యస్సీయస్టీ చట్టంపై ఎందుకింత అసహనం? - వాహెద్


యస్సీయస్టీ చట్టంపై ఎందుకింత అసహనం? - వాహెద్

యస్సీయస్టీ

దేశవ్యాప్తంగా దళితులు నిరసన ప్రదర్శనలకు దిగారు. యస్సీ యస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని స్వయంగా సుప్రీంకోర్టే నీరుగార్చడాన్ని నిరసిస్తూ భారత్ బంద్ దేశవ్యాప్తంగా జరిగింది. ప్రభుత్వం బహుశా భారత్ బంద్ ప్రభావం అంతగా ఉండదని భావించిందేమో ప్రారంభంలో లక్ష్యపెట్టలేదు, కాని భారత్ బంద్ దేశవ్యాప్తంగా ప్రభావం చూపించింది. చివరకు న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ వేస్తామని చెప్పక తప్పలేదు. బిజేపిలో రాజకీయాశ్రయం పొందిన దళిత నేతలు కూడా ఈ విషయమై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని విమర్శిస్తే, నిరసిస్తూ నోరు విప్పారు. బిజేపి పార్లమెంటు సభ్యుడు ఉధిత్ రాజ్ ప్రభుత్వం దళితులకు నచ్చచెప్పడంలో విఫలమైందని, అందుకే నిరసనలు జరుగుతున్నాయని అన్నాడు. మధ్యప్రదేశ్ లో నిరసన హింసాత్మకమై ఒక వ్యక్తి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అనేకమంది గాయపడ్డారు. ఆగ్రాలో నిరసనకారులను అదుపు చేయడానికి పోలీసులు గాలిలో కాల్పులు జరపవలసి వచ్చింది. మీరట్ యస్.పి. ప్రకారం 200 మందిని నిర్బంధించారు. నిరసన ప్రదర్శనల్లో విధ్వంసానికి పాల్పడిన అల్లరిశక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని, కాని ఈ సాకుతో దళితులను అణిచే ప్రయత్నాలను సహించమంటూ మాయావతి వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం ఎనిమిది కంపెనీల రేపిడ్ యాక్షన్ ఫోర్సు పంపినట్లు సమాచారం. బీహారు, జార్ఖండ్ లలో ప్రదర్శనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగిన వార్తలు వచ్చాయి. రాజస్థాన్ లో దళితులకు, రాజపుత్ర కర్నీసేన కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఢిల్లీ జైపూర్ మధ్య రైళ్ల రాకపోకలు స్తంభించాయి. గుజరాత్ లోను నిరసనలు పెద్ద ఎత్తున జరిగాయి. పంజాబ్ లో సి బి యస్ యి పరీక్షలు వాయిదా వేయవలసి వచ్చింది.
దళితులు నిరసన ప్రదర్శనలకు ఎందుకుదిగారు? ఎందుకు ఆగ్రహిస్తున్నారన్న ప్రశ్నలు ఆలోచించవలసినవి. మార్చి 20వ తేదీన సుప్రీంకోర్టు యస్సీ యస్టీ చట్టం క్రింద వెంటనే అరెస్టలు చేయడాన్ని, క్రిమినల్ కేసులు రిజీష్టర్ చేయడాన్ని నిషేధిస్తూ, ఈ చట్టం అమాయక పౌరులను, పబ్లిక్ సర్వంట్లను బ్లాక్ మెయిల్ చేయడానికి దుర్వినియోగం అవుతుందని చెబుతూ ప్రభుత్వ ఉద్యోగులను, ప్రయివేటు ఉద్యోగులను ఈ చట్టం క్రింద అరెస్టు చేయడానికి మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగిని అరెస్టు చేయాలంటే అపాయింట్ మెంట్ అథారిటీ నుంచి రాతపూర్వక అనుమతి తర్వాతే చేయాలని, ప్రయివేటు ఉద్యోగి అయితే జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ దానికి అనుమతి ఇవ్వాలని సూచించింది.
సుప్రీంకోర్టు ఉత్తర్వు తర్వాత ప్రతిపక్షాలే కాదు, మిత్రపక్షాలనుంచి, చివరకు స్వంత పార్టీలో కూడా ఈ విషయమై వ్యతిరేకత పెరిగిన తర్వాత కాని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ విషయమై రివ్యూ పిటీషన్ వేస్తామన్న ప్రకటన చేయలేదు.
ప్రతి పదిహేను నిముషాలకు ఒక దళితుడిపై దౌర్జన్యం జరుగుతోంది. ప్రతి రోజు ఆరుగురు దళిత మహిళలు మానభంగాలకు గురవుతున్నారు. ఇది 2007 నుంచి 2017 మధ్యకాలంలో అధికారిక గణాంకాల ప్రకారం చెప్పిన మాట. నేషనల్ క్రయిం రికార్డ్ బ్యూరో ఇచ్చిన లెక్కలే ఇవి. సుప్రీంకోర్టు మార్చి 20వ తేదీన తీర్పు కూడా ఈ గణాంకాలనే దృష్టిలో పెట్టుకుంది. గత పదిసంవత్సరాల కాలంలో దళిత మహిళలపై లైంగిక అత్యాచారాలు రెట్టింపయ్యాయి. ఇలాంటి కేసుల్లో 78 శాతం కేసుల్లోనే చార్జిషీట్లు దాఖలవుతున్నాయి. అంటే అర్థమేమిటి, మిగిలిన కేసుల్లో చార్జిషీటు వరకు వెళ్ళడం లేదు. ఇక తప్పుడు కేసులు రిజీష్టరవుతున్నాయని చెప్పడం ఎలా సాధ్యం?
నేషనల్ క్రయిం రికార్డ్ బ్యూరో ఇచ్చిన లెక్కలు చూసి దళితులపై ఇన్ని దౌర్జన్యాలు జరుగుతున్నాయా అని ఆశ్చర్యపోయేవాళ్ళు తెలుసుకోవలసిన మరో వాస్తవమేమంటే, ఇవి కేవలం రిజీష్టరైన కేసుల లెక్కలు, చాలా మంది నిస్సహాయ బాధిత దళితులు కనీసం కేసు పెట్టడానికి కూడా ధైర్యం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎప్ ఐ ఆర్ నమోదు చేయించుకోలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి అసలు లెక్కలు ఇంతకన్నా చాలా ఎక్కువ ఉంటాయి. రిజీష్టరైన కేసుల్లోను కులవివక్ష కారణంగా దోషులకు శిక్షలు పడుతున్నాయా అంటే అది కూడా చాలా తక్కువ. చాలా తక్కువగా దోషులపై కేసులు రుజువవుతున్నాయి కాబట్టి దుర్వినియోగమవుతుందని తీర్మానించగలమా? నిజానికి టెర్రరిస్టు వ్యతిరేక చట్టాల్లోను కేసు రుజువై శిక్షలు పడడం తక్కువ. తప్పుడు కేసులు చాలా ఎక్కువే. అంత మాత్రాన అనేకమంది అమాయకుల జీవితాలు ఈ కేసుల కారణంగా నాశనమైపోయాయి. అయినా టెర్రరిస్టులకు వ్యతిరేకంగా కఠిన చట్టాలనే కోరుతున్నప్పుడు దళితులపై దౌర్జన్యాల నిరోధక చట్టంలో కేసులు రుజువై శిక్షలు తక్కువ పడుతున్నాయన్నది చట్టం దుర్వినియోగానికి నిదర్శనంగా భావించి చట్టాన్ని నీరుకార్చడం సముచితమా? నిజానికి నేషనల్ క్రయిం రికార్డ్స్ బ్యూరో ప్రకారం యస్సీ యస్టీ చట్టం క్రింద తప్పుడు కేసులు తగ్గిపోతున్నాయి. 2013లో రుజువైన శిక్షలు పడిన కేసులు 23.8 శాతం ఉంటే 2014లో 28.8 శాతం కేసుల్లో శిక్షలు పడ్డాయి.
గుజరాత్ లో గుర్రం ఎక్కినందుకు దళిత యువకుడిని చంపేశారు. కేరళలో వెనుకబడిన కులాల వ్యక్తి తన కూతురు దళితుడిని ప్రేమించిందని ఆ అమ్మాయిని చంపేశాడు. ఉత్తరప్రదేశ్ లో దళితుల వివాహ ఊరేగింపు ఠాకూర్ల ప్రాంతం నుంచి వెళితే తీవ్రమైన పరిణామాలుంటాయని బెదిరించారు. యస్సీ యస్టీ చట్టంపై రివ్యూ పిటీషను వేస్తే తీవ్ర పరిణామాలుంటాయని మహారాష్ట్ర లో అగ్రవర్ణ సంస్థలు బెదిరింపులు జారీ చేశాయట. భీమ కోరేగాంవ్ సంఘటన, ఉనా సంఘటనలను దేశం మరిచిపోయిందా?
గుజరాతులో ఆ దళిత యువకుడు గుర్రం పై స్వారి చేయకపోతే, కేరళలో దళిత యువకుడు కాస్త పెద్దకులం అమ్మాయిని ప్రేమించకపోతే, అలాగే ఉత్తరప్రదేశ్ లో దళితులు తమ పెళ్ళి ఊరేగింపు ఠాకూర్ల వాడ నుంచి కాక మరో దారిన వెళితే ... ఇలా అనేక అలా చేయకుండా ఉన్నట్లయితే, ఇలా చేయకుండా ఉన్నట్లయితే బహుశా ఈ దౌర్జన్యాలు, అఘాయిత్యాలు ఉండేవి కావు. శాంతి మూడుపువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లేది. ధర్మం నాలుగు పాదాలతో నడిచేది. కాని ఇలాంటి శాంతిని దళితులు కోరుకోవడం లేదు. తమ మానాభిమానాలను, గౌరవమర్యాదలను తాకట్టు పెట్టి కొనుక్కునే శాంతి అవసరమని భావించడమూ లేదు. శతాబ్దాల అణిచివేతలపై గొంతెత్తుతున్నారు. కాబట్టే దాడులు పెరుగుతున్నాయి.
దళితులు యస్సీయస్టీ దౌర్జన్యాల నిరోధక చట్టం చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అగ్రకులాలు ఆరోపించడం కొత్త కాదు. అగ్రకులాల రాజకీయ నాయకులు ఈ ఆరోపణలు ఇంతకు ముందు నుంచి చేస్తూనే ఉన్నారు. తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని రద్దు చేయాలన్న డిమాండ్ కూడా వినిపించింది. ఈ చట్టం క్రింద తప్పుడు కేసులతో వేధిస్తున్నారన్న ఆరోపణలతో ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. దళితులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారంటూ అక్కసు వెళ్ళగక్కడం కూడా కనబడుతుంది. దళితులకు రిజర్వేషన్లతో ఉద్యోగాలు, విద్యావకాశాలు కట్టబెట్టేస్తున్నారు, ప్రతిభ ఉన్నా మాకు దక్కడం లేదంటూ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడేవారు కూడా ఎక్కువయ్యారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడడం, దళితులు అవకాశాలను కొల్లగొట్టుకుపోతున్నారంటూ దళితులకు వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించడం, యస్సీయస్టీ చట్టం ద్వారా దళితేతరులను అణిచేస్తున్నారని చెప్పడం ఇప్పుడు మరీ ఎక్కువైంది.
ఇలాంటి వాదనలు చేసేవారెవరో అందరికీ తెలుసు. రిజర్వేషన్లను రద్దు చేయాలని కోరేవారే ఇలాంటి వాదనలు ముందుకు తెస్తుంటారు. రాజకీయంగా ఈ వాదోపవాదాలు వేరు. కాని సుప్రీంకోర్టు స్వయంగా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చడం దురదృష్టం. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా యస్సీయస్టీ చట్టం క్రింద వెంటనే అరెస్టులు చేయకూడదని చెప్పింది కాబట్టి తమ వాదన కరక్టేనని ఈ శక్తులు మరింత రెచ్చిపోయే పరిస్థితి తలెత్తింది. కాని దళితుల జీవితాలు, పరిస్థితులు అలా లేవు. రోహిత్ వేముల ఆత్మహత్యకు దారితీసిని పరిస్థితులను విశ్లేషించినా చాలు దళితులు ఎలాంటి వివక్షాపూరిత వాతావరణంలో బతుకుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. దౌర్జన్యాలు, అఘాయిత్యాలు జరిగినప్పుడు కేసు రిజీష్టరు చేయడం కూడా చాలా సందర్భాల్లో దళితులకు సాధ్యం కాదు. ఎఫ్ ఐ ఆర్ నమోదు కోసం కూడా చాలా సంఘర్షించవలసిన పరిస్థితి ఉంది. ఒకవేళ ఎఫ్ ఐ ఆర్ నమోదైనా ఇతర చట్టాల క్రింద నమోదు చేయకుండా, యస్సీ యస్టీ చట్టం క్రింద ఎఫ్ ఐ ఆర్ నమోదయ్యేలా చేయడం మరో సవాలు. దళితులు తమపై జరిగిన నేరాలకు వెంటనే రిపోర్టు చేసే వాతావరణం ఉందా? ఎఫ్ ఐ ఆర్ వెంటనే నమోదయ్యే వాతావరణం ఉందా? అందరూ సుప్రీంకోర్టును అడగవలసిన ప్రశ్నలివి.
చాలా సందర్భాల్లో బాధితులు కేసు వేసిన వెంటనే లేదా అంతకన్నా ముందే దోషులు కూడా కౌంటర్ కేసులు వేస్తుంటారు. సాధారణంగా దొంగతనమో, దోపిడియో, దొమ్మికి సంబంధించిన కేసులో వేస్తారు. బాధిత దళితులు కూడా కేసు విచారణకు కోర్టుకు రోజు వెళ్ళి రావడం తప్పదు. రోజుకూలితో పొట్టపోసుకునే వారయితే ఇది ఎంత కష్టమో ఆ కుటుంబాలకు తప్ప మరెవ్వరికీ అర్ధం కాదు. ఈ కౌంటర్ కేసుల్లో ఒక్కోసారి బాధిత దళితులే ముందుగా అరెస్టయ్యే అవకాశాలున్నాయి.
యస్సీ యస్టీ చట్టం క్రింద కేసుల్లో చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే శిక్షలు పడుతున్నాయన్నది ఈ చట్టం దుర్వినియోగానికి సాక్ష్యమా లేక చట్టాన్ని అమలు చేసే యంత్రాంగం నిజాయితీ లేకుండా వ్యవహరిస్తుందనడానికి సాక్ష్యమా? చాలా సందర్భాల్లో నానాన విధాల ఒత్తిళ్ళతో కేసు ఎత్తివేయించడమో, రాజీ చేయించడమో, సెటిల్ మెంటో జరుగుతుందన్నది కూడా మరిచిపోరాదు.
దళితులపై దౌర్జన్యాలు పెరుగుతున్న వాతావరణంలో యస్సీ యస్టీ చట్టాన్ని బలహీనపరచడం దేన్ని సూచిస్తుంది. నెమ్మదిగా ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసే వాతావరణాన్ని కల్పించడం కాదా? బాధిత దళితుల నిస్సహాయ స్థితి, చారిత్రకంగా అణిచివేతల నేపథ్యం దృష్టిలో ఉంచుకోవడం వల్లనే ఈ చట్టాన్ని కఠినంగా తయారు చేసారు. తక్షణం అరెస్టులు చేయడం అనేది అందువల్లనే. సాక్ష్యాధారాలను ప్రాబల్యం ఉన్న నిందితులు తారుమారు చేయకుండా ఉండడానికి. కులవివక్ష కారణంగా దళితులపై జరుగుతున్న దౌర్జన్యాలను అడ్డుకోవడంలో ఈ కఠినమైన చట్టం కూడా చాలా సందర్భాల్లో విఫలమైంది. నేరాలు తగ్గుముఖం పట్టడం లేదు. ఈ చట్టాన్ని కూడా బలహీనపరిస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుంది?
- వాహెద్

(Wahed Abd ఫేస్ బుక్ టైమ్ లైన్ నుండి)

Keywords : dalit, sc st atrocities act, bjp, sprem court, bandh
(2019-03-15 22:40:29)No. of visitors : 591

Suggested Posts


Shocking video of two naked ‘Dalit women’ being thrashed by ‘upper caste’ women

A shocking video of two ʹDalit womenʹ being subjected to merciless thrashing and public humiliation allegedly women from upper caste has gone viral on social media platforms....

ముస్లింల రక్షణ కోసం కత్తులు దూసిన సిక్కులు,చేతులు కలిపిన దళితులు ‍- పరారైన శివసేన మూక

పంజాబ్ లోని పగ్వారా పట్టణంలో ముస్లింల మీద దాడి చేయడానికి ప్రయత్నించిన శివసేన గుంపును సిక్కులు, దళితులు, ముస్లింలు ఐక్యంగా ఎదుర్కొన్నారు. కాశ్మీర్ కు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు బుధవారంనాడు ర్యాలీ నిర్వహించారు ఈ సంధర్భంగా...

గోముసుగు దౌర్జన్యాలపై దళితుల యుద్దభేరి - భగ్గుమంటున్న గుజరాత్

దళితులు భగ్గుమంటున్నారు... తమపై హిందుత్వ శక్తులు చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా కదం తొక్కుతున్నారు. గుజరాత్ లో గోరక్షకులు చేస్తున్న అమానుష అరాచకలాను ఎదిరిస్తూ ఆందోళనలకు దిగారు. గిరి సోమనాథ్ జిల్లాలోని ఊనాలో చనిపోయిన ఆవు చర్మాన్ని ఒలిచిన...

గోరక్షకుల రాజ్యంలో.. ఆకలితో 500 ఆవులు మృత్యువాత !

బీజేపీ పాలిత రాజస్తాన్ లోని గోసంరక్షణ శాలలో పట్టించుకునే వారు కరువై ఆకలి, అపరిశుభ్రంతో రెండు వారాల్లో దాదాపు 500 ఆవులు మృత్యువాతపడ్డాయి. జైపూర్‌లోని హింగోనియా గోశాలలో దాదాపు 250 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు.

చెట్టుకు కట్టేసి మత్తు సూదులేసి.. పెట్రోల్ పోసి.. దళిత బాలుడి పై అగ్రకుల అమానుషం !

కొంతమంది అగ్రకులస్థులు ఓ దళిత బాలుడికి నరకం చూపించారు. చెట్టుకుకట్టేసి బట్టలూడదీసి దారుణంగా కొట్టారు. అతడి మర్మాంగాలపై పెట్రోల్ పోసి హింసించారు. ఈ ఘటన ఆగ్రా జిల్లాలోని బర్హాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల బాస్ కేసీ....

నీళ్ళు తాగనివ్వని అగ్రకుల అహంకారం - బావిలో పడి దళిత బాలుడి మృతి

మధ్యప్రదేశ్ దమోహ్ జిల్లా ఖమరియా కలాన్ గ్రామంలో మూడవతరగతి చదువుతున్న వీరన్ అనే దళిత బాలుడు మధ్యాహ్న భోజనం తర్వాత నీళ్ళు తాగడానికి....

ఢిల్లీ లో దళితులపై హిందుత్వ సంస్థల దాడి !

ఢిల్లీలో శాంతి యుత ప్రదర్శన నిర్వహిస్తున్న దళితులపై హిందుత్వ శక్తులు దాడి చేశాయి. గుజరాత్ లో దళితులపై దాడికి నిరసనగా ఆదివారంనాడు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద యూత్ ఫర్ బుద్దిస్ట్ ఇండియా అనే సంస్థ అద్వర్యంలో దళితులు ధర్నా.....

వాళ్ళకు కమ్మోళ్ళ రక్తమే కావాలట !

హైదరాబాద్ మాక్స్ క్యూర్ హాస్పటల్ లో చికిత్సపొందుతున్న ఓ మూడేళ్ళ చిన్నారికి రక్తం అవసరం వచ్చింది. బ్లడ్ డోనర్స్ ఇండియా అనే ట్విట్టర్ లో ఓ కుల గజ్జి మహానువుడు కమ్మోళ్ళ రక్తం కావాలని ట్వీట్ చేశాడు....

ముందుకు సాగుతున్న ʹఛలో ఉనాʹ - కదం తొక్కుతున్న గుజరాత్ దళితులు

గుజరాత్ దళితులు కదం తొక్కుతున్నారు. వారితో ముస్లింలు చేతులు కలుపుతున్నారు. అన్ని వర్గాల ప్రజాస్వామికవాదులు, విప్లవ, ప్రజా సంఘాలు ఒక్కటై కదులుతున్నారు. ఆగస్టు 5 న అహ్మదాబాద్ లో బయలు దేరిన ఛలో ఉనా ర్యాలీ అనేక పల్లెలు, పట్టణాలు....

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుండి దళిత విద్యార్థుల గెంటివేత

వాళ్ళు దళితులు.... రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంభాల నుండి వచ్చిన నిరుపేద విద్యార్థులు... ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు వాళ్ళు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే చ‌దువుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు చ‌దువు రావడం లేదని పదో తరగతికి ప్రమోట్ చేయకుండా 34మంది విద్యార్థులను స్కూల్ నుండి గెంటేశారు....

Search Engine

జమ్మూ కాశ్మీర్ - ʹపండితులుʹ
పుణె తాజా నివేదిక – ఆశాభంగాలూ విద్యుల్లతలూ..!
ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...
యూపీలో కాశ్మీరీలపై దాడులకు తెగబడ్డ కాషాయ మూక‌
నిరుద్యోగం గురించి మాట్లాడినందుకు విద్యార్థిని చితకబాదిన ʹదేశభక్తʹ మూక‌ !
Why is the operation ʹgreen huntʹ a genocidal operation?
ఉన్మాదుల దృష్టిలో గంగూలీ కూడా దేశ ద్రోహేనా..?
లైన్ ఆఫ్ నో కంట్రోల్ - భారత మీడియా
వెనుజులా సంక్షోభానికి అమెరికా ఆజ్యం - ఎ.నర్సింహ్మారెడ్డి
భగ్న సభోత్తేజం ‍- పాణి
చత్తిస్ గడ్ ఎన్కౌంటర్ లో చనిపోయింది మావోయిస్టులు కాదు గ్రామస్తులే
మోడీ కాళ్ళు కడుగుతాడు..యోగీ దేశద్రోహం కేసు పెడతానని బెదిరిస్తాడు
కనకాభిషిక్తులు ఇనాక్‌గారు | పాణి |
సామూహిక గాయానికి 29 ఏండ్లు...
సంఘ్ పరివార్ ఆగడాలను ఖండించినందుకు విద్యార్థులపై దేశద్రోహం కేసు పెట్టిన సీపీఎం ప్రభుత్వం
బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
more..


యస్సీయస్టీ