క‌థువా, ఉన్నావ్ నుండి చింతగుఫా వ‌ర‌కు

క‌థువా,

ఇటీవ‌లి ప్ర‌ధాన‌మంత్రి బీజాపుర్ ప‌ర్య‌ట‌న గురించి మ‌న‌కు తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా మోదీ ఒక ఆదివాసీ మ‌హిళ‌కు వంగి చెప్పులు తొడిగే ఫొటో మీడియాలో హ‌ల్‌హ‌ల్ చేసింది. ఈ సంద‌ర్భంగా బీజేపీ మోదీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కూడా కురిపించింది. ఆదివాసులంద‌రికి కాదు... ఎండుటాకులు సేక‌రించే కుటుంబాల‌లో ఒక్క‌రికి చెప్పులు తొడిగినందుకే ఇంత‌టి ప్ర‌చారం. చెప్పుల విష‌యం ప‌క్క‌న పెడితే, 2005 నుంచి స‌ల్వాజుడుం వ‌ల్ల‌ ఆస్థి, ఇల్లు న‌ష్ట‌పోయిన ఏ ఒక్క కుటుంబానికి కూడా ప్ర‌భుత్వం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ న‌ష్ట‌ప‌రిహారం అంద‌లేదు.

అంబేద్క‌ర్ జ‌యంతి రోజు, జై భీం అంటే స‌రిపోదు. ఆయ‌న కాంక్షించిన నిజ‌మైన ప్ర‌జాస్వామ్యం కోసం పాటుప‌డాలి. కానీ, ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డాల్సిన ప్రజా ప్ర‌తినిధులే కొంద‌రు అత్యాచార నిందితులైన వారికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నారు. త‌మ ఆస్తి న‌ష్ట‌పోయి, అయిన వారిని కోల్పోయి, అత్యాచారాల‌కు బ‌లైన ఎంద‌రో ఆదివాసీల‌కు న్యాయం జ‌రిగేదాకా, ప్ర‌భుత్వానికి, న‌క్స‌ల్స్‌ను ఆయుధాలు వీడ‌మ‌ని చెప్పే నైతిక హ‌క్కులేదు.

స‌రిగ్గా సంవ‌త్స‌రం క్రితం ఏప్రిల్ 2017లో సుక్మా జిల్లాలోని చింత‌గుఫ గ్రామంలో సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు ఒక మైన‌ర్ బాలిక‌పై అత్యాచారం చేశారు. గ‌త ఏడాది ఏప్రిల్ 2 తెల్ల‌వారుజామున 4 గంట‌ల ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు భాదితురాలి ఇంటికి వ‌చ్చారు. మావోయిస్టు అనే నెపంతో భాదితురాలి అన్న కోసం వెతికారు. కానీ అత‌ను లేక‌పోవ‌డంతో ఇంట్లో ఉన్న అత‌డి త‌ల్లిని, చెల్లిని బంధించి, ఆమెను కొంత దూరం ఈడ్చుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ క్ర‌మంలో ఆమె తీవ్రంగా గాయ‌ప‌డింది కూడా. చీక‌టి వ‌ల్ల ఆమె నింధితుల‌ను గుర్తించ‌లేక పోయింది.

ఏప్రిల్ 3న ఈ ఉదంతం ఒక గ్రామ‌స్తుడి వ‌ల్ల బ‌య‌టికి పొక్కింది. ఏప్రిల్ 4న న‌యీ దునియా అనే ప్ర‌తిక ఈ విష‌యాన్ని వెలుగులోకి తీసుకువ‌చ్చింది. కాగా, ఈ సంఘ‌ట‌న‌ను న‌క్స‌ల్స్ సృష్టిస్తున్న త‌ప్పుడు ప్ర‌చారంగా డీఐజీ పి సుంద‌ర్ రాజ్ కొట్టిపారేశాడు. పిల్ల‌లపై లైంగిక నేరాల చ‌ట్టం కింద కేసు న‌మోదు చేయాల్సిన పోలీసులు విచార‌ణ‌కు ముందే ఇలాంటి వాఖ్య‌లు చేయ‌డం, ఈ విష‌యాన్ని రిపోర్టు చేసిన పాత్రికేయుడిని బెదిరించడాన్ని బ‌ట్టి అక్క‌డి ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకోవ‌చ్చు.

ఏప్రిల్ 5న, నేష‌న‌ల్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ ఉమెన్స్ (ఎన్ఎఫ్ఐడ‌బ్ల్యూ) వారు, భాదిరురాలిని, ఆమె త‌ల్లిని ఎస్‌పీని క‌లిసేందుకు సుక్మా జిల్లా కేంద్రానికి తీసుకువ‌చ్చారు. విచిత్రంగా పోలీసులు ఆ ఇద్ద‌రిని క‌స్ట‌డీలోకి తీసుకొని, వారి ఆత్మ‌ర‌క్ష‌ణ కోస‌మే అంటూ స‌మ‌ర్థించుకున్నారు. నేర‌స్థుల‌ను వ‌దిలి, భాదితుల‌నే అరెస్టు చేసిన పోలీసుల నుండి ఏ న్యాయం ఆశించ‌గ‌లం? క్ర‌మంగా కేసు వెన‌క్కి తీసుకోమ‌ని భాదితురాలిపై వేధింపులు మొద‌ల‌య్యాయి.

పోలీసుల క‌థ‌నంలో లోపాలు

జ‌గ్ద‌ల్‌పూర్‌లో భాదితురాలికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఆ రిపోర్టులో.... "ఏప్రిల్ 2వ తేది సుమారు 4గంట‌ల‌కు భాదితురాలిని ముగ్గురు వ్య‌క్తులు అప‌హ‌రించ‌గా, వారు ఆమెను క‌ట్టెతో కొట్ట‌డం వ‌ల్ల మెడ ఎడ‌మ వైపు గాయం అయ్యింది. వారు ఆమెను బ‌ల‌వంతం చేయ‌గా, భాదితురాలు త‌న్న‌డంతో వారు పారిపోయారు. గాయం 2x1.5 ఇంచులు. వారం ముందు జ‌రిగింది. అత్యాచారం కాలేదు" అని రాశారు.
జ‌గ్ద‌ల్ పూర్‌లోని మ‌హారాణి ఆసుప‌త్రి రిపోర్టులో.... ఇద్ద‌రు వ్య‌క్తులు బాధితురాలిని కొట్ట‌డం వ‌ల్ల గాయం అయ్యింద‌ని పేర్కొంటే, పోలీసులు మాత్రం త‌లుపు తెరుస్తుంటే ప్ర‌మాద‌వ‌శాత్తు క‌ట్టె త‌గిలి గాయ‌మైంద‌ని పేర్కొన్నారు.

బాధితురాలి వ‌య‌సును సైతం పోలీసులు త‌ప్పుగా సూచించారు. బాధితురాలు 15 - 16 సంవ‌త్స‌రాలు ఉంటుంద‌ని గ్రామ‌స్థులు పేర్కొన్నారు. కానీ పోలీసులు 20 - 22 ఏళ్ల మ‌ధ్య ఉంటుంద‌న్నారు. వైద్య రిపోర్టు త‌రువాత వాళ్ల వాద‌న‌ను మార్చుకున్నారు. స‌మ‌యాన్ని , వ‌య‌సును ప్ర‌కృతి స‌హాయంతో అంచ‌నా వేసే ఆదివాసీల‌కే నేర్పే అంత నిష్ణాతులు క‌దా పోలీసులు.

ఏప్రిల్ 8న ఈ కేసును జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌కు బ‌ద‌లాయించారు. పోలీసుల‌ను స‌మాధానం ఇవ్వాల్సిందిగా ఆదేశించిన క‌మీష‌న్ బాధిరురాలి నుంచి స‌మాధానం రాలేద‌ని, క‌నీస విచార‌ణ కూడా జ‌ర‌ప‌కుండా రెండున్న‌ర నెల‌ల్లోనే కేసును కొట్టేసింది.

అక్టోబ‌ర్ 25న భాదితురాలి నుంచి ఏ స‌మాధానం రానందున ఆమె పోలీసుల రిపోర్టుతో సంతృప్తి చెందింద‌ని ఈ కేసు విష‌యంలో జోక్యం అవ‌స‌రం లేద‌ని భావించి, కేసు కొట్టి వేస్తున్నామ‌ని అక్టోబ‌ర్ 25న క‌మీష‌న్ పేర్కొంది.

గోండి త‌ప్ప వేరే భాష తెలియ‌ని భాదితురాలు, హిందీలో ఉన్న పోలీసు రిపోర్టును, ఇంగ్లీషులో ఉన్న మెడిక‌ల్ రిపోర్టును అర్థం చేసుకొని, కేసు వెన‌క్కి తీసుకోమ‌నే వేధింపుల మ‌ధ్య‌, అన్నింటికి మించి త‌న‌కు జ‌రిగిన శారీర‌క‌, మాన‌సిక హింస‌, భ‌యాల మ‌ధ్య‌, ఆమె నుండి స‌మాధానం రాలేద‌నే ఒకే ఒక్క నెపంతో కేసు కొట్టేయ‌డం ఎంత అన్యాయం.

ఐనా.. స‌ల్వాజుడుం మొద‌లైన 2005 నుంచి ఏ ఒక్క హ‌త్య‌, అత్యాచారం కేసులో భాదితులు న్యాయానికి నోచుకోలేదు. మాన‌వ హ‌క్కుల క‌మీష‌న్, మ‌హిళా క‌మీష‌న్, సుప్రీంకోర్టు, ప్ర‌భుత్వం, ఏ ఒక్క‌టీ వారికి అండ‌గా నిల‌బ‌డ‌లేదు.

క‌థువా, ఉన్నావ్ నుండి చింతగుఫా వ‌ర‌కు త‌మ బిడ్డ‌ల‌ను కాపాడుకోలేని దేశం, ఇంకా బ‌తికే ఉంద‌ని ఎలా అనుకోగ‌లం?

అనువాదం : స‌్వేచ్ఛ‌
thewire.in సౌజ‌న్యంతో.
(virasam.org లోనుండి తీసుకున్నాం)

Keywords : kathuva, unnau, asifa, chinthagufa, dandakaranyam, chattis garh, police
(2024-03-21 23:07:43)



No. of visitors : 1111

Suggested Posts


ఆసిఫా హ‌త్యాచారం: మోడీని ఏకిపడేసిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక‌

కఠువా, ఉన్నావ్‌ అత్యాచార ఘటనలపై ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతలు వ్యవహరించిన తీరు అంతర్జాతీయంగా కూడా భారత్‌ ప్రతిష్ఠను మసకబార్చాయి. మోదీ తీరుపై న్యూయార్క్‌ టైమ్స్‌ ఓ సంపాదకీయం రాసింది.

ఆ దుర్మార్గులు బైటికొస్తే మమ్మల్నీ చంపేస్తారు...కథువా చిన్నారి తల్లి ఆందోళన‌

ʹనా బిడ్డపై అత్యాచారం చేసి, చిత్ర హింసలు పెట్టి హత్య చేసిన ఆ దుర్మార్గులు జైలు నుండి బైటికొస్తే మమ్మల్ని కూడా చంపేస్తారు. వాళ్ళు తాము అమాయకులమని చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు దుర్మార్గులు రసానాలో తాము గడిపిన రోజులు నిజంగా భయంకరమైనవి, సాంజీరామ్‌(బాలిక హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు) కుటుంబీకులు చాలా క్రూరంగా

కథువా చిన్నారి కేసు పంజాబ్ కు బదిలీ..సిబీఐ విచారణకు నో..సుప్రీంతీర్పు

జమ్ము కాశ్మీర్ లోని కథువాలో చిన్నారిని కిడ్నాప్ చేసి, చిత్ర హింసలు పెట్టి, అత్యాచారం చేసి, హత్య చేసిన కేసు విచారణను జమ్ముకశ్మీర్‌ కోర్టు నుంచి పఠాన్‌కోట్‌ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి బాధితురాలి తండ్రి వేసిన పిటిషన్‌ను కోర్టు అంగీకరించింది. ఈ సంఘట్నపై సీబీఐ విచారణ జరపాలన్న నిందితుల వాదనను కోర్టు తి

ʹమోడి నాట్ వెల్కమ్ʹ ... లండన్ లో భారతీయుల నిరసనలు

కామన్వెల్త్‌ ప్రభుత్వాధినేతల సమావేశంలో పాల్గొనేందుకు లండన్‌ వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి చేదు అనుభవం ఎదురైంది. ఆయన విదేశీ పర్యటనల్లో ఎప్పుడు లేని విధంగా నిరసనలు చవిచూడాల్సివచ్చింది.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


క‌థువా,