గడ్చిరోలీలో జరిగింది ఎన్కౌంటర్ కాదు,సామూహిక‌ హత్యలు - నిజ నిర్దారణ బృందం రిపోర్ట్


గడ్చిరోలీలో జరిగింది ఎన్కౌంటర్ కాదు,సామూహిక‌ హత్యలు - నిజ నిర్దారణ బృందం రిపోర్ట్

గడ్చిరోలీలో

గత నెలలో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో సీ-60 అనే యాంటీ నక్సల్ పోలీసులు చేసిన రెండు ఎన్‌కౌంటర్లు నిజమైనవి కావని.. అవి కచ్చితంగా బూటకపు ఎన్‌కౌంటర్లని 44 మందితో కూడిన నిజనిర్థారణ కమిటీ తేల్చి చెప్పింది. మూడు పౌర హక్కుల, మానవహక్కుల సంఘాలు చేసిన నిజనిర్దారణలో ఈ విషయం తేలినట్టు ఆ సంస్థలు ప్రకటించాయి.

కోఆర్డి నేషన్ ఆఫ్ డెమాక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్ (CDRO), ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్ (IAPL), ఉమె అగేనిస్ట్ స్టేట్ రిప్రెషన్ అండ్ సెక్సువల్ వాయిలెన్స్ (WSS) సంస్థలు గత నెల 22 న గడ్చిరోలీ జిల్లాలో పోలీసులు జరిగిందని చెబుతున్న ఎన్ కౌంటర్ స్థలాన్నిసందర్శించి , నిజ నిర్దారణ జరిపి ఓ రిపోర్ట్ రిలీజ్ చేశారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

గత నెల 22న గడ్చిరోలి జిల్లాలో ఒక ఎన్‌కౌంటర్ జరిగిందని.. ఆ ఘటనలో 16 మంది మృతి చెందారని పోలీసులు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. కాని రెండు రోజుల అనంతరం మరో 15 మ‌ృత దేహాలు ఇంద్రావతి నదిలో తేలియాడుతుండగా కనుగొన్నామని మరో ప్రకటన విడుదల చేశారు. ఈ రెండు ప్రకటనల ఆధారంగానే 40 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది.

నిజనిర్థారణ కమిటీ వెల్లడించిన విషయాల్లో ముఖ్యమైనది.. జీ-60 పోలీసులు, సీఆర్‌పీఎఫ్ దళాలు కలసి మావోయిస్టులు సమావేశమైన ప్రదేశాన్ని చుట్టుముట్టారని.. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండా విచక్షణారహితంగా కాల్పులు జరిపారని తెలుస్తోంది. అంతే కాకుండా ఈ కాల్పులకు అధునాతనమైన ʹయూబీజీఎల్ʹ వంటి ఆయుధాలను ఉపయోగించి.. కేవలం చంపాలనే లక్ష్యంతోనే ఈ దుర్ఘటనకు పాల్పడ్డారని.. ఇది కచ్చితంగా రాజ్యం చేయించిన సామూహిక హ్యత్యలే అని ఆ కమిటీ తెలిపింది.

ఇదే నిజనిర్థారణ కమిటీ.. ఒక వేళ ఇది నిజమైన ఎన్‌కౌంటర్ అయితే ఎదుటి పక్షానికి (పోలీసులకు) ఎందుకు చిన్న గాయం కూడా ఎందుకు కాలేదని ప్రశ్నించింది. నలబై మంది మావోయిస్టులు మరణించినా. . ఒక్క పోలీసు కూడా గాయపడక పోవడమే ఇది నకిలీ ఎన్‌కౌంటర్ అనడానికి నిదర్శనం అని ఆ కమిటీ చెబుతోంది. అంతే కాకుండా ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్ని సీ-60 పోలీసులు ఒక్కరు కూడా గాయపడక పోగా.. ప్రస్తుతం వాళ్లందరూ మీడియాకు దూరంగా.. విదేశీ యాత్రలో ఉన్నారని ఆ కమిటీ స్పష్టం చేసింది.

గడ్చిరోలిలో ఏప్రిల్ 22న ఎన్‌కౌంటర్ జరిగింది అని చెప్పినా.. సీ-60 ఫోర్స్ మృతి చెందిన మావోయిస్టుల శరీరాలను వెంటనే సేకరించలేదు. పోలీసులు ఆరోపిస్తున్నట్లు జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల దేహాల పక్కన ఉత్తరాలు, ఫొటోలు, గుర్తింపు కార్డులు మిగిలిన వస్తువులు కావాలనే పడేసినట్లుగా కొన్ని రోజుల పాటు ఉన్నాయి. అసలు ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని కాని, ఆ ప్రదేశపు ఫొటోలను కాని ఏప్రిల్ 22న మీడియాకు చూపలేదు. కాని పోలీసులు ఎంచుకున్న కొంత మంది జర్నలిస్టులను ఘటనా ప్రదేశానికి తీసుకొని వెళ్లిన తర్వాత మరో 15 మృత దేహాలు దొరికాయని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. అంతే కాక ఆ ప్రదేశానికి వెళ్లి వచ్చిన మీడియా ప్రతినిధులు కూడా పోలీసులు చెప్పిన కథనే మళ్లీ చెప్పడం మరిన్ని అనుమానాలకు దారితీసిందని ఆ కమిటీ చెబుతోంది.

అంతే కాకుండా నిజనిర్థారణ కమిటీ సంఘటన జరిగిన గ్రామంలోనికి వెళ్లి గ్రామస్తులను ప్రశ్నిస్తున్నప్పుడు అక్కడ భారీగా రక్షక దళాలను మోహరించారు. అంతే కాకుండా కమిటీ సభ్యుల వెంట ఆ దళాలు ఎప్పుడూ వెంబడిస్తూనే ఉన్నాయి.

అయితే ఈ ఘటనతో పాటు నిజనిర్థారణ కమిటీ కొన్ని ప్రశ్నలను లేవనెత్తింది. ముఖ్యంగా నైనెర్ సమీపంలో నందూతో పాటు చనిపోయిన మరో ఐదుగురి విషయంలో ఏం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేసింది. ఎందుకంటే నందు తండ్రి అతని మృతదేహాన్ని తీసుకొని వెళ్లే సమయంలో అది కుళ్లిపోయిన స్థితిలో ఉంది. కాని అతని భుజంపై గొడ్డలితో నరికినట్లుగా గాయం ఉంది తప్ప ఎక్కడా తుపాకీ గుండ్లు దిగినట్లుగా గాయలు కనిపించలేదు. అంతే కాకుండా సంఘటన జరిగిన ప్రదేశానికి సమీప గ్రామస్తులు కూడా తాము గన్‌ఫైరింగ్ జరిగినట్లు శబ్దాలు వినలేదని.. అంత అర్థరాత్రి జరిగితే కనీసం చిన్న శబ్ధాలైనా వినపడతాయి కాని అసలు ఆ రాత్రి ఒక్క శబ్దం కూడా వినలేదని వాళ్లు స్పష్టం చేశారు. నందూతో పాటు మరణించిన మిగతా ఐదుగురిని పోలీసులు పట్టుకొని.. తీవ్రంగా చిత్రవధ చేసినందువల్లే పోలీసుల కస్టడీలో మరణించారని ఆ కమిటీ స్పష్టం చేసింది.
గడ్చిరోలిలో జరిగిన ఘటన కూంబింగ్లో భాగంగా జరిగిన సంఘటన కాదని.. గత కొంత కాలంగా మావోయిస్టులపై పోలీసులు రచించిన వ్యూహంలో భాగంగానే జరిగిందని కమిటీ భావిస్తున్నట్లు వారు ఆ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

అయితే అక్కడ కొంత మంది నిజనిర్థారణ కమిటీకి మరో కథనం చెప్పారు.. గత ఫిబ్రవరి 5వ తేదీన కోయనవర్ష గ్రామానికి చెందిన రామ్‌కుమార్, ప్రేమ్ లాల్ అనే ఇద్దరు యువకులు అడవిలో పిట్టలను వేటాడటానికి వెళ్లారు. అదే సమయంలో అడవిలోకి వచ్చిన పోలీసులు వాళ్లిద్దరిని బలవంతంగా తీసుకొని వెళ్లారు. ఆ ఇద్దరు యువకులను ʹమేము మావోయిస్టులంʹ అని చెప్పమని తీవ్రంగా హింసిస్తూ బలవంతం చేశారు. అయితే ప్రేమ్‌లాల్ పోలీసుల నుంచి తప్పించుకొని గ్రామానికి చేరాడు. అసలు జరిగిన కథనాన్ని గ్రామస్తులకు వివరించాడు. దీంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు అందరూ కలసి ఫిబ్రవరి 6న ఈ ఇద్దరు యువకులను ఎక్కడైతే రక్షక దళాలు పట్టుకున్నాయో అక్కడకు వెళ్లారు. అయితే అక్కడ రక్తపు మరకలతో పాటు రామ్‌కుమార్ ఓటర్ ఐడీ, వాళ్లు వేటాడిన పక్షిని కనుగొన్నారు. దీంతో గ్రామస్తులు రామ్ కుమార్‌కు ఏదో జరిగిందని భావించి గడ్చిరోలి పోలీస్ స్టేషన్‌కు తరలి వెళ్లారు. తీరా అక్కడకు వెళ్లి చూసే సరికి రామ్‌కుమార్ మృతదేహం కనపడింది. దీంతో గ్రామస్తులు కోపోద్రిక్తులైయ్యారు. అయితే పోలీసులు గ్రామ పెద్దలకు లంచాలను ఎరచూపి లోబరచుకోవడానికి ప్రయత్నించారు. అంతే కాకుండా ఆ ఇద్దరు యువకులకు మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ వారి కుటుంబ సభ్యుల వేలి ముద్రలు తీసుకొని హెదారీ పోలీస్ క్యాంప్‌లో పిర్యాదు చేశారు. అంతే కాకుండా ఇదే విషయమై పోలీసులు ఎంతలా గ్రామస్తులను హింసించారో.. ఆ విషయాన్ని కూడా నిజనిర్థారణ కమిటి దృవీకరించింది.

గడ్చిరోలిలో జరిగిన ఘటన విషయంలో పోలీసులు చెప్పిన దానికి నిజనిర్థారణ కమిటీ తేల్చిన దానికి తీవ్ర వ్యత్యాసం ఉండటంతో ఈ కమిటీ ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు ఉంచింది.

గడ్చిరోలిలో జరిగిన నకిలీ ఎన్‌కౌంటర్ ఘటనపై జ్యుడీషియల్ ఎన్‌క్వైరీ వేయాలని.. పోలీసుల దురాగతాలపై గళం ఎత్తిన రాజారాం ఖండాలా, కోయన్ వర్షే, రేఖానార్‌లపై వెంటనే తప్పుడు కేసులను ఎత్తివేయాలని, ఆ నకిలీ ఎన్‌కౌంటర్‌కు పాల్పడిన ప్రతీ ఒక్కరిపై కేసు నమోదు చేయాలని , పోలీసు, పారామిలటరీ బలగాలను ఆ ఏరియానుండి వెనక్కి తీసుకోవాలి. గ్రామ సభల అనుమతి లేకుండా మైనింగ్ చేయడాన్ని నిషేధించాలని పౌర హక్కుల సంఘాలు డిమాండ్ చేశాయి.

Keywords : gadchiroli, fake encounter, c60, police, maoists
(2019-09-22 07:33:49)No. of visitors : 2404

Suggested Posts


ముంబై కదిలింది.. అన్నదాతకు అన్నం పెట్టింది..

తమకు అన్నంపెట్టే రైతుల పోరాటానికి ముంబై నగరం అండగా నిల్చింది. తినీ, తినక 200 కిలోమీటర్లు నడిచి వచ్చిన 50 వేల రైతుల ఆకలి తీర్చేందుకు తమ చేతనైన రీతిలో ముంబై నగరం నడుం బిగించింది..

NO ENCOUNTER HAPPENED IN GADCHIROLI ON APRIL 22ND 2018

The killings of at least 37 Maoists by the combined force of the CRPF and the C-60, the elite unit of the Gadchiroli Police, on 22nd and 23rd April 2018 raises some very disturbing questions

దళితుణ్ణి పెళ్ళి చేసుకున్నందుకు యువతిని పెట్రోల్ పోసి కాల్చి చంపిన కన్న‌ తండ్రి

మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లా పార్నర్ తాలుకా నిఘోజ్ గ్రామానికి చెందిన రుక్మిణి అనే అగ్రకులానికి చెందిన యువతి దళితుడైన మంగేష్ ప్రేమించుకొని ఆరు నెలల క్రితం పెళ్ళి చేసుకున్నారు.

Media ignores...35 Thousands of farmers long march from Nashik to Mumbai

Farmers taking out a protest march under the banner of All India Kisan Sabha en route from Nashik to Mumbai in Maharashtra Besides pressing for their long-standing demands, the agitating farmers have also been opposing acquisition ...

ఇంద్రావతిలో విషాద ఘోష - పాణి

నదులతో, వాగులతో, విశాలమైన అటవీ ఆకాశాల్లో జీవించే ఆదివాసులు ఇప్పుడొక స్వప్నాన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. నదిలో పారే నీళ్లను ఎలా వడిసిపట్టి పంటలు పండించుకోవాలో వాళ్లు ఆలోచిస్తోంటే ప్రభుత్వం ఆ పారే నీళ్లలోకి ఆదివాసులను శవాలుగా విసిరేస్తున్నది. ఇదీ భామ్రాగడ్‌ విషాదం.

Gadchiroli Encounter, a Fake and Cold-blooded Mass Murder, Says Fact-finding Teamʹs Report

ʹThe C-60 police and CRPF surrounded the Maoists on all sides and opened fire indiscriminately by using sophisticated weapons like Under Barrel Grenade Launchers (UBGL) with an intention to kill them. As such it is a cold-blooded mass murder,ʹ says the report.

గడ్చిరోలిలో 5గురు మహిళలతో సహా 7 గురు మావోయిస్టులను చంపేసిన పోలీసులు

మహారాష్ట్ర గడ్చరోలి జిల్లా జిగ్ణూరు వద్ద జరిగిన ఎన్కౌంటర్ లో 7 గురు మావోయిస్టులు చనిపోయినట్టు పోలీసులు ప్రకటించారు. చనిపోయినవారిలో గడ్చిరోలి జిల్లా అహిరి తాలూకా లింగంపల్లి గ్రామానికి చెందిన అయితు అలియాస్ అశోక్ (దళ కమాండర్) , చత్తీస్ గడ్, బీజాపూర్ జిల్లా కవాండే గ్రామానికి చెందిన‌ సరిత, మహారాష్ట్ర సిరొంచకు చెందిన చంద్రు, అహిరి తాలూకా....

రైతుల పోరాటానికి దిగి వచ్చిన ఫడ్నవీస్ సర్కార్ !

ఎర్రటి ఎండలో విరామమెరుగక నడుస్తూ ఎముకలు కొరికే చలిలో రొడ్డు పక్కనే సగం నిద్ర పోయి. జనం పెట్టింది తింటూ అర్దాకలితో... పాదాలు బొబ్బలెక్కి, చర్మాలు ఊడిపోయి నెత్తురోడే కాళ్ళతో, మహిళలు, వృద్దులు చేసిన పోరు యాత్రకు మహారాష్ట్ర ఫడ్నవీస్ సర్కార్ దిగిరాక తప్పలేదు....

After arrest of seven ʹCPI (Maoist) membersʹ, teacher questioned on ʹNaxal linksʹ ends life

DAYS AFTER he was questioned by the Maharashtra Anti Terrorism Squad (ATS) in connection with the arrests of seven alleged members of the banned Communist Party of India (Maoist), Mumbai schoolteacher Prabhakar Macha committed suicide on January 23....

మీ మద్దతు నాకిప్పుడు కావాలి - ఆనంద్‌ తెల్తుంబ్డే

నాతో పాటు నిందితులైన మరో తొమ్మిదిమంది ఇప్పటికీ జైలులో ఉన్నారు. చట్టపరమైన ప్రక్రియల వేధింపులకు గురవుతున్నారు. మీ అందరి సహకారమూ మద్దతూ కోరే అవకాశం నాకు వచ్చిన విధంగా వారికి రాలేదు. మీరు ఇప్పుడు నాకు అండగా నిలిస్తే

Search Engine

జేయూ విద్యార్థిపై బ్యాట్లతో దాడి... జై శ్రీరాం అంటూ నినాదాలు
కాషాయ మూక దాడిపై భగ్గుమన్న విద్యార్థిలోకం...వేలాదిమందితో ర్యాలీ
కేంద్ర మంత్రి సాక్షిగా జాదవ్‌పూర్‌ వర్సిటీలో ఏబీవీపీ హింసాకాండ !
బొగ్గు పరిశ్రమలో FDI కి వ్యతిరేకంగా 24న జరిగే సమ్మెను విజయవంతం చేయాలంటూ సభ‌
మావోయిస్టు పార్టీకి 15 ఏండ్లు...ఏవోబీలో భారీ బహిరంగ సభ‌
తెలుగులో ఇలాంటి సినిమాలు తీయలేరా..?
పోరాడితే పోయేదేమీ లేదు...పోరాడి హక్కులు సాధించుకున్న విద్యార్థినులు
భీం ఆర్మీ ఛీఫ్ ఆజాద్ ను వెంటనే విడుదల చేయాలి... మేధావులు, లాయర్లు, విద్యార్థుల డిమాండ్
పులివెందుల నుండి నల్లమలదాకా...వరలక్ష్మి
ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి ? ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం ఎలా ? - ఎన్.వేణుగోపాల్
కశ్మీర్ లో ఎవ్వరికి లేని ʹనెట్ʹ సేవలు బీజేపీ వాళ్ళకు ఎలా వచ్చాయి ?
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
Savenallamala: యురేనియం తవ్వకూడదన్నవాళ్ళంతా అర్బన్ నక్సలైట్లేనా ?
కశ్మీర్ ప్రజల పోరాటానికి మద్దతుగా నిబడదాం...మావోయిస్టు పార్టీ పిలుపు
భూ గురత్వాకర్షణ శక్తిని కనుగొన్నది ఐనిస్టీనా... న్యూటన్ కాదా ?
Maoist leader Murali recounts his own jail experience to cite rampant rights violation
ప్రభుత్వాన్ని,న్యాయవ్యవస్థను,ఆర్మీని విమర్శించడం దేశద్రోహం కాదు ... సుప్రీం కోర్టు జడ్జ్
దేవరకొండలో యురేనియం సర్వే కోసం వచ్చిన వారిని తరిమిన ప్రజాసంఘాలు
చెప్పులేసుకొని బైక్ నడిపినా.. లుంగీ కట్టి లారీ నడిపినా భారీ జరిమానాలు..!
యురేనియంపై నల్లమల బంద్.. కదం తొక్కిన జనం... నాయకుల అరెస్ట్, ఉద్రిక్తత‌
నల్లమల ప్రజలకు మద్దతుగా నిలబడదాం, యురేనియం తవ్వకాలను అడ్డుకుందాం ... మావోయిస్టు పార్టీ ప్రకటన‌
జేఎన్యూ పై మళ్ళీ ఎర్రజెండా రెపరెపలు... విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్ ఘనవిజయం
దేవుడు లేడని చెప్పే హక్కు రాజ్యాంగం కల్పించింది...మద్రాస్ హైకోర్టు
దేశ పరిస్థితులపై ఆందోళన...మరో ఐఏఎస్ రాజీనామా
జేఎన్యూ విద్యార్థి నాయకురాలు షెహ్లా రషీద్ పై రాజద్రోహం కేసు
more..


గడ్చిరోలీలో