పి ఉన్నాడు.

ఈ విషయంపై మేము అప్పటికే మీడియా దృష్టికి, ఏపీ హోంమంత్రి చినరాజప్ప, తెలంగాణ హోంమంత్రి నాయినినర్సిమ్హరెడ్డిల దృష్టికి తీసుకెళ్ళాము. ఈ రోజు పొద్దటి నుండి కూడా అటు చినరాజప్ప, ఇటు నాయినిలతో ఈ విషయంపై మాట్లాడుతున్నాము. ప్రొఫెసర్ హరగోపాల్ కూడా వీరిద్దరి విషయంపై రెండు రాష్ట్రాల డీజీపీలకు మెసెజ్ పెట్టి ఉన్నాడు. మరో వైపు హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేయడానికి పౌరహక్కుల సంఘం సిద్దమయ్యింది.

అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి చిలకా చంద్రశేఖర్ అద్వర్యంలో పృథ్వీరాజ్ తల్లి, పౌరహక్కుల సంఘం, విరసం, ఇతర ప్రజా సంఘాలు ఏపీ డీజీపీ కలివడానికి వెళ్ళి డీజీపీ లేకపోతే ఆయన కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చి మీడియాతో మాట్లాడుతున్నారు. అదే సమయంలో పృథ్వీరాజ్, చందన్ లను కాకినాడలో ప్రొడ్యూస్ చేశారని తెలిసింది. దాంతో హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేయడానికి సిద్దంగా ఉన్న పౌరహక్కుల సంఘం నాయకులు లక్ష్మణ్, నారాయణరావు, రఘునాథ్ లు దాన్ని విరమించుకున్నారు.

మేము మొన్న రాత్రి నుండి అంటే పృథ్వీ, చందన్ లను పోలీసులు ఎత్తుకెళ్ళారు అని తెలిసినప్పటి నుండి పారదర్శకంగా అందరి దృష్టికి తీసుకెళ్ళాం. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ భద్రాచలందగ్గర వాహనాల తనికీలో దొరికారని చెప్పడం మొట్టమొదటి అబద్దం. వాళ్ళను పోలీసులు ఎత్తుకెళ్ళిన రోజును‍ండి ఇవ్వాల్టి వరకు ఆ ఇద్దరిని తీవ్ర చిత్రహింసలకు గురి చేశారన్నది స్పష్టం. పోలీసులు వాళ్ళపై ఏ విధమైన చిత్రహింసలు చేశారు. ఏ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారో రేపు రేపు బహిర్గతమవుతాయి.

ఇక రెండో అంశం రోహిత్ వేముల ఆత్మహత్యను స్మృతిబద్ద హత్యగా సమాజం అంగీకరించింది. అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కదిలించింది. రోహిత్ వేముల స్వయంగా ఓ సైంటిస్ట్, ఓ మేదావి. అలాగే వైస్ ఛాన్స్ లర్ అప్పారావు గురించి రాయడం, బ్రాహ్మణీయ హిందూ భావజాలం మీద ఆయన చేసిన పోరాటం. ఇవన్నీ ఆయన చనిపోయిన మూడేళ్ళ తర్వాత కూడా ఇవ్వాల్టికి ఉద్యమం రగులుతూనే ఉన్నది. అలాగే వీసీ అప్పారావు చేసిన పనులన్నీ బహిర్గతమయ్యి మూటగట్టుకోవాల్సిన అప్రదిష్టనంతా మూటగట్టుకున్నడు. అలాంటివాడిని చంపాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు. పైగా మావోయిస్టు పార్టీ గానీ ఆ భావజాలంతో ఉన్న ప్రజాసంఘాలకైనా ఇటువంటి చరిత్ర ఉన్నదా ? ఎక్కడైనా అకడమీషియన్ లను వాళ్ళెంత దుర్మార్గులైనప్పటికీ హత్యలు చేశారా ? అటువంటి చరిత్ర రాజ్యానికి ఉన్నది కానీ మావోయిస్టులకు లేదు.

డాక్టర్ రామనాథం, లాయర్లయిన పురుషోత్తం, నర్రాప్రభాకర్ రెడ్డి, గోపీ రాజన్న లాంటి వాళ్ళను మేదావులైన జాపా లక్ష్మారెడ్డి, ఉపాధ్యాయుడైన‌ ఆజం అలీ లాంటి వాళ్ళను చంపిన చరిత్ర రాజ్యానిది, ఆరెస్సెస్ ది. ప్రపంచస్థాయి మేదావులైన డాక్టర్ వినాయక్ సేన్, ప్రొఫెసర్ సాయిబాబాలకి యావజ్జీవ శిక్ష విధించిన చరిత్ర ఈ రాజ్యానికున్నది. గౌరీ లంకేశ్ , గోవింద్ పన్సారే, కల్బుర్గీ, దబోల్కర్ లను చంపిన చరిత్ర సంఘ్ పరివార్ కున్నది. కానీ మావోయిస్టు పార్టీకి ఆచరిత్ర లేదు. విప్లవరచయితల సంఘానికి ఎన్నడూ అలాంటి చరిత్ర లేదు.

రోహి వేముల చనిపోయిన నాటి నుండి యూనివర్సిటీల్లో నిర్బంధాన్ని పెంచే కుట్ర సాగుతున్నది. యూనివర్సిటీని కాంన్సంట్రేషన్ క్యాంపుగా మార్చి విద్యార్థుల , అద్యాపకుల గొంతునొక్కే కుట్ర జరుగుతున్నది. అందువల్ల సెంట్రల్ యూనివర్సిటీ తో సంబందమున్నవాళ్ళందరిపై దాడులు జరుగుతున్నాయి. పృథ్వీ రాజ్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువు అయిపోయినప్పటికీ అందులోనే చదువుతున్న ఆయన మిత్రుడు చందన్ మిశ్రాతో కలిసి కులం, మార్క్సిజం మీద అద్యయనం సాగిస్తున్నాడు. ఇటువంటి ఇద్దరు మేదావులపై హత్యాప్రయత్న ఆరోపణ మోపడం దుర్మార్గం.

జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఏ విధంగానైతే విద్యార్థులను ఎట్లానైతే వేదిస్తున్నారో హెచ్సీయూలో కూడా అదే చేస్తున్నారు. హెచ్ సీయూలో ప్రొఫెసర్ లక్ష్మీనారాయణపై దాడి చేసిన సంఘ్ పరివార్ పై చర్యలు తీసుకోవడం కాక విచారణ పేరుతో ఆయననే వేదిస్తున్నారు. ప్రొఫెసర్ రత్నంను వేదిస్తున్నారు. దీనిని ప్రశ్నించిన , ఉద్యమించిన విద్యార్థులపై దాడులు చేస్తున్నారు. మరో వైపు ఈ విషయం పై మాట్లాడిన వీసీ అప్పారావు తన ప్రాణానికి ముప్పు ఉందనే విషయం తనకు తెలియదని, పోలీసులు తనకేమీ చెప్పలేదని, యూనివర్సిటీ ప్రశాంతంగా ఉందని చెప్పారు. నిజంగానే అప్పారావును హత్యచేయడానికి కుట్రజరిగి ఉంటే పోలీసులు ఆయనకు చెప్పి ఉండాలి కదా ?

ఈ ఇద్దరి మేదావులపై పోలీసులు చేస్తున్న ఆరోపణలు ఓ కుట్ర. ముఖ్యంగా కేంధ్రీయ విశ్వవిద్యాలయాల్లో ఉండే భావప్రకటనా స్వేచ్చను, ప్రజాస్వామిక వాతావరణాన్ని నాశనం చేసే కుట్ర. రోహిత్ వేముల హత్యతో ప్రారంభమైన ఉద్యమం ఇప్పటికీ అనేక యూనివర్సిటీల్లో ఏదో రూపంలో కొనసాగడం, ఆ ఉద్యమంతో మొదలైన‌ శోధన ఊనా లాంటి ఉద్యమాలు భూసమస్యవైపు తీసుకెళ్ళడంతో బేంబేలెత్తిన బీజేపీ ప్రభుత్వంతో ఇక్కడి కేసీఆర్, చంద్రబాబు సర్కార్ లు మిలాకతయి విశ్వవిద్యాలయాలయాలపై విద్యార్థులపై దుర్మార్గమైన దాడులకు దిగుతున్నాయి. మరో వైపు ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ను పలచన చేసే సుప్రీ కోర్టు తీర్పు నేపథ్యంలో పృథ్వీ రాజ్ లాంటి దళిత మేదావిపై దాడులు దుర్మార్గమైన ఆరోపణలు దేనికి సంకేతం? ఇది కేంధ్ర రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర.

సమాజంలోని దళిత, ఆదివాసీ, ముస్లిం మైనార్టీ సామాజిక బృందాల విషయంలో, పీడిత పోరాట వర్గాల విషయంలో పలకవర్గాల‌ పార్లమెంటరీ పార్టీల వైకరి ఎలా ఉంటుందో స్పష్టంగా ర్దమవుతున్నది. వీరిని ప్రజాస్వామిక ఐక్యసంఘటన ద్వారా మాత్రమే ఎదుర్కోగలం. విరసం సభ్యుడు పృథ్వీరాజ్, విద్యార్థి చందన్ లపై మోపిన అబద్దపు ఆరోపణలను ప్రజాస్వామిక పోరాటాలద్వారా విరసం ఎదుర్కొంటుంది.
- వరవరరావు

Keywords : HCU, maoists, police, vc, apparao, prudviraj, chandan mishra, modi, kcr, chandrababu
(2018-08-16 03:33:38)



No. of visitors : 956

Suggested Posts


మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం - విరసం

ʹరచయితలందరూ తమ తరానికి జవాబుదారులు; తమకు తాము జవాబు చెప్పుకోవాల్సిన వాళ్ళు... అంతస్సాక్షి ఉన్న రచయిత పీడిత ప్రజల పక్షాన దృఢంగా నిలవాలి. అలా కాకపోతే ఆ రచయితల్ని నిర్దోషులుగా నిర్ణయించే ప్రశ్నే లేదు.ʹ....

ʹఆయన జైల్లోనే చనిపోతారేమోʹ

90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. ఆయనేమైనా యుద్ద ఖైదీనా..? ప్రభుత్వ అనాలోచిత చర్యతో యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ...

చలసాని స్మృతిలో... - కే.కుమార్ వర్మ

బొడ్డపాడు నడిబొడ్డులో అమరవీరులను స్మరిస్తూ ఎర్ర జెండా చేతబట్టి తామాడ గణపతి ఇంటిముందునుండి దండుగా కదులుతున్నట్లుంది...

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ప్రజల కోసం సముద్రం వలె గర్జించిన తారకం - విరసం

తండ్రి దళిత ఉద్యమ వారసత్వాన్ని చిన్న వయసు నుండే స్వీకరించిన తారకం గారు సాంస్కృతిక కార్యకర్తగా, విద్యార్థి ఉద్యమకారుడిగా తన సొంతవూరిలో దళిత యువకుల్ని సంఘటితం చేశారు. వర్గపోరాట రాజకీయాలతో ప్రభావితమై విరసం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైనారు....

Search Engine

News from the revolutionary movement in Manipur
మేం ప్రశ్నిస్తాం, తర్కిస్తాం, వాదిస్తాం, విభేదిస్తాం..ఇదే జేఎన్‌యూ ప్రత్యేకత ‍- ఉమర్ ఖలీద్
Maoist leader Shyna released on bail
జేఎన్యూ విద్యార్థి ఉమర్ ఖలీద్ పై ఢిల్లీ లోహత్యా యత్నం...ఇది సంఘ్ పరివార్ పనేనన్న ప్రజా సంఘాలు
ఓ అమ్మాయికి రక్షణగా నిల్చినందుకు దళిత యువకుడిని కొట్టి చంపిన ఉగ్రకుల మూక‌ !
IIT Bombay Students Question Decision to Invite Modi to Convocation Ceremony
అగ్రకులోన్మాదం:దళితుడిని పెళ్ళి చేసుకున్నందుకు కూతురును హత్య చేసిన తండ్రి!
అది ఎన్ కౌంట‌ర్ కాదు, మావాళ్ల‌ను వెంటాడి చంపేశారు‍: బోరుమ‌న్న ఆదివాసీలు
మరణశిక్ష - రాజ్యాంగమే ఆమోదించినపుడు రాజ్యం ఊరుకుంటుందా? - వరవరరావు
రాపూర్ దళితులపై దుర్మార్గమైన దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి - విరసం
ʹఅవి ఎదురుకాల్పులు కాదు.. ఆదివాసీల హత్యలుʹ
మోడీ రాజ్యం: మోసాన్ని బహిర్గతం చేసినందుకు ఉద్యోగాలు పోగొట్టుకున్న‌జర్నలిస్టులు !
people organise rally in national capital in protest against the state high handedness on rights activists
Martyrs Week: Maoists organise Huge meeting in Malkangiri
తెలంగాణొస్తే ఏమొచ్చింది ? - ‍ ఎన్.వేణు గోపాల్
అమరుల సంస్మరణ సభను జరుపుకున్న వేలాది మంది ఆదివాసులు
Historic Eight Documents of Charu Majumdar (8th Document)
Historic Eight Documents of Charu Majumdar (7th Document)
Historic Eight Documents of Charu Majumdar (6th Document)
Historic Eight Documents of Charu Majumdar (5th Document)
Historic Eight Documents of Charu Majumdar (4thDocument)
Historic Eight Documents of Charu Majumdar (3rd Document)
Historic Eight Documents of Charu Majumdar(2nd Document)
Historic Eight Documents of Charu Majumdar (1st Document)
చేపలమ్ముకుంటూ చదువుకోవడమే నేరమయ్యింది !
more..


పృథ్వీరాజ్,చందన్