బంద్ సందర్భంగా ముగ్గురు దళితులను కాల్చి చంపింది ఉగ్రకుల మూక‌ !

భారత్ బంద్ సందర్భంగా జరిగిన కాల్పుల్లో 11 మంది దళితులు చనిపోయారు. అయితే వారంతా పోలీసు కాల్పుల్లో చనిపోలేదని అగ్రకుల ఉన్మాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు దళితులు చనిపోయారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్ లో దళితులపైకి కాల్పులు జరుపుతున్న ఓ వ్యక్తి వీడియో నిన్నటి నుండి మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. అతను రాజా సింగ్ చౌహాన్ అని పోలీసులు గుర్తించారు. ఓ గుంపుతో కలిసి అతను కాల్పులు జరుపుతున్న వీడియో స్పష్టంగా కనపడుతున్నప్పటికీ తన కొడుకు ఆరోజు గ్వాలియర్ లో లేనే లేడని అతని తండ్రి బుకాయిస్తున్నాడు.

రాకేశ్‌ జాటవ్‌కు 40 ఏళ్లు. రోజు కూలి చేసుకుని బతికే సంసారి. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ సిటీ, భీమ్‌నగర్‌ దళిత వాడలో నివసిస్తున్నాడు. ప్రతిరోజు లాగే సోమవారం నాడు కూడా ఉదయం ఎనిమిది గంటలకు రెడీ అయ్యాడు. కూతురు టిఫిన్‌ బాక్సులో చపాతీలు కట్టివ్వగా తీసుకొని సమీపంలోని కూలీ అడ్డాకు బయల్దేరి వెళ్లారు. మధ్యాహ్నానికి పక్కింటాయన పరుగెత్తుకుంటూ వచ్చి ʹమీ నాన్నకు బుల్లెట్‌ తగిలింది. కింద పడిపోయాడుʹ అంటూ 18 ఏళ్ల కూతురు కాజల్‌కు చెప్పారు.

కూతురు పరుగెత్తుకుంటూ కుమ్హార్‌ పురలోని కూలీల అడ్డకు వెళ్లింది. దూరం నుంచే ఓ పోలీసు ఆమెను అడ్డుకున్నారు. రక్తం మడుగులో నుంచి అప్పుడే రాజీవ్‌ జాటవ్‌ శరీరాన్ని లేపి అంబులెన్స్‌లోకి ఎక్కిస్తున్నారు. ʹఅప్పటికి నాన్న ఊపిరి కొట్టుకుంటుందో లేదో, నాకు తెలియదు. ఛాతిలో నుంచి బుల్లెట్‌ దూసుకపోయిందంటూ అక్కడి వారు చెప్పుకుంటుంటే విన్నాను. ఆ తర్వాత నేను ఆస్పత్రికి వెళ్లేలోగా నాన్న చనిపోయాడుʹ అని కాజల్‌ మీడియాకు వివరించింది.

భారత్‌ బంద్‌ సందర్భంగా గ్వాలియర్‌ సిటీలో దళితులు, అగ్రవర్ణాల మధ్య జరిగిన ఘర్షణల్లో మరణించిన ముగ్గురు దళితుల్లో రాకేశ్‌ జాటవ్‌ ఒకరు. మిగతా ఇద్దరు దళితులు కూడా బుల్లెట్‌ గాయాలకే మరణించారు.మరొకరు 26 ఏళ్ల విమల్‌ ప్రకాష్‌. గ్వాలియర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెవారియా ఫూల్‌ గ్రామస్థుడు. ఈ ముగ్గురులో ఎవరికి కూడా బంద్‌తోగానీ, ఘర్షణతోగానీ సంబంధం లేదని తేలింది. రాకేశ్‌ జాటవ్‌ రోడ్డు మీద వెళుతుండగా ఛాతిలోకి బుల్లెట్‌ దిగింది. జీవితంలో ఎస్సై కావాలనుకుంటున్న విమల్‌ 40 కిలోమీటర్ల దూరంలోని దాబ్రాలో కోచింగ్‌ తరగతులకు హాజరై ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో బుల్లెట్‌ తగిలి అక్కడికక్కడే మరణించాడు. 22 ఏళ్ల దీపక్ గ్వాలియర్‌ నగరంలోని గొల్లకొత్తార్‌ ప్రాంతానికి చెందిన వాడు. ఆటో నడుకొని జీవిస్తాడు. రోడ్డు పక్కన ఆటో ఆపుకొని నిలబడి ఏదో గొడవ జరుగుతోందని అనుకుంటున్నంతలోనే మెడలో నుంచి బుల్లెట్‌ దూసుకుపోయి అక్కడికక్కడే చనిపోయారు. అన్న చనిపోతున్న దృశ్యాన్ని పక్కనే ఉన్న 20 ఏళ్ల తమ్ముడు సచిన్‌ చూశాడు. 50 మంది గుంపు లాఠీలు, తుపాకులు పట్టుకొని జై శ్రీరాం అని అరుచుకుంటూ ఫైరింగ్ చేస్తూ వచ్చారని వాళ్ళ కాల్పుల్లోనే తన కుమారుడు చనిపోయాడని దీపక్ తండ్రి మోహన్ జాటవ్ చెప్పారు.

Keywords : madhyapradesh, gwaliar, dalit, upper cast, firing, police, bharat bandh
(2024-04-05 11:14:26)



No. of visitors : 960

Suggested Posts


Shocking video of two naked ‘Dalit women’ being thrashed by ‘upper caste’ women

A shocking video of two ʹDalit womenʹ being subjected to merciless thrashing and public humiliation allegedly women from upper caste has gone viral on social media platforms....

ముస్లింల రక్షణ కోసం కత్తులు దూసిన సిక్కులు,చేతులు కలిపిన దళితులు ‍- పరారైన శివసేన మూక

పంజాబ్ లోని పగ్వారా పట్టణంలో ముస్లింల మీద దాడి చేయడానికి ప్రయత్నించిన శివసేన గుంపును సిక్కులు, దళితులు, ముస్లింలు ఐక్యంగా ఎదుర్కొన్నారు. కాశ్మీర్ కు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు బుధవారంనాడు ర్యాలీ నిర్వహించారు ఈ సంధర్భంగా...

గోముసుగు దౌర్జన్యాలపై దళితుల యుద్దభేరి - భగ్గుమంటున్న గుజరాత్

దళితులు భగ్గుమంటున్నారు... తమపై హిందుత్వ శక్తులు చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా కదం తొక్కుతున్నారు. గుజరాత్ లో గోరక్షకులు చేస్తున్న అమానుష అరాచకలాను ఎదిరిస్తూ ఆందోళనలకు దిగారు. గిరి సోమనాథ్ జిల్లాలోని ఊనాలో చనిపోయిన ఆవు చర్మాన్ని ఒలిచిన...

గోరక్షకుల రాజ్యంలో.. ఆకలితో 500 ఆవులు మృత్యువాత !

బీజేపీ పాలిత రాజస్తాన్ లోని గోసంరక్షణ శాలలో పట్టించుకునే వారు కరువై ఆకలి, అపరిశుభ్రంతో రెండు వారాల్లో దాదాపు 500 ఆవులు మృత్యువాతపడ్డాయి. జైపూర్‌లోని హింగోనియా గోశాలలో దాదాపు 250 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు.

చెట్టుకు కట్టేసి మత్తు సూదులేసి.. పెట్రోల్ పోసి.. దళిత బాలుడి పై అగ్రకుల అమానుషం !

కొంతమంది అగ్రకులస్థులు ఓ దళిత బాలుడికి నరకం చూపించారు. చెట్టుకుకట్టేసి బట్టలూడదీసి దారుణంగా కొట్టారు. అతడి మర్మాంగాలపై పెట్రోల్ పోసి హింసించారు. ఈ ఘటన ఆగ్రా జిల్లాలోని బర్హాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల బాస్ కేసీ....

నీళ్ళు తాగనివ్వని అగ్రకుల అహంకారం - బావిలో పడి దళిత బాలుడి మృతి

మధ్యప్రదేశ్ దమోహ్ జిల్లా ఖమరియా కలాన్ గ్రామంలో మూడవతరగతి చదువుతున్న వీరన్ అనే దళిత బాలుడు మధ్యాహ్న భోజనం తర్వాత నీళ్ళు తాగడానికి....

ఢిల్లీ లో దళితులపై హిందుత్వ సంస్థల దాడి !

ఢిల్లీలో శాంతి యుత ప్రదర్శన నిర్వహిస్తున్న దళితులపై హిందుత్వ శక్తులు దాడి చేశాయి. గుజరాత్ లో దళితులపై దాడికి నిరసనగా ఆదివారంనాడు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద యూత్ ఫర్ బుద్దిస్ట్ ఇండియా అనే సంస్థ అద్వర్యంలో దళితులు ధర్నా.....

వాళ్ళకు కమ్మోళ్ళ రక్తమే కావాలట !

హైదరాబాద్ మాక్స్ క్యూర్ హాస్పటల్ లో చికిత్సపొందుతున్న ఓ మూడేళ్ళ చిన్నారికి రక్తం అవసరం వచ్చింది. బ్లడ్ డోనర్స్ ఇండియా అనే ట్విట్టర్ లో ఓ కుల గజ్జి మహానువుడు కమ్మోళ్ళ రక్తం కావాలని ట్వీట్ చేశాడు....

ముందుకు సాగుతున్న ʹఛలో ఉనాʹ - కదం తొక్కుతున్న గుజరాత్ దళితులు

గుజరాత్ దళితులు కదం తొక్కుతున్నారు. వారితో ముస్లింలు చేతులు కలుపుతున్నారు. అన్ని వర్గాల ప్రజాస్వామికవాదులు, విప్లవ, ప్రజా సంఘాలు ఒక్కటై కదులుతున్నారు. ఆగస్టు 5 న అహ్మదాబాద్ లో బయలు దేరిన ఛలో ఉనా ర్యాలీ అనేక పల్లెలు, పట్టణాలు....

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుండి దళిత విద్యార్థుల గెంటివేత

వాళ్ళు దళితులు.... రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంభాల నుండి వచ్చిన నిరుపేద విద్యార్థులు... ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు వాళ్ళు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే చ‌దువుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు చ‌దువు రావడం లేదని పదో తరగతికి ప్రమోట్ చేయకుండా 34మంది విద్యార్థులను స్కూల్ నుండి గెంటేశారు....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


బంద్