కొంచెం ఆలోచించి మాట్లాడుదాం - ఎ.సునిత‌, తేజ‌స్విని మాడ‌భూషి


కొంచెం ఆలోచించి మాట్లాడుదాం - ఎ.సునిత‌, తేజ‌స్విని మాడ‌భూషి

కొంచెం


గత రెండు వారాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ గురించి సమాజాన్ని కుదిపేసిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో జరుగుతున్న ఆసక్తికరమైన చర్చ ప్రజాస్వామ్య విలువల కోసం సినీ పరిశ్రమని నిలదీసింది. ఈ పరిశ్రమని స్త్రీల కనువయిన పనిస్థలంగా తయారుచెయ్యటానికి, అన్ని పని స్థలాల్లో జరిగే లైంగిక దోపిడీ/వేధింపుల గురించి చర్యలు తీసుకోవాలని గుర్తు చేసింది. ఆ క్రమంలో వచ్చిన అనేక అసంబద్ధ వాదనలని తోసిపుచ్చి సరైన ఆలోచనని ముందుకు తీసుకొచ్చింది. వివిధ మీడియాలలో (రొటీన్‌ బూతు స్పందనలని పక్కన పెడితే), జరిగిన చర్చలు, స్పందనల్లో వచ్చిన సరైన ఆలోచనని ఒక చోట కూరిస్తే అందరికీ కొంత ఉపయోగపడుతుందని మా ప్రయత్నం.

ఇటువంటి బట్టలిప్పి, అర్ధనగ్న నిరసనతో మనం పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాం? చెడు ఆలోచనలు కాక? పెద్దవాళ్ల లాగా పిల్లలు శరీరాన్ని కేవలం లైంగిక వస్తువుగా చూడరని అందరికీ తెలుసు. వారికి శరీరం ప్రపంచాన్ని అర్థంచేసుకునే ఒక పరికరం మాత్రమే. పెద్ద వాళ్ల పెత్తనం, అధికారం, దానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయలేని అసహాయత అనుభవించే పిల్లలకి అధికారం లేని వాళ్ల నిరసన బాగానే అర్థమవుతుంది. శ్రీ రెడ్డి అర్ధ నగ్న ప్రదర్శన గురించి వారికి తెలియటం చాలా మంచిది. ఎందుకంటే, చిన్న పిల్లలని లైంగిక వేధింపుల నుంచి కాపాడటానికి పాఠశాలల్లోనే శరీరాన్ని గురించి నేర్పి, మంచి స్పర్శ, చెడ్డ స్పర్శల్లో తేడాలని నేర్పిస్తున్నారు. పెరిగిపోతున్న పిల్లల లైంగిక వేధింపులు ఈ పరిస్థితికి దారితీసాయి. అధికారం వున్న వాళ్లు, హీరోలుగా భావించే వాళ్లు కూడా తప్పులు చేస్తారని తెలిస్తే, తమని వేధించే పెద్ద వాళ్ల గురించి వారికుండే భయం పోయి బయటికి చెప్తారు.

ʹʹయువత లంచగొండితనం, విచ్చలవిడి శృంగారం అలవాటు చేసుకుని విలువలు లేకుండా తయారయిందిʹʹ అని ముప్పయేళ్లు దాటిన ప్రతి వ్యక్తి ఈ మాట చెప్పే ముందు ఆలోచించాలి. ఎందుకంటే, యువత పుట్టి, పెరిగిన ప్రపంచాన్ని సష్టించి, ఇలా నిర్వచిస్తున్నవాళ్లం మనమే. బాధ్యత యువతది మాత్రమే కాదు. తెలుగు సినిమాలు తీసేవాళ్లు, టెలివిజన్ ఛానళ్లు, వార్తా పత్రికలు నడిపేవాళ్లు, సోషల్‌ మీడియా, ఫేస్బుక్‌ సష్టించిన మార్క్‌ జుకెన్బెర్గ్‌తో సహా మన అందరిదీ. మనం సష్టించిన ప్రపంచంలోకి, విలువల్లోకి ప్రవేశించిన యువతని నిందించి, వారిపైనే మొత్తం బాధ్యత పెట్టటం సబబు కాదు కదా?

పరిశ్రమలో అందరు చెడ్డవాళ్లే కాదు:

స్త్రీలపై లైంగిక వేధింపులు, హింస గురించి మాట్లాడం గానే, మగవాళ్లందరూ చెడ్డవాళ్లు కాదని, దళితులపై హింస గురించి మాట్లాడితే అగ్ర కులాలందరు చెడ్డవాళ్లు కాదనటం వంటిదే ఇది కూడా. కానీ ఆధిపత్య ధోరణులని, సంస్కతిని, అలవాట్లని, పద్ధతులని ప్రశ్నించటానికి కొంత మేరకు అందర్నీ ఒక గాటన కట్టడం అవసరం. తెలుగు సినీ పరిశ్రమలో స్త్రీలపై పురుషుల లైంగిక దోపిడీని, వారి ఆధిపత్యాన్ని ప్రశ్నించటానికి సినీ రంగాన్ని ఒకటిగా పరిగణించటం అటువంటిదే. వాళ్లే తమని తాము కుటుంబంగా వర్ణించుకుంటారు కూడా. తమ పరిశ్రమలో ఇటువంటి చెడ్డ సంస్కతి, ధోరణి ఉందని ఒప్పుకున్నప్పుడే, పరిశ్రమ పెద్దలు అవి జరక్కుండా చర్యలు తీసుకోగలరు. భారత దేశ సంస్కతికి మూలమని చెప్పుకునే కుటుంబంలోనే స్త్రీలపై హింస జరుగుతోందని చట్టాలు చేసిన దేశం మనది. వేలమంది పని చేసే ఒక పెద్ద పరిశ్రమలో వేధింపులు జరుగుతాయని ఒప్పుకోవటం వల్ల పరువు పోదు. అది పరిశ్రమ పరిణితికి సూచన అవుతుంది.

సాక్షాలేవీ?

ఒక్కొక్క పరిశ్రమలో లైంగిక దోపిడీ, వేధింపులు ఒక్కో రకంగా ఉంటాయి. భవన నిర్మాణ రంగంలో మేస్త్రీలు, కూలీలపై చేసేది ఒకటి, అలాగే యూనివర్సిటీల్లో మరొకటి. సినిమా పరిశ్రమలో కూడా కింది స్థాయి వారిపై లైంగిక దోపిడీ, ఆర్థిక దోపిడీతో కలిసి ఉంటుంది. వీరిలో ఎవరూ సాక్ష్యాలని సేకరించరు. పై స్థాయిలో జరిగే ʹనేను నీకిది చెయ్యాలంటే, నువ్వు నాకేమిస్తావ్‌ʹ అనే ఒప్పందాల్లో లైంగిక దోపిడీ అవకాశాలు కల్పించటంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. కానీ, ఆర్థిక దోపిడీతో కలిసి ఉండదు. రెండు సందర్భాల్లో ఆర్థిక లావాదేవీలు ఉండటం వల్ల జరిగేది దోపిడీతో కలిసిన అసమాన కాంట్రాక్టుగానే కనిపిస్తుంది తప్ప, వేధింపులు, హింసగా కనిపించదు. అందుకే అవకాశాలు దొరకనప్పుడే ఫిర్యాదులు వస్తాయి. అప్పుడు జరిగింది దోపిడీ, మోసంగా కనిపిస్తుంది. అలా చేస్తారని ముందే ఊహించరు కాబట్టి సాక్ష్యాలు పొందు పరుచుకోరు. సెలెబ్రిటీలని బెదిరించి డబ్బులు చేసుకుంటారు. కాబట్టి సాక్ష్యాలు అడగాలనే వాళ్లు కూడా గుర్తించాల్సింది, ఆ పరిశ్రమలో నిలదొక్కుకోవాలనే ఆశకలవాళ్లు ఎప్పటికీ ఆ పని చెయ్యరని.

పేర్లు చెప్పాల్సిందే!

ఇది అన్నిటికన్నా బాధ్యతా రహిత డిమాండ్‌. మాట్లాడే స్త్రీలకి, పరిశ్రమలో పురుషులకి ఉన్న తీవ్ర అధికార అంతరాన్ని గుర్తించని డిమాండ్‌. మాట్లాడే స్త్రీలు ఆధిపత్య శ్రేణిలో కింది స్థాయిలో వుండేవాళ్లు. లైంగిక వేధింపులకు పాల్పడే వాళ్లు డబ్బు, అధికారం, హోదాల్లో అత్యంత పెద్ద స్థాయిలో వున్నవాళ్లు. మాట్లాడే స్త్రీలని ఏ రకంగా అయినా దెబ్బ తియ్యగలిగే అపరిమిత అధికారం వున్న వాళ్లు. పరువు నష్టం దావాలు వారి ఆయుధాల్లో చిన్నవి. ʹʹమేము పేర్లు చెప్పలేమంటేʹʹ అర్థం చేసుకోవాలి. చెప్పిన వాళ్లని సమర్థించాలి. వారిని శిక్షించకూడదు. భద్రత కల్పించాలి. ఒక వేదిక ఏర్పర్చాలి. అప్పుడే ధైర్యంగా తమ పరిస్థితిని ఎదుర్కోగలరు. అంతే తప్ప, చెప్పాల్సిందే అని బెదిరించటం వల్ల మరింత హానీ జరుగుతుంది.

ʹʹనువ్వెందుకు అవకాశమిచ్చావ్‌? అడిగినోణ్ని ఒక తన్ను తన్నుంటే ఇక్కడి వరకు వచ్చేది కాదుʹʹ అనటం బాధితులపై బండలు వెయ్యటమే. కేవలం లైంగిక సంబంధాల ఆధారంగా మంచి స్త్రీలు, చెడ్డ స్త్రీలు అనే విభజన చేయటం స్త్రీ పురుషుల లైంగికత గురించిన పాత నైతిక సిద్ధాంతాలపై ఆధారపడింది. పురుషులకి ఇటువంటి విభజన వర్తించదు. వివాహం బయట ఇటువంటి సంబంధాలున్నాయని ఒప్పుకున్న స్త్రీలని చెడ్డ వాళ్లంటారు. అదే అటువంటి సంబంధాలలోకి స్త్రీలని ఆహ్వానించే వివాహిత పురుషులని మాత్రం ʹమగవాళ్లు అట్లాగే వుంటారుʹ అంటూ సమర్థిస్తారు. ఈ ద్వంద్వ విలువలు పురుషాధిక్య హక్కులని కాపాడతాయి. మనం పురుషాధిక్య విలువలు మారాలని, వాటిని నిర్ములించాలని రాజ్యాంగాన్ని రాసుకున్నాం. పురుషులకున్న అనంతమైన అధికారాల్ని, హక్కుల్ని పరిమితం చెయ్యాలని నిర్ణయించుకున్నాం. వాటిలో కొన్నింటిని ʹకుటుంబ హింసʹ, ʹలైంగిక వేధింపులుʹ లేదా ʹలైంగిక దాడిʹ అనే పేర్లతో నేరస్మతిలో పొందుపరిచాం. ఇక్కడ విషయం పవిత్ర/అపవిత్ర స్త్రీల గురించి కాదు, పురుషాధిక్య హక్కులని తొలగించటం.

అవకాశం కోసం లొంగిపోయిన స్త్రీకి మాట్లాడే అర్హత లేదు. లైంగిక దోపిడీ లేదా లైంగిక వేధింపుల సమస్య ఫిర్యాదు చేసిన స్త్రీలతో మొదలవలేదు. వారితోనే ముగిసిపోదు. లైంగిక వేధింపుల కమిటీ పెట్టాలని చట్టం వచ్చిన ఐదేళ్ల పాటు కళ్లు మూసుకుని గడిపిన పరిశ్రమలోని సంస్థల వల్ల ఈ సమస్య

ఉత్పన్నమైంది. ఎక్కడైనా సరే, ʹలైంగిక లొంగుబాటుʹ తో పని దొరకటం అవమానకరం. ఈ సంస్క తిని ఇన్నాళ్లు భరించిన సినీ రంగాన్ని తప్పు పడదామా? లేక ఉందని చెప్పిన మహిళలనా? లంచం తీసుకున్న అధికారిని తప్పు పడతాం గానీ, ఇచ్చిన వారిని తప్పు పట్టం. అలాగే అవకాశం ఇస్తామని వాడుకున్న వారిది తప్పు గానీ అవకాశం కోసం లొంగిపోయిన వారిది కాదు. మాట్లాడే వారిపై దాడి చేస్తే, ఫిర్యాదు చెయ్యటానికి ఇంకెవరు ముందుకు రారు కదా.

పోలీసుల దగ్గరికి వెళ్లాలి గానీ, మీడియా దగ్గరికి కాదు. సినీ పరిశ్రమ మీడియా లేనిదే ఒక్క రోజు కూడా బతకలేదు. సినిమాల ప్రచారం, పోస్టర్లు, ఆడియో విడుదల, సినిమా సక్సెస్‌. కొంచెం నోరున్న హీరోయిన్లని నోరు మూయించటం కోసం ఇలా ఎన్నో రకాలుగా మీడియా వారికి ఉపయోగపడుతుంది. మరి అటువంటి మీడియా దగ్గరికి వెళ్లక ఇంకెక్కడికెళ్లాలి? మీడియా సినిమా ప్రొడ్యూసర్లకే, హీరోలకే కాదు, అందరిదీ కదా. అన్ని రకాల అధికారం కలిగివున్న పురుషులని వ్యతిరేకించటానికి మీడియా కొంచెం వేదిక ఇచ్చినందుకు మెచ్చుకుని, సంతోషించాలి గానీ, వెళ్లొద్దు అనటం సబబు కాదు కదా?

మా పరిశ్రమని ఎందుకు వేలెత్తి చూపిస్తున్నారు? పరిశ్రమ అంటే లోకువైపోయింది. విషయం పరువు-ప్రతిష్టలకి సంబంధించింది కాదు. పని స్థలాల్లో మహిళల భద్రతకు సంబంధించింది. వారికి తమ పని చికాకులు లేకుండా చేసుకునే వాతావరణం కల్పించటం గురించి. కొన్నాళ్ల క్రితం విశ్వవిద్యాలయాల్లో లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ప్రొఫెసర్‌ల లిస్టు ఒకటి ఇంటర్నెట్‌లో హల్చల్‌ చేసింది. ఆయా విద్యా సంస్థలేవీ తమ పేరు నాశనం అయిందని గగ్గోలు పెట్టలేదు. అలాగే రోజూ ఏదో పేరున్న సంస్థలో, రంగంలో వేధింపులు బయట పడుతూనే వున్నాయి. వాళ్లందరూ సాధ్యమయినంత త్వరగా సమస్యని పరిష్కరించుకున్నారు. ఇప్పటికి కొంత శాతమైనా ఆయా రంగాలు బాగుపడి స్త్రీలు కొంతలో కొంత చికాకులు లేకుండా పని చేసుకునే వాతావరణం ఏర్పడింది. తెలుగు సినీ పరిశ్రమ తమని మాత్రమే వేలెత్తి చూపిస్తున్నారని భావన వీడి, త్వరగా పరిస్థితిని బాగు చేసుకుంటే అందరి గౌరవం పెరుగుతుంది.

కింది స్థాయిలో కోఆర్డినేటర్స్‌, బ్రోకర్లతోనే సమస్య, పై వాళ్ళతో సమస్య లేదు. పై స్థాయిలో వుండే వారి గురించి ఫిర్యాదులు లేకపోవటం, వారి ఆధిపత్యాన్ని సూచిస్తుంది తప్ప సమస్య లేదని కాదు. ఎక్కడయితే పూర్తి ఆధిపత్యం ఉంటుందో అక్కడ నిశ్శబ్దం కూడా రాజ్యమేలుతుంది. బొడ్డు మీద కొబ్బరి చిప్పలు వేశారని, తెలుగు సినీ పరిశ్రమ నుంచి వెళ్లిపోయిన హీరోయిన్లు చిన్నగా అంటేనే, వారిని నానా శాపనార్థాలు పెట్టి వారితో క్షమాపణలు చెప్పించిన సినిమా భక్తులున్న సమాజం మనది. పరిశ్రమ తీసిన అతి పెద్ద సినిమాలో స్త్రీ పాత్ర చిల్లరగా ఉందని విమర్శించిన యువతిని ఇంటర్నెట్‌లో వేధించి మళ్లీ కనిపించకుండా చేసిన ఘనులు కూడా ఉన్నారు. విమర్శ ఎదగటానికి తోడ్పడుతుందనే సోయి లేని భక్తులని, భరించలేని వారి తిట్లని పల్లెత్తు మాట కూడా అనని పురుషులున్న పరిశ్రమలో కింది వాళ్లు మాత్రమే వేధింపులకు పాల్పడుతున్నారని నమ్మటం కొంచెం కష్టం.

ఇప్పుడు మీడియా ముందు మాట్లాడిన వాళ్లు తరువాత మాట మీద నిలబడరు. నిజమే. ఒత్తిడి తట్టుకోలేని కుటుంబ హింస బాధితులు ఫిర్యాదులు వెనక్కి తీసుకుంటారు. అత్యాచార బాధితులు ఏమీ జరగలేదంటారు. హత్యచేయబడిన వారి కుటుంబ సభ్యులే సహజ మరణమంటారు. మరి సినీ పరిశ్రమ వంటి ఆధిపత్య నిర్మాణాన్ని ఢీకొట్టిన వారు ఒత్తిడి, ఎదురు దాడి తట్టుకోలేక వెనుదిరగటంలో ఆశ్చర్యమేముంది? డబ్బులు తీసుకున్నారని, ఏదో రాజకీయ ఉద్దేశంతో చేస్తున్నారని నిందలు మోపితే తట్టుకోవటం అధికారం, డబ్బు లేని బాధితులకి సాధ్యం కాదు కదా.

సమస్య లేవనెత్తిన మహిళల నుండి సమస్యని విడదీసి చూడాలని అనేక మంది సోషల్‌ మీడియాలోనే చక్కగా విడమర్చి చెప్పారు. ఇది మన సమాజ పరిణితికి చిహ్నం. లైంగిక వేధింపులు ఈ ఒక్క నిరసన, చర్చతో మాయమైపోతాయని చెప్పటం కష్టమే. కానీ ఈ చర్చ తరువాత వీటిని కిందికి నెట్టేయటం కూడా అంత తేలిక కాదు. అసలు ఇటువంటి చర్చ జరగటమే తెలుగు సమాజంలో ఒక ప్రజాస్వామ్య మార్పుకి సూచన అని మా నమ్మకం.

(న‌డుస్తున్న తెలంగాణ మే 2018 సంచిక‌లో ప్ర‌చురితం)

Keywords : casting couch, tollywood, youth
(2019-02-17 02:06:43)No. of visitors : 392

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.

మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

ఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్‌ ముట్టడి, పెరేడ్‌ గ్రౌండ్స్‌లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్‌ ఉద్యమాలు నిర్వహించారు.

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

ʹనీ బాంచెన్ దొరా కాల్మొక్తʹ

జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ఖిల్లాలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పాదాభివందనం చేస్తున్నానంటూ ...

మహాజనాద్భుత సాగరహారానికి నాలుగేళ్ళు

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపుత్రుల దేహాల సంరంభాన్ని అనుభవించవలసిన సందర్భం అది....

Search Engine

బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
stand against the threat of imminent arrest of Prof. Anand Teltumbde - Students, Faculty and Alumni of IIT Kharagpur
Health of imprisoned DU Professor G.N. Saibaba is seriously deteriorating
Drop the false charges against Prof. Anand Teltumbde Immediately: Trade Unions
ఆపరేషన్ సమాదాన్ కు నిరసనగా భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించిన మావోయిస్టులు...31న బంద్ కు పిలుపు
రిపబ్లిక్ డే ఉత్సవాలను బహిష్కరించిన ఈశాన్య రాష్ట్రాలు
పుణె కోర్టులో నాలుగోసారి కలలూ కన్నీళ్లూ
నల్గొండ‌లో... ఫిబ్రవరి 9,10 తేదీల్లో విరసం సాహిత్య పాఠశాల
COSTISA demands quashing of fabricated FIR against Prof. Anand Teltumbde!
దేశద్రోహం కేసు : JNU విద్యార్థి నేతలపై చార్జ్ షీట్ తిరస్కరించిన కోర్టు
Dragging Anand Teltumbde into ʹterroristʹ allegations and raiding his house is an attack on freedom of expression : Swami Agnivesh
మీ మద్దతు నాకిప్పుడు కావాలి - ఆనంద్‌ తెల్తుంబ్డే
Immediate and Complete Withdrawal of all Charges against Dr. Anand Teltumbde
ʹపాకిస్తాన్ జిందాబాద్ʹ అని అరిచింది ఏబీవీపీ విద్యార్థులే.. సంచలన వాస్తవాలు బయటపెట్టిన మాజీ నాయకులు
మనను ఆక్రమిస్తున్న ఈ వ్యాధిని ప్రతిఘటిద్దాం- అరుంధతీ రాయ్
A Statement by Umar Khalid and Anirban Bhattacharya in the context of the Chargesheet
more..


కొంచెం