ఆసిఫా హ‌త్యాచారం: మోడీని ఏకిపడేసిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక‌


ఆసిఫా హ‌త్యాచారం: మోడీని ఏకిపడేసిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక‌

ఆసిఫా

కఠువా, ఉన్నావ్‌ అత్యాచార ఘటనలపై ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతలు వ్యవహరించిన తీరు అంతర్జాతీయంగా కూడా భారత్‌ ప్రతిష్ఠను మసకబార్చాయి. మోదీ తీరుపై న్యూయార్క్‌ టైమ్స్‌ ఓ సంపాదకీయం రాసింది. ʹఅన్ని విషయాల మీదా మోదీ ప్రతీరోజూ ట్వీట్లు చేస్తారు. కానీ జాతీయవాద, మతతత్వవాదుల బారిన పడుతున్న మహిళలు, మైనారిటీలకు పొంచి ఉన్న ప్రమాదాలపై మాట్లాడరు. ట్వీట్‌ చెయ్యరు. జనవరిలో కఠువాలో ఎనిమిదేళ్ల బాలికపై కర్కశంగా అత్యాచారం జరిగింది. దుర్మార్గం ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పే ఘటన అది. అయినా కొద్ది వారాల కిందట దాకా మోదీ స్పందించలేదు. ఆ మాట్లాడినది కూడా ఏదో తూ తూ మంత్రంగా..! ప్రజాగ్రహం కట్టలు తెంచుకునే దాకా మోదీ మిన్నకున్నారు. ఆయన పార్టీ తరఫు మంత్రులు, నాయకులు కశ్మీర్‌లో నిందితుల పక్షాన తీసిన ర్యాలీలో పాల్గొన్నారుʹ అని ఆ సంపాదకీయం దుయ్యబట్టింది.

ʹఉన్నావ్‌లోనూ అంతే.. బీజేపీ ఎమ్మెల్యే ఒకరు తనను కిందటి వేసవిలో అత్యాచారం చేశారని ఓ టీనేజీ అమ్మాయి చెప్పినా పోలీసు యంత్రాంగం పట్టించుకోలేదు. ఇంత జరిగినా మోదీ మౌనం వహించారు. ʹʹకొద్ది రోజులుగా చర్చ జరుగుతున్న ఘటనలు అని ఆ రేప్‌ కేసులను ఆయన అభివర్ణించారు. మన కుమార్తెలకు న్యాయం జరుగుతుంది అనే ఆయన హామీలో డొల్లతనం బయటకు వినిపిస్తూనే ఉంది. మోదీ అనుసరిస్తున్న మౌనం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశ ఆరోగ్యానికి మంచిది కాదు. ప్రధాని అంటే దేశప్రజలందరి బాగోగులూ పట్టించుకోవాలి.. తన రాజకీయ పక్షానికి చెందిన వారిని మాత్రమే కాదుʹʹ అని చెరిగిపారేసింది.

Keywords : new york times , narendra modi, america, india, asifa
(2018-09-18 06:29:34)



No. of visitors : 696

Suggested Posts


ఆ దుర్మార్గులు బైటికొస్తే మమ్మల్నీ చంపేస్తారు...కథువా చిన్నారి తల్లి ఆందోళన‌

ʹనా బిడ్డపై అత్యాచారం చేసి, చిత్ర హింసలు పెట్టి హత్య చేసిన ఆ దుర్మార్గులు జైలు నుండి బైటికొస్తే మమ్మల్ని కూడా చంపేస్తారు. వాళ్ళు తాము అమాయకులమని చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు దుర్మార్గులు రసానాలో తాము గడిపిన రోజులు నిజంగా భయంకరమైనవి, సాంజీరామ్‌(బాలిక హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు) కుటుంబీకులు చాలా క్రూరంగా

క‌థువా, ఉన్నావ్ నుండి చింతగుఫా వ‌ర‌కు

ఇటీవ‌లి ప్ర‌ధాన‌మంత్రి బీజాపుర్ ప‌ర్య‌ట‌న గురించి మ‌న‌కు తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా మోదీ ఒక ఆదివాసీ మ‌హిళ‌కు వంగి చెప్పులు తొడిగే ఫొటో మీడియాలో హ‌ల్‌హ‌ల్ చేసింది. ఈ సంద‌ర్భంగా బీజేపీ మోదీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కూడా కురిపించింది.

కథువా చిన్నారి కేసు పంజాబ్ కు బదిలీ..సిబీఐ విచారణకు నో..సుప్రీంతీర్పు

జమ్ము కాశ్మీర్ లోని కథువాలో చిన్నారిని కిడ్నాప్ చేసి, చిత్ర హింసలు పెట్టి, అత్యాచారం చేసి, హత్య చేసిన కేసు విచారణను జమ్ముకశ్మీర్‌ కోర్టు నుంచి పఠాన్‌కోట్‌ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి బాధితురాలి తండ్రి వేసిన పిటిషన్‌ను కోర్టు అంగీకరించింది. ఈ సంఘట్నపై సీబీఐ విచారణ జరపాలన్న నిందితుల వాదనను కోర్టు తి

ʹమోడి నాట్ వెల్కమ్ʹ ... లండన్ లో భారతీయుల నిరసనలు

కామన్వెల్త్‌ ప్రభుత్వాధినేతల సమావేశంలో పాల్గొనేందుకు లండన్‌ వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి చేదు అనుభవం ఎదురైంది. ఆయన విదేశీ పర్యటనల్లో ఎప్పుడు లేని విధంగా నిరసనలు చవిచూడాల్సివచ్చింది.

Search Engine

దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది-ఒడిషాలో బలపడ్డాం..విస్తరిస్తున్నాం: మావోయిస్టు పార్టీ
నన్నో దేశద్రోహిగా చిత్రీకరించాలని పోలీసులు ప్రయత్నించారు..!
ఓటమిని అంగీకరించలేక బీభత్సం సృష్టించిన ఏబీవీపీ.. గూండాలతో లెఫ్ట్ విద్యార్థులపై దాడి
హక్కుల కార్యకర్తల అక్రమ అరెస్టుల కేసులో పిటిషనర్ల లాయర్ సుప్రీంకు చెప్పిన నిజాలు ఇవే
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
ఆంటీ! చంపేసారాంటీ..నా ప్రణయ్‌ను చంపేసారు
జేఎన్‌యూపై ఎర్రజెండా రెపరెపలు.. మతోన్మాదులను మట్టి కరిపించి లెఫ్ట్‌ను మళ్లీ గెలిపించిన విద్యార్థులు
నీ కోసం వేలాది మంది వచ్చారు.. ఒక్కసారి లే ప్రణయ్..
ప్రొఫెసర్ సాయిబాబకు చిన్నారి సాహస్ లేఖ.. ప్రశ్నించడమే నువ్వు చేసిన తప్పా..?
ఇవి పరువు హత్యలు కావు.. దేశం పరువు తీసే హత్యలు
అమృత తండ్రి దుర్మార్గపు చరిత్ర.. కూతురు కంటే పరువే ముఖ్యమంటున్న కులోన్మాది
ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదే.. పెద్దలను కూడా ఈడ్చిపడేయటమే
ప్ర‌శ్నించ‌డ‌మే నేర‌మైన‌ప్పుడు : క్రాంతి
తలపాగా ధరించాడని ఎస్సీ వర్గీయుడి తల ఒలిచేసిన అగ్రకుల ఉన్మాదులు
ʹక్రాంతి కోస‌మే ఈ ప్ర‌యాణంʹ
SUSPEND AGREEMENTS WITH INDIA UNTIL THE HUMAN RIGHT ACTIVISTS ARE RELEASED : MEP TO EUROPEAN COMMISSION
స్వచ్చమైన హిందీ, సంస్కృత భాషలో ఉన్న ఉత్తరం వరవరరావు రాసిందేనా.?
మొదటి అర్బన్ నక్సల్ భగత్ సింగ్
ʹజీవితాన్ని ధారపోయడమే నక్సలిజం అయితే, నక్సలైట్లు చాలా మంచి వాళ్లుʹ
70 ఏండ్ల చరిత్రను తిరగరాసిన విద్యార్థిని.. మతోన్మాద శక్తులపై లెఫ్ట్ విజయం
ప్రజల సభంటే.. ఇట్లుంటది
Punjab:Dalit bodies protest arrest of 5 human rights activists
Why are the Indian authorities afraid of a ʹhalf-Maoistʹ?
ʹప్రధాని హత్యకు కుట్రʹ కేసు ఓ కుట్ర..మేదావుల అరెస్టు దుర్మార్గం..మావోయిస్టు పార్టీ ప్రకటన‌
హిందూత్వ తీవ్రవాదుల హిట్‌ లిస్టులో దభోల్కర్‌ కుమార్తె
more..


ఆసిఫా