ఇంద్రావతిలో విషాద ఘోష - పాణి


ఇంద్రావతిలో విషాద ఘోష - పాణి

ఇంద్రావతిలో

నదులతో, వాగులతో, విశాలమైన అటవీ ఆకాశాల్లో జీవించే ఆదివాసులు ఇప్పుడొక స్వప్నాన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. నదిలో పారే నీళ్లను ఎలా వడిసిపట్టి పంటలు పండించుకోవాలో వాళ్లు ఆలోచిస్తోంటే ప్రభుత్వం ఆ పారే నీళ్లలోకి ఆదివాసులను శవాలుగా విసిరేస్తున్నది. ఇదీ భామ్రాగడ్‌ విషాదం.

అత్యంత ప్రాచీన జీవన మూలాలున్న దండకారణ్య ఆదివాసులు మావోయిస్టుల నాయకత్వంలో ఇంద్రావతి ఇరువైపుల అద్భుతమైన సంస్కృతిని, జీవన విధానాన్ని నిర్మిస్తున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి దాని స్వభావం వల్లనే సాధ్యంకాని నిజమైన ప్రజాతంత్రాన్ని రూపంలో, సారంలో కూడా అట్టడుగు నుంచి ఆదివాసులు రూపొందిస్తున్నారు. అలాంటి సృజనకు, ప్రజా భాగస్వామ్యానికి ఇంద్రావతి సారవంతమైన నేల. ఇప్పుడది నెత్తురోడుతోంది. నదీ తీరమంతా రక్త ప్రవాహం. నదిలో శవాల ప్రవాహం. ఈ నెల 22వ తేదీ నుంచి ఇంద్రావతి తల్లడిల్లుతోంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా భామ్రాగడ్‌ ప్రాంతంలో తాండ్‌గావ్‌ అడవుల్లో భారత రాజ్యం మానవహననానికి పాల్పడుతోంది. 22వ తేదీన మొదట ఒక ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు వార్త వచ్చింది. అందులో తెలంగాణ రాష్ట్ర్ జయశంకర్‌ భూపాల్‌పల్లి జిల్లా చల్లగరిగ గ్రామానికి చెందిన విజయేందర్‌ అలియాస్‌ శీను చనిపోయాడు. మిగతా 15మందిలో సాయినాథ్‌, దీప, నందు అనే మూడు పేర్లు తప్ప మరే వివరం తెలియదు. 23వ తేదీ అహెరీ ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇందులో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. 24వ తేదీ ఇంద్రావతి నదిలో కొన్ని శవాలు కొట్టుకపోతున్నాయని, వాటి సంఖ్య ఎంతో చెప్పలేమని అంటూనే ఈ రెండు ఎన్‌కౌంటర్లలో మృతులు 37మంది అని అంటున్నారు. ఈ లెక్కన ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు. వాస్తవమేమిటో ఇంద్రావతి చెప్పగలదు. లేదా మావోయిస్టు పార్టీ చెప్పగలదు. మూడు రోజులుగా కొనసాగిన ఈ హత్యాకాండ భారత విప్లవోద్యమ చరిత్రలోనే అతి పెద్ద ఎన్‌కౌంటర్‌. ఏడాది కింద ఆంధ్రా ఒడిషా సరిహద్దుల్లో జరిగిన రాంగుడ ఎన్‌కౌంటర్‌లో 31మంది చనిపోయారు. అది కూడా మూడు రోజులపాటు జరిగింది. ఇప్పుడు ఆ సంఖ్య దాటిపోయింది.

22వ తేదీ నుంచి సి-60, సీఆర్పిఎఫ్‌ వందల సంఖ్యలో బలగాలు అత్యాధునిక ఆయుధాలతో సిరొంచ, అహెరీ ప్రాంతాలను చుట్టుముట్టి ఏక పక్ష కాల్పులు జరిపారు. కానీ దీన్ని ఎన్‌కౌంటర్‌ అని పోలీసులు అంటున్నారు. అదే నిజమైతే 37 మంది విప్లవకారులను చంపేసిన ఈ ఘటనలో ఒక్క పోలీసు కూడా గాయపడలేదు. ఇక్కడ ఒక తాజా ఘటనను గుర్తు చేయాలి. మార్చి నెల 2వ తేదీ చత్తీస్‌ఘడ్‌లోని పూజారి కాంకేర్‌ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్లో 10 మంది విప్లవకారులు చనిపోయారు. ఒక పోలీసు చనిపోయాడని, ఇద్దరు గాయపడ్డారని ప్రభుత్వమే చెప్పుకుంది. నిజానికి ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు చనిపోయారని మావోయిస్టుపార్టీ అంటోంది. తమ కామ్రేడ్స్‌ వీరోచితంగా శత్రువును ప్రతిఘటిస్తూ తప్పుకున్నారని, నాయకత్వాన్ని కాపాడుకున్నారని పది మంది అమరులయ్యారని అధికారికంగా ప్రకటించింది.

ఎదురు కాల్పులే జరిగితే ఎలా ఉంటుందో ఇదొక ఉదాహరణ. కానీ భామ్రాగడ్‌ ఘటనలో ఒక్క పోలీసు కూడా గాయపడలేదు. అంటే లక్ష్యం ఎంచుకొని పోలీసులు ఈ దాడి చేశారని అర్థమవుతోంది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికైనా, ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఇతర ప్రభుత్వాలకైనా ఒక విషయం స్పష్టం. దేశంలో తమ రాజకీయ ప్రత్యర్థి మావోయిస్టు ఉద్యమం మాత్రమే అని. ఇదేదో సైనిక చర్యలకు సంబంధించింది కానే కాదు. రాజకీయార్థిక రంగాలకు చెందింది. అందుకే మావోయిస్టు రహిత భారతదేశమని అన్ని పాలక పార్టీలూ ఒకే వైఖరి ప్రకటిస్తున్నాయి. దీని కోసం దేశవ్యాప్తంగా వివిధ రకాల ఆపరేషన్లు, అభయాన్ల పేరుతో విప్లవోద్యమాన్ని అణిచివేస్తున్నారు. బస్తర్లో ఆపరేషన్‌ ప్రహార్‌-2, ఎఓబిలో ఆలౌట్‌ వార్‌-2, ఒడిశాలో హంటింగ్‌ మావోయిస్టు మిషన్‌, కేరళలో ఆపరేషన్‌ థండర్‌ బోల్ట్‌, జార్ఖండ్‌లో ఆపరేషన్‌ హాకా, ఆపరేషన్‌ విజయ్‌, ఆపరేషన్‌ సరండా పేర్లతో దాడులను నిర్వహిస్తున్నారు. గత వారంలో జార్ఖండ్‌ విప్లవోద్యమ ప్రాంతంలో నాలుగు రోజులపాటు కార్పెట్‌ బాంబింగ్‌ జరిగింది. కార్గిల్‌ యుద్ధంలో అనుసరించిన ఈ తరహా దాడి ఆ తర్వాత జార్ఖండ్‌లో ఆదివాసులపై చేశారు.

కొద్ది రోజల కింద ఛత్తీస్‌ఘడ్‌లో వైమానిక దాడులకు (డ్రోన్లు, హెలికాఫ్టర్‌ కార్పెట్‌ బాంబింగ్‌లు) కేంద్ర హోంమంత్రి రాజనాథ్‌ సింగ్‌ అనుమతి ఇచ్చాడు. ఇప్పుడు ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ మొదలయ్యాక చేపట్టిన అన్ని అభియాన్లను కేంద్ర ప్రభుత్వం ʹఆపరేషన్‌ సమాధాన్‌- 2022ʹ కిందికి తీసుకొచ్చింది. దీని లక్ష్యం 2022 నాటికల్లా మావోయిస్టు ఉద్యమాన్ని అంతమొందించడమని ప్రకటించుకుంది.

ముఖ్యంగా దండకారణ్యంలో ఆదివాసుల విప్లవోద్యమ నిర్మాణాన్ని దెబ్బతీయడానికి అనేక రకాల చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోంది. చత్తీస్‌ఘడ్‌లో అయితే గ్రామాలను తగలబెట్టడం, ఆస్తులను ధ్వంసం చేయడం, క్రాంతికారీ జనతన సర్కార్‌ నిర్మించిన పాఠశాలలను కూల్చి వేయడం నిత్యకృత్యమైంది. ఆదివాసీ మహిళలు, బాలికలపై అత్యాచారాలకు లెక్కేలేదు. వందల మందిని అక్రమంగా అరెస్ట్‌ చేసి జైల్లో పెడుతున్నారు. బెయిళ్లు రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ స్థితి గడిచిరోలిలో కూడా కొనసాగుతున్నట్లు అక్కడి ఉద్యమ వార్తలను బట్టి తెలుస్తోంది. నిజానికి ప్రభుత్వ పాలనాపరంగా చత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్రలోని గడ్చిరోలి వేర్వేరు కావచ్చుగాని విప్లవోద్యమానికి అదంతా దండకారణ్యం. అలాగే అక్కడి విప్లవోద్యమాన్ని దెబ్బతీయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడబలుక్కొని ఒకే విధానం అమలు చేస్తున్నాయి.

సరిగ్గా మహారాష్ట్రలో ఈ దాడి జరగడానికి ఒక రోజు ముందు అంటే 22వ తేదీన చత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లాలో మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఐదుగురు విప్లవకారులు చనిపోయారు. జార్ఖండ్‌లో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు చనిపోయారు. అంతకు ముందు మార్చి 27న ఆంధ్రా ఒడిషా సరిహద్దు ప్రాంతంలో ఒక ఘటనలో నలుగురు మహిళలను, మరో ఘటనలో ఒక పురుషుడ్ని కాల్చేశారు. మార్చి2న పూజారి కాంకేర్‌ ఘటనలో పది మందితో కలుపుకుంటే ఇప్పటికి మొత్తం 62 మందిని చంపేశారు.

అధికారం, సంపద చేతిలో ఉన్న రాజ్యం ఎంత దుర్మార్గంగా తయా రైంది! ఆదివాసులను, విప్లవకారులను చంపడానికే దేశంలోనే అతి పెద్ద పాశవిక వ్యవస్థను నడుపుతోంది. పైగా విప్లవకారులు అభివృద్ధికి ఆటం కంగా తయారయ్యారని, వాళ్లను ఇలా చంపేసి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. పోలీసు అధికారులు అంటున్నారు. ఒక్క అహెరీ, సిరొంచ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమం నడుస్తున్న ఆదివాసీ ప్రాంతాలను ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తున్నాయా? లేక మావోయిస్టులు అభివృద్ధి చేస్తున్నారా? అనే బహిరంగ చర్చకు సిద్ధమయ్యే నైతికత పాలకులకు ఉన్నదా? తమ నౌకరీ పరిమితులు మర్చిపోయి అభివృద్ధి గురించి మాట్లాడే పోలీసులు దండకారణ్యాన్ని ఎవరు అభివృద్ధి చేస్తున్నారో చెప్పగలరా?

ఆదివాసులకు అభివృద్ధిని అందిస్తున్నారా? లేక కార్పెట్‌ బాంబింగ్‌ను కానుకగా ఇస్తున్నారా? అభివృద్ధి అంటే విధ్వంసం, దోపిడీ, విస్తాపన అని రుజువయ్యాక ఆదివాసులు ప్రత్యామ్నాయం కోసం విప్లవిస్తున్నారు. నదులతో, వాగులతో, విశాలమైన అటవీ ఆకాశాల్లో జీవించే ఆదివాసులు ఇప్పుడొక స్వప్నాన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. నదిలో పారే నీళ్లను ఎలా వడిసిపట్టి పంటలు పండించుకోవాలో వాళ్లు ఆలోచిస్తోంటే ప్రభుత్వం ఆ పారే నీళ్లలోకి ఆదివాసులను శవాలుగా విసిరేస్తున్నది. ఇదీ భామ్రాగడ్‌ విషాదం.
- పాణి

Keywords : gadchiroli, encounter, maoists
(2018-06-24 12:14:25)



No. of visitors : 1354

Suggested Posts


ముంబై కదిలింది.. అన్నదాతకు అన్నం పెట్టింది..

తమకు అన్నంపెట్టే రైతుల పోరాటానికి ముంబై నగరం అండగా నిల్చింది. తినీ, తినక 200 కిలోమీటర్లు నడిచి వచ్చిన 50 వేల రైతుల ఆకలి తీర్చేందుకు తమ చేతనైన రీతిలో ముంబై నగరం నడుం బిగించింది..

గడ్చిరోలీలో జరిగింది ఎన్కౌంటర్ కాదు,సామూహిక‌ హత్యలు - నిజ నిర్దారణ బృందం రిపోర్ట్

అవి కచ్చితంగా బూటకపు ఎన్‌కౌంటర్లని 44 మందితో కూడిన నిజనిర్థారణ కమిటీ తేల్చి చెప్పింది. మూడు పౌర హక్కుల, మానవహక్కుల సంఘాలు చేసిన నిజనిర్దారణలో ఈ విషయం తేలినట్టు ఆ సంస్థలు ప్రకటించాయి.

NO ENCOUNTER HAPPENED IN GADCHIROLI ON APRIL 22ND 2018

The killings of at least 37 Maoists by the combined force of the CRPF and the C-60, the elite unit of the Gadchiroli Police, on 22nd and 23rd April 2018 raises some very disturbing questions

Media ignores...35 Thousands of farmers long march from Nashik to Mumbai

Farmers taking out a protest march under the banner of All India Kisan Sabha en route from Nashik to Mumbai in Maharashtra Besides pressing for their long-standing demands, the agitating farmers have also been opposing acquisition ...

Gadchiroli Encounter, a Fake and Cold-blooded Mass Murder, Says Fact-finding Teamʹs Report

ʹThe C-60 police and CRPF surrounded the Maoists on all sides and opened fire indiscriminately by using sophisticated weapons like Under Barrel Grenade Launchers (UBGL) with an intention to kill them. As such it is a cold-blooded mass murder,ʹ says the report.

గడ్చిరోలిలో 5గురు మహిళలతో సహా 7 గురు మావోయిస్టులను చంపేసిన పోలీసులు

మహారాష్ట్ర గడ్చరోలి జిల్లా జిగ్ణూరు వద్ద జరిగిన ఎన్కౌంటర్ లో 7 గురు మావోయిస్టులు చనిపోయినట్టు పోలీసులు ప్రకటించారు. చనిపోయినవారిలో గడ్చిరోలి జిల్లా అహిరి తాలూకా లింగంపల్లి గ్రామానికి చెందిన అయితు అలియాస్ అశోక్ (దళ కమాండర్) , చత్తీస్ గడ్, బీజాపూర్ జిల్లా కవాండే గ్రామానికి చెందిన‌ సరిత, మహారాష్ట్ర సిరొంచకు చెందిన చంద్రు, అహిరి తాలూకా....

రైతుల పోరాటానికి దిగి వచ్చిన ఫడ్నవీస్ సర్కార్ !

ఎర్రటి ఎండలో విరామమెరుగక నడుస్తూ ఎముకలు కొరికే చలిలో రొడ్డు పక్కనే సగం నిద్ర పోయి. జనం పెట్టింది తింటూ అర్దాకలితో... పాదాలు బొబ్బలెక్కి, చర్మాలు ఊడిపోయి నెత్తురోడే కాళ్ళతో, మహిళలు, వృద్దులు చేసిన పోరు యాత్రకు మహారాష్ట్ర ఫడ్నవీస్ సర్కార్ దిగిరాక తప్పలేదు....

After arrest of seven ʹCPI (Maoist) membersʹ, teacher questioned on ʹNaxal linksʹ ends life

DAYS AFTER he was questioned by the Maharashtra Anti Terrorism Squad (ATS) in connection with the arrests of seven alleged members of the banned Communist Party of India (Maoist), Mumbai schoolteacher Prabhakar Macha committed suicide on January 23....

Search Engine

నయీ పీష్వాయీ నహీ చలేగీ - వరవరరావు
ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 22 యేండ్లు !
అన్యాయాన్ని ప్రశ్నించాడని.. దళితుడిని పెట్రోల్ పోసి తగులబెట్టారు..!
declaration by the ʹStruggle Associationʹ, an underground Maoist organization in China
కోలుకొండ దళితుల భూ పోరాటానికి విరసం సంఘీభావం
Members of European Parliament, condemn the presence of Sushma Swaraj on Yoga Day
Dalits In Haryana Allege Social Boycott, Threaten To Convert To Buddhism
ఆర్ఎస్ఎస్ ఎన్నికల వ్యూహంలో కాశ్మీర్ సమిద కానున్నదా?
ముస్లిం ఇంజనీర్ మాట్లాడాడని.. మతోన్మాదంతో రెచ్చిపోయిన మహిళ
బంధాలను నాశనం చేసిన నేటి వ్యవస్థ.. ఆర్థిక బంధాలకే ప్రాధాన్యం..!
Long live the national truck driversʹ strike!
గుర్రంపై ఊరేగుతున్న దళిత పెండ్లి కొడుకుపై అగ్రకులస్థుల దాడి
చెడ్డీ గ్యాంగ్ బరి తెగింపు.. లౌకికవాదులపై అనుచిత వ్యాఖ్యలు
సినిమాల్లో ʹస్త్రీʹ పాత్ర మారుతోంది..!
రాజ్యమే కుట్ర చేస్తే...
ఉద్యమ స్పూర్తి రగిలించిన ʹచేʹ
ఇదో దుర్మార్గం.. మతోన్మాదం ఒక ఆడపిల్లని పిచ్చిదానిలా చిత్రించింది..!
ఈ హత్యలకు అంతే లేదా..?
Bengaluru techie arrested for Maoist links
ఇక్కడ కవిత్వం కూడా తీవ్రవాదమేనా..?
Leftist Publisher Shot Dead as Blogger Deaths Return to Haunt Bangladesh
ʹదుర్గాప్రసాద్‌ను మధ్యాహ్నంలోగా కోర్టులో హాజరుపరచాలిʹ
ప్రధాని మోడీపై హత్యకు కుట్ర నిజంగానే జరిగిందా..?
పేదవాడి నిజమైన సమస్యను చర్చించిన ʹకాలాʹ..!
వరవరరావుపై ప్రభుత్వం కుట్ర.. ప్రజా, హక్కుల సంఘాల అణచివేతలో భాగమే - విరసం
more..


ఇంద్రావతిలో