చిన్నారి ఆసిఫా కేసు వాదిస్తే రేప్ చేసి చంపుతారట !


చిన్నారి ఆసిఫా కేసు వాదిస్తే రేప్ చేసి చంపుతారట !

చిన్నారి

చిన్నారి ఆసిఫాపై అత్యాచారం, హత్య కేసులో బాధితుల పక్షాన కేసు వాదిస్తున్న అడ్వొకేట్‌ దీపికా సింగ్‌ రజావత్ కు బెదిరింపులు పెరిగి పోయాయి. కేసు వాదిస్తే ఆమెను కూడా రేప్ చేసి చంపుతాం అంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరిస్తున్నట్టు దీపికా సింగ్ మీడియాకు తెలిపారు. గతంలో కూడా ఈమెను కేసు వాదించవద్దని జమ్ము బార్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వయంగా బెదిరించాడు. అప్పటి నుండి ఆమెకు బెదిరింపుల పర్వం కొనసాగుతోంది.
ఆదివారం కూడా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తనకు ఫోన్‌ చేశారని, ఈ కేసు వాదిస్తే రేప్‌చేసి చంపేస్తామని బెదిరించారని ఆమె మీడియాతో చెప్పారు. ʹబహుశా ఈ విచారణ పూర్తయ్యేలోపు నేను ప్రాణాలు కోల్పోవచ్చు లేదా మరొకటి జరగొచ్చు. అయితే బెదిరింపులకు భయపడి విచారణనుంచి మాత్రం తప్పుకోబోను. నాకు, బాధితురాలి కుటుంబానికి రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ఆశ్రయిస్తాʹ అని దీపిక తెలిపారు.

ముస్లింలను గ్రామం నుండి భయపెట్టి వెళ్ళగొట్టాలన్న ఉద్దేశంతో చిన్నారి ఆసిఫాను కిడ్నాప్ చేసి, గుడిలో దాచి ఆరు రోజులపాటు మత్తు మందు ఇచ్చి , క్రూరంగా హింసించి, రేప్ చేసి చివరకు బండరాయితో తలపై మోది హత్య చేసి శవాన్ని అడవిలో పడేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న గుడి పూజారి సాంజీరాం, అతని కొడుకు, మేనల్లుడు, పోలీసు అధికారులు దీప​క్‌ ఖాజురియా, సురేందర్ వర్మ, ఆనంద్ దత్తా, తిలక్ రాజ్, అనే పోలీసు అధికారులను రక్షించడానికి హిందూ సంఘాలు ర్యాలీలు తీశాయి. అందులో ఇద్దరు బీజేపీ మంత్రులు కూడా పాల్గొన్నారు. వారిపై కేసు నమోదు చేయడానికి వీలు లేదంటూ జమ్ము బార్ కౌన్సిల్ సభ్యులు కోర్టులో పెద్ద రబస సృష్టించారు. కేసు పేపర్లను చించేశారు. ఆరోజు నుండి చిన్నారి ఆసిఫా కుటుంభానికి , వారికి మద్దతు తెలిపిన వారికి అనేక బెదిరింపులు వస్తున్నాయి.
ఈ దుర్మార్గమైన సంఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు రావడంతో తప్పని సరి పరిస్థితుల్లో స్పందించిన మోడీ నిందితులకు మద్దతుగా నిల్చిన జమ్ము కాశ్మీర్ బీజేపీ మంత్రులతో రాజీనామా చేయించారు. ఈ సంఘటన చూసి దేశం సిగ్గుపడాలి అని ప్రకటించారు. అయితే ఆయన అనుచరులు మాత్రం ఎలాంటి సిగ్గూ ఎగ్గూ లేకుండా నిందితులను కాపాడడానికి శతవిదాలా ప్రయత్నిస్తున్నారు. అడ్వకేట్ దీపికా సింగ్‌ రజావత్ లాంటి వాళ్ళను బెదిరించే పనిలో బిజీగా ఉన్నారు.

Keywords : asifa, jammu, rape and murder, police, rss, bjp
(2018-04-22 01:23:08)No. of visitors : 713

Suggested Posts


ʹనేను ముస్లింను నన్ను కౌగలించుకోండిʹ....

ముంబై మహా నగరంలో గేట్ వే ఆఫ్ ఇండియాకు దగ్గరలో ఓ ఫుట్ పాత్ పై ఓ యువకుడు కళ్ళకు గంతలు కట్టుకొని నిలబడి ఉన్నాడు. అతని పక్కన ఓ ప్లకార్డ్ ఉంది దానిపై ʹనేను ముస్లిం ను, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరూ నన్ను నమ్మేట్టయితే వచ్చి కౌగలించుకోండిʹ...

Muslim child punished for refusing to sing Hindu prayer

Naushad Kashimjiʹs (name changed) school adopted a few Sanskrit shlokas as its official prayer for the morning assembly this academic year. Last week, when Kashimjiʹs principal caught him and a few other Muslim students for not singing the prayer, they were punished for it....

ముస్లిం మహిళలపై ప్రభుత్వం కపట ప్రేమ‌ - డానీ

భారత ముస్లిం సమాజాన్ని నయా బానిసగా మార్చి హిందూత్వ శక్తులకు ఊడిగం చేసేలా లొంగదీయడానికే ఇప్పుడు ముస్లిం మహిళల (వైవాహిక హక్కుల పరిరక్షణ) బిల్లును తెస్తున్నారని కొందరు వ్యక్తం చేస్తున్న ఆందోళన కొట్టిపడవేయ దగ్గదేమీకాదు.

Search Engine

ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టంపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నిర‌స‌న‌ల‌కు మావోయిస్టు పార్టీ పిలుపు
మహిళా జర్నలిస్టులపై బిజెపి నేత అనుచిత వ్యాఖ్యలు - ‍పార్టీ ఆఫీస్ ముందు జర్నలిస్టుల నిరసన‌
క‌థువా, ఉన్నావ్ నుండి చింతగుఫా వ‌ర‌కు
ఇంద్రవెల్లి ఇంగలం - వరవరరావు
Statement of the First Meeting of European Marxist-Leninist-Maoist Parties and Organizations
ఆసిఫా హ‌త్యాచారం: మోడీని ఏకిపడేసిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక‌
ʹమోడి నాట్ వెల్కమ్ʹ ... లండన్ లో భారతీయుల నిరసనలు
“It’s The State That’s Violating the Constitution, Not Us”
Women in People’s War: Past, Present and Future
Expand The Peopleʹs War To Fight Brahmanical Hindu Fascism And Advance The New Democratic Revolution - Varavara Rao
బంద్ సందర్భంగా ముగ్గురు దళితులను కాల్చి చంపింది ఉగ్రకుల మూక‌ !
ఇప్పుడు కావాల్సింది ఇలాంటి జర్నలిస్టులే !
యస్సీయస్టీ చట్టంపై ఎందుకింత అసహనం? - వాహెద్
ఏది ఫేక్ న్యూస్ ? దీనిని ఎవరు ప్రచారం చేస్తున్నారు ?
ఎగిసిన దళితాగ్రహం..బంద్ విజయవంతం...నిరసనపై పోలీసు తూటా.. 9 మంది బలి !
SC,STచట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలకు నిరసనగా రేపు భారత్ బంద్
పృథ్వీరాజ్,చందన్ లు HCU VC పై హత్యా యత్నం చేశారన్న‌ఆరోపణలు ఓ కుట్ర‌ - వరవరరావు
జిగ్నేష్ మేవాని... కొత్త దళిత రాజకీయాలు - ఎన్. వేణు గోపాల్ (2)
జిగ్నేష్ మేవాని... కొత్త దళిత రాజకీయాలు - ఎన్. వేణు గోపాల్ (1)
పోలీసులు కిడ్నాప్ చేసిన విరసం సభ్యుడు పృథ్వీరాజ్,చందన్ లను విడుదల చేయాలి !
దశాబ్దం దాటినా ఆరని కన్నీటి మంట... అయేషా మీరా హంతకులకు పాలకుల అండ‌
ఇంట‌ర్మీడియెట్ బోర్డును ముట్ట‌డించిన తెలంగాణ విద్యార్థి వేదిక - 70 మంది విద్యార్థుల‌ అరెస్టు
Ban Sri Chaitanya & Narayana Corporate Colleges
ఆ హంతకుడే తమ రాముడంటూ ఊరేగించిన మతోన్మాదులు
more..


చిన్నారి