కాలుష్యకారణ కంపెనీపై ప్రజల పోరాటం...పోలీసు కాల్పులు.. 11 మంది మృతి !
తమిళనాడులోని తూత్తుకుడిలో తమ జీవితాలను నాశనం చేస్తున్న స్టెరిలైట్ కంపెనీని మూసివేయాలంటూ నిరసన ప్రదర్శన చేసిన వేలాదిమంది ప్రజలపై పోలీసులు కాల్పులు జరపడంతో 11 మంది మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. గాయాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
1996లో స్టెరిలైట్ ఫ్యాక్టరీని స్థాపించారు. ఏడాదికి 4 లక్షల మెట్రిక్ టన్నుల కాపర్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉండగా, ఈ ఫ్యాక్టరీ మాత్రం రెట్టింపు ఉత్పత్తి చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. 2013 మార్చిలో వేలాది మంది ప్రజలు ఈ ఫ్యాక్టరీ నుంచి వెలువడ్డ కాలుష్యాలు భూగర్భ జలాలను కలుషితం చేయటం, విషపూరిత వాయువుల కారణంగా గొంతు ఇన్‌ఫెక్షన్, శ్వాస సంబంధిత వ్యాధులతో వేలాది మంది ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. దీంతో ఫ్యాక్టరీని మూసేయాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే నేషన్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశాలతో తిరిగి ఫ్యాక్టరీ తెరుచుకుంది. అదే ఏడాది ఎడీఎంకే చీఫ్ వైకో సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేయగా, పర్యావరణానికి, ప్రజలకు చేసిన నష్టానికి 100 కోట్ల జరిమానా విధిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే యాజమాన్య సంస్థ వేదాంత గ్రూప్ మాత్రం ʹ కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలకు ఎక్కడా ఉల్లంఘించటం లేదుʹ అని వాదించి ఆ జరిమానా నుంచి తప్పించుకుంది. అంతేకాదు ఇప్పుడు ఫ్యాక్టరీ మూసివేత డిమాండ్ ఊపందుకున్న వేళ.. తమ ఫ్యాక్టరీ ద్వారా పరోక్షంగా 25 వేల మందికి, ప్రత్యక్షంగా 3 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు వాదిస్తోంది. అయితే స్థానిక ప్రజలు ఇది ప్రమాదకరమని, తక్షణమే మూసేసే దిశగా ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు. ఎన్ని ఆందోళనలు నిర్వహించినా అటు కంపెనీ కానీ ప్రభుత్వం కానీ పటించుకోలేదు పైగా లైసెన్స్ రెన్యువల్‌కు, కంపెనీని విస్తరించేందుకు కుట్రలు ప్రారంభించారు. దాంతో మూడు నెలలుగా స్థానికులు తమ ఆందోళనలను తీవ్రం చేశారు
ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు ఈ రోజు కలక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చాయి. దాదాపు 20 వేల మంది ప్రజలు కలక్టర్ కార్యాలయం ముందు శాంతి యుతంగా ప్రదర్శన నిర్వహిస్తుండగా వేదాంత సంస్థకు అండగా అక్కడ మోహరించిన 4 వేల మంది పోలీసులు ఆందోళనకారులపై విరుచుకపడ్డారు. లాఠీచార్జ్ చేయడంతో ప్రజలు తిరగబడ్డారు. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పలు వాహనాలకు నిప్పటించారు. పోలీసులు ప్రజలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోగా 50 మంది తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసు కాల్పులపై తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. కార్మిక సంఘాల పిలుపు మేరకు తూత్తకుడి పట్టణంలో దుకాణాలు మూసివేసి స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ప్రభుత్వ తీరును రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని రెచ్చగొట్టేవిధంగా ఆంక్షలు విధించి వారిపై అమానుషంగా దాడి చేయడంపై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. సంఘటనా స్థలం వద్ద 144 సెక్షన్ విధించడంతో పాటు పోలీసులు భారీగా మోహరించారు.
మరోవైపు అన్నాడీఎంకే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై ఆంక్షలు విధించి రెచ్చగొట్టారని, పైగా వారిపై అమానుషంగా పొట్టనబెట్టుకున్నారని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే పరిస్థితి అదుపు తప్పటంతోనే పోలీసులు కాల్పులు చేపట్టినట్లు మంత్రి జయకుమార్ వెల్లడించారు. మృతులకు నష్టపరిహారం అందిస్తామన్న ఆయన ప్రకటనపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి.
డీఎంకే అధినేత స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ...ʹప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాల్సిందిపోయి.. ఈ ప్రభుత్వం వారి ప్రాణాలను బలిగొంది. అవినీతిని ప్రొత్సహించటం కాదు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆ ఫ్యాక్టరీ మూత పడాల్సిందే. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయిʹ అని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. తూత్తుకుడి పరిస్థితుల నేపథ్యంలో రేపు కర్ణాటకలో జరగబోయే కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి స్టాలిన్ హాజరు కావటం లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రేపు కీలక నేతలతో స్టాలిన్ తూత్తుకుడిలో పర్యటించే అవకాశం ఉంది.
ఈ పరిణామాలపై నటుడు, మక్కళ్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ కూడా స్పందించారు. ʹపౌరుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేకుండా పోయింది. వాళ్లేం నేరగాళ్లు కాదు. ప్రజా హక్కులను కాపాడాల్సింది పోయి పొట్టనబెట్టుకుంది. జంతువులను కాల్చి చంపినట్లు చంపారు. శాంతియుత ఆందోళనను హింసాత్మకంగా మార్చింది ప్రభుత్వమే. ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రేపు తూత్తుకుడికి వెళ్తాను. తక్షణమే ఫ్యాక్టరీని మూసేయాలిʹ ఆయన డిమాండ్ చేశారు.
Keywords : tamil nadu, police firing, 11 Killed, Protests Against Sterlite
(2022-06-27 15:54:08)
No. of visitors : 2295
Suggested Posts
| కరోనా కన్నా కులమే ప్రమాదకర వైరస్...పా రంజిత్కరోనా మహమ్మారి సమయంలో కూడా దళితులను హత్య చేయడం వారిపై దాడులు, హింస పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ దర్శకుడు పా రంజిత్ ఈ దేశంలో కరోనా కన్నా కులం ఎక్కువ ప్రమాదకారి అని అన్నారు. |
| ʹచోళ రాజుల కాలం దళితులకు చీకటి యుగంʹ అన్నందుకు డైరక్టర్ పా రంజిత్ పై కేసు !చోళరాజుల పాలనలో దళితులు తీవ్రంగా అణచివేయబడ్డారు, దేవదాసి వ్యవస్థను ప్రోత్సహిస్తూ నిమ్నకులాలను నీచంగా చూశారు. తంజావూర్ డెల్టా ప్రాంతాల్లో ఉన్న భూములన్ని వారు లాక్కున్నారు. వాస్తవానికి కుల అణచివేత ప్రారంభమైంది వారి పాలనలోనే. 400 మంది దళిత స్త్రీలు దేవదాసీలుగా, సెక్స్ వర్కర్లుగా మార్చబడ్డారు. |
| వేయిరూపాయల అప్పు తీసుకున్న పాపానికి పదేళ్ళుగా భానిస జీవితం..వృద్దుడి హృదయవిదారక గాథనిలబడ్డవాళ్ళ కాళ్ళపై పడి మొక్కుతున్న ఆ వృద్దును పేరు కాశీ. వెట్టి కార్మికుడు... అంటే ప్రజాస్వామ్య భారతంలో భానిస. తమిళనాడు కాంచీపురం జిల్లా కొన్నెరకుప్పం గ్రామంలో ఓ కట్టెల మిల్లులో పదేళ్ళుగా వెట్టి చేస్తున్న భానిస. అది కూడా పదేళ్ళ కింద ఆయన చేసిన వేయి రూపాయల అప్పు కోసం... |
| Dalit girl ends life in T.N. village after boys tear up her Class XII exams hall ticketA Class XII Dalit girl committed suicide after her examination hall ticket was torn up on Monday by two boys in her classroom in Pochampalli in Tamil Nadu. One of the boys had been harassing her to accept his love proposal |
| పోలీసుల క్రూరత్వం... తండ్రీ కొడుకుల హత్య...మాటలకందని హింస
మొబైల్ షాపు నడుపుకునే ఇద్దరు తండ్రీ కొడుకుల్ని లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో అరెస్టు చేసిన పోలీసులు చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారు. తమిళనాడు తూతుకూడి జిల్లా శతాంకులంలో ఫెనిక్స్ (31) చిన్న మొబైల్ షాపు నడుపుతుంటాడు. |
| న్యూఇయర్ వేడుకలు జరుపుకున్నందుకు దళితులపై అగ్రకుల ఉగ్రమూక దాడులు ... ఇండ్లు కూల్చి వేతతంజావూర్ జిల్లా అంబాలపట్టు దక్షిణ గ్రామంలో దళిత యువకులు కొందరు నూతన సంవత్స రాన్ని పురస్కరించుకొని మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేసుకున్నారు. లైట్లతో ఆ ప్రాంతాన్ని అలంకరించుకు న్నారు. వారి ఉత్సవాలకు గుర్తుగా గ్రామ ప్రవేశ ద్వారానికి బెలూన్లు, రంగు కాగితాలు కట్టారు. |
| లాక్ డౌన్ ను అవకాశంగా తీసుకుంటున్న కులోన్మాదులు ...4రోజుల్లో నలుగురు దళితుల హత్య!"తమిళనాడును అత్యాచారాల రాష్ట్రంగా ప్రకటించాలి. ఇక్కడ వున్నట్లుగా కుల సమస్య మరే రాష్ట్రంలోనూ లేదు" అని మదురైకి చెందిన ఎన్జీఓ ʹఎవిడెన్స్ʹ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ కదిర్ ఆవేదన.
కరోనావైరస్ గత్తర సమయంలో కుల ఆధారిత హింస తమిళనాడులో కొత్త స్థాయికి ఎదిగిందని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. |
| వేదాంత స్టెరిలైట్ ను మూడు రాష్ట్రాలు తిరస్కరిస్తే తమిళనాడు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది !1995లో ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రతిపాదించింది మొదలు తూత్తుకూడిలోని స్టెరిలైట్ రాగి ఫ్యాక్టరీ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూ వస్తోంది. గుజరాత్, గోవా, మహారాష్ట్ర సహా మూడు రాష్ట్రాల్లో తిరస్కరించిన తర్వాత ఈ కర్మాగారం చివరికి తమిళనాడులో అడుగుపెట్టింది. ఈ వివాదంపై ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ) పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింద |
| వేదాంత నిరసనకారులపై దాడి...ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న పోలీసుల దారుణాలుపోలీసులు జరిపిన కాల్పుల్లో 22 ఏళ్ల కలియప్పన్ అనే వ్యక్తి బుల్లెట్ తగిలి మరణించాడు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడి తీవ్రంగా రక్తమోడుతూ పడిపోయిన అతని చూట్టూ పోలీసులు చేరి లాఠీలతో బెదిరిస్తూ ʹనటించింది చాలు ఇక వెళ్లుʹ అని కసురుకున్నారు.
|
| నోట్ల రద్దు, జీఎస్టీ ల పై అగ్రహీరో పాడిన పాటకేంధ్ర ప్రభుత్వం ఎంత సమర్దించుకుందామని ప్రయత్నించినా పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ లపై ఇప్పటికీ దేశవ్యాప్తంగా నిరసన గొంతులు వినిపిస్తూనే ఉన్నాయి. సామాన్యులే కాదు సినీ సెలబ్రిటీలు కూడా ఈ రెండింటిపై తమ నిరసన గళ్ళాన్ని వినిపించారు. అయితే ఇప్పుడు.... |
| భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
|
| వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక |
| ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు |
| సిలంగేర్, హస్దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం |
| చెర సాహిత్య సర్వస్వం పునర్ముద్రణ... మీ కాపీని ముందస్తుగా బుక్ చేసుకోండి.. |
| బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు |
| పూంబాడ్ లో జరిగిన రాకెట్ దాడిపై ఆదివాసీల ఆగ్రహం
|
| జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
|
| మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు |
| శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
|
| ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
|
| యేడాది సిలింగేర్ ఏం చెబుతోంది? - ధరణి |
| ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు |
| ఛత్తీస్గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక |
| శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు |
| గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్ |
| త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్ |
| అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత |
| నాగరాజు హత్యను ఖండించిన ముస్లిం థింకర్స్ డయాస్ |
| Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు |
| Madhya Pradesh: ఇద్దరు గిరిజనులను కొట్టి చంపిన ʹగోరక్షకులుʹ |
| ఉత్తరప్రదేశ్ లో ఈ ఏడాది 10వ తరగతి, ఇంటర్ హిందీ పరీక్షల్లో 8 లక్షల మంది ఫెయిల్ |
| అదానీ కోసం అడవిని నరికేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.....రక్షించుకోవడానికి ఆదివాసుల ఉద్యమం |
| ప్రపంచ విప్లవ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవహారాల కమిటీ ప్రకటన
|
| హిందీ భాష మాట్లాడని వారు ఈ దేశం వదిలి వెళ్ళాలి - యూపీ మంత్రి భాషాహంకారం
|
more..