తూత్తుకుడి... గడ్చిరోలీ - వరవరరావు


తూత్తుకుడి... గడ్చిరోలీ - వరవరరావు

తూత్తుకుడి...

మాయంటావా !అంతా
మిథ్యంటావా ?
నా ముద్దుల వేదాంతి !
ఏమంటావు ?
మాయంటావు ? లోకం
మిథ్యంటావు ?

మర ఫిరంగి విషవాయువు
ఏమంటావు ? ఏం
ఏమంటావు ?

పాళీకాపు నుదుటి చెమట
కూలివాని గుండె చెరువు
బిచ్చగాని కడుపు కరువు
మాయంటావూ ?

తుపాకులు, భూకంపం
తిరుగుబాట్లు, సంగ్రామం
సంగ్రామం, సంగ్రామం
మాయంటావూ ? ఏం
ఏమంటావు ?

కాపర్ కాలుష్యం, క్యాన్సర్ విషపు కాటు కూడా అబద్దమేనా అని మనం తూత్తుకూడి తిరుగుబాటు అంత బలంగా అడిగితే తప్ప తాత్కాలిక ఉపశమనాలు లభించేట్లు లేవు. నియంగిరిలో మాయమైందనుకున్న వేదాంతం తూత్తికూడి సముద్రం నుంచి తలలు బయిటికి పెట్టి తన వేయిపడగల విషాన్ని చిమ్మింది. మరణశయ్యపై ఉన్న పెట్టుబడి తూత్తికూడి సముద్ర తీర పట్నంలో పదమూడు తిరుగుబాటు మృత శరీరాలను వారం రోజులు తన శవాగారంలో జాగారం చేయించి ʹగజం మిథ్య, పలాయనం మిథ్యʹ అని పారిపోతోంది. ఎక్కడో మన నేలమీదికే పారిపోతుంది సుమా. గోవా నుంచి, మహారాష్ట్ర నుంచి, పడమటి తీరం నుంచి దక్షిణ తీరానికి వచ్చిన మార్కెట్ మాయా సామ్రాజ్యవాద అంతంతో కానీ అంతం కాదు. పైగా ఇది అద్వైత మాయ వేదాంత బోర్డు తగిలించుకున్నది.
శంకరాచార్య కేరళ నుంచి అద్వైత సిద్ధాంతాన్ని చెప్పిన నాడే భౌతికవాదులు ʹగజం మిథ్య.. పలాయనం మిథ్యʹ అని వెక్కిరించారు.జీవుడు మిథ్య, జగత్తు మిథ్య అని శిష్యులకు ఆత్మ అఖండత్వాన్ని బోధిస్తున్న శంకరాచార్యుడు కేరళ అడవిలో ఎదురుగా వచ్చే ఏనుగుల గుంపును చూసి పారిపోయాడట. అది బ్రాహ్మణీయ భూస్వామ్య కాలపు మాట. ఏడో శతాబ్ధానికి ఈ వేదాంతం, ఈ మాయా వాదం కేరళ నుంచి కశ్మీర్ దాకా విస్తరించి ఇవ్వాళ సామ్రాజ్యవాద దళారీగా మార్కెట్ మాయాజాలానికి ఎంతగా దాసోహమై సేవ చేస్తున్నదో తూత్తుకుడి తాజా ఉదాహరణ.

అఖండమైన ఆత్మ ఒక్కటే సత్యమనే వాదనను రాజకీయాల్లో స్థాపించి గ్లోబల్ మార్కెట్కు భావజాల ఆమోదం పొందడానికే 1984లో లాల్ కృష్ణ అద్వానీ ఏకాత్మతా రథయాత్ర చేశాడు. జగత్తు మిథ్యా వాదానికి మన పాలకులు, పాలకులకు, పాలకులైన కంపెనీలకు లోకానికి తవ్విపోయడం, భూమి గర్భాన్ని చీల్చడం, విధ్వంసం తప్ప ప్రకృతిపై, శ్రమపై గౌరవం లేదు. మనిషి పై ప్రేమ సహా ఎన్ని రూపాల్లో ఈ జగత్తును అబద్దం చేయవచ్చునో. ఈ భూమి మీద అభాగ్య దేవుళ్ళైన శ్రమ దేవుళ్లను, విస్థాపితులను, నిర్వాసితులను చేయవచ్చునో అన్ని విధాల చేయవచ్చు. ఇంకా జీవుడు మిథ్య అయినప్పుడు ఒకరినేమొచ్చే పదమూడు మందిని, నలబై ఇద్దరినీ చంపవచ్చు. ʹనటిస్తున్నʹ శవాలను నడిరోడ్డు మీద ఈడ్చి పారేయవచ్చు. చచ్చిన గొడ్డును ఈడ్చుకపోయేవాడు ఈ వ్యవస్థలో ʹఅంటరానివాడుʹ అయితే.. చచ్చిన తర్వాత మనుషులను ఒక మానవధర్మంగా కాక.. అమానుషంగా ఒక పోలీసు విధిగా ఈడ్చుకపోయేది రాజ్యం.. వేదాంత తత్వం ఒంట బట్టిన రాజ్యం.

రాగి కాక విరాగి కాడు.. అనేది వెనుకటికొక భౌతిక వాద పరిశీలన. ఇప్పుడంతా రాగి వేదాంతమే. భూమి కింద ఎన్ని రకాల ఖనిజాలు ఉంటే.. భూమి మీద ఎన్ని తీర్ల కంపెనీ నిర్మాణాలు ఉంటే అన్ని తీర్ల వేదాంతాలు. తెలుసుకోవడం ఆగిపోయిన స్థితి వేదాంతం. చలనం, ఘర్షణల నుంచి మార్పు ఆగిపోయిన మారి బండ (మరణ సదృశ్య) స్థితి వేదాంతం. అది కాపర్ ఉత్పత్తి చేసే అనిల్ అగర్వాల్ల ఖజానాలు నింపవచ్చు కాని ప్రజలకు మాత్రం అది కాలుష్య వ్యవస్థ, క్యాన్సర్ వ్యవస్థ.

దేశంలోకెల్లా ఎక్కువ రాగి ఉత్పత్తి చేసే సంస్థ వేదాంత. బస్తర్ అడవుల్లో ప్రవేశిస్తుంటే వేదాంత క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కనిపించగానే లోపలెక్కడో వేదాంత మైనింగ్ పరిశ్రమ ఉండి ఉంటుంది అనిపించిందట అరుంధతీరాయ్ కి . దేశంలో పాలకవర్గాలు ఉన్నచోట ఎక్కడ వేదాంత లేదని..మరొక కంపెనీ లేదని...గడ్చిరోలీలో లాయిడ్స్ ఉన్నట్లు కాపర్ ఇండస్ట్రీ అనగానే చిలీ దేశం గుర్తుకు వచ్చింది. అమెరికన్ సామ్రాజ్యవాదానికి బహుళజాతి కంపనీల దోపిడికి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో చిలీలో 1973లో ప్రజాస్వామ్య, ప్రగతిశీల శక్తులన్నీ కలిసి దేశాధ్యక్ష పదవికి సాల్వడార్ అలెండీని నిలబెట్టాయి. అలెండీ చిలీ కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి . పాబ్లో నెరూడా ప్రాణ స్నేహితుడు. ఆయన అఖండ విజయం సాధించి దేశాధ్యక్షుడయ్యాడు. దేశంలోని వీదేశీ కంపనీలన్నింటినీ జాతీయం చేసాడు. అప్పుడు అమెరికా లోని రాగి తీగల బహుళజాతి కంపనీ మిలిట్రీ కుట్ర చేసి అలెండీ అధ్యక్ష భవనంపై బాంబు దాడి చేసి చంపి వేసింది. అప్పటికే క్యాన్సర్ తో బాధపడుతున్న నెరుడా ఇంటికి వైద్యులు కూడా వెళ్ళకూడదని కట్టడి చేసింది. వారం రోజులు తిరగకుండానే నెరుడా మరణించాడు. అప్పటికే మిలటరీ మారణకాండలో భాగంగా అద్భుత ప్రజాగాయకుడు విక్టర్ జారా బందీ అయి నెత్తురోడుతూ పాటలు పాడుతూనే బెల్లి లలిత వలె ఖండ ఖండాలుగా చంపబడ్డాడు. బహుళ జాతి కాపర్ పరిశ్రమ అటువంటి క్యాన్సర్. అటువంటి క్యాన్సర్ ను ఎంత అద్భుతమైన పార్లమెంటరీ ఐక్య సంఘటన వల్ల కూడా అంత చేయలేమనడానికి అలెండీ ప్రయోగం ఒక గుణపాఠం. వివాలా శాంటియాగో, వివాలా అలెండీ, వివాలా నెరూడా మనకూ ఉన్నాయి. క్రైస్తవ విద్యా సంస్థలను జాతీయం చేయబోయి కూలి పోయిన నంబూద్రి పాద్ ప్రభుత్వం (1959). దున్నేవారికే భూమి దాకా వెళ్ళనక్కర్లేదు. నియంగిరి కోందు ప్రజల తాత్కాలిక విజయం , తూత్తుకూడి పల్లెకారుల, ప్రజల తాత్కాలిక విజయం మనకు వేరొక ప్రజా ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపుతున్నాయి.

రాగి కంపెనీ మూతపడకుండా నా బిడ్డ అంత్యక్రియలు చేయనని ఒక తల్లి ప్రతిఙ చేసింది. పదమూడు కుటుంభాలు పట్టుబట్టాయి. ప్రజలు వాళ్ళకు అండగా ఉన్నారు. నీ పక్క గదిలో శవం కుళ్ళుతూ ఉంటే వచ్చే దుర్వాసన ఇంకెంత మాత్రం ప్రైవేటు వ్యవహారం కాదంటాడు సర్వేశ్వర్ దయాల్ సక్సేనా అనే హిందీ కవి.ఇది పట్టణం గనుక, సముద్ర తీరం గనుక , మైదాన ప్రాతం గనుక అన్ని రాజకీయ పార్టీలు కూడా రానున్న ఎన్నికల అవకాశవాదంతో వెనక నిల్చాయి. కనుక ఒక న్యాయమైన, మానవీయమైన ప్రజాస్వామిక డిమాండు వారంరోజుల్లో పరిష్కారం అయినట్టు కనిపిస్తున్నది. ( న్యాయ నిపుణులందరూ వేదాంత కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవాలని ఆశిస్తున్నారు, విశ్లేషిస్తున్నారు. )
తల్లి జయలలిత అనే తల అనుమానాస్పద మృతి వల్ల మొండెంగానే తమిళనాడుకు మోడీ షాల రెండు తలలపాము ప్రాక్సీగా నడుపుతున్న ఏఐడీఎంకే పదమూడు ప్రాణాలు పోయాకగానీ మగత నిద్ర వదిలింది. ʹసంఘవిద్రోహ శక్తుల్నిʹ అదుపు చేయడానికి సైన్యాన్ని పంపాలా అని బ్రాహ్మణీయ ఫాసిస్టు కేంద్రం అడిగింది కూడా.
వేదాంతతోపాటు జిందాల్, ఎస్సార్, టాటా, మిట్టల్, లాయిడ్స్ వంటి అనేకానేక బహుళ జాతి కంపనీలను బడా కంపనీలను నిలదీస్తూ ముప్పై ఎనిమిదేళ్ళుగా దండకారణ్య, బీహార్, ఝార్కండ్, జంగల్ మహల్, ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ, ఆంధ్రా ఒరిస్సాసరిహద్దు, పడ్మటి కనుమల్లో ట్రై జంక్షన్ లలో పోరాడుతూ అమరులవుతున్న ఆదివాసీలు, వారి మధ్య అండగా నిల్చిన మావోయిస్టులు మనకు పట్టరా ? వారెవరికొరకు పోరాడుతున్నారు ? ఏ శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు ?
తూత్తుకూడికి సరిగ్గా నెలరోజుల ముందు ఏప్రెల్ 22న మొదలై 27 దాకా సీ60, సీఆర్పీఎఫ్ మారణకాండలో గడ్చిరోలీ లో అమరులైన నలబై ఇద్దరు ఇరవై ఏళ్ళుగా సూరజ్ గడ్ ఖనిజాలను దోచుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకున్న లాయిడ్స్ కంపెనీకి వ్యతిరేకంగా..జల్ , జంగల్, జమీన్, ఇజ్జత్, స్వాబలంబన అధికారాలకోసం పోరాడి అమరులయ్యారు. ఆసిఫాలతోపాటు హిడ్మాలను కూడా స్మరించుకుందాం అని నందినీ సుందర్ అడిగినట్టు తూత్తుకూడితోపాటు గడ్చిరోలీలను స్మరించుకుందాం.
- వరవరరావు

Keywords : thoothukudi, tamil nadu, gadchiroli, maharashtra, vedantha, police, firing
(2018-12-11 04:22:51)



No. of visitors : 1701

Suggested Posts


తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

మందుపాతరలతో దాడి చేశాం అని ఒప్పుకున్నారు కదా..ఇది యుద్దం అని ప్రకటించండి - పాలకుల‌కు వరవరరావు సవాల్

మందుపాతరలు ఉపయోగించాం అని పోలీసు అధికారులే చెప్పారు కాబట్టియుద్దం చేస్తున్నామని ప్రకటించండి. ఇది యుద్దక్షేత్రమని మీరు ఒప్పుకోండి మరో దేశం మీద యుద్దంజరిగితే ఏం జరగాలో అదే ఇక్కడా జరగాలి. రెడ్ క్రాస్ రావాలల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ ఆమ్నెస్టీ రావాల్సి ఉంటుంది. జెనీవా సూత్రాలను అంగీకరించాల్సి ఉంటుంది.

కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?

విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు...

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు

చారు మజుందార్‌ కన్న ముందే 1970 జూలై 28ననే మరొక గొప్ప విప్లవకారుడు కామ్రేడ్‌ భుజాసింగ్‌ పంజాబ్‌లో అమరుడయ్యాడు. అది పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్‌ హత్య...102 సంవత్సరాల క్రితం సాయుధ పోరాటం చేపట్టిన గదర్‌ పార్టీ మొదలు నక్సల్బరీ వసంత మేఘగర్జన దాకా ఆయన సాయుధ విప్లవంతో కొనసాగిన కమ్యూనిస్టు.....

Search Engine

కాశ్మీర్ ఉజ్వలమైన చరిత్ర, పోరాట గాథ...మాజీ కేంద్ర మంత్రి సఫుద్దీన్ సోజ్ కాశ్మీర్ పై రాసిన పుస్తకం గురించి..
మత రాజకీయాల్లో యూపీ సీఎం యోగీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ..
సర్జికల్ స్ట్రైక్స్ రాజకీయం... ప్రమాదకరమన్న ఆర్మీ అధికారి
ఏవోబీలో పీఎల్జీఏ వారోత్సవాలు..ఆడియో రిలీజ్ చేసిన మావోయిస్టులు
బీజేపీకి రాజీనామా చేసిన దళిత మహిళా ఎంపీ - సమాజంలో బీజేపీ విభజనలు సృష్టిస్తోందని ఆరోపణ‌
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 3
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్ - 2
ఎన్నికలపై మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఇంటర్వ్యూ పార్ట్-1
దళితులపై తప్పుడు కేసులు బనాయించి చితకబాదుతుంటే నాకు గర్వంగా ఉంటుంది.. ఒక ఐపీఎస్ వ్యాఖ్యలు
ʹఅఖ్లక్ హత్యపై దర్యాప్తు చేశాడనే ఇన్‌స్పెక్టర్ సుబోధ్‌ను హిందుత్వవాదులు అంతం చేశారుʹ
Isolate the fish from the water: a genocidal practice in India - Adolfo Naya
18 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
కేసీఆర్ ఓ నియంత : మావోయిస్టు జ‌గ‌న్‌
భీమాకోరేగావ్ విప్ల‌వ, ద‌ళిత శ‌క్తుల ఐక్య‌త‌కు ప్ర‌తీక : పాణి
CPI (Maoist) appoints military strategist Basavraju as its next general secretary
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బసవరాజు...అనారోగ్య కారణాలతో స్వచ్చందంగా విరమించుకున్న‌ గణపతి
పుణెలో రెండు రోజులు
కిషన్ జీ... పీడితుల యుద్ద గీతి !
చీకటి గదిలో ఒంటరిగా.. ఊపిరి పీల్చుకోలేని స్థితిలో వరవరరావు
గృహ నిర్బంధం అంటే ? - వరవరరావు
పోరాడి తమ హక్కులు సాధించుకున్న గిరిజన రైతులు.. ముంబైలో మహాపాదయాత్ర
ప్రజా గొంతుకల అక్రమ అరెస్టులపై పోరాడుదాం
నేల చెర విడిపించే అక్షరాలు - అశోక్ కుంబము
రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే
నా ప్రమాదకర వ్యక్తిత్వం ప్రభావమంతా కవిత్వ రహస్యమే
more..


తూత్తుకుడి...