చారిత్రాత్మక కమ్యూనిస్టు ప్రణాళిక (రెండవ భాగం) - ఎ.నర్సింహరెడ్డి

చారిత్రాత్మక

(ఇది ʹచారిత్రాత్మక కమ్యూనిస్టు ప్రణాళికʹవ్యాసం లోని రెండవ భాగం)

ముగింపు

దోపిడీని తీవ్రతరం చేయడం ద్వారా తృతీయ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేందుకై రూపొందించిన సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాల పేరుతో సామ్రాజ్యవాదం సాగిస్తున్న కొత్తదాడులు పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క అన్యాయపూరిత, అమానుష స్వభావాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. వర్ధమాన ప్రపంచంలోని కోట్లాది మందిని చుట్టుముట్టిన ఆకలి, కడగండ్లు, రోగాలు, నిరక్షరాస్యతలతో కూడిన భయానక దుస్థితికి దురాశతో అది చేస్తున్న దోపిడీయే కారణం. చివరకు అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ ప్రపంచంలో సైతం శ్రామిక ప్రజల కష్టార్జితమైన హక్కులను ఈ దాడి కుదించి వేస్తున్నది. మానవాళి ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించలేని అసమర్థ వ్యవస్థగా పెట్టుబడిదారీ వ్యవస్థ గతంలోకన్నా ఎక్కువగా ఈనాడు తనకుతానే రుజువు చేసుకుంటున్నది.

ప్రణాళిక ప్రచురితమైన నాటి నుండి ప్రపంచంలో చెప్పుకోదగిన మార్పులు అనేకం సంభవించాయి. అయినప్పటికీ మారుతున్న చారిత్రక పరిస్థితులకు సంబంధమున్న పలు ఘటనలను అవగాహన చేసుకోవడానికీ, విశ్లేషించడానికీ ఈ ప్రణాళిక మనకు సాధన సంపత్తిని సమకూరుస్తున్నది. సృజనాత్మకమైన శాస్త్రంగా మార్క్సిజం మానవాభివృద్ధిలోని ధోరణులను, దిశలను గుర్తిస్తున్నది. ఇలా చేయడం ద్వారా దోపిడీ రహిత సమాజ స్థాపనలో భాగస్వాములయ్యే అవకాశాన్ని ప్రజానీకానికి కల్పిస్తున్నది. వర్గ పోరాటాన్ని, నూతన సమాజానికి దిక్సూచి అయిన కార్మికవర్గం నిర్వహించాల్సిన చారిత్రక విప్లవ కర్తవ్యాన్ని గురించి వివరించింది. ప్రపంచానికి భాష్యం చెప్పటమే కాదు, దానిని మార్చటానికి కావలసిన చైతన్యాన్ని అందిస్తుంది.

ʹʹఈ చిన్న పుస్తకం ఎన్నో సంపుటాల కంటే విలువైంది. ఈనాటికీ నాగరిక ప్రపంచంలో పోరాటం చేస్తున్న కార్మిక వర్గానికి మార్గదర్శకంగా ఉందిʹʹ. పెట్టుబడిదారీ వ్యవస్థలోని కార్మికవర్గ ఉద్యమాన్ని ప్రతిబింబించిన ఈ ప్రణాళికని సామ్రాజ్యవాద యుగంలో ఏ మార్పులూ, చేర్పులు లేకుండా స్వీకరించడం సాధ్యం కాదు. లెనిన్‌ సామ్రాజ్యవాద యుగంలో కమ్యూనిస్టు పార్టీ వ్యూహాన్నీ ఎత్తుగడల్ని కార్యక్రమాన్ని రూపొందించి విప్లవాన్ని విజయవంతం చేశాడు. 1928లో సామ్రాజ్యవాద యుగప్రత్యేక లక్షణాల్ని వివరిస్తూ ప్రోగ్రాం ఆఫ్‌ ద కమ్యూనిస్టు ఇంటర్‌నేషనల్‌ అనే పేరుతో స్టాలిన్‌ నాయకత్వాన కంపానియన్‌ వాల్యూం ఆఫ్‌ ద మానిఫెస్టోని రూపొందించడం జరిగింది. చైనా విప్లవానుభవాన్ని సిద్ధాంతీకరిస్తూ మావో రాసిన న్యూ డెమోక్రటిక్‌ రివల్యూషన్‌ వ్యాసాల్ని కూడా మానిఫెస్టోకి అనుబంధంగా అధ్యయనం చేయాలి.

చారిత్రక భౌతికవాదం, గతితార్కిక భౌతికవాదం, వర్గపోరాట సిద్ధాంతం, కార్మికవర్గ విప్లవకర పాత్రల విషయంలో ఒక మహత్తర ప్రమాణ పత్రంగా ప్రణాళికకు మార్కిస్టు సాహిత్యంలో తిరుగులేని స్థానం ఉన్నప్పటికీ కార్యక్రమ సూచికగా గ్రహించాలంటే లెనినిజం. మావో ఆలోచనా విధానం వెలుగు నుంచీ అదనపు సమాచారాన్ని అనుబంధం చేసుకోవాల్సి ఉంటుంది. చారిత్రక పరిణామాల కనుగుణంగా ఈ సృజనాత్మక కార్మికవర్గ అస్త్రాన్ని సుసంపన్నం చేసుకోవడంలో అరకొరలు, వైఫల్యాలు అనేవి, దాని సారాంశంలో గతితర్క భౌతికవాద పద్ధతి లేకపోవడంవల్ల సంభవించలేదు. ఈ తాత్విక భౌతిక గతితర్క ధృక్ఫథాన్ని స్వీకరించిన వారిలో శాస్త్రీయత కొరబడడం వల్లనే. అందువల్ల ఈ సృజనాత్మక ప్రణాళికను సుసంపన్నం చేసుకోవడంలో అరకొరలు, వైపల్యాలు అధిగమించాల్సిన బాధ్యత కార్మికవర్గ అగ్రగామి పార్టీపై ఉంది.

- ఎ.నర్సింహరెడ్డి

Keywords : marx. engels, communist manifesto, communism
(2024-04-24 20:29:37)



No. of visitors : 1503

Suggested Posts


మార్క్స్‌ దాస్‌కాపిటల్‌లోని ఒక్క పేజీకి మూడున్నర కోట్లు !

వివక్ష, అణచివేత, అసమానతల మూలాలను బైటపెట్టి, అదనపు విలువ సిద్దాంతంతో దోపిడీ గుట్టువిప్పిన కారల్‌ మార్క్స్‌ ద్విశతాబ్ది జయంతుత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో ఆయన రాసిన దాస్‌ కాపిటల్‌ రాతప్రతి ఒకే ఒక్క పేజీ 5,23, 000 డాలర్లకు వేలంలో అమ్ముడంతో వార్తల్లోకెక్కింది. ఈ నెల 3న బీజింగ్‌లో మార్క్స్‌ రాసిన దాస్‌ కాపిటల్‌లోని ఒక పేజీ రాతప్రతిని వేలం వేయగా మూడున్నర కోట్ల

చారిత్రాత్మక కమ్యూనిస్టు ప్రణాళిక (మొదటి భాగం) - ఎ.నర్సింహరెడ్డి

మార్క్స్‌, ఎంగెల్స్‌ల కమ్యూనిస్టు ప్రణాళికను 1948 ఫిబ్రవరిలో ప్రపంచానికి అందజేశారు. ఇది ప్రపంచ చరిత్రలో మహత్తర రచన. కారల్‌మార్క్స్‌, ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌ రచించిన కమ్యూనిస్టు ప్రణాళికయే శాస్త్రీయ కమ్యూనిజపు మొట్టమొదటి కార్యక్రమం.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


చారిత్రాత్మక