ఏఎంయూలో ఏబీవీపీ వీరంగం - విద్యార్థులపై దాడులు !


ఏఎంయూలో ఏబీవీపీ వీరంగం - విద్యార్థులపై దాడులు !

ఏఎంయూలో

అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) అట్టుడుకుతున్నది. దశాబ్దాల కాలం నుంచి ఏఎంయూ స్టూడెంట్‌ యూనియన్‌ కార్యాలయంలో ఉన్న పాకిస్థాన్‌ వ్యవస్థాపకుడు మహమ్మద్‌ అలీ జిన్నా ఫొటోపై ఏబీవీపీ తాజాగా వివాదాన్ని రేపింది. ఈ నేపథ్యంలో విద్యార్థులపై వర్సిటీలో దాడులకు తెగబడింది. బుధవారం జరిపిన దాడుల్లో దాదాపు 28 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తున్నది. వారిని జవహర్‌లాల్‌ నెహ్రూ మెడికల్‌ కళాశాలలో చేర్చారు. మిగిలిన వారిని ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ చేశారు.

కాగా, ఏబీవీపీ దాడికి నిరసనగా గురువారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ వర్సిటీలో ఉండగానే హిందూత్వ గ్రూపులు ఈ దాడికి తెగబడ్డారు. బుధవారం వర్సిటీలో జరిగే ఓ కార్యక్రమంలో ప్రసంగించేందుకు, విద్యార్థుల మండలి జీవితకాల సభ్యుత్వం స్వీకరించేందుకు అన్సారీ విచ్చేసారు. ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఉద్దేశపూర్వకంగా, ముందస్తు ప్రణాళిక ప్రకారం ఏబీవీపీ విద్యార్థులు దాడులకు తెగబడ్డారని ఏఎంయూఎస్‌యూ ఆరోపించింది. ఏఎంయూకు వచ్చిన ఉప రాష్ట్రపతిని లక్ష్యంగా చేసుకొని ఘర్షణలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకొనే వరకూ తమ ఆందోళన ఆగేదిలేదని స్పష్టంచేసింది. దాడులకు తెగబడినవారిపై చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన జిల్లా యంత్రాంగం, పోలీసులపై అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని ఏఎంయూ విద్యార్థి సంఘం నిర్ణయించింది. హింసకు తెగబడిన ఏబీవీపీ విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయాలంటూ ఏఎంయూ టీచర్స్‌ అసోసియేషన్‌ కూడా జిల్లా యంత్రాంగానికి లేఖ రాసింది. ఉద్దేశపూర్వకంగానే ఏబీవీపీ విద్యార్థులు ఆయుధాలు చేతబూని కళాశాలలో ఉద్రిక్తవాతావరణం సృష్టించారని ఆరోపించింది. ఇదిలావుండగా, ఏబీవీపీ విద్యార్థులు క్యాంపస్‌లోకి అడుగుపెట్టడం, ఘర్షణల్లో పోలీసుల పాత్రపై దర్యాప్తుకు జిల్లా మేజిస్ట్రేట్‌ ఆదేశాలు జారీచేశారు.

వర్సిటీలోని జిన్నా చిత్రపటాన్ని ఎందుకు ఉంచారో వివరణ ఇవ్వాలంటూ స్థానిక బీజేపీ ఎంపీ సతీశ్‌ గౌతమ్‌ ఇటీవల ఏఎంయూకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే ఏబీవీపీ ఈ దాడులకు పాల్పడింది.
బీజేపీ ఎంపీ సతీశ్‌ గౌతమ్‌ రాసిన లేఖకు ఏఎంయూ అధికార ప్రతినిధి షఫీ కిద్వారు మీడియాకు వివరణ ఇచ్చారు. ʹజిన్నా ఏఎంయూ వ్యవస్థాపక సభ్యుడు. వర్సిటీకి విరాళం ఇచ్చారు. అంతేకాదు పాకిస్థాన్‌ కోసం డిమాండ్‌ చేయకముందే వర్సిటీ ఏర్పాటుకు జిన్నా కృషి చేశారు. 1938లో వర్సిటీ విద్యార్థి సంఘం జీవిత కాల సభ్యత్వం పొందారు. అలా సభ్యత్వం పొందినవారి చిత్రపటాలు యూనియన్‌ కార్యాలయంలో ఉంచడం సంప్రదాయంగా వస్తోంది. ఆ చిత్రపటాలు ఉమ్మడి భారతదేశ వారసత్వ సంపద. మహాత్మా గాంధీ, మౌలానా ఆజాద్‌, సర్వేపల్లి రాధాకృష్ణ, సి.రాజగోపాలాచారి, రాజేంద్ర ప్రసాద్‌, నెహ్రూలతో సహా ఏ జాతీయ నాయకుడూ ఆ చిత్రపటం గురించి అభ్యంతరం వ్యక్తం చేయలేదుʹ అన్నారు.

Keywords : amu, alighar. bjp. abvp, hindutva, students
(2018-07-18 00:40:18)No. of visitors : 307

Suggested Posts


గోరక్షకులా ? దోపిడి దారులా ? - NDTV స్టింగ్ ఆపరేషన్ లో వెలుగు చూసిన నిజాలు !

ఆవులనే కాదు ఎద్దులను, బర్రెలను, దున్నపోతులను... వేటినైనా సరే వాహనాల్లో తీసుకెల్తే వీళ్ళు ఆపుతారు. పోలీసుల సహకారంతో గోశాలలకు తరలిస్తారు. అక్కడి నుంచి వాటిని అమ్ముకుంటారు. పశువులను తరలించేవారు వీరితో ముందే ఒప్పందానికి వచ్చి డబ్బులు ముట్టజెప్తే ఆ వాహనాలను ఆపరు....

బాలికల అక్రమ తరలింపు - బైటపడ్డ ఆర్‌ఎస్‌ఎస్‌ అసలు రంగు

ఆర్‌ఎస్‌ఎస్‌ అసలు ఎజెండా ఏంటి అనేది బహిర్గతమైంది. తన మతోన్మాద ఎజెండాను అమలుచేయడంలో భాగంగా బాలికల అక్రమ తరలింపుకు సిద్దపడింది. జాతీయ, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఆదివాసీ బాలికలను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న వైనాన్ని ఔట్ లుక్ పత్రిక బహిర్గతపర్చింది....

బీఫ్‌ తినడం నేరం కాదు - మద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పు

గో మాంసంపై మద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బీఫ్‌ తినడం నేరం కాదని, ప్రజల ఆహార అలవాట్లలో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. పళని ఆలయ పరిసరాల్లో ముస్లింలు నిర్వహిస్తున్న దుకాణాలను తొలగించాలని దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది...

HCU లో ఏబీవీపీ అరాచకం - విద్యార్థిపై దాడి

హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో మ‌తోన్మాద గుండాల అరాచ‌కాల‌కు అంతులేకుండా పోతోంది. రోహిత్ వేముల మృతికి కార‌ణ‌మైన సుశీల్ కుమార్, బీజేపీ నాయ‌కుడైనా అత‌ని సోద‌రుడు మ‌రో ముప్పై మందితో క‌లిసి నిన్నరాత్రి యూనివ‌ర్సిటీలో విద్యార్థుల‌పై దాడుల‌కు పాల్ప‌డ్డారు. గ‌త వారం ప‌ది రోజులుగా

ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్ బాకీ హై

22 రాష్ట్రాలు, 44 ప‌ట్ట‌ణాలు, 50 ప్ర‌ద‌ర్శ‌న‌లు... ఇది బాహుబ‌లి సినిమా కాదు... మ‌తోన్మాద రాజ‌కీయాల్నిన‌గ్నంగా నిల‌బెట్టిన డాక్యుమెంట‌రీ చిత్రం. వ‌ర్త‌మాన చ‌రిత్ర‌కు సాక్ష్యం.....

హిందూ మతోన్మాదం మోడి,యోగి - డా. కత్తి పద్మారావు

ఆర్ఎస్ఎస్ మూలవాసుల సంస్కృతికి వ్యతిరేకి. ముస్లిం మైనార్టీలకు శత్రువు. ఎంతో నెత్తురు హిందూ, ముస్లిం ఘర్షణల్లో భరత ఉపఖండంలో ఇంకిపోరుుంది. అందుకే అంబేడ్కర్ దళితులను బౌద్ధ మత స్వీకారం చేయమని బోధించాడు. బౌద్ధ మత స్వీకారం ఒక్కటే హిందూ మతం పునాదులను కదిలించగలుగుతుందని అంబేడ్కర్ విశ్వసించాడు....

ఫిదా సినిమా... జాతీయ గీతం - తుమ్మేటి రఘోత్త‌మ్ రెడ్డి

నేను తెలుగు సినిమా చూడాల్సి వచ్చింది! చాలా కాలం తరువాత! సంవత్సరాల తరువాత.... ఏం చెయ్యను? ఖర్మ! నాలుగురోజుల క్రితం, మాదగ్గరి బంధువు పోన్ చేసాడు! ఒకసారిʹఫిదాʹసినిమా చూడగలరా? మీతో చర్చించాలని ఉంది అన్నాడు! దగ్గరి బంధువు! సినిమా రంగంలో భవిష్యత్తును నిర్మించుకుంటున్నవాడు! కాదనలేని స్ధితి!

ఇప్పటి దేశ పరిస్థితుల్లో రాడికల్ ఉద్యమ అవసరం ఉందా?

వ‌ర్త‌మాన సామాజిక‌, రాజ‌కీయ‌, ఆర్థిక విష‌యాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడూ స‌రైన అవ‌గాహ‌నను అందిస్తూ, ప్ర‌జ‌ల ప‌క్షాన గొంతును వినిపించే లామ‌కాన్, ముగ్గురు ప్ర‌ముఖ ఉద్య‌కారుల‌ను ఒకే వేదిక‌మీదికి తీసుకువ‌స్తోంది. ఆగ‌స్టు 15 సాయంత్రం 7 గంట‌ల‌కు లామ‌కాన్‌లో నిర్వ‌హించే.....

మోడీలు, మోహన్ భగవత్ లు బూట్లు తొడుక్కొని జెండాలు ఎగరేయొచ్చు... అదే ఓ ముస్లిం చేస్తే దాడులు చేస్తారా !

మోడీ, అమిత్ షాలు బూట్లు తొడుక్కొని స్వాతంత్ర్య దినోత్సవం రోజు జాతీయ జెండాకు వందనాలు చేయొచ్చు. మోడీ అయితే ఏకంగా జాతీయ జెండాతో చెమటను తుడుచుకోవచ్చు.... కానీ ఓ కాలేజీ ప్రిన్సిపాల్... ముస్లిం అయినందుకు జెండా ఎగరేయ కూడదు. ఎగిరేసినందుకు ఆయన కాశాయ మూక చేతుల్లో దాడికి గురవుతాడు.....

BJP may lose Gujarat if polls are held today: RSS internal survey

BJP may not do well and lose Gujarat if elections are held in state in the present circumstances, a fresh internal survey conducted by partyʹs ideological mentor RSS has concluded...

Search Engine

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు
మతోన్మాదులు ఈ న‌వ‌ జంటను చంపేస్తారేమో !
గోగూండాల దాడులపై సుప్రీం కోర్టు ఆగ్రహం
78 ఏళ్ళ స్వామి అగ్నివేష్ పై చెడ్డీ గ్యాంగ్ దాడి
ఇప్పటికీ మానని గాయం - కారంచేడు మారణ హోమం
భీమాకోరేగాఁవ్ ప్రజా పోరాటాన్ని ముందుకు తీసుకపోదాం - ఆగస్ట్ 3న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం
ప్రశ్నలను నిషేధిస్తారట...సంధ్యక్క‌ను హత్య చేస్తారట‌
చిన్న పొరపాటుకు చిన్నారికి బ‌హిష్కరణ శిక్ష - కాప్ పంచాయతీ దుర్మార్గం
ఒక బీజేపీ ఎమ్మెల్యే రాసలీలలు.. అండగా పార్టీ హైకమాండ్
ʹమతం పేరుతో హింసను రెచ్చగొడుతున్నారుʹ
ఏడవకు బిడ్డా - గుగివా థియాంగో
హస్బెండ్‌ స్టిచ్‌ - గీతాంజలి
సీపీఎం కు ఇక రామాయణమే రక్షనట !
తెల‍ంగాణ డీజీపీకి 26 మంది మేధావుల బహిరంగ లేఖ‌ !
కత్తి మహెష్ నగర బహిష్కరణ అప్రజాస్వామికం - విరసం
దేవుడు లేడంటే.. సంసదకు ఎసరొస్తుంది.. పెద్దరికాలకు ఇబ్బందొస్తుంది
కత్తి మహేష్ ʹనగర బహిష్కరణʹ.. అక్రమం, చట్టవ్యతిరేకం
छत्तीसगढ़ के वन कर्मियों का कारनामा : 46 बैगा आदिवासी परिवारों को किया बेघर
छत्तीसगढ़ : मानवाधिकार कार्यकर्ताओं की गिरफ्तारी के विरोध में प्रदर्शन
ఓ ముస్లింను హత్య చేసిన కేసులో మరణ శిక్ష పడి బెయిల్ పై వచ్చిన వారికి సన్మానం చేసిన కేంధ్ర మంత్రి
Release Prof G.N Saibaba From Jail - Justice Markandey Katju
Kerala; Alleged Maoist Shyna Gets Bail in all the cases.
పంటలు పండటానికి నాలుగు మంత్రాలు చాలు.. గోవా ప్రభుత్వం కొత్త స్కీం
దుర్గాప్రసాద్, బద్రి, రంజిత్, సుధీర్ లను వరంగల్ జైల్లో అధికారులు వేధిస్తున్నారు..వీవీ
ఇజ్రాయేలీ సైనికులకు తమ నృత్యంతో చెమటలు పట్టించిన పాలస్తీనా యువత
more..


ఏఎంయూలో