వైజాగ్ లో ఇండస్ట్రియల్ కోస్టల్ కారిడార్ నిర్మాణ వ్యతిరేక సదస్సు


వైజాగ్ లో ఇండస్ట్రియల్ కోస్టల్ కారిడార్ నిర్మాణ వ్యతిరేక సదస్సు

వైజాగ్

(కోస్టల్ కారిడార్ నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటి వేసిన కరపత్రం పూర్తి పాఠం)

2018 మే 19, 20 (శని, ఆదివారాలు) విశాఖపట్టణం అంబేద్కర్ భవన్లో జరుగు | ఇండస్ట్రియల్ కోస్టల్ కారిడార్ నిర్మాణ వ్యతిరేక సదస్సుని జయప్రదం చేయండి!
ప్రజలు కేంద్రంగా అభివృద్ధి జరగాలి
ఆంధ్ర రాష్ట్రం రియల్ ఎస్టేట్ కాదు! అది ప్రజలది!

ప్రజల జీవితాల్లో కాస్త వెలుగొచ్చి, వాళ్ల క్రమకి తగ్గట్టుగా కే నాలుగు రాళ్లు మిగులుతాయంటే ఎవరొద్దంటారు? ప్రజల అభివృద్ధి కోసం నాలుగు ప్రాజెక్టులూ, పరిశ్రమలూ, ఉద్యోగాలు, ఉపాధీ ఇస్తామంటే ఎవరు కాదంటారు? రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగాన్ని తగ్గిస్తామంటే ఎవరికశ్యంతరం? కానీ ఆ పేరుతో ప్రకృతినీ, పర్యావరణాన్ని నాశనం చేస్తూ విషతుల్య రసాయన పరిశ్రమలను ఎవరూ ఆహ్వానించరు. అలాగే మన పొలాలు తడవాలంటే, లక్షలాది గిరిజనుల ఇళ్లు, పళ్లూ కాళీ చేయాలనే రాక్షసనీతిని ఎవరూ ఒప్పుకోరు. కరెంటు కోసం అణుధార్మికతను వెదజల్లే అంఐవిద్యుత్ కేంద్రాలను ఆహ్వానించి మానవాళిని వేల సంవత్సరాలు వికలాంగులుగానూ, రోగగ్రస్తులుగానూ, జన్యులోపాలతోనూ బతకాలని కాసిస్తే ప్రజలు ఉద్యమించక మానరు. అబాండాల్లాంటి అంబవిద్యుత్ కేంద్రాలను పెరట్లో పెడతానంటే ఆ బాంబుల్ని విసిరి కొడతారు. సెజ్ చట్టం పేరుతో మనం పుట్టిన భూమిలో మనమే విదేశీయులుగా మారిపోయి కార్పొరేట్ వ్యాపారుల చేతుల్లో మన భూములు వెళ్లిపోతే, మంత్రులు, కాంట్రాక్టుల గలా పెట్టిలు నిండులాయ తప్ప మనకి ఒరిగేదేమీ లేదు. రాకపోతే, మత్స్యకారుల జీవితాలు తీర సముద్రంలో తెప్పలుగా తేల్తాయి. రైతుల ఆత్మహత్యలతో కచాలు కుప్పలుగా రాలతాయి. పచ్చని కోస్తా ప్రాంతం రసాయనిక వ్యర్థాలతో బీడు భూమిగా మారిపోతుంది. పీసీసీఐఆర్ (పెట్రోలియం & కెమికల్ అండ్ పెట్రోకెమికల్ బ్యాక్లమెంట్ రీజియన్) పేరుతో కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రంతోట కోస్తా తీరంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను ప్రభుత్వాలు బీడుభూములుగా మార్చబోతున్నాయి. అప్పటికే ఓఎన్జీసీ, రిలయన్స్ పెట్రోల్, క్రూడ్ ఆయిల్ త్రవ్వకాల వల్ల తూర్పుగోదావరి పచ్చటి పొలాలు కుంగిపోతున్నాయి. మనకు అరగబోతున్న ఈ విధ్వంసాన్నీ, పర్యావరణ కాలుష్యాన్నీ, మన భూముల్లోనే పరాయివాళ్లుగా మనం నివసించాల్సి వస్తున్న ఈ దుస్థితిని |ప్రజస్వాన్యుంగానూ, చట్టబద్ధంగానూ ఎదుర్కోవడానికి 2006లో కోస్టల్ కారిడార్ నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటీʹ ఏర్పడింది. ప్రజల కేంద్రంగా అభివృద్ధి జరగాలనీ, పర్యావరణ రక్షణ లక్ష్యంతో పరిశ్రమలు నెలకొల్పాలనీ, బహుళజాతి విదేశీ స్వదేశీ కంపెనీల లాభాల కోసం కాకుండా, ప్రాంతీయ ప్రజల సంప్రదాయ ఉత్పత్తి అభివృద్ధి చేయాలనీ, పచ్చని పొలాలను నాశనం చేయకుండా ప్రణల ఆహార వినియోగాన్ని భద్రపరిచి తీరప్రాంత మత్స్యకారుల జీవితాల్ని అభివృద్ధి చేసే దిశలో ఉత్పత్తి జరగాలనే లక్ష్యంలో అనేక ప్రజా సంఘాలలో ఏర్పడింది, రోస్టల్ కారిడార్ నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటీʹ.
అయితే ప్రస్తుతం అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఎన్నో ప్రమాణాలు చేసి ఇప్పుడు అంతా తూచ్ |అంటూ అన్ని రంగాల్లోనూ దేశాన్ని దిగజారుస్తున్న ప్రబుద్ధులు ఏలుతున్నారు. దేశ రాజకీయాలనూ, ప్రజల భావోద్వేగాలనూ నిష్ఫలమైన ఉన్మాదపూరిత అంశాల చుట్టూ తిష్పతున్నారు. గత నాలుగు సంవత్సరాల నుంచీ టీవీల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ దేశం అవినీతి గురించీ, గాలి కాలుష్యం గురించీ, నీటి కాలుష్యం గురించీ, ఆకలి, పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, అనారోగ్యం, వైద్యం గురించీ చర్చలేదు కానీ ఏ మతం గొప్పది, ఏ కులం గొప్పది, నువ్వు మతాన్ని మార్చే క్రిష్టియనివా, వందేమాతరం పాడని ముస్లించా, |నువ్వ టెర్రరిస్టువా, పాకిస్తానీయుడివా అనే విషయాల మీదే చర్చ! మహిక అత్యాచారానికి గురై మరణిస్తే, ఆమెదే కులం, ఏ మతం, దళిత స్త్రీయా, ముస్లిమా, క్రిష్టియనా అనేదే చర్చగా మిగులుతోంది. మన ఆలోచనలను ఉన్మాదం చుట్టూనే రాణం తిప్పతోంది. ఎందుకు మనకీ దుస్థితి దాపురించింది? ఎన్నడూ లేనిది దేశ రాజకీయాల్లో మతం ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ చౌకబారు రాజకీయాలు చలామణి అవుతున్నాయి. మతం పేరులో, పురాణాల పేరుతో ఎక్కడ పడితే అక్కడ విజ్ఞానశాస్త్రాన్ని సవాలు చేస్తూ మూఢనమ్మకాల్ని పెంచి పోషించి వీటిని వ్యతిరేకించే వాళ్లని కాల్చి చంపడం మామూలైపోయింది. భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు ఉన్నవాళ్లని దేశద్రోహులుగా ముద్ర వేయడం, మన మధ్య ఉన్న జీవన సంస్కృతిలోని వైవిధ్యాలనూ, తేడాలుగానూ, దూరాలుగానూ చివరికి భరింపరాని లోపాలుగానూ ముద్ర వేసి మనలో ద్వేషాన్ని రెచ్చగొట్టడం నేటి భారతదేశ రాజకీయ పౌత్ర పటం. | అచ్చే దిన్ అయేంగే", "మూడు కోట్ల ఉద్యోగాలుʹ, ప్రతి వ్యక్తిలోనూ 15 లక్షల రూపాయలు"- ఏమైనాయి. ఈ ప్రమాణాలన్నీ? అరు నెలల్లో మొత్తం లక్షల కోట్ల రూపాయల క్లారమనీని తెచ్చేస్తానన్నారు. కానీ ఇప్పుడు హైకమనీతో బాటు నల్లకుబేరులు కూడా మూడొంతుల విదేశాలకి ఎగిరిపోయి వెక్కిరిస్తున్నారు. డీమానిటైజేషన్ ద్వారా ప్రజల జేబులు - ఆరు, బ్యాంకుల నిండా డబ్బు వరదలై పారింది. దాన్ని మన అవసరాలకి ఇవ్వరు. కానీ కార్పొరేట్ పెట్టుబడిదారులు రుణాల పేరిట ఏగలేక తిరిగిరాని రుణాలు. సామ్ము మనది, సాకు వాళ్లది! | స్వచ్చ భారత్ʹ అంటూ వీధుల్ని శుభ్రం చేయమన్నారు. ఇక గాలి కలుషితం. నీరు కలుషితం. నదీ జలాలు, భూగర్భ లాలూ, అఖరికి హిమనీ నదాలు, హిమాలయాలూ కలుషితం. పవిత్రంʹ, ʹపవిత్రం" అని మనం నిత్యం ఘోషించే గంగా నది పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితం. కోస్తా తీరం, సముద్ర జలాలు, నదీనదాలు, చెరువులు, మందుల కంపెనీల, పాలిమర్ రసాయనాల కలుషితాలతో నిండిపోయింది. విశాఖలో హెచీపీసీఎల్, కోరమాండ, పోర్టు, వెదజల్లే కాలుష్యంతో చలికాలంలో గంధరీరామ పార
విశాఖని కప్పస్తోంది. ఇది చాలదన్నట్లు, మన నెత్తి మీద కత్తి చేశాడుతున్నట్టుగా పీసీవీఐఆర్ ప్రతిపాదన ఒకటి. | ఓసీపీఐఅర్ (పెట్రోలియం & కెమికల్ అండ్ పెట్రోకెమికల్ ఇన్వెనమెంట్ రీజియన్) పేరిట శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు 9 జిల్లాలనూ మన ప్రభుత్వం రియల్ ఎస్టేలుగా మార్చి ఐహకడా, పెబై, థర్మల్ పవర్, నిర్మాణ రంగ ఎగుమతి ఊగుమతి కంపెనీల విదేశీ పోర్టుల చేతుల్లో పెట్టబోతోంది. దీని పేరిట విరివిగా మందుల, రసాయనాల, పెట్రో రసాయనాల కంపెనీలు, స్మార్ట్ సిటీలూ రాబోతున్నాయి. దీంతో మన తీరప్రాంతానికి చెందిన లక్షలాది రైతుల భూముల కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి పోయి వారు వెదజల్లే కాలుష్యం మన జీవితాల్లోకి విస్తరిస్తుంది. ఈ కంపెనీలకు వేల ఓఎంసీల నీరు పంపడానికే పోలవరం ప్రాజెక్టు. విశాఖ నుంచి కాకినాడ వరకు ఉన్న 110 రెవిన్యూ గ్రామాల్లో చమురు పరిశ్రమలు రాబోతున్నాయి. ఇక్కడి పంట భూములు, సముద్రంలోని వేల టన్నుల చేపలూ, ఇతర సముద్ర జీవులూ, పాడి పరిశ్రమ, ప్రకృతి, పర్యావరణం, వ్యవసాయ ఉత్పత్తులు, రక్షిత అడవులు, మంచినీటి వనరులు, బురదనేలలు, ఉప్పునీటి కయ్యలు, చెరువులు, సరస్సులు, మన సంస్కృతులు, ఆర్థిక సామాజిక సంబంధాలు, వీళ్లు చెప్తున్న ఈ అభివృద్ధి పిడుగు బారినపడి నాశనం కాబోతున్నాయి. ఈ ఏడుగు వెదజల్లే మెరుపులో, దాని వెలుగులో రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ముఖ్యంగా బహుళజాతి పెట్రో కంపెనీలు వేలకోట్ల డాలర్లకి పడగలేత్తబోతున్నాయి. ఈ పడగలు ఆ విషంలో మన తీరప్రాంతం కాలుష్యంతో నిండిపోయి, పుట్టి పెరిగిన ఈ నేలమీద పరాయినాథమైపోలాం, లాభాలు వాడీ, వినాశనం మనకీ, ఇంతటిలో మన ప్రభుత్వాలేమీ ఆగడం లేదు. మరో వాక్సైటు పడగ నిరంతరం మన నెత్తిమీద వూగుతూనే ఉంది.
బాక్సైట్ గనులు | సుమారు 3037 కోట్ల టన్నుల బాక్సైట్ గనులు మనకున్నాయి. ఇది జీవవైవిధ్యం ఉన్న దట్టమైన అడవుల్లో, గిరిజనులు ఉండే ప్రాంతాల్లో సుమారు 700 నుండి 2100 మీటర్ల ఎత్తులో లభిస్తుంది. ఇంత ఎత్తులో, కొండల్లో బాక్సైట్ లభించడం ఎంత సహజమో, అక్కడే నీటి వూటలు, ధారలు, చెలమలు, వాగులు, వంకలూ, వీటన్నింటి ద్వారా పుట్టే ఉపనదులూ, నదులూ ఉందడం అంటే సహణం, పెద్ద పెద్ద నదులకి ఈ కొండలే పుట్టినిల్లు. | ఆంధ్రా, ఒరిస్సా దట్టమైన అటవీ ప్రాంతం గల తూర్పు ప్రాంతంలో పుష్కలంగా బాక్సైట్ నిక్షేపాలున్నాయి. అంధా లోని తూర్పు అడవుల్లో 6, 580 మిలియన్ టన్నుల బాక్సైటి నిక్షేపాలున్నాయి. అంటే, దేశంలోని బాక్సైట్ నిక్షేపాల్లో నున దగ్గరున్నవి 21. 65%. ఇవన్నీ గుర్తెరు, అనంతగిరి, గాలికొండ, రత్తకొండ, కట్టువి, చిట్టిమాగండి, చింతపల్లి, సష్పర, గూడెం, విజరేలా ప్రాంతాల్లో ఉన్న కొండలో ఉన్నాయి. వేలాదిమంది గిరిజనులతానీ, జీవవైవిధ్యంతాల్, అటవీ సంపదతో, వృక్షాలతోటి జీవత్వంతోటీ తొణికిసలాడే పర్వత ప్రాంతాలివి. ఇలాంటి జీవవైవిధ్యాన్నీ, గిరిజన జీవితాల్నీ లిద్రం చేస్తూ నదులు, సెలయేరులూ, భూగర్భజలాలూ, కలుషితమైపోయేటట్లూ చేసి ఈ బాటు గనుల తవ్వకం సంవత్సరానికి 9 నుంచి 10 లక్షల టన్నుల దాకా కొనసాగుతుంది. నాలో పాండాలో ఇండియన్ అల్యూమినియం కంపెనీ, అలైన్ కంపెనీలు, దామన్జోడి, కలహంది, రాయగడ, కేశాపూర్, కోరాపూర్, అచ్చింపూర్, థర్మల్ పూర్ ప్రాంతాలలో 17 ఏళ్లలో |3 లక్షల కోట్ల బాక్సైటీ ఖనిజాన్ని మన దేశానికీ, ముందు తరాల వాళ్లకే, రాబోయే మానవాళికి ఉపయోగపడాల్సిన సహజమైన బాటి.
నిజాన్ని తవ్వి, అతి తక్కువ ధరల్లో త్రవ్వి, అంతర్జాతీయ మార్కెట్లో అమ్మేస్తున్నాయి. ఇప్పుడు అదే పద్దతిని మన విశాఖ జిల్లాలోని తూర్పు కనుమల్లో కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం కొన్ని అంతర్గత కారణాల వల్ల వాయిదా పడ్డా, రాబోయ. కాలంలో ఈ ప్రమాదం మన మీద వేలాడుతున్న కత్త. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలో కైల్ వెలికి తీస్తే, కేవలం ఆదీవాసులకే కాదు, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, నదులు, భూగర్భ జలాలూ, అల్యూమినియం వ్యర్థాలతో కలుషితమైపోతాయి. అనంతగిరి కొండల్లో దాకైల్ తీస్తే, గోస్తనీ, భారదా నదులకు ముప్పు వాటిల్లుతుంది. ఈ నదులపై నిర్మించిన లాడిపూడి, రైవాడ, జలాశయాలకు నీరు రావడం ఆగిపోతుంది. చింతపల్లి కొండల్లోని వాటి త్రవ్వకం వల్ల శరీ, మచ్ఖండ్ నదులకు ముప్పు వాటిల్లుతుంది. ఇప్పుడు చెప్తశవన్నీ ఆషామాషీ అంచనాలు కావు. పర్యావరణవేత్తలు వివరించిన పచ్చి నిజాలు.
పోలవరం
ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో చేపట్టే ఏ ప్రణాళికైనా, అట్టడుగు ప్రజానీకమైన దళితులు, గిరివిజనులతోటీ, వాళ్ల విస్థాపనలోదీ | ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా, ప్రాజెక్టుల, గనుల విషయంలో ఆదివాసుల జీవితాలు ఛిద్రమవుతాయి. ప్రతి ఆదివాసీ తన జీవితంలో || 2 లేక 3 సార్లు విస్తాపనకు గురైనా ఆశ్చర్యం లేదు. ఇందుకు ఉత్తరాంధ్ర ఆదివాసులు మినహాయింపు కాదు. కాని | భారీ విస్థాపనకు కారణమవుతోంది.
పర్యావరణవేత్తల అంచనా ప్రకారం, 276 గ్రామాలు, 1,77,200 మంది ప్రజలు పోలవరం ముంపు గురవుతాయి, 1,80,667 | మంది ప్రణలు తరతరాలుగా నివసిస్తున్న తమ గ్రామాలను వదిలి వెళ్లాల్సి వస్తుంది. అయితే 2001 లెక్కల ప్రకారం, రాళీ చేయాల్సిన ||ప్రణలు 2,36,834 గా తేలింది. ఈ 17 ఏళ్లలో ఈ లెక్క 3,00,000 దాటుతోందని ఒక అంచనా. పోలవరం వల్ల అటు కృష్ణాజిల్లా నుంది ఇటు శ్రీకాకుళం వరకు పొలాలకు నీరందుతుందనీ, వ్యవసాయాభివృద్ధి జరుగుతుందనీ ప్రభుత్వం ఊదరగొడుతోంది. ఇప్పటికీ |నాగార్జునసాగర్ లెఫ్, రైట్ కాల్వల ద్వారా చివరి భూములకు నీరందడం లేదు. ఇప్పుడు అన్నివేల కోట్లతోటి ఇన్ని లక్షలమంది జీవితాలు
నాశనం చేసి కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నీరందుతున్న పొలాలకు అదనంగా నీరందించడంలో ఏం ప్రయోజనం ఉంది? |Verనికి పోలవరం శ్రీకాకుళం నుండి కాకినాడ వరకు రాబోయే వీసీపీఐంలోని ఐహుళజాతి కంపెనీలకు నీరందించడమే దాని ప్రధాన లక్ష్యం.
తెలంగాణా విడిపోయి అంధ్ర రాష్ట్రంగా అవతరించిన మన రాష్ట్రానికి కరవు జిల్లాలు, వెనకబడ్డ జిల్లాలు, మన అభివృద్ధికి ఒక అద్దంగా ఉన్నాయి. ఉదాహరణకి, రాయలసీమ ఒక కరవుసీమ. కోస్తా ప్రాంతం సరాసరి వర్షపాతం 1,078 మి. మీ. అయితే, రాష్ట్ర సరాసరి వర్షపాతం 840 మి. మీ. కానీ ప్రకాశం సరాసరి వర్షపాతం 750 మి.మీ. కడప, కర్నూలు, అనంతపురం సగటు వర్షపాతం

700 మీ.మీ. 62 సంవత్సరాల నుంచి ఇదే లెక్కలో వర్షం పడుతోంది. ఈ మాత్రం వర్షపు నీటిని కూడా నిలవ చేసే చర్యలేవీ ప్రభుత్వాలు చేపట్టలేదు. రాష్ట్రంలోని 5 కరవు పీడిత ప్రాంతాల్లో ! రాయలసీమ జిల్లాలే. దేశంలో రెండవ అత్యంత దుర్భిక్ష కరవు పీడిత జిల్లా అనంతపురం. మొత్తం రాయలసీమ ప్రాంతం చెరువుల వ్యవస్థ పూర్తి నిర్వనికి గురైంది. ఇప్పుడు అనంతపురం జిల్లా ||1200 అడుగుల వరకు బోరు వేసినా చుక్క నీరు లభించడం లేదు. 1878 బ్రిటిషు పరిపాలన నుంచి ఇప్పటివరకు రాయలసీమ | దుర్భిక్షం గురించి ఎన్నో సూచనలు, ప్రణతాఃలు, పథకాలూ చేశారు. కానీ ఆనాటి నుంచి ఈ నాటి వరకూ ఏదీ అమలు విరగడం లేదు. | | ఒక ప్రక్క రాయలసీను వెనకబాటుతనంలో కరవుతో కునారిల్లుతుంటే, ఉత్తరాంధ్ర పుష్కలంగా నీరు, ప్రకృతి వనరులు ఉన్నా వెనుకబాటుతనానికి గురైంది.
| ఉత్తరాంధ్ర జీవ, భౌగోళిక వైవిధ్యంతో అటవీ, మైదాన, ఓల భూములు, సముద్ర తీరాలలో ఉండే భిన్న సమాహారం. 365 ||ఆలోమీటర్ల సముద్ర తీరంలో, 510 కి.మీ. అటవీ ప్రాంతంతో, 4000 చ.కి.మీ.తో, 6500 గ్రామాలలో, వంశధార, నాగావళి, రుండవతి లాది 19 నదులలో వర్షాకాలం వరదలతో పాంగి, ఎండాకాలం చుక్కనీరు లేకుండా ఇంచుమించు కోటి వినాభాదోది, 11 లక్షలమంది | ఆదివాసులు, 9 లక్షల దళితవాసులు, 3 లక్షల మత్స్యకారులు, 70 లక్షల బహుజనులతోటీ అంటే, సుమారు 90 లక్షలు శ్రమించే ||వరాలలోకీ ఉండే లంగ ప్రాంతం. ఆశ్చర్యం ఏమిటంటే, క్లచవవారి పాలన నుంచి ఇష్పటిదాకా అచ్చంగా వలస వచ్చినవారి దోపిడీకి | గురవుతూ రాబోయే అర్థిక రాజధాని (ఎవరికి?) విశాఖ లాంటి నగరమున్నా ఉత్తరాంధ్రలో మిగిలిన ప్రాంతాలన్నీ వెనుకబాటుతనంలో తులతూగుతూ రాయలసీమలో పోటీ పడుతోంది. ఉత్తరాంధ్రలో 3 వంతుల సాగుభూమికి నీటి వసతి లేదు. 500 టీఎంసీ నీళ్లు లభ్యమయ్యే ఉత్తరాంధ్రలో 50 లక్షల ఎకరాలకి నీరు అందించవచ్చు. కానీ 8 లక్షల ఎకరాలకే సాగునీరు అందుతోంది. ప్రకృతి వనరులు | పుష్కలంగా ఉన్న ఏ ప్రాంతమైనా దోపిడీకి గురయినట్లే, ఉత్తరాంధ్ర వనరులు దానికి శాపమైనాయి. ఆ నాటి ఫ్యూడల్ శక్తుల నుంచి ఈ ||నాటి కార్పొరేట్ శక్తుల దాకా ఉత్తరాంధ్ర ఒడ్డించిన విస్తరి అయింది. గతంలో ఈస్ట్ ఇండియా అయిత. అసలు రీస్ అల్లెమా. జిందాల్. ||ఈస్ట్రోక్స్ టైనర్స్), ఎస్ ఆర్ కంపెనీలు దోచుకుంటున్నాయి. ప్రపంచీకరణ ఫలితాలను ఉత్తరాంధ్రతరులు పంచుకుంటున్నారు. | ఉత్తరాంధ్ర సహజ వనరుల్నీ, అటవీ ప్రాంతాల్నీ కార్పొరేట్ కంపెనీలు ఆక్రమిస్తే, ఇక్కడి అటవీ భూమీ, ఇతర సంపదల్ని పాలక పక్ష సామాజిక వర్గం ఆక్రమించింది. క్రొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం, సోంపేట, కాకరపల్లి వంటి థర్మల్ కేంద్రాలు, గ్రానైట్ గనులు, బాక్సైట్ గనులు, కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం వల్ల ఇక్కడ నదులు, అడవులు, కషధ మొక్కలు, భూగర్భ జలాలు, ప్రజల జీవితాలూ నాశనమవుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా ʹఉత్తరాంధ్ర సంపద, స్థానిక వనరులు, స్థానికులకే!" అన్న నినాదంలో ఉద్యమించాలి.
| అన్ని సమస్యలలోని ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడితే, ఇవన్నీ మన ముఖ్యమంత్రిగారికి పట్టడం లేదు. ʹబాబోస్తే జాబిస్తుందిʹʹ అన్నారు. ||"ప్రతి సంవత్సరం 3 లక్షల ఉద్యోగాలు!" అన్నారు. అ రాతలు గోడల మీద అలాగే ఉన్నాయి. మళ్లీ ఎన్నికలకి కాబోలు, ʹభాగస్వామ్య సదస్సులుʹ పేరిట, ʹటూరిజంʹ పేరిట, ప్రతి జిల్లానీ రియల్ ఎస్టేటిగా మార్చేస్తున్నారు. ఎవరికీ తెలియని మారుమూల ప్రాంతాలకు టూరిజం పేరిట కార్పొరేట్ శక్తులకు రోడ్లు, విద్యుచ్ఛక్తి, హెల్త్ సెంటర్ల సౌకర్యాలు కల్పిస్తున్నారు. అంటే, రామ్లం మొల అభినంది" పేరులో రియల్ వర్జటిగా మారుస్తున్నారు. ʹఐ.టి.హబ్ గా విశాఖని మార్చడానికి ఇక్కడ ʹపబ్ʹలు, నైట్ క్లబ్ లు, అందాలపోటీ" బీచ్ ఫెస్టివల్స్ʹ వంటి విష సంస్కృతుల్ని యథేచ్ఛగా పెంచుతున్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని దిగజారుస్తున్నారు. ఇప్పుడు దామిగారు మళ్లీ ||ఎన్నిక కావాలంటే, అయన పూర్తి చేయాలనుకుంటున్న లక్ష్యాలు రెండు. ఒకటి, 3 లక్షల మంది గిరిజనుల్ని కాళీ చేయించైనా సరే, వారి ||బ్రతుకుల్ని చిత్రం చేసైనా సరే, పోలవరం నిర్మించాలి. రెండు, తన వారికీ, తమ మంత్రివర్గ సహచరులకీ, కాంట్రాక్టర్లకీ, దళారీలకి రాక్చతంగా ʹఅమరావతిʹ అనే రియల్ ఎస్టేటిని అప్పజెప్పాలి. ఇవే వారి ముందున్న లక్ష్యాలు.
కేపిటల్ ప్రము-అమరావతి రియల్ ఎస్టేట్
సాధారణంగా సారవంతమైన సాగుభూములున్న ప్రదేశంలో రాజధాని నగరం నిర్మించరు. కారణం, భూసేకరణ చాలా ఖర్చు కూడుకున్నది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సెక్షన్ 6 ప్రకారం, తరలించాల్సిన వినాభా సంఖ్య కనీసం?? ఉండాలి. వ్యవసాయ భూములకు జరిగే నష్టం తక్కువగా ఉండాలి. కానీ రాజధాని పేరిట జరుగుతున్నది. ఇందుకు పూర్తిగా విరుద్ధం తెనాలి, గుంటూరు, మంగళగిరి, ఆంధ్ర ప్రదేశ్రీ ధాన్యాగారం వంటివి. తుకూరు, మంగళగిరిలలో సంవత్సరానికి 3 పంటలు పండుతాయి రాణధాని పేరిట రైతులు ఈ భూముల్ని అమ్మేసుకుంటున్నారు. ఇప్పడు ఎంతో లాభంగానే కనబడుతుంది. కానీ వచ్చిన డబ్బుని వాటిని రంగాలలో వెచ్చించలేరు. ఎందుకంటే, వాణిజ్య సముదాయం వినియోగదారుల సంఖ్యపై ఆధారపడుతుంది. అమరావతిలో మౌలి! సదుపాయాల రూపకల్పన సాకారం కావడానికి కనీసం 10 ఏళ్లు పడుతుంది. చిన్న రైతుల చేతుల్లో ఈ డబ్బు మహా అయితే ! |సంవత్సరాలు ఉంటుంది. ఎక్కువ ఎకరాలున్న భూస్వామ్య రైతులు ఇక్కడ వ్యవసాయం చేయని భూయజమానులు, ఈ దలని అతడి ప్రదేశాలలో వినియోగించి లాభపడతారు. అమరావతి ప్రాంతంలో రైతుకూలీలకు రోజుకి 900 రు. కూలీ వస్తుంది. వారి పరిస్థితి ఇప్పుడు ఒడ్డున పడ్డ చేపల్లాగా తయారైంది. భూపరిహారం సింహభాగం ఇక్కడ వ్యవసాయం చేయని ధనిక రైతుల చేతుల్లో వెల్తోంది. |అంటే నాకు రాజధాని అవతల భూములు కొనుక్కున్నారు. మరో నంహ భాగం దశార్, రియల్ ఎస్టేటర్ల చేతుల్లోకి పోయింది. 2017 లాండ్ ఎక్విజిషన్, రిహాబిలిటేషన్ చట్టాన్ని పక్కన పెట్టి, లాండ్ పుల్లింగ్ విధానాన్ని ముందుకి తెచ్చారు. అంటే, పచ్చడి భూముల్ని తీసుకుని, ఒక రియల్ ఎస్టేటర్ లాగా డెవలప్ చేసి, అక్కడ కొంత భూమినివ్వడం. ఈ విధానం ద్వారా 2015 నుండి 2016 చివరి దాకా |8,000 ఎకరాలు మాత్రమే వచ్చాయి. 2017 లో స్వచ్ఛందంగా ఇవ్వకపోతే, ఐలవంతంగా తీసుకుంటామని అనేక రకాలుగా ప్రచారం చేస్తే, అసలుకే మోసం వస్తుందనే భయంతో 2017 ఫిబ్రవరిలో రైతులు 20,000 ఎకరాలు ఇష్టం లేకపోయినా అప్పజెప్పారు. ఈ |రకంగా 25 శాతం ఇష్టపడి, 75 శాతం భయపడి రైతులు భూముల్ని ఇష్పజెప్పారు. తర్వాత 27,000 ఎకరాల వింజరు భూమికి ప్రభుత్వం రాజధానికి కేటాయించింది. మళ్లీ 2018 లో కేంద్రం దగ్గర నుంచి సెమీ ఫారెస్ట్ భూమి 45,000 ఎకరాలను డీఫారెస్ట్ చేసి
| తెచ్చుకున్నారు. అంటే, అక్షరాలా 1లక్ష ఎకరాల పంట భూములీ, ఫారెస్ట్ భూముల్నీ, ఐంజరు భూముల్నీ రాజధానికి కేటాయించారు. ||ఉండే 15,000 ఎకరాలు 26 భూములు, సారవంతమైన భూములు, ఎత్తిపోతల పథకాలతో సంవత్సరానికి 3 పంటలు పండే భూములూ ఉన్నాయి.
ముఖ్యనుంత్రి గారి అంచనా ప్రకారం, 2050 నాటికి అమరావతి జనాభా 25 లక్షలకు చేరుతుందిట. ఇది నిఅమా? | హర్యానా, పంజాబ్ రెండు రాష్ట్రాల రాజధాని అయిన చండీగఢ్ 1966 లో ఏర్పడింది. ఇష్పటికీ దాని జనాభా 11,50,000 చిల్లర | దీని కోసం 20,000 ఎకరాల్ని ఎంతో ఇష్టంగా ఇచ్చారు రైతులు. పోనీ, పక్క దేశాన్ని చూద్దాం. చైనా అనాభా సుమారు 187 కోట్లు,
ఇక్కడ నిర్మిస్తున్న కొత్త నగరాల్లో అనుకున్నదాంట్లో కనీసం 25 కూడా వచ్చి చేరడం లేదు. ʹతియందుచంగ్ʹ నగరాన్ని 2003లో 10 | లక్షల జనాభా కోసం నిర్మించారు. ఇప్పటికి అక్కడికి 30,000 జనాభా మాత్రమే వచ్చారు. ʹరంగ్ దాంగ్" నూతన ప్రాంతం. దీన్ని || వేలాది ఎకరాల గోధుమ పొలాల్లో, కాన్ఫ్రాన్సిస్కో కన్నా రెండు రెట్లు ఉండేలా మహానగరాన్ని నిర్మించారు. ఇక్కగా అదే పరిస్థితి. దీని || చుట్టుప్రక్కల జనాభా పెరిగింది గానీ ఇక్కడి రియల్ ఎస్టేట్ జూదానికి భయపడి ప్రజలు రావడం లేదు. అక్కడే ఉన్న ప్రజలు అద్దెలు
భరించలేక వెళ్లిపోతున్నారు. ʹకుమింగ్ʹ అనే ప్రాంతంలో వెల్లువెత్తుతున్న వినాల కోసం ʹచంగ్ గాంగ్ʹ అనే పట్టణాన్ని నిర్మించారు. || అక్కడి జనాలు చేరుకోవడం లేదు. వాళ్ల సాంత ఆవాసాల్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. చైనాని చూసైనా నునం బుద్ధి || తెచ్చుకోవాలి..
| అసలు ఇంత సమాచార వ్యవస్థ, రవాణా వ్యవస్థా అభివృద్ధి చెందిన ఈ కాలంలో అన్ని రంగాలనూ ఒక చోట కేంద్రీకరించేటట్లు, రాజధాని నిర్మించడం, దాని కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఒక తప్పుడు ప్రయోగం. ఇలా ఎందుకు జరుగుతోందంటే, ఇది కేవలం కొన్ని వర్గాల, కులాల, అధికారుల కష్టం మీద రాబోయే కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పనికి వచ్చే షాట్ల రాజధాని అమరావతి. ఇది ఒక తటస్థ ప్రదేశంలో గానీ, వెనకబడ్డ ప్రాంతంలో గానీ, భిన్న ప్రాంతాల మధ్య ఒక సర్దుబాటు ప్రాంతంలో గానీ ఏర్పడింది కాదు. అప్పటికే అభివృద్ధి చెందిన జిల్లాల మధ్య చంద్రబాబు, వారి వర్గీయుల వ్యాపారం కోసం నిర్మించబడుతున్నది ఈ రాజధాని.
పైన చెప్పిన సమస్యలలో రాష్ట్రం ఉక్కరిబిక్కిరి అవుతోంది. రండి! మన కోస్తా తీరాన్నీ పొలాలనూ, జలాలనూ, జనాలనూ, సముద్రాలనూ, నదులనూ, మత సంపదను కాపాడుకుందాం! మన ఉపాధిని పోరాడి సాధించుకుందాం! ముందు తరాల వాళ్లను అధార్మిక ప్రభావానికి గురి చేయకుండా ఉండేలా ఉద్యమిద్దాం! మన ఆదివాసుల విస్థాపననీ, తరలింపునీ అడ్డుకుందాం! 2018 మే ||నెల 19, 20 తేదీల్లో (శ‌ని, ఆదివారాలు) విశాఖపట్టణం, అంబేద్కర్ భవన్లో జరిగే 2రోజుల సదస్సులో పై విషయాలన్నీ చర్చింకుందాం. చట్టబద్ధమైన ప్రజా ఉద్యమాల్ని నిర్మిద్దాం!
డిమాండ్స్
1.కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రాన్ని అపివేయాలి!
2.బాక్సైట్ తవ్వకాలనుశాశ్వత‍ంగానిలిపివేస్తున్నట్టు ప్రకటన విడుదల చేయాలి!
3. లక్షలాదిమంది గిరిజనులను నిర్వాసితులుగా చేస్తున్న పోలవరం ప్రాజెక్ట్ ని విరమించుకోవాలి! 4.ఎక్కడికక్కడ చిన్న ప్రాజెక్టుల ద్వారా సాగునీటి ప్రాజెక్టులను అమలు చేయాలి! 5. పి.సి.పి.ఐ. ఆర్. నిర్మాణాన్ని శాశ్వతంగా రద్దు చేయాలి! 6.కాలుష్యాన్ని వెదజల్లే రసాయన, ఫార్మా, పెట్రో, పాలిమర్ కంపెనీలను నియంత్రించాలి. నిషేధించాలి! 7.పోర్టు కాలుష్యంపై శాశ్వత నివారణ చర్యలు తీసుకోవాలి! 8.కాలుష్య పరిశ్రమలను నియంత్రించాలి! 9.సెజ్ చట్టాన్ని రద్దు చేయాలి! 10. మత్స్యకారులకు ఉపయోగపడని భావనపాడు పోరుని నిలిపివేసి, మత్స్యకారుల కోసం షిప్పింగ్ హార్బర్ ని నిర్మించాలి! 11.బొగ్గు అధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాలనూ, అణువిద్యుత్ కేంద్రాలనూ ఉపసంహరించుకోవాలి! 12.ప్రత్యామ్నాయ ఇంధన వనరులను అభివృద్ధి చేయాలి! 13.రాజధానిని వికేంద్రీకరించాలి!14. టూరిజం పేరుతో రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ గా మార్చొద్దు! 15.కళింగాంధ్ర వెనుకబాటుతనంపై తక్షణం చర్యలు తీసుకోవాలి!
# # # # #
సభ్య సంఘాలు : కాకరాపల్లి థర్మల్ విద్యుత్ వ్యతిరేక పోరాట కమిటీ, కాండ్ మైనింగ్ వ్యతిరేక పోరాట కమిటీ, బాక్సైట్ మైనింగ్ వ్యతిరేక పోరాట కమిటీ, కొవ్వాడ-మత్స్యరేశం అవిద్యుత్తు వ్యతిరేక పోరాట కమిటీ, కోడిపాం, వెల్దుర్తి, లచ్చయ్యపేట, శారద పవర్ ప్లాంట్ల వ్యతిరేక పోరాట కమిటీలు, ఎపీసిఎలేసి, గిరిజన హక్కుల పరిరక్షణ సంస్థ, గిరిజన ఉద్యోగుల సంఘం, విరసం, వేనిపికి వ్యతిరేక పోరాట కమిటీ, ప్రగతిశీల మహిళా సంఘం, ఐఎఫ్టీయు, దళిత విముక్తీ, ఐఎపీఎల్, ఎమ్ఎన్ఎస్ఎస్, దీటీఎఫ్, ఎఐకెఎస్ఎస్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, ప్రజాకళా మండలి, జన విజ్ఞాన వేదిక, కుల నిర్మూలనా పోరాట సమితి, ప్రజాకానాస్త్ర సమాశితం, ప్రజ‌లు కేంద్రంగా అభివృద్ధి సాధనా ఉద్యమం, సోంపేట పర్యావరణ పరిరక్షణ సంఘం, శ్రీకాకుళం రైతాంగ కమిటీ, ప్రగతిశీల కార్మిక సమాఖ్య, ఎ.బి.ఎం.సి., పి.డి.ఎం.

Keywords : coastal corridor, visakhapatnam, andhrapradesh
(2020-01-17 11:51:11)No. of visitors : 1778

Suggested Posts


మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం - విరసం

ʹరచయితలందరూ తమ తరానికి జవాబుదారులు; తమకు తాము జవాబు చెప్పుకోవాల్సిన వాళ్ళు... అంతస్సాక్షి ఉన్న రచయిత పీడిత ప్రజల పక్షాన దృఢంగా నిలవాలి. అలా కాకపోతే ఆ రచయితల్ని నిర్దోషులుగా నిర్ణయించే ప్రశ్నే లేదు.ʹ....

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ʹఆయన జైల్లోనే చనిపోతారేమోʹ

90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. ఆయనేమైనా యుద్ద ఖైదీనా..? ప్రభుత్వ అనాలోచిత చర్యతో యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ...

ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ

అందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు.

Search Engine

కట్టుకథ ఆధారంగా కాశీం అరెస్ట్...!!
ʹప్రొఫెసర్ కాశీంను అణగారిన ప్రజల వైపు నిలబడ్డందుకే అరెస్ట్ చేశారుʹ
ఉరిశిక్ష‌లు, ʹఎన్‌కౌంట‌ర్ʹ హ‌త్య‌ల‌తో నేరాల నియంత్ర‌ణ సాధ్య‌మేనా?
రాజ్యాంగమే నా బలం,ఆ బలంతోనే పోరాటం కొనసాగిస్తా - ఆజాద్
మోడీ భారత పౌరుడనే రుజువుందా ? ఆర్టీఐ ద్వారా అడిగిన కేరళవాసి
వాళ్ళిద్దరి కోసం..!
జేఎన్‌యూ తర్వాత‌...ఇప్పుడు మరో యూనివర్సిటీ విద్యార్థులపై దాడి
మమ్మల్ని ఈ దేశం నుండి బహిష్కరించండి - రాష్ట్రపతికి లేఖ రాసిన ʹఉనాʹ దళితులు
JNU పై దాడి చేసిందెవరో తేల్చి చెప్పిన వార్డెన్ల నివేదిక‌
భీం ఆర్మీ ఛీఫ్ ఆజాద్ కు బెయిల్...నెల రోజులు సహరన్ పూర్ లోనే ఉండాలని కండీషన్
మోడీషా రాజ్య నిర్బంధంలో మగ్గుతున్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ విడుదలకై ఉద్యమిద్దాం
విద్వేషం అతని మతం.. అణచివేత అతని ఆయుధం..!
మీరు చేస్తే గొప్ప పని ప్రజలు చేస్తే హింసనా జగ్గీ గారు
ఈ ప్రభుత్వమే నిర్బంధ కేంద్రాల్లోకి నెట్టబడే రోజొస్తుంది : అరుంధతి రాయ్
మన చేతుల మీది నెత్తుటి మరకలు కడగడానికి ఎన్ని సముద్రాలు కావాలి?
నిజం ఎప్పటికి బయటకు వస్తుంది?
విరసం అధ్యక్ష కార్యదర్శులుగా అరసవెల్లి కృష్ణ,కాశీం
50 ఏళ్ల.. దుఃఖం, నిర్భంధం, ధిక్కారం, స్పూర్తి... 50 ఏళ్ల విరసం మహాసభలు
విరసం 50 ఏళ్ళ సభలు...నోమ్ ఛామ్ స్కీ సందేశం
సృజ‌నాత్మ‌క ధిక్కారం.. విర‌సం 50 ఏళ్ల స‌భ‌లు ప్రారంభం
విరసం 50 ఏళ్ల సభలు.. పూణే జైలు నుంచి వరవరరావు సందేశం
CPI (Maoist) oppose Citizenship Amendment Act, calls to intensify mass campaign against it
అమిత్ షాకు బహిరంగ లేఖ‌ !
50 ఏళ్ళ ధిక్కారస్వరం...ఈ నెల11,12 తేదీల్లో విరసం రాష్ట్ర‌ మహాసభలు
నెత్తుటి ఏరులు పారినా ఎత్తిన జెండా దించకుండా... మళ్ళీ పిడికిలెత్తిన జేఎన్‌యూ
more..


వైజాగ్