మ‌తం మీద విమ‌ర్శ రాజ‌కీయాల మీద విమ‌ర్శే - మార్క్స్‌


మ‌తం మీద విమ‌ర్శ రాజ‌కీయాల మీద విమ‌ర్శే - మార్క్స్‌

మ‌తం

మనిషే మతాన్ని తయారుచేస్తాడు. మతం మనిషిని తయారుచేయదు. తాను గుర్తించలేని మనిషికి, తనను తాను మళ్లీ పోగొట్టుకున్న మనిషికి మతం స్వీయ చైతన్యం, స్వీయ గౌరవం. కాని మనిషి ప్రపంచానికి బైట ఉన్న అనిర్దిష్ట జీవి కాదు. మనిషే మానవ ప్రపంచం. రాజ్యం. సమాజం. ఈ రాజ్యం, ఈ సమాజం తాము తలకిందుల ప్రపంచం కావడం వల్ల ఒక తలకిందుల ప్రాపంచిక చైతన్యాన్ని, మతాన్ని తయారుచేస్తాయి. ఆ ప్రపంచపు సాధారణ సిద్ధాంతం, దాని ఆధ్యాత్మిక గౌరవ కారణం దాని ఆసక్తి, దాని నైతిక అనుమతి, దాని నిబ్బరమైన కానుక, ఓదార్పుకూ, సంజాయిషీకి అది ఇచ్చే సార్వజనికమూలం మతమే. మానవసారం వాస్తవికతలో లేనందుచేత, మతమే మానవసారపు అద్భుత గుర్తింపు అందువల్ల మత వ్యతిరేక పోరాటం పరోక్షంగా-మతం ఏ సమాజపు ఆధ్యాత్మిక శోభగా ఉన్నదో ఆ సమాజానికి వ్యతిరేక పోరాటమే.

మత వేదన వాస్తవ వేదనకు వ్యక్తికరణే. అదే సమయంలో అది వాస్తవ వేదన పట్ల నిరసన కూడా. మతం అణచబడ్డ జీవి నిట్టూర్పు, హృదయం లేని ప్రపంచపు హృదయం, ఉత్సాహం లేని పరిస్థితుల ఉత్సాహం. అది ప్రజలకు మత్తుమందు.

ప్రజల భ్రమాజనిత ఆనందంగా ఉన్న మతాన్ని రద్దు చేయడమంటే ప్రజల వాస్తవమైన ఆనందాన్ని ఆకాంక్షించడమే. ప్రస్తుత స్థితి పట్ల భ్రమల్ని వదిలేయమని కోరడమంటే, భ్రమలు అవసరమయ్యే పరిస్థితుల్ని వదిలెయ్యమని కోరడమే. అందుకే మతం మీద విమర్శ, ఏ కన్నీటి ప్రవాహాల వెలుగు మతమో, ఆ కన్నీటి ప్రవాహాల మీద విమర్శకు బీజరూపమే.

విమర్శించడమంటే హారం నుంచి ఊహాజనిత పుష్పాల్ని రాల్చివేయడమనే. కాని మనిషి అలంకారం లేని, ఆనందం లేని హారం ధరించాలని కాదు. అతను హారాన్ని దులిపి, వాస్తవ పుష్పాన్ని స్వీకరించే వీలు కలిపించేదే విమర్శ. మత విమర్శ మనిషి భ్రమల నుంచి మేల్కొలిపి, భ్రమలు పోయిన మనిషి హేతుబద్ధంగా ఆలోచించినట్టుగా ఆలోచించేట్టు, తన వాస్తవికతను రూపొందించేట్టు చేస్తుంది. అలా అతను తన చుట్టూ తాను, అంటే తన సూర్యుని చుట్టూ తాను తిరుగుతాడు. మనిషి తన చుట్టూ తాను తిరగనంత వరకూ మతం మనిషి చుట్టూ తిరిగే ఒక ఊహాజనిత సూర్యుడు.

అందువల్ల వాస్తవాన్ని మించిన ప్రపంచం అదృశ్యం కాగానే చరిత్ర కర్తవ్యం ఈ ప్రపంచపు వాస్తవాన్ని నిర్ధారించడం అవుతుంది. మానవ స్వీయ పరాయీకరణ పవిత్రరూపం బట్టబయలు కాగానే తత్వశాస్త్రపు తక్షణ కర్తవ్యం. పరాయీకరణను దాని అపవిత్ర రూపాల్లో బట్టబయలు చేయడం అవుతుంది. ఆ రకంగా స్వర్గంపై విమర్శ భూమి మీద విమర్శగా మారుతుంది. మతం మీద విమర్శ చట్టం మీద విమర్శగా, మతవాదం మీద విమర్శ రాజకీయాల మీద విమర్శగా మారుతుంది.

(ఇంట్రడక్షన్‌ టు ది క్రిటిక్‌ ఆఫ్‌ హెగెల్స్‌ ఫిలాసఫీ ఆఫ్‌ లా నుంచి)
(న‌డుస్తున్న తెలంగాణ మే 2018 సంచిక‌లో ప్ర‌చురితం)

Keywords : marx, religion, marxism, introduction to the critique of hegel philosophy of law
(2018-07-20 11:35:06)No. of visitors : 378

Suggested Posts


0 results

Search Engine

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు
మతోన్మాదులు ఈ న‌వ‌ జంటను చంపేస్తారేమో !
గోగూండాల దాడులపై సుప్రీం కోర్టు ఆగ్రహం
78 ఏళ్ళ స్వామి అగ్నివేష్ పై చెడ్డీ గ్యాంగ్ దాడి
ఇప్పటికీ మానని గాయం - కారంచేడు మారణ హోమం
భీమాకోరేగాఁవ్ ప్రజా పోరాటాన్ని ముందుకు తీసుకపోదాం - ఆగస్ట్ 3న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం
ప్రశ్నలను నిషేధిస్తారట...సంధ్యక్క‌ను హత్య చేస్తారట‌
చిన్న పొరపాటుకు చిన్నారికి బ‌హిష్కరణ శిక్ష - కాప్ పంచాయతీ దుర్మార్గం
ఒక బీజేపీ ఎమ్మెల్యే రాసలీలలు.. అండగా పార్టీ హైకమాండ్
ʹమతం పేరుతో హింసను రెచ్చగొడుతున్నారుʹ
ఏడవకు బిడ్డా - గుగివా థియాంగో
హస్బెండ్‌ స్టిచ్‌ - గీతాంజలి
సీపీఎం కు ఇక రామాయణమే రక్షనట !
తెల‍ంగాణ డీజీపీకి 26 మంది మేధావుల బహిరంగ లేఖ‌ !
కత్తి మహెష్ నగర బహిష్కరణ అప్రజాస్వామికం - విరసం
దేవుడు లేడంటే.. సంసదకు ఎసరొస్తుంది.. పెద్దరికాలకు ఇబ్బందొస్తుంది
కత్తి మహేష్ ʹనగర బహిష్కరణʹ.. అక్రమం, చట్టవ్యతిరేకం
छत्तीसगढ़ के वन कर्मियों का कारनामा : 46 बैगा आदिवासी परिवारों को किया बेघर
छत्तीसगढ़ : मानवाधिकार कार्यकर्ताओं की गिरफ्तारी के विरोध में प्रदर्शन
ఓ ముస్లింను హత్య చేసిన కేసులో మరణ శిక్ష పడి బెయిల్ పై వచ్చిన వారికి సన్మానం చేసిన కేంధ్ర మంత్రి
Release Prof G.N Saibaba From Jail - Justice Markandey Katju
Kerala; Alleged Maoist Shyna Gets Bail in all the cases.
పంటలు పండటానికి నాలుగు మంత్రాలు చాలు.. గోవా ప్రభుత్వం కొత్త స్కీం
దుర్గాప్రసాద్, బద్రి, రంజిత్, సుధీర్ లను వరంగల్ జైల్లో అధికారులు వేధిస్తున్నారు..వీవీ
ఇజ్రాయేలీ సైనికులకు తమ నృత్యంతో చెమటలు పట్టించిన పాలస్తీనా యువత
more..


మ‌తం