అమరులైన మన బిడ్డలను యాజ్జేసుకుందాం రండి !


అమరులైన మన బిడ్డలను యాజ్జేసుకుందాం రండి !

అమరులైన

రష్యా విప్లవంలో అమ్మ నవల చారిత్రాత్మమకం. ఆ నవలలో అమ్మ పాత్ర విప్లవాత్మకమైందని సాహిత్యం కొనియాడుతుంది. బిడ్డను కోల్పోయినా మడమ తిప్పకుండా నిలోవ్న విప్లవంలో భాగమైందని ప్రేరణ పొందుతాం. మనం సాహిత్యంలోంచి కాస్త సమాజాన్ని కూడా చూస్తే , ఎందరో అమ్మలు పరిచయం అవుతుంటారు. తెలుగు నేల మీద అమ్మ పాత్రకు జీవం పోస్తు ʹఅమరుల బంధు మిత్రుల సంఘం(ABMS)ʹ పనిచేస్తుంది. అసమాన్య తెగువతో హంతక ప్రభుత్వాన్ని ఢీకొడుతుంది. పోగొట్టుకోవడానికి ప్రాణాలు తప్ప ఇంకేమి లేని మనుషులు వాళ్ళు. ప్రాణాల్ని లెక్క చేయక బిడ్డల త్యాగల్ని ఎత్తిపడుతున్న తల్లులు అనేకమంది. త్యాగాల వనంలో మొలకెత్తే విప్లవ బీజాలకు కంచెలా చేయి చేయి కలిపి నిలబడ్డారు. వేటగాడి నుంచి విప్లవాన్ని కాపాడుతున్న మనుషులు వాళ్ళు. తమ బిడ్డలు అందించిన జండాను ఎత్తిపట్టి విప్లవాన్ని స్వప్నిస్తున్న తల్లుల సంఘం(ABMS). తమ బిడ్డలను రూపం లేకుండా కుళ్ళిపోయిన మంసపు ముద్దలుగా చేసినా సరే, హంతక ప్రభుత్వం బెదిరిస్తున్న సరే, కన్నపేగు బంధంతో రాజ్యాన్ని ప్రతిఘటించి ఊరి పొలిమేరలో కన్నీటి మధ్య పూడ్చుకున్నవాళ్ళు. బిడ్డ జ్ఞాపకంగా చిన్న స్థూపం కట్టుకుంటే కూల్చేస్తే దడవకుండా నిలబడి మళ్ళి కట్టుకున్న సాహస చరిత్ర ABMS. ఏ బిడ్డ ప్రాణం తీయబడ్డ తమ పేగు తేగిందని రొమ్ములు కొయ్యబడ్డ శవాలు, తలలు తెగిబడ్డ శవాలను రాష్ట్రాల సరిహద్దులు దాటి ఇండ్లలకు చేర్చే సంఘం(ABMS).
జీవించే హక్కను కాపాడాల్సిన ప్రభుత్వం పూజారి కాంకేర్(ఛత్తీస్ ఘడ్) వద్ద తొమ్మిది మంది విప్లవ మానవి/మానవులను పొట్టన పెట్టుకున్నది. బిడ్డలను కోల్పోయిన తల్లులు తమ దుఃఖం పంచుకుందామని ఏప్రిల్ 28నాడు ఖమ్మంలో సభ పెట్టాలనుకుంది. తల్లుల దుఃఖానికి భయపడ్డ పిరికిపంద టిఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంది. వరుసగా పది రోజులు 144సెక్షన్ విధించి అమలు చేసింది. సభ పెట్టుకునే హక్కు కోసం తల్లులు కోర్టు మెట్లెక్కారు. మే 12నాడు ఖమ్మం (న్యూ డెమోక్రసి ఆఫీస్ లో)నిర్వహిస్తున్నారు. బుద్దిజీవులకు, ప్రజాస్వామిక వాదులను వినమ్రంగా కోరుతున్నారు. బిడ్డలను కోల్పోయిన ప్రజాస్వామ్య దేశంలో జీవించే హక్కు కోసం, సభ పెట్టుకునే హక్కు కోసం ఐక్యంగా గొంతులు కలిపి నినదిద్దాం. పోరాడుదామని తల్లులు పిలుపునిస్తున్నారు.
మనం మనుషులం, ఈ దేశ పౌరులం, ఈ సమంజం పట్ల భాధ్యత కలిగిన విద్య వంతులం. ఈ సమాజానికి జవాబుదారితనం కలిగిన ప్రజాస్వామికులం. తాను హామి పడ్డ జీవించే హక్కును ప్రభుత్వమే కాలరాస్తుంది. తన బిడ్డలను తానే చంపుకుంటున్న దౌర్భాగ్యంలో మనం గొంతు విప్పాలి కదా. ఈ దేశంలో రాజ్యంగం ఉందని ప్రభుత్వానికి గుర్తు చేయాలి కదా. ఆధునిక మానవ సమాజంలో ప్రాణహక్కును కాపాడుకోవాడానికి నినదిద్దాం రండి. కడుపుకోతను దిగమింగి, పొంగి వచ్చే కన్నీళ్ళను పంటిబిగువున దాచి హక్కులకోసం తల్లులు నినదిస్తున్నారు. ఆ తల్లుల నినాదాలకు కోరస్గా గొంతు కలుపుదాం రండి.
- అమరుల బంధు మిత్రుల సంఘం(ABMS)

Keywords : maoists, martyrs, khammam, abms
(2018-07-20 19:44:12)No. of visitors : 685

Suggested Posts


శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావు

వరంగల్ జిల్లాలో మంగళవారంనాడు ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నది అబద్దమని శృతిని విద్యాసాగర్ లను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని విప్లవ రచయిత వరవరరావు ఆరోపించారు....

అది ఎన్‌కౌంట‌ర్ కాదు - అత్యాచారం చేసి చంపేశారు : నిజ‌నిర్థార‌ణ బృందం

హిడ్మే ఒంటిపై దుస్తులను తొల‌గించి... సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. శరీర భాగాల‌న్నింటినీ క‌త్తుల‌తో కోశారు. ఆ త‌రువాత చాతీపై, క‌డుపులో తూటాల వ‌ర్షం కురిపించారు. మృత‌దేహాన్ని సుక్మా ప‌ట్ట‌ణానికి త‌ర‌లించారు. 14వ తేది విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు....

రాజ్యం పెంచి పోషించిన ప్రజా హంతకుడు నయీం - మావోయిస్టు పార్టీ

హంతక ప్రభుత్వాల పోలీసు యంత్రాంగం ఎస్ఐబి డైరెక్షన్లో ఎంతో మంది ప్రజలను, పౌరహక్కుల నేతలను, ఉద్యమకారులను కిరాతకంగా చంపిన ప్రజా హంతకుడు నయీం చావు వార్త పీడిత ప్రజలకు పండుగ వంటిదే కాకుంటే తనను పెంచి, పోషించి ఎన్నో చీకటి హత్యలకు ఆయుధంగా వాడుకున్న దోపిడీ పాలక వర్గం చేతిలో కన్నా ప్రజల చేతిలో నయినాం ఖతం అయితే ప్రజలు ఎక్కువగా సంతోషపడేవాళ్ళు...

శ్రుతి పాడిన పాట దోపిడి గుండెల్లో తూట !

శ్రుతి.... చిన్నప్పటినుండే విప్లవ భావాలతో పెరిగింది. సమాజాన్ని నిశితంగా గమనిస్తూ, సమాజాన్ని చదువుతూ పెరిగింది. వేదికలెక్కి సమాజాన్ని చైతన్య పరిచే పాటలు పాడింది. ఎమ్ టెక్ చదివిన శ్రుతి తన తండ్రి సుదర్శన్ చెప్పినట్టు అమెరికాకు కాకుండా అడవిలోకి....

చీప్ లిక్కర్ తో గ్రామజ్యోతిని వెలిగిస్తారా - మావోయిస్టు జగన్ ప్రశ్న

ప్రభుత్వం హరితహారం లో మొక్కలు నాటడం కోసం ఆదివాసులను భూముల్లోంచి వెళ్ళగొడతోందని జగన్ మండి పడ్డారు. ఒక వైపు ప్రజలను చీప్ లిక్కర్ లో ముంచి తేల్చే కుట్రలు చేస్తూ మరో వైపు గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం పై జగన్ మండి పడ్డారు. చీప్ లిక్కర్ తో గ్రామ జ్యోతిని వెలిగిస్తారా

ఫేస్ బుక్ మిత్రుడి ఎన్ కౌంటర్ !

సార్ మీరు నాకు తెలుసు... మీరు నాఫేస్ బుక్ ఫ్రెండ్ సార్..... దండకారణ్యంలో భుజానికి తుపాకీ వేసుకొని తీక్షణంగా పరిసరాలను పరీక్షిస్తూనే మరో చేత్తో వంట చేస్తున్న.. ప్రతిక్షణం యుద్దం మధ్యలో జీవిస్తున్న ఓ మావోయిస్టు గెరిల్లా ఆమాట అనడంతో నేను షాక్ తిన్నాను.....

నక్సల్బరీ రాజకీయాలను ఎత్తి పట్టండి - ‍మావోయిస్టు పార్టీ నేత గణపతి పిలుపు

నేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు.....

ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 21 యేండ్లు !

అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం....

ఆ శవాలు మాట్లాడుతున్నవి...

శరీరాన్ని చీల్చేసినట్టుగా, పొడిచేసినట్టుగా కనపడుతున్న ఆ శవాలు మాట్లాడుతున్నవి. పురుగులు పట్టిన ఆ శవాలు మాట్లాడుతున్నవి.....

ఈ నెల 26 న తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

గొల్లగూడెం ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 26 న తెలంగాణ బంద్ ను జయప్రదం చేయాలని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రా గడ్చిరోలి జిల్లా, వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లగూడెం అడవుల్లో...

Search Engine

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు
మతోన్మాదులు ఈ న‌వ‌ జంటను చంపేస్తారేమో !
గోగూండాల దాడులపై సుప్రీం కోర్టు ఆగ్రహం
78 ఏళ్ళ స్వామి అగ్నివేష్ పై చెడ్డీ గ్యాంగ్ దాడి
ఇప్పటికీ మానని గాయం - కారంచేడు మారణ హోమం
భీమాకోరేగాఁవ్ ప్రజా పోరాటాన్ని ముందుకు తీసుకపోదాం - ఆగస్ట్ 3న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం
ప్రశ్నలను నిషేధిస్తారట...సంధ్యక్క‌ను హత్య చేస్తారట‌
చిన్న పొరపాటుకు చిన్నారికి బ‌హిష్కరణ శిక్ష - కాప్ పంచాయతీ దుర్మార్గం
ఒక బీజేపీ ఎమ్మెల్యే రాసలీలలు.. అండగా పార్టీ హైకమాండ్
ʹమతం పేరుతో హింసను రెచ్చగొడుతున్నారుʹ
ఏడవకు బిడ్డా - గుగివా థియాంగో
హస్బెండ్‌ స్టిచ్‌ - గీతాంజలి
సీపీఎం కు ఇక రామాయణమే రక్షనట !
తెల‍ంగాణ డీజీపీకి 26 మంది మేధావుల బహిరంగ లేఖ‌ !
కత్తి మహెష్ నగర బహిష్కరణ అప్రజాస్వామికం - విరసం
దేవుడు లేడంటే.. సంసదకు ఎసరొస్తుంది.. పెద్దరికాలకు ఇబ్బందొస్తుంది
కత్తి మహేష్ ʹనగర బహిష్కరణʹ.. అక్రమం, చట్టవ్యతిరేకం
छत्तीसगढ़ के वन कर्मियों का कारनामा : 46 बैगा आदिवासी परिवारों को किया बेघर
छत्तीसगढ़ : मानवाधिकार कार्यकर्ताओं की गिरफ्तारी के विरोध में प्रदर्शन
ఓ ముస్లింను హత్య చేసిన కేసులో మరణ శిక్ష పడి బెయిల్ పై వచ్చిన వారికి సన్మానం చేసిన కేంధ్ర మంత్రి
Release Prof G.N Saibaba From Jail - Justice Markandey Katju
Kerala; Alleged Maoist Shyna Gets Bail in all the cases.
పంటలు పండటానికి నాలుగు మంత్రాలు చాలు.. గోవా ప్రభుత్వం కొత్త స్కీం
దుర్గాప్రసాద్, బద్రి, రంజిత్, సుధీర్ లను వరంగల్ జైల్లో అధికారులు వేధిస్తున్నారు..వీవీ
ఇజ్రాయేలీ సైనికులకు తమ నృత్యంతో చెమటలు పట్టించిన పాలస్తీనా యువత
more..


అమరులైన