ఆదివాసుల సమాధుల మీద పర్యాటక రహదారులు నిర్మిస్తున్న పాలకులు - క్రాంతి


ఆదివాసుల సమాధుల మీద పర్యాటక రహదారులు నిర్మిస్తున్న పాలకులు - క్రాంతి

ఆదివాసుల

ఒక‌ప్ప‌టి ఉద్య‌మ ప్రాంతాల‌న్నీ ఇప్పుడు ప‌ర్యాట‌క ప్రాంతాలుగా మారుతున్నాయి. నిన్న న‌ల్ల‌మ‌ల‌, ఇవాళ దండ‌కార‌ణ్యం. పారిశ్రామికాభివృద్ధి, ప‌ర్యాట‌కాభివృద్ధి పేరిట అడ‌వుల్ని ఆధ్యాత్మిక కేంద్రాలుగా, ప‌ర్యాట‌క ప్రాంతాలుగా, బ‌హుళ‌జాతి కంపెనీల దోపిడీకి నిల‌యాలుగా మార్చుతున్నారు పాల‌కులు. అందుకోసం... ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల్ని నిలువునా కూల్చి నెత్తుటేరులు పారిస్తున్నారు. నదులు, కొండలు, అడవులను అల్లుకున్న ఆదివాసీ తెగ‌లను అంతం చేసి వాళ్ల స‌మాదుల‌పై మార్కెట్‌కు రెడ్ కార్పెట్‌లు ప‌రుస్తున్నారు.

జాతి విముక్తికోసం త‌మిళ పులులు జ‌రిపిన పోరాటాన్ని అత్యంత హింసాత్మ‌కంగా అణ‌చివేసిన సింహ‌ళ పాల‌కులు... జాఫ్నాను టూరిజానికి కేంద్రంగా మార్చారు. దాదాపు 70వేల మంది త‌మిళుల‌ను హ‌త్యచేసి, ల‌క్ష‌లాది మందిని నిర్వాసితుల‌ను చేసిన శ్రీలంక ప్ర‌భుత్వం ఎల్‌టీటీఈ ఉద్య‌మ ప్రాంతానికి ప‌ర్యాట‌క సొబగులద్దింది. వార్ జోన్ టూరిజం పేరిట త‌మిళుల పోరాట స్థావ‌రాల‌ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేస్తూ... ఆ ఉద్య‌మంపై తాము సాధించిన ʹగెలుపుʹను గొప్ప‌గా చాటుకుంది.

న‌ల్ల‌మ‌లలో విప్ల‌వోద్య‌మంపై తీవ్ర అణ‌చివేత‌ను ప్ర‌యోగించిన స్థానిక పాల‌కులు సైతం ఇప్పుడు అలాంటి వ్యూహాన్నే అనుస‌రిస్తున్నారు. అందులో భాగంగానే న‌ల్ల‌మ‌ల అట‌వీ ప్రాంతం విస్త‌రించిన‌ న‌ల్ల‌గొండ, మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌, క‌ర్నూలు, క‌డ‌ప‌, ప్ర‌కాశం జిల్లాల్లో టూరిజం యాక్టివిటీని విస్త‌రిస్తుండడాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. హైద‌రాబాద్ నుంచి, శ్రీశైలం వెళ్లే దారిలో ఫ‌ర‌హాబాద్ టైగ‌ర్ రిజ‌ర్వ్ ఫారెస్ట్ వాటిల్లో ఒక‌టి. ఫ‌ర‌హాబాద్ అన‌గానే అక్క‌డి వ్యూ పాయింట్ గుర్తొస్తుంది. చూపుసారించిన మేర క‌నిపించే ప‌చ్చ‌ద‌నం గుర్తొస్తుంది. దాని మ‌ధ్య‌లో బ్రిటీష్ కాలంలో డాక్టర్ రస్సెల్స్ తవ్వించిన పెద్ద మానవ నిర్మిత సరస్సు గుర్తొస్తుంది. దారిలో తార‌స‌ప‌డే శిథిలావ‌స్థ‌లోని ఏడోనిజాం విడిది గృహాం గుర్తుస్తొంది. కానీ వాటి వెన‌క దాగిన ప్ర‌జ‌ల చ‌రిత్ర క‌నిపించ‌దు. ఏలినవాళ్లు సాగించిన అకృత్యాలు క‌నిపించ‌వు. ఈ ప్రాంతాన్ని ప‌ర్యాట‌క కేంద్రంగా మ‌ల‌చే కుట్ర‌ను ఒక్క‌ప్పుడు విప్ల‌వోద్యమం తీవ్రంగా ప్ర‌తిఘ‌టించింది. అభివృద్ధి పేరిట జ‌రిగే విధ్వంసాన్ని వ్య‌తిరేకిస్తూ స్థానిక చెంచు ప్ర‌జ‌లు పోరాటాలు నిర్వ‌హించారు. కానీ ఇప్పుడు ఆ ప్రాంతాల‌న్నీ విధ్వంస‌క‌ర అభివృద్ధి న‌మూనాలో పెట్టుబ‌డి దాహం తీర్చుతున్నాయి.

ప‌ర్యాట‌కం పేర క్ర‌మంగా సెజ్‌లు, కంపెనీలు అడ‌విలోకి చొర‌బ‌డుతుండ‌డాన్ని ఇవాళ దేశ‌వ్యాప్తంగా గ‌మ‌నించ‌వ‌చ్చు. యురేనియం, బాక్సైట్‌, అల్యూమినియం, సున్న‌పురాయి లాంటి స‌హ‌జ న‌రుల‌ను బ‌హుళ‌జాతి కంపెనీల‌కు దారాద‌త్తం చేసేందుకు ఆదివాసుల‌ను అడ‌వి నుంచి గెంటివేస్తున్నారు. టైగ‌ర్ రిజ‌ర్వ్ ఫారెస్ట్‌ల పేరిట క‌వ్వాల్‌, ఆమ్రాబాద్ అట‌వి ప్రాంతాల్లో జ‌రుగుతున్న విధ్వంసంలో అందులో భాగ‌మే.

మహబూబ్‌నగర్‌ జిల్లా అమ్రాబాదు టైగ‌ర్ రిజ‌ర్వ్ ఫారెస్ట్ వ‌ల్ల‌ మన్ననూర్‌ మండలంలోని వటవర్ల పల్లి, సార్లపల్లి, కుడిచింతల బైలు గ్రామాల ప్ర‌జ‌లు నిర్వాసితులు కానున్నారు. అక్క‌డ యురేనియం త‌వ్వ‌కాల కోసం ఆమ్రాబాద్‌ను టైగ‌ర్ రిజ‌ర్వ్ ఫారెస్ట్‌గా ప్ర‌క‌టించేందుకు ముందుకు వ‌చ్చింది ప్ర‌భుత్వం. తాజాగా అమ్రాబాద్ ఫారెస్ట్‌లో ప‌ర్యాట‌కాభివృద్ధి పేరిట ఆక్టోప‌స్ వ్యూ పాయింట్‌ని ప్రారంభించింది కూడా. ఈ మొత్తం ఆలోచ‌న‌ల వెన‌క యురేనియం త‌వ్వ‌కాలు జ‌ర‌ప‌నున్న డీబీర్ కంపెనీ ప్ర‌యోజ‌నాలున్నాయి. ఇలాంటి కంపెనీల ప్ర‌యోజ‌నాల కోసం అక్క‌డి చెంచు ప‌ల్లెల్ని ఖాళీ చేయించేందుకు సిద్ధ‌మైంది స‌ర్కారు. స‌రిగ్గా ఇలాంటి ప్ర‌యోగాన్నే ఆదిలాబాద్ జిల్లాలోని క‌వ్వాల్ అట‌వీ ప్రాంతంలోనూ చూడొచ్చు. కవ్వాల్‌ ప్రాంతంలోని కుర్రెక గూడెం ప్రజలను బలవంతంగా మైదాన ప్రాంతానికి తరలించారు. అక్క‌డ ల‌భించే అపారమైన సున్నపురాయిని దోచుకోవ‌డానికి కంపెనీల‌కు మార్గాన్ని సుల‌భం చేస్తూ పాల‌కులు ఇలాంటి ప్ర‌తిపాధ‌న‌ల‌తో ముందుకు వ‌స్తున్నారు.

ఒక్క ఉత్త‌ర తెలంగాణ‌, న‌ల్ల‌మ‌ల‌లాంటి ఉద్య‌మ ప్రాంతాల్లోనే కాదు.. దండ‌కార‌ణ్యంలోనూ ప‌ర్యాట‌కాభివృద్ధి పేరిట పాల‌కులు కొత్త వ్యూహానికి తెర‌తీశారు. తాజాగా స్వ‌దేశ్ ద‌ర్శ‌న్ కింద కేంద్రం 99 కోట్లు మంజూరు చేసింది. చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని జ‌ష్‌పూర్ - మెయిన్‌ప‌ట్ - అంబికాపుర్ - మ‌హేష్‌పుర్ - రత‌న్‌పూర్ - కుర్ద‌ర్ - స‌రోద‌దాద‌ర్ - గంగ్రేల్ - కొండ‌గావ్‌- న‌త్య‌న‌వాగావ్ - జ‌గ‌ద‌ల్‌పుర్ - చిత్ర‌కూట్ - తీర్థ్‌ఘ‌ర్ ప్రాంతాల‌ను క‌లుపుతూ రామాయ‌ణ స‌ర్య్కూట్ పేరిట ప‌ర్యాట‌కాన్ని విస్త‌రించ‌నున్నారు. ఎకో టూరిజం లాంటి ముసుగులో బ‌హుళ‌జాతి కంపెనీల దోపిడీ మార్గం సుగ‌మం చేసే ప్ర‌య‌త్నంలో భాగంగానే వీటిని చూడాల్సి ఉంది.

అభివృద్ధి ముసుగులో జ‌రుగుతున్న ఈ విధ్వంసాన్ని ప్ర‌జ‌లు ద‌శాబ్ధాలుగా వ్య‌తిరేకిస్తూనే ఉన్నారు. ఆ ప్ర‌జ‌ల పోరాటాలకు అండ‌గా నిలిచిన విప్ల‌వోద్య‌మం ఇలాంటి దోపిడీ అభివృద్ధి న‌మూనాను ప్ర‌తిఘ‌టిస్తూ, ప్ర‌త్యామ్నాయ అభివృద్ధి న‌మూనాను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేస్తోంది. అందుకే... త‌మ దోపిడీకి ఆటంకంగా మారిన విప్ల‌వోద్య‌మాన్ని నిర్మూలించే ల‌క్ష్యంతో ప్ర‌జ‌లపై యుద్ధానికి దిగిన ప్ర‌భుత్వం ల‌క్ష‌లాది పోలీసు బ‌ల‌గాల‌ను ప్ర‌యోగిస్తోంది. ఆదివాసీ నిర్మూల‌న‌కు తెగ‌బ‌డి నెత్తుర్లు పారిస్తోంది. పాల‌కుల విధ్వంసాన్ని వ్య‌తిరేకిస్తే.. అడ‌వి మీదే కాదు.. న‌గ‌రాల్లోనూ తూటాల వ‌ర్షం కురుస్తుంది. అందుకే.. ఇంద్రావ‌తి నెత్తుటి త‌డి ఆర‌క‌ముందే... తుత్తుకూడిలో తూటాలు పేలాయి. అయినా.. స‌రే, అంతిమ విజ‌యం ప్ర‌జ‌ల‌దే అవుతుంది. త‌మ కాళ్ల కింది నేల‌ను కాపాడుకునేందుకు ప్రాణ‌త్యాగం చేస్తున్న ప్ర‌జ‌లెప్పుడూ ఓడిపోరు.
- క్రాంతి

Keywords : adivasi, dandakarnyam, nallamala, telangana, police, encounters
(2019-02-18 00:05:39)No. of visitors : 584

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.

మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

ఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్‌ ముట్టడి, పెరేడ్‌ గ్రౌండ్స్‌లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్‌ ఉద్యమాలు నిర్వహించారు.

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

ʹనీ బాంచెన్ దొరా కాల్మొక్తʹ

జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ఖిల్లాలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పాదాభివందనం చేస్తున్నానంటూ ...

మహాజనాద్భుత సాగరహారానికి నాలుగేళ్ళు

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపుత్రుల దేహాల సంరంభాన్ని అనుభవించవలసిన సందర్భం అది....

Search Engine

బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌
చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి
వీవీ, గాడ్లింగ్ ల‌పై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం
వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
stand against the threat of imminent arrest of Prof. Anand Teltumbde - Students, Faculty and Alumni of IIT Kharagpur
Health of imprisoned DU Professor G.N. Saibaba is seriously deteriorating
Drop the false charges against Prof. Anand Teltumbde Immediately: Trade Unions
ఆపరేషన్ సమాదాన్ కు నిరసనగా భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించిన మావోయిస్టులు...31న బంద్ కు పిలుపు
రిపబ్లిక్ డే ఉత్సవాలను బహిష్కరించిన ఈశాన్య రాష్ట్రాలు
పుణె కోర్టులో నాలుగోసారి కలలూ కన్నీళ్లూ
నల్గొండ‌లో... ఫిబ్రవరి 9,10 తేదీల్లో విరసం సాహిత్య పాఠశాల
COSTISA demands quashing of fabricated FIR against Prof. Anand Teltumbde!
దేశద్రోహం కేసు : JNU విద్యార్థి నేతలపై చార్జ్ షీట్ తిరస్కరించిన కోర్టు
Dragging Anand Teltumbde into ʹterroristʹ allegations and raiding his house is an attack on freedom of expression : Swami Agnivesh
మీ మద్దతు నాకిప్పుడు కావాలి - ఆనంద్‌ తెల్తుంబ్డే
Immediate and Complete Withdrawal of all Charges against Dr. Anand Teltumbde
ʹపాకిస్తాన్ జిందాబాద్ʹ అని అరిచింది ఏబీవీపీ విద్యార్థులే.. సంచలన వాస్తవాలు బయటపెట్టిన మాజీ నాయకులు
మనను ఆక్రమిస్తున్న ఈ వ్యాధిని ప్రతిఘటిద్దాం- అరుంధతీ రాయ్
A Statement by Umar Khalid and Anirban Bhattacharya in the context of the Chargesheet
more..


ఆదివాసుల