కథువా చిన్నారి కేసు పంజాబ్ కు బదిలీ..సిబీఐ విచారణకు నో..సుప్రీంతీర్పు

కథువా

జమ్ము కాశ్మీర్ లోని కథువాలో చిన్నారిని కిడ్నాప్ చేసి, చిత్ర హింసలు పెట్టి, అత్యాచారం చేసి, హత్య చేసిన కేసు విచారణను జమ్ముకశ్మీర్‌ కోర్టు నుంచి పఠాన్‌కోట్‌ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి బాధితురాలి తండ్రి వేసిన పిటిషన్‌ను కోర్టు అంగీకరించింది. ఈ సంఘట్నపై సీబీఐ విచారణ జరపాలన్న నిందితుల వాదనను కోర్టు తిరస్కరించింది.

ఈ మేరకు జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. ఈ కేసులో ఇక నుంచి రోజువారీ విచారణ చేపట్టాలని, దర్యాప్తు మొత్తాన్ని కెమెరా రికార్డింగుల్లో నిక్షిప్తం చేయాలని సూచించింది.జమ్ముకశ్మీర్‌లోని పీనల్‌ కోడ్‌ ప్రాతిపదికన విచారణ చేపట్టాలని న్యాయస్థానం తెలిపింది. విచారణలో ఎలాంటి జాప్యం చేయవద్దని స్పష్టం చేసింది. అంతేగాక బాధితురాలి కుటుంబానికి, వారి తరఫున వాదించే న్యాయవాదికి భద్రతను కొనసాగించాలని జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

చిన్నారిపై అత్యాచారం,హత్య తర్వాత నిందితులపై కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ కొన్ని మతోన్మాద శక్తులు ర్యాలీలు నిర్వహించాయి. అందులో బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. కేసు కోర్టుకు రాకుండా జమ్ము బార్ అసోసియేషన్ సబ్యులు అడ్డుకున్నారు. పత్రాలను చించి వేశారు. చిన్నారి వైపు వాదిస్తున్న లాయర్ ను చంపేస్తామంటూ బెధిరించారు. విచారణ తమకు అనుకూలంగా ఉండాలన్న ఉద్దేశంతో కేసును సీబీఐకి అప్పగించాలంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఇవ్వాళ్ళ ఈ తీర్పును వెల్లడించింది.

Keywords : asifa, kashmir, rape, supreme court, punjab
(2024-03-19 05:10:34)



No. of visitors : 1115

Suggested Posts


ఆసిఫా హ‌త్యాచారం: మోడీని ఏకిపడేసిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక‌

కఠువా, ఉన్నావ్‌ అత్యాచార ఘటనలపై ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతలు వ్యవహరించిన తీరు అంతర్జాతీయంగా కూడా భారత్‌ ప్రతిష్ఠను మసకబార్చాయి. మోదీ తీరుపై న్యూయార్క్‌ టైమ్స్‌ ఓ సంపాదకీయం రాసింది.

ఆ దుర్మార్గులు బైటికొస్తే మమ్మల్నీ చంపేస్తారు...కథువా చిన్నారి తల్లి ఆందోళన‌

ʹనా బిడ్డపై అత్యాచారం చేసి, చిత్ర హింసలు పెట్టి హత్య చేసిన ఆ దుర్మార్గులు జైలు నుండి బైటికొస్తే మమ్మల్ని కూడా చంపేస్తారు. వాళ్ళు తాము అమాయకులమని చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు దుర్మార్గులు రసానాలో తాము గడిపిన రోజులు నిజంగా భయంకరమైనవి, సాంజీరామ్‌(బాలిక హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు) కుటుంబీకులు చాలా క్రూరంగా

క‌థువా, ఉన్నావ్ నుండి చింతగుఫా వ‌ర‌కు

ఇటీవ‌లి ప్ర‌ధాన‌మంత్రి బీజాపుర్ ప‌ర్య‌ట‌న గురించి మ‌న‌కు తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా మోదీ ఒక ఆదివాసీ మ‌హిళ‌కు వంగి చెప్పులు తొడిగే ఫొటో మీడియాలో హ‌ల్‌హ‌ల్ చేసింది. ఈ సంద‌ర్భంగా బీజేపీ మోదీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కూడా కురిపించింది.

ʹమోడి నాట్ వెల్కమ్ʹ ... లండన్ లో భారతీయుల నిరసనలు

కామన్వెల్త్‌ ప్రభుత్వాధినేతల సమావేశంలో పాల్గొనేందుకు లండన్‌ వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి చేదు అనుభవం ఎదురైంది. ఆయన విదేశీ పర్యటనల్లో ఎప్పుడు లేని విధంగా నిరసనలు చవిచూడాల్సివచ్చింది.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


కథువా