తెలంగాణ జనసమితికి ఓ ఆహ్వానం, ఓ హెచ్చరిక !


తెలంగాణ జనసమితికి ఓ ఆహ్వానం, ఓ హెచ్చరిక !

తెలంగాణ


(తెలంగాణ జనసమితికి ఓ ఆహ్వానం, ఓ హెచ్చరిక అనే ఈ వ్యాసం వీక్షణం ఏప్రెల్, 2018 సంచికలో ప్రచురించబడిన సంపాదకీయ వ్యాఖ్య‌)

తెలంగాణ రాష్ట్ర సమితి పద్నాలుగు సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజా ఆకాంక్షల ఆందోళనలో భాగమైనప్పటికీ, నాయకత్వం వహించినప్పటికీ, అధికారానికి వచ్చిన తర్వాత అది ఆ ఆకాంక్షలను తుంగలో తొక్కడం ప్రారంభించింది. తానే ప్రకటిస్తూ వచ్చిన లక్ష్యాలకు దూరం జరుగుతూ వచ్చింది. ప్రజలను వంచించడానికి, భ్రమల్లో ముంచడానికి పాత మాటలనే వల్లిస్తూ, ఆ మాటలకు వ్యతిరేక ఆచరణలో పడింది. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల ఫలితంగా వచ్చిన అధికారాన్ని పిడికెడు మంది ఆశ్రితుల ప్రయోజనాలకు కుదించింది. ఏ కోస్తాంధ్ర - రాయలసీమ కాంట్రాక్టర్ల, సంపన్నుల ఆధిపత్యం కింద తెలంగాణ నలిగిపోరుుందనీ, దోపిడీ పీడనలకు గురైందనీ, ఆ దోపిడీ పీడనల నుంచి విముక్తి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలనీ తెలంగాణ ప్రజలు ఉద్యమించారో, అవే ఆధిపత్యశక్తుల అధికారం చెక్కుచెదర లేదు సరిగదా బలపడుతూ వచ్చింది. తెలంగాణ ప్రజానీకంలో గణనీయమైన భాగం వేచి చూడాలనీ, ప్రత్యర్థుల దృష్టిలో పలుచన కావద్దనీ తొలి రెండు సంవత్సరాలు మౌనం వహించారుగాని తెరాస పాలనా విధానాలు క్రమక్రమం గా అంతకంతకూ ఎక్కువ ప్రజా సమూహాలలో అసంతృప్తిని మిగిల్చారుు. ఆ అసంతృప్తి వ్యక్తీకరణకు కూడ అవకాశం ఇవ్వని నిరంకుశ నిర్బంధ పాలనను కొనసాగించడం ద్వారా తెరాస మరింత అసంతృప్తినీ ఆగ్రహాన్నీ మూట కట్టుకుంది. కోదండరామ్‌ నాయకత్వంలో తెలంగాణ జన సమితి అనే కొత్త రాజకీయ పక్షం ఆవిర్భవించడాన్ని ఈ నేపథ్యంలోనే అర్థం చేసుకోవాలి. ఇవాళ తెలంగాణలో ఉన్న అసంతృప్తుల, ఆగ్రహాల వాతావరణం లో, ఆ ఆగ్రహం బైటికి కనబడకుండా పాలకులు సాగిస్తున్న అణచివేత, ఉక్కపోత వాతావరణంలో ప్రజల వైపు నుంచి, ప్రజా ఆకాంక్షలు వ్యక్తం చేసే ఎన్ని ప్రయత్నాలు జరిగినా ఆహ్వానించవలసినవే. ఆ రకంగా చూసినప్పుడు ప్రజా ఆకాంక్షల వ్యక్తీకరణకు ఒక కొత్త వేదికగా తెలంగాణ జనసమితిని ఆహ్వానించవలసి ఉంది. అది సొంతంగా రాష్ట్ర రాజకీయాధికారం చేపట్టగలదా లేదా అనేది ఇప్పటికైతే సందేహమే. అటువంటప్పుడు అది కూడ అవకాశవాద రాజకీయ పొత్తులకు దిగి తన ప్రజాపక్ష శక్తిని తానే బలహీన పరచుకుంటుందా చూడవలసే ఉంది. నిజంగా సొంతంగానో, పొత్తులతోనో అధికారంలోకి రాగలిగినా, ఉన్న రాజకీయార్థిక చట్రంలో ప్రజానుకూల విధానాలు అమలు చేయగలదా, కనీసం రాజ్యాంగ బద్ధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉండగలిగినంత ప్రజానుకూలంగానైనా ఉండగలదా ఇప్పటికైతే జవాబు లేని ప్రశ్నలే. అరుుతే, దాదాపు ఎనిమిది దశాబ్దాలుగా తెలంగాణ ప్రజా ఆకాంక్షల కెరటాల మీద ఎగిసిన ఎన్నో నురుగులు కరిగిపోయాయని, తమ సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్ముకుని ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఎన్నో నాయకత్వాలు తమ పబ్బం గడుపుకోవడానికి వాడుకున్నాయని, ఆకాంక్షలకు ద్రోహం చేశాయని, అంతిమంగా ప్రజలకు మిగిలింది వంచన మాత్రమేనని చూపడానికి 1951, 1956, 1969, 1972, 2014 వంటి ఎన్నో కొండగుర్తులున్నారుు. తెలంగాణ జన సమితి నిజంగా తెలంగాణ ప్రజా ఆకాంక్షలు వ్యక్తీక రించడానికి, ప్రజా సమస్యలను పరిష్కరించడానికి నిలబడుతుందా, తనను తాను పాలకవర్గ రాజకీయ పక్షాల తానులో మరొక ముక్కగా తేల్చుకుంటుందా చరిత్ర చెపుతుంది. ఒక చారిత్రక సామాజిక అవసరాన్ని తీర్చడానికి కాలం తనకు జన్మనిస్తున్నదని, ఆ అవసరం తీర్చలేకపోతే అనేక పార్టీలలో ఒకానొకటిగా కాలగర్భంలో కలిసిపోక తప్పదని గుర్తించడం తెలంగాణ జన సమితి బాధ్యత.

Keywords : telangana janasamithi, kodandaram, tjac, trs
(2018-09-17 10:22:33)No. of visitors : 948

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.

మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

ఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్‌ ముట్టడి, పెరేడ్‌ గ్రౌండ్స్‌లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్‌ ఉద్యమాలు నిర్వహించారు.

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

ʹనీ బాంచెన్ దొరా కాల్మొక్తʹ

జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ఖిల్లాలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పాదాభివందనం చేస్తున్నానంటూ ...

మహాజనాద్భుత సాగరహారానికి నాలుగేళ్ళు

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపుత్రుల దేహాల సంరంభాన్ని అనుభవించవలసిన సందర్భం అది....

Search Engine

దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది-ఒడిషాలో బలపడ్డాం..విస్తరిస్తున్నాం: మావోయిస్టు పార్టీ
నన్నో దేశద్రోహిగా చిత్రీకరించాలని పోలీసులు ప్రయత్నించారు..!
ఓటమిని అంగీకరించలేక బీభత్సం సృష్టించిన ఏబీవీపీ.. గూండాలతో లెఫ్ట్ విద్యార్థులపై దాడి
హక్కుల కార్యకర్తల అక్రమ అరెస్టుల కేసులో పిటిషనర్ల లాయర్ సుప్రీంకు చెప్పిన నిజాలు ఇవే
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
ఆంటీ! చంపేసారాంటీ..నా ప్రణయ్‌ను చంపేసారు
జేఎన్‌యూపై ఎర్రజెండా రెపరెపలు.. మతోన్మాదులను మట్టి కరిపించి లెఫ్ట్‌ను మళ్లీ గెలిపించిన విద్యార్థులు
నీ కోసం వేలాది మంది వచ్చారు.. ఒక్కసారి లే ప్రణయ్..
ప్రొఫెసర్ సాయిబాబకు చిన్నారి సాహస్ లేఖ.. ప్రశ్నించడమే నువ్వు చేసిన తప్పా..?
ఇవి పరువు హత్యలు కావు.. దేశం పరువు తీసే హత్యలు
అమృత తండ్రి దుర్మార్గపు చరిత్ర.. కూతురు కంటే పరువే ముఖ్యమంటున్న కులోన్మాది
ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదే.. పెద్దలను కూడా ఈడ్చిపడేయటమే
ప్ర‌శ్నించ‌డ‌మే నేర‌మైన‌ప్పుడు : క్రాంతి
తలపాగా ధరించాడని ఎస్సీ వర్గీయుడి తల ఒలిచేసిన అగ్రకుల ఉన్మాదులు
ʹక్రాంతి కోస‌మే ఈ ప్ర‌యాణంʹ
SUSPEND AGREEMENTS WITH INDIA UNTIL THE HUMAN RIGHT ACTIVISTS ARE RELEASED : MEP TO EUROPEAN COMMISSION
స్వచ్చమైన హిందీ, సంస్కృత భాషలో ఉన్న ఉత్తరం వరవరరావు రాసిందేనా.?
మొదటి అర్బన్ నక్సల్ భగత్ సింగ్
ʹజీవితాన్ని ధారపోయడమే నక్సలిజం అయితే, నక్సలైట్లు చాలా మంచి వాళ్లుʹ
70 ఏండ్ల చరిత్రను తిరగరాసిన విద్యార్థిని.. మతోన్మాద శక్తులపై లెఫ్ట్ విజయం
ప్రజల సభంటే.. ఇట్లుంటది
Punjab:Dalit bodies protest arrest of 5 human rights activists
Why are the Indian authorities afraid of a ʹhalf-Maoistʹ?
ʹప్రధాని హత్యకు కుట్రʹ కేసు ఓ కుట్ర..మేదావుల అరెస్టు దుర్మార్గం..మావోయిస్టు పార్టీ ప్రకటన‌
హిందూత్వ తీవ్రవాదుల హిట్‌ లిస్టులో దభోల్కర్‌ కుమార్తె
more..


తెలంగాణ