ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టంపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నిర‌స‌న‌ల‌కు మావోయిస్టు పార్టీ పిలుపు


ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టంపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నిర‌స‌న‌ల‌కు మావోయిస్టు పార్టీ పిలుపు

ఎస్సీ,


ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం-1969ʹ నిరోధ‌క కేసుల్లో తక్షణ అరెస్టులు వద్దంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును మావోయిస్టు పార్టీ త‌ప్పుబ‌ట్టింది. దేశానికి స్వతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా పాల‌క పార్టీలు దళితుల, ఆదివాసీ జీవితంలో ఎటువంటి మార్పును తేలేద‌ని ఆరోపించింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశవ్యాప్తంగా దళితులకు వ్యతిరేకంగా దాడులు పెరిగాయ‌ని శ‌నివారం విడుద‌ల చేసిన మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర క‌మిటీల సంయుక్త ప్ర‌క‌ట‌నలో పేర్కొన్న‌ది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టంపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఏప్రిల్ 25న నిరసన దినం పాటించాల‌ని పార్టీ దండ‌కార‌ణ్య స్పెష‌ల్ జోన‌ల్ క‌మిటీ అధికార ప్ర‌తినిధి విక‌ల్ప్‌, తెలంగాణ రాష్ట్ర క‌మిటీ అధికార ప్ర‌తినిధి జ‌గ‌న్ పిలుపునిచ్చారు.

ప్ర‌క‌ట‌న పూర్తి పాఠం ఇలా...

ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టంపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఏప్రిల్ 25న నిరసన దినం పాటించండి

ʹఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంʹ కేసుల్లో తక్షణ అరెస్టులు వద్దని, మార్చి 20న సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాంటి కేసుల్లో వారంలోగా ప్రాథమిక విచారణ నిర్వహించి ఫిర్యాదు సరైందేనని నిర్ధారించుకోవాలని, ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకపోతే ముందస్తు బెయిల్ కూడా ఇవ్వవచ్చని కోర్టు పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదైనా, అరెస్టు తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.

ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఫిర్యాదు దాఖలైతే ఏ విధంగా ముందుకెళ్లాలన్న అంశంపై కూడా సుప్రీం ఆదేశాలిచ్చింది. ప్రభుత్వోద్యోగిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మేరకు ఫిర్యాదు చేస్తే... ఆ ఉద్యోగికి అరెస్టుకు సంబంధిత నియామక అధికారి అనుమతి తప్పనిసరి అని చెప్పింది, ఇతరులపై ఫిర్యాదుల విషయంలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లేదా డీఎస్పీ అనుమతి అవసరముంది.

ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపిస్తూ, దళిత సంఘాలు ఏప్రిల్ 2న భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఉత్తర, తూర్పు భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపి, దేశవ్యాప్తంగా బంద్ విజయవంతమైంది. మధ్య ప్రదేశ్, రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో పోలీసు కాల్పులు, అరెస్టులు జరిగాయి. 9 మంది పౌరులు మరణించగా, వందల మంది గాయపడ్డారు. వేలాది మందిని అరెస్టు చేసారు. కొన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలు బంద్ అయ్యాయి. విద్యాసంస్థలకు శెలవులు ప్రకటించారు. ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేసారు. ఒడిశా, జార్ఖండ్, గుజరాత్ లోని ప్రధాన పట్టణాలలో జనజీవవనానికి అంతరాయం కలిగింది.

పార్లమెంటు శాసన విధానానికి సుప్రీంకోర్టు ఉత్తర్వులు విరుద్ధంగా ఉన్నాయని ఎస్సీ, ఎస్టీలపై ఈ తీర్పు తీవ్ర ప్రభావం చూపుతుందని, కేంద్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో ఏప్రిల్ 1న తీర్పును సమీక్షించాలంటూ, రివ్యూ ఫిటిషన్ దాఖలు చేసింది. ఎస్సీ, ఎస్టీల భద్రత విషయంలో అనుకూలంగా ఉన్నానని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రకటించుకుంటుంది. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశంలో దళితులు, మైనార్టీపై అత్యాచారాల ఘటనలు పెరిగిపోయాయని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఏదో మొక్కుబడిగా నిరసనలు ప్రకటిస్తున్నది. కాంగ్రెస్ పాలనలోనే ఎక్కువ జరిగాయని బీజేపీ ప్రత్యారోపణ చేస్తున్నది.

దేశానికి స్వతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా, అధికారంలో ఏ పాలక పార్టీ ఉన్నా, దళితుల, ఆదివాసీ జీవితంలో ఎటువంటి మార్పును తేలేదు. చట్టాలు ఎన్ని చేసినా వాటిని చిత్తశుద్ధితో అమలు చేయలేదు. ఇప్పుడు వారిచే నియంత్రించ బడుతున్న న్యాయవ్యవస్థ దళితుల రక్షణకు అనుకూలంగా ఉన్న ఆ ఒక్క చట్టాన్ని నీరుగార్చడానికి ఉద్దేశించినదే. దళితులు, ఆదివాసులపై ఆధిపత్య వర్గాల దాడులు యధేచ్చగా జరగడం వాటికి దాతు ఫిర్యాదు లేకుండా ఉండేది. ఈ చట్టం) కొంచెం వారు అవమానాలకు, దాడులకు, గురైనప్పుడు అండగా ఉంటుంది. కానీ సుప్రీంకోర్టు తీర్పు మళ్ళీ ఆదిపత్య వర్గాలకు వరంగా మారబోతున్నది. పాలక వర్గాల పాలనా విధానాలు, ఉన్నత న్యాయస్థానాల ప్రజావ్యతిరేక తీర్పులు ముఖ్యంగా దళితులను మరింత సమస్యల్లోకి నెడుతున్నాయి.

కంచికచర్ల కోటేశ్ నుండి మొదలుపెట్టి కారం చేడు దళితులపై దాడులు, కెల్విన్మణి లాంటి ఘటనలకు వ్యతిరేకంగా | పెల్లుబుకిన ఆందోళనలు, మహారాష్ట్రలోని దళిత పాంథర్స్ చేసిన ఆందోళనలు లాంటి చరిత్ర మనకు తెలుసు, బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశవ్యాప్తంగా దళితులకు వ్యతిరేకంగా ఒక ట్రెండ్గానే యూనివర్సిటీల్లోను, మహల్లాలోను దళితులపై దాడి ఎక్కుపెట్టబడింది. అందులో భాగంగానే గుజరాత్, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్రలలో జరిగిన వివిధ రకాలైన దళితులపై దాడులను చెప్పవచ్చు. ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్ విధానాన్ని నీరుగార్చుతుంది. ఒక పథకం ప్రకారం సోషల్ మీడియాలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఏప్రిల్ 10న బందను ఆర్గనైజ్ చేసింది. గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు కుదించి వేయబడ్డాయి. విద్యాసంస్థలు మూసివేయబడ్డాయి. ఆ మిగిలిన కొద్దిపాటి రిజర్వేషన్లు కూడా అందకుండా కుట్రలు చేస్తుంది.

ఒక పక్క అంబేద్కర్ ను పొగుడుతూ, అంబేద్కర్ పేరు చాటున ఓట్ల రాజకీయం చేస్తూ, ప్రజలను దగా చేస్తుంది. దేశంలో ఊనా నుండి నిన్న మొన్నటి ఘటనలు దాకా దళిత |వ్యతిరేక సంఘపరివార్ ఉన్మాదం పెట్రేగిపోతూనే ఉంది. దళితుల ఓట్ల కోసం సవర్ణులందరూ (బీజేపీ, కాంగ్రెస్ మొదలగు) దళితుల గురించి మాట్లాడుతున్నారే తప్ప వారికి చిత్తశుద్ధి లేదు. దళితుల్లోంచి ఒక కొత్త యువతరం ముందుకొచ్చి గొప్పగా సంఘటితమవుతున్న సందర్భాన్ని ఆహ్వానిద్దాం. కొరైగావ్ లాంటి ఘటనలకు వెంటనే ప్రతిస్పందన చూపిన చైతన్యాన్ని, దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్న ప్రజాస్వామ్య గళాన్ని, నిరసన ప్రదర్శనలో భాగమవుతున్న వివిధ సెక్షన్ల ప్రజలను ఆహ్వానిద్దాం. | సుప్రీంకోర్టు ఇటువంటి ప్రకటన చేస్తుందని తెలిసి కూడా కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకోలేదు. ప్రజలు, అన్ని సెక్షన్లు ఆందోళనకు దిగడం బండ్లు నిర్వహించడం, అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించడం, బీజేపీ పార్టీలోనే కొంత మంది నాయకులు దీన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడడంతో కేంద్ర ప్రభుత్వం ఆత్మ రక్షణలో పడి రివ్యూ ఫిటీషన్ వేసింది తప్ప దానికి చిత్తశుద్ధిలేదు. ప్రతిపక్ష రాజకీయ పార్టీలుపైకి వ్యతిరేకిస్తున్నాయే తప్ప ఇంత పెద్ద, ముఖ్యమైన సమస్య పట్ల సరైన |విధానాన్ని అనుసరించి పోరాటానికి ప్రజలను సిద్ధం చేయడానికి పూనుకోవడం లేదు.

విప్లవోద్యమ ప్రాంతాల్లో దళితులు, ఆదివాసులపై ప్రభుత్వ సాయుధ బలగాలు యధేచ్చగా అత్యాచారాలు, హత్యాకాండ చేస్తున్నాయి. వీటిపై అసలు కేసులు నమోదు చేయడం లేదు. ప్రభుత్వ కమీషన్లు ఈ అత్యాచారాల పట్ల ఉదాసీనంగాను, నిర్లక్ష్యంగాను ఉన్నాయి. అత్యాచారాలు చేసిన పోలీసులకు అవుటాప్ టర్న్ ప్రమోషన్లు కూడా ఇస్తున్నారు. రాజ్య స్వభావాన్ని వ్యక్తీకరించే ఈ ఘటనల పట్ల సమాజం సిగ్గుతో తల వంచుకుంటుంది.

దళితులు, ఆదివాసులు తము పోరాడి సాధించుకున్న ఈ చట్టాన్ని రక్షించుకోవడానికి ఉద్యమించాలి. దళితుల ఆదివాసుల మౌలిక సమస్యల పరిష్కారానికి భూమి కేంద్రంగా ఉద్యమించాలి. దళితులకు, ఆదివాసులకు ఆత్మగౌరవం కావాలన్నా, స్వావలంభన ఒనగూరాలన్నా భూమి, అధికారం దక్కాలి. భూమి, భుక్తి, విముక్తి లక్ష్యంగా సాగుతున్న నూతన ప్రజాస్వామిక విప్లవం ఒక్కటే దళితులతో సహా అన్ని సెక్షన్ల ప్రజల మౌలిక సమస్యలకు పరిష్కారం తప్ప మరొకటి కాదు. 70 సంవ‌త్స‌రాల భారత పార్లమెంటరీ రాజకీయాలు పరిష్కారం చూపవని తేటతెల్లమైంది. దళితులపై దాడులు జరగకుండా ఉండాలన్నా, దళితులకు రిజర్వేషన్లు అమలు కావాలన్నా, అభివృద్ధి పధంలో పోవాలన్నా దళితులు పోరాడక తప్పదు. బీజేపీ ప్రభుత్వ విధానాలకు, సుప్రీంకోర్టు దళిత, ఆదివాసీ వ్యతిరేక ఆదేశాలకు నిరసనగా ఈ నెల 25న జరిగే నిరసన దీనాన్ని పాటించాలని అన్ని సెక్షన్ల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. -

ఉన్నత న్యాయస్థానం తాత్కాలికంగా మార్చి 20 నాటీ ఆదేశాన్ని ఉపసంహరించుకున్నా, ఈ ప్రమాదం భవిష్యత్లో మరోసారి కూడా వచ్చేందుకు అవకాశం ఉంది కాబట్టి ప్రజాస్వామిక శక్తులు అప్రమత్తంగా ఉండాల్సిన అవుసరం ఉంది.

విప్లవోద్యమం మొదటి నుండి దళితుల పక్షాన నిలిచి దళితులకు అన్ని విధాల రక్షణ కల్పిస్తూ, వారి మౌళిక హక్కుల రక్షణకు చిత్తశుద్ధితో పనిచేస్తుంది. సుప్రీంకోర్టు మార్చి 20న వెలువరించిన తీర్పుకు నిరసనగా ఏప్రిల్ 25వ తేదీన నిరసన దినాన్ని పాటించాలని అన్ని సెక్షన్ల ప్రజలను కోరుతున్నాము.

వికల్స్,
అధికార ప్రతినిధి, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సి.పి.ఐ (మావోయిస్టు)

జగన్
అధికార ప్రతినిధి, తెలంగాణ రాష్ట్ర కమిటీ సి.పి.ఐ (మావోయిస్టు)

12 ఏప్రిల్, 2018

Keywords : maoist, jagan, vikalp, sc, st act, protest
(2019-04-22 04:48:14)No. of visitors : 2201

Suggested Posts


A Powerful Reply from Maoist Leaderʹs Daughter to Home Minister

When I was 10, my four-year-old sister Savera and our mother were unreasonably taken into police custody. Due to the unending harassment from your force....

జంపన్న పార్టీకి ద్రోహం చేశాడు..ఏడాది క్రితమే ఆయనను సస్పెండ్ చేశాం..మావోయిస్టు పార్టీ

మొన్నటిదాకా మావోయిస్టు పార్టీలో పని చేసి ఇటీవల పోలీసులకు లొంగిపోయిన జినుగు నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న మావోయిస్టు పార్టీకి ద్రోహం చేశాడని సీపీఐ మావోయిస్టు పార్టీ మండిపడింది. ఆయనను ఏడాది క్రితమే పార్టీ సస్పెండ్ చేసిందని ఆ తర్వాత కూడా ఆయన తప్పులను సరిదిద్దుకోకపోగా ఇప్పుడు శత్రువుకు లొంగిపోయాడని

జగదల్ పూర్ జైలు నుండి మావోయిస్టు పద్మక్క లేఖ

ఏళ్లతరబడి జైలులో ఉన్నతరువాత, విడుదలయ్యే రోజున స్వేచ్ఛ నుంచి వంచితురాల్ని చేసి పాత, అబద్ధపు వారంట్లతో అరెస్టు చేయడం అనేది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. ఇలాంటి స్థితిలో నా అరెస్టుని చట్టవ్యతిరేకమైనదిగా ప్రకటించడానికి ఈ వినతిని ఉన్నత న్యాయ స్థానానికి తీసుకెళ్ళండి.....

మావోయిస్టు పార్టీకి ప‌న్నెండేళ్లు

సెప్టెంబ‌ర్ 21... భారత విప్లవోద్యమంలో చారిత్రక ప్రాధాన్యం గ‌ల రోజు. మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌ ఆఫ్‌ ఇండియా, సీపీఐ ఎంఎల్‌ (పీపుల్స్‌వార్‌) విలీనమై....

ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 22 యేండ్లు !

అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం మొదలు పెట్టారు. లోపల ఉన్నది ఒకే ఒక వ్యక్తి అతను తేరుకొని ఆత్మరక్షణ కోసం తన దగ్గరున్న తుపాకీతో కాల్పులు మొదలు పెట్టాడు.

మావోయిస్టు మున్నా స్తూపాన్ని కూల్చేయాల‌ట‌ !

ఏఓబీ ఎన్‌కౌంట‌ర్‌లో మృతి చెందిన మున్నా స్మార‌కార్థం కుటుంబ స‌భ్యులు ప్ర‌కాశం జిల్లా ఆల‌కూర‌పాడులో నిర్మించిన స్తూపాన్ని తొల‌గించాలంటూ కొంది మందిని డ‌బ్బులు తీసుకొచ్చిన జ‌నాల‌తో పోలీసులు ర్యాలీ తీయించారు. జిల్లా క‌లెక్ట‌ర్‌, టంగుటూరు త‌హ‌సీల్దార్‌కు విన‌తిప‌త్రం ఇచ్చారు. మావోయిస్టులు హింస‌కు పాల్ప‌డుతున్నార‌ని, పోలీసులు చ‌ట్ట‌బ‌ద్ద పోరాటంలో ప్రాణాలు కోల్

రాజుకుంటున్న మన్యం

విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం ఊపందుకుంది. ʹదేశ ఖనిజ సంపదను విదేశాలకు దోచి పెట్టే ఏ చర్యలను మేం ఒప్పుకోబోంʹ అంటూ ప్రకటించిన మావోయిస్టు పార్టీ బాక్సైట్ పోరాటాన్ని ఉదృతం చేసింది. మన్యం ప్రాంతంలో సభలు, సమావేశాలు....

ఫిబ్రవరి 5న తెలంగాణ, దండకారణ్యం బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

దోపిడీ పాలకులైన కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుపార్టీని నిర్మూలించే లక్ష్యంతో గ్రీన్ హంట్ 3వ దశలో భాగంగా సమాధాన్, ప్రహార్-2 పేరుతో కొనసాగిస్తున్న ఫాసిస్టుదాడికి వ్యతిరేకంగా, కొత్త భూ సేకరణ చట్టానికి, నిర్వాసితత్వానికి వ్యతిరేకంగా,ఇసుక మాఫియా హత్యలకు, దళితులు ఆదివాసులపై దాడులు, హత్యలు, మహిళలపై లైంగిక అత్యాచారాలు, విద్యార్థుల పై దాడులు, అరెస్టులకు...

37 మంది మావోయిస్టులను విషంపెట్టి చంపారా ?

ఈ ఎన్ కౌంటర్ ను తీవ్రంగా ఖండించిన సీపీఐ ఎంఎల్ న్యూడెమాక్రసీ దీనిపై సుప్రీం కోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. చత్తీస్ గడ్, మహారాష్ట్ర విప్లవోధ్యమంపై కక్షగట్టిన కేంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు నరమేధానికి ఒడిగట్టాయని

Govt lost mercy petition of 4 Maoist convicts on death row

Four death row convicts in Bihar have been waiting for a decision on their mercy petition for more than a decade because their plea to be spared.....

Search Engine

ఇంద్రవెల్లి ఘటన జరిగిన మూడురోజులకు రాడికల్స్ వేసిన కరపత్రం పూర్తి పాఠం
పోలీసుల వలయంలో ఇంద్రవెల్లి...స్వరాష్ట్రంలోనూ అమరులకు నివాళులు అర్పించుకోలేని దుస్థితి
ఇంద్రవెల్లి ఇంగలం - వరవరరావు
అతడు ఓటేయలేదు..!
ʹఆ తొమ్మిది మందిʹ అద్భుత మానవుల కరచాలనం
మోడీ విధానాలే తన వైఖరి అని తేల్చి చెప్పిన కెసిఆర్
వికీలీక్స్‌ ఫౌండర్‌ జూలియన్ అసాంజే అరెస్ట్‌
బీజేపీకి ఓటు వేయకండంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న‌ రైతు !
ʹప్రొఫెసర్ సాయిబాబాను తక్షణమే విడుదల చేయాలిʹ
Condemn the denial of bail to human rights defender Dr. GN Saibaba
Open Letter to KCR from Varavara Raoʹs wife
కేసీఆర్‌కు వరవరరావు సహచరి బహిరంగ లేఖ
ఓట్లడిగే నైతిక హక్కు.. ఈ పార్టీలకు లేదు...!!
లేబర్ ఆఫ్ లవ్... ఇది మన కథే..!
ఈ దేశం మరోసారి మోసపోకూడదు.
బీమా కోరేగావ్ కేసులో మరో మంగళవారం.. పూణే కోర్టులో ఆ రోజు ఏం జరిగింది..?
సాయిబాబా,వరవరరావులని విడుదల చేయాలి - వివిధ పార్టీలకు 100మంది మేధావుల లేఖ
After 12 Years In Jail For 157 Charges, Nirmalakka Is Set Free
విద్వేష‌ రాజకీయాలను ఓడించండి - 200 పైగా రచయితల విఙప్తి
ఫాసిజమై మారుతోంది ప్రజాస్వామ్య నాటకం
బీజేపీ వ్యతిరేక ప్రచారానికి డైరెక్టర్ ʹపా రంజిత్ʹ మద్దతు
మోడీ, బీజేపీ సర్కారును కూలదోయండి : దేశానికి ఫిల్మ్ మేకర్స్ అభ్యర్థన
Solidarity Statement from the US Coalition to Free Professor G.N. Saibaba
పోలీసుల ప్రయత్నం విఫలం... నక్కా వెంకట్రావుకు బెయిల్ మంజూరు
వరవరరావు సహచరి హేమలత‌ ఛీఫ్ జస్టిస్‌కు రాసిన బహిరంగ లేఖ
more..


ఎస్సీ,