విప్లవ రచయిత వరవరరావుతో జర్నలిస్టు స్వాతి సేన్ గుప్తా ఇంటర్వ్యూ


విప్లవ రచయిత వరవరరావుతో జర్నలిస్టు స్వాతి సేన్ గుప్తా ఇంటర్వ్యూ

విప్లవ

(ది బెంగాల్ స్టోరీ వెబ్ సైట్ కోసం జర్నలిస్టు స్వాతి సేన్ గుప్తా విప్లవ రచయిత వరవరరావుతో చేసిన ఇంటర్వ్యూ... తెలుగు ట్రాన్స్ లేట్ చేసింది సీహెచ్ సుబ్బరాజు)


స్వాతి సేన్ గుప్తా: తూత్తుకుడి లో గత వారం స్టెరిలైట్ వ్యతిరేక నిరసనకారుల పై పోలీసులు సూటిగా తుపాకీ గురిపెట్టిన గగుర్పాటు కల్గించే ఛాయాచిత్రం చూశాం. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఇతర మార్గాలు ఉన్నప్పుడు అమాయక ప్రజలపై పోలీసులు కాల్పులు జరపాలని ఎందుకు అనుకుంటున్నారు?

వరవరరావు: అది మాత్రమే కాదు, ఒక పోలీసు అధికారి కనీసం ఒక జీవితాన్ని తీసుకోవాలని అంటే ఒక్కడి ని అన్నా చంపాలని ఆదేశించే ఆయన గొంతు కూడా వినబడింది. అలాగే ఒక చనిపోయిన మృతదేహాన్నిలాగుతున్న ఒక పోలీసు ఆ వ్యక్తి నిజానికి చనిపోలేదని చనిపోయినట్లు నటిస్తున్నాడని అనడం, గాయపడి పడిపోయిన జంతువు ను ఈడ్చుకుపోయినట్టు పోలీసు ఒక మనిషి పార్ధివ దేహాన్ని లాగడం కూడా చూశాం. వాస్తవానికి సెక్షన్ 144 ను ఉల్లంఘించినందుకు నేరుగా నుదిటిపై కాల్చారు అతను వెంటనే చనిపోయాడు. ఇది జలియన్వాలాబాగ్ లో డయ్యర్ తలుపులు మూసివేసి ప్రజలను విచక్షణారహితంగా వూచకోత కోసి చంపడం వంటిది. ఇది ఊచకోత ఉద్దేశపూర్వక మరియు కావాలని చేసింది

స్వాతి సేన్ గుప్తా: నిరసనకారులపై జరిపిన ఈ పోలీసులు కాల్పులు ఇతర పోలీసులు కాల్పుల ఘటనలను గుర్తుకు తెచ్చాయా?

వరవరరావు: తూత్తుకుడి వద్ద పోలీసు కాల్పుల సంఘటన మార్చి 14 న (కార్ల్ మార్క్స్ వర్ధంతి ) నందిగ్రాం లో నిరసనకారుల పై జరిపిన కాల్పుల లో 14 మంది చనిపోయిన ఘటనను గుర్తుచేసింది, అలాగే 2006 లో కళింగ నగర్ లో 11 మందిని చంపారు.

తూత్తుకుడి (టుటికోరిన్) లో మృత దేహాన్ని లాగిన ఆ దుర్మార్గం 1997 లో ముంబైలోని ఘాట్కోపర్లో రామబాయి నగర్లో 11 దళిత నిరసనకారులు కాల్చి చంపి వారి మృతదేహాలను చనిపోయిన జంతువుల మృతదేహాలలా పోలీసు వాన్ లోకి లాగి విసిరేసిన దారుణాన్ని నాకు గుర్తు చేసింది,

అప్పట్లో ఇండోనేషియన్ కంపెనీ అయిన సలీమ్ గ్రూప్ కోసం నందిగ్రాంలో, టాటా కోసం కళింగనగర్లో , ఇప్పుడు ఇది అత్యంత అపఖ్యాతియైనపాలైన బహుళ జాతి సంస్థ నియమగిరి లోని వేదాంత కోసం జరిగింది . మావోయిస్టుల నుండి వచ్చిన ఆహ్వానంపై అరుంధతి రాయ్, దండకారణ్యంలో ప్రవేశించేటప్పుడు బస్తర్ ప్రవేశ ప్రాంతం లో వేదాంత క్యాన్సర్ హాస్పిటల్ నెలకొల్పటం చూసి దండకారణ్యంలో వేదాంత భారీ మైనింగ్ కార్యకలాపాలు చేస్తుండాలి అని ఊహించారు . పెద్ద సంస్థల స్వార్థ ప్రయోజనాలే ఆదివాసీలు, మత్స్యకారులు, మహిళలు, దళితులు, మైనారిటీల పై జరుగుతున్న ఈ మారణకాండకు కారణం.

స్వాతి సేన్ గుప్తా: ఈ విధమైన హింసాత్మక దాదులతో అసమ్మతిని అణిచివేయడం వల్ల సామాన్య జనం ఆయుధాలను చేపట్టేందుకు దారితీస్తుందా ?

వరవరరావు: ప్రభుత్వాలు, పాలక వర్గాలు, అగ్ర కులాల పెత్తందారులు , మెజారిటీ మత దురహంకారులు శ్రామికుల పేద ప్రజల హక్కులపై దాడి చేసినప్పుడు ప్రజలు నిరసన వ్యక్తం చేస్తారు.

అప్రజాస్వామ్య విధానాలపై సత్యాగ్రహం, సహాయ నిరాకారణ , శాసనోల్లంగణ వంటివి గాంధీ నిరసన రూపాలుగా దాదాపు వంద సంవత్సరాలుగా వుంటూ వచ్చాయి. సమ్మె, ర్యాలీ, ధర్నా, కార్మికుల ఘెరావ్ వంటి నిరసనలు రూపాలు నావిక తిరుగుబాటు, చౌరా-చౌరి ఉద్యమం మొదలైనప్పటినుంచి వుంటున్నాయి. భారతీయ రాజకీయ చరిత్రలో స్వాతంత్ర్యం కోసం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆయుధాలను చేపట్టడం, గదర్ పార్టీ స్టాపించిన నాటినుంచి అంటే సుమారు 100 ఏళ్లకు పైగా మన దేశం లో సాయుధ విప్లవ సంప్రదాయం ఉంది. శ్రీ కృష్ణుడు భగవద్గీతలో హింసాకాండను ప్రబోధిస్తాడు, సిక్కు క్వాలంలో ఐదు రకాల ఆత్మరక్షణ ఆయుధాలు ధరించటం వారి ధార్మిక సాంప్రదాయం.

అందువల్ల అహింస అనేది భారతీయ లేదా హిందూ సంస్కృతి అని చెప్పటం ఒక పెద్ద అబద్దం. హిందుత్వ మతం దొంతరల కుల వ్యవస్థ హింస పై నమ్మకం వున్న మతం. ప్రజలు వేట, వ్యవసాయ ఉత్పత్తి, స్వీయ రక్షణ కోసం బాణాలు, ధనస్సు , కత్తులు, కొడవలి వ్యవసాయ పరికరాలుగా ఉపయోగిస్తారు . 1857 లో జరిగిన భారత ప్రదమ స్వాతంత్ర్య సంగ్రామం సిపాయిల తిరుగుబాటు.

వర్గ పోరాటం కేవలం కార్ల్ మార్క్స్ ఏంగెల్స్ యొక్క మేధో సృష్టి కాదు, ఇది వర్గ సమాజం ప్రారంభం నుండి మానవజాతి చరిత్ర నుండి వారిరువురు సేకరించిన చారిత్రక, భౌతికవాద, గతితార్కిక ఆవిష్కరణ. శ్రామిక ప్రజలకు సాయుధ పోరాటం అవసరం.

సామాన్యులచే ఆయుధాలను చేపట్టడం అర్ధ భూస్వామ్య, అర్ధ వలస బ్యూరోక్రటిక్ వ్యవస్థను పడగొట్టడం కోసం చేసే సాయుధ పోరాటానికి పూర్తిగా భిన్నమైనది.

1946-51లో తెలంగాణా లో లేదా హైదరాబాద్ రాచరిక వ్యవస్థ లో 3 వేల గ్రామాలలో 10 లక్షల ఎకరాల భూమిని నిరుపేద వ్యవసాయ కార్మికులు రైతులు ఆక్రమించారు . 1967 లో బెంగాల్ లో నక్సల్బరి పోరాటం లో, నూతన ప్రజాస్వామ్య విప్లవ మార్గం ఆవిర్భవించింది ప్రపంచంలోని సాయుధ విప్లవం లో ఇది ఓ సుదీర్ఘ చరిత్ర , కొన్ని అపజయాలున్నప్పటికి ఇది 50 సంవత్సరాల పాటు మధ్య తూర్పు భారత్ దేశం లో ని దండకారణ్యం, బీహార్, జార్ఖండ్, ఒడిషా,ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు, మరియు పశ్చిమ కనుమలలో కొనసాగుతూనే ఉంది.

స్వాతి సేన్ గుప్తా: సాయుధ చర్యకు సాయుధ ప్రతిచర్య సమస్యను పరిష్కరిస్తుందా? రాష్ట్ర హింసను నిలువరించడానికి అహింసా పద్ధతులు లేవా ? ఇది స్టెర్లైట్ నిరసన కారులపై జరిగిన దారుణ మారణ కాండ సందర్భంలో అడగడానికి నాకే అన్యాయంగా వుంది , కానీ నేను మామూలుగా అడుగుతున్నాను.

వరవరరావు: సామాన్య ప్రజలు వ్యక్తిగత స్థాయిలో లేదా సమిష్టి ప్రతీకారం తీర్చుకోవడానికి తూత్తుకుడి లో ఆయుధాలను చేపట్టవచ్చు.

కానీ నక్సల్బరి పంధాలో నూతన ప్రజాస్వామ్య విప్లవం కోసం సిపిఐ (మావోయిస్టు) నాయకత్వంలో సాయుధ విప్లవం , దండకారణ్యంలో "జనతాన సర్కార్" ఏర్పాటు చేసింది. సరండ లో లేదా జార్ఖండ్ స్టానిక విప్లవ మండలాలు, ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రత్యేక గెరిల్లా జోన్, జంగల్ మహల్ , పశ్చిమ కనుమలు, ట్రై జంక్షన్, మరియు 1996-1999 సమయంలో తెలంగాణలో ఇటువంటి ప్రయత్నాలు జరిగాయి.

దండకారణ్యం లో ప్రత్యేకించి దక్షిణ బస్టర్ లో సువిశాల ప్రాంతం లో జనతన సర్కార్ ఏర్పాటయ్యింది. ఇక్కడ ఆదివాసీలు, దళితులు మరియు అణచివేత గురైన నిమ్న వర్గాలు, కులాలు తమ భూములను ఆక్రమించి, ప్రత్యామ్నాయ అభివృద్ధి కార్యక్రమాలను దిగువ క్షేత్ర స్థాయి నుండి అమలు చేస్తున్నారు. వారు పార్టీ మరియు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) మద్దతుతో విస్తృతమైన ఫ్రంట్ ను ఏర్పాటు చేశారు, అలాగే వారికి స్వంత ప్రజా సైన్యం వుంది.

స్వాతి సేన్ గుప్తా: సాల్వా జుదుం (2004-2009), గ్రీన్ హంట్ (2009 నుండి) మరియు 2014 నుండి అన్ని-యుద్ధం తరువాత, మోడీ-రాజ్నాథ్-రమణ్ సింగ్ ప్రభుత్వం 2022 నాటికి మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తి గా అణిచి వేయడానికి సమాధాన్ యుద్ధం ప్రకటించింది కదా?

వరవరరావు: ప్రభుత్వ సంస్థలతో మిలఖత్ అయ్యి ప్రవేశించటానికి ప్రయత్నించిన కార్పొరేట్ పెట్టుబడులను అడ్డగించటం తో ఇళ్ళు దహనం చేయటం, గ్రామాలపై దాడులు చేయడం, మానభంగాలు చేయడం ఆదివాసీలను హతమార్చడం ద్వారా, కొందరు ఆదివాసీలు ఇళ్ళు, గ్రామాలు వదిలి వలస పోతున్నారు. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధిని మావోయిస్టులు అడ్డుకుంటున్నారని అవినీతిపరమైన మీడియా దుష్ప్రచారం చేస్తోంది.

నందిగ్రాం లో సలీమ్, సింగూర్ లోని టాటాస్, జంగాల్హాహల్లోని జిందాల్ ఆదివాసీ చట్టాలను ఉల్లంఘించారు. ఎవరు ఈ వైఖరిని అంగీకరించినా కాదన్నా, జంగల్గల్ మహల్లోని 5,000 ఎకరాల ఆదివాసీల భూమి ని జిందాల్ విధ్వంసం నుండి ఆపింది మావోయిస్టులు మాత్రమే.

అందువల్ల, ప్రజలు రాజ్య హింసకు వ్యతిరేకంగా నిరసన ప్రతిఘటన కోసం మాత్రమే కాకుండా, రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకోవడానికి కూడా ఆయుధాలను చేపడుతున్నారు. 50 సంవత్సరాల క్రితమే నక్సల్బరి పంధా పార్లమెంటరీ మార్గాన్ని విడనాడే విప్లవ పథం చూపించింది.

స్వాతి సేన్ గుప్తా: రాను రాను రాజ్యం అసహనం మరింత గా పెరుగుతోందా ?

వరవరరావు: మార్క్సిస్ట్ అవగాహనలో, రాజ్యం అనేది ఎల్లప్పుడూ దోపిడీ పాలక వర్గం యొక్క అణిచివేత సాధనం. రష్యా, తూర్పు ఐరోపా సామ్యవాదం పతనం తరువాత అమెరికా సంయుక్త రాష్ట్రాల తో విలీనం అయ్యి ప్రపంచ సామ్రాజ్య వాద శక్తిగా ఏక దృవ ప్రపంచంగా మారింది. పారదర్శకంగా ఉండటానికి ప్రయత్నిస్తు న్నట్టు అగుపించటం కోసం తనను తాను సంక్షేమ రాజ్యం కాదని బహిరంగంగా చెప్తోంది. ఆహారం, బట్ట, ఇల్లు ( రోటీ, కపడా, మకాన్), విద్య, ఆరోగ్యం, త్రాగు నీరు ఇప్పుడు రాజ్య బాధ్యత కాదు. దీనికి విరుద్దంగా ప్రతి దేశం ప్రపంచ బ్యాంకు కు జవాబుదారీగా మారింది. ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమం ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ మరియు సరళీకరణ - కార్పోరెటైజేషన్ అభివృద్ధి పట్లే దాని ఆసక్తి . రాజ్యం ఇప్పుడు కేవలం ఒక సౌల్భభ్యవంతం చేసే మధ్యవర్తి పాత్రను మాత్రమే కలిగి ఉంది.

బహుళ‌ జాతి సంస్థలతో సంతకం చేసిన అవగాహనా ఒప్పందాలను లను పూర్తి చేయడానికి రాజ్యం అసహనంగా మారింది, ఇది సహజం కూడా.

లాయిడ్స్ కు ప్రయోజనం చేకూర్చటం కోసం గడ్చిరోలిలో ఇటీవల జరిగిన 42 మంది వూచకోత మరియు తూత్తుకుడిలో పోలీసు కాల్పులను ఈ వెలుగులో చూదాలి. దళితులు మరియు ముస్లింలపై దాడులు కూడా అందుకే.

స్వాతి సేన్ గుప్తా: నిరసనలు, ప్రతిఘటనలు జరుగుతున్నాయి, కార్పొరేట్ నిధులతో, అపారమైన రాజ్య అధికార బలం తో అణిచి వేస్తున్నాయి. నేటి యువత ను నక్సలిజానికి ప్రేరణ నివ్వటం కష్టమా ?

వరవరరావు: మీ ప్రశ్నే నా సమాధానం కూడా . ఏ రకమైన అణచివేత లేదా సంస్కరణ సమస్యను పరిష్కరించదు. వాస్తవ సమస్య ఏమిటంటే, "అభివృద్ధి విధానం" అని పిలవబడే ఈ ప్రస్తుత విధానం కేవలం అధ్వాన్నమైన నాశన విధానం. ఇది ప్రజలను తమ మూలలనుంచి వెల్లగొట్టే వలస బాట పట్టే లేదా అణగదొక్కే వినాశకరమైన విధానంగా ఉంది. పేదలపట్ల సంఘీభావం ఉన్న యువత నక్సలిజాన్ని ఎన్నుకోవలసివుంటుంది

స్వాతి సేన్ గుప్తా: అనేక మంది నక్సల్స్ లొంగిపోతున్నాయి, వారు ఉద్యోగాలు ప్రశాంతమైన జీవితంతో సంతోషిస్తున్నారు. నక్సలిజం అనేది ఒక అభివృద్ధి సమస్య అని కేంద్రం రాష్ట్రాలు చెబుతున్నాయి, అవి ఆ విధ్న మార్గం లోనే పనిచేస్తున్నాయి. వారు ఈ సమస్యను పరిష్కరించగలరా?

వరవరరావు: కేసులు లేకుండా లేదా కేసుల సెక్షన్ లు లేకుండా లొంగిపోయిన వారు సాధారణ జీవితంలో సంతోషంగా ఉంటారు. కానీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎదుట లొంగిపోయి, పెళ్లి చేసుకున్న మహిళ కిషన్ జీ ని అరెస్టు చేసి, చంపే అవకాశం కల్పించందని మీకు తెలుసు. ఇక్కడ చాలా మందినయీమ్ లాంటి ఉదాహరణలు ఉన్నాయి. జమ్ము-కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో, జార్ఖండ్, ఒడిషా, డి.కె.లలో ఇదే ధోరణి. . రాజ్యామ్ ఎవరినీ శాంతియుతంగా జీవించడానికి అనుమతించదు.

స్వాతి సేన్ గుప్తా: దేశవ్యాప్తంగా, వామపక్ష పార్టీలు బలహీనమయ్యాయి, బిజెపి మరింత శక్తివంతమైనదిగా ఎదిగింది, ప్రపంచవ్యాప్తంగా మతశక్తుల పెరుగుదల, అస్తిత్వ రాజకీయాలు ప్రతిచోటా రాజకీయ ధోరణులు మారుతున్నాయి. ఈ నేపధ్యంలో మీరు "ప్రజా ఉద్యమం", వామపక్ష సిద్ధాంతం, మావోయిస్టులు వాణి ని ఎలా విస్తృతం చేస్తారు? ఏవిధంగా మార్పును తెస్తారు?

వరవరరావు: ఈ వామపక్ష పార్టీలు గా పిలువబడే ఈ పార్టీలు వర్గ పోరాటాన్ని విడిచిపెట్టాయి. కాబట్టి, ఉత్పత్తి మరియు వర్గ పోరాటంలో పాల్గొనేవర్గాలను అవి ఓటర్లుగా మాత్రమే చూస్తున్నాయి. వారు ఎన్నికైనట్లయితే, మనం గతం లో బెంగాల్ మరియు కేరళలో చూసినట్లుగా, అదే అభివృద్ధి విధానాన్ని అమలు చేస్తున్నారు.వారు మార్పును తీసుకురావాలనుకుంటే , వారు ప్రజాస్వామ్య విప్లవాత్మక పంధాతో ఫ్యూడల్ వ్యతిరేక సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలకు కట్టుబడి ఉండాలి.

స్వాతి సేన్ గుప్తా: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంధా లో చేరుతుందా ? అది ప్రజలకు మరింత "ఆమోదయోగ్యమైన" నమూనా అవుతుందా ? (ఇక్కడ నేను అణచివేతకు గురయ్యే పేదలే కాకుండా , నక్సలైట్ సిద్ధాంతంతో అభిమానమున్నా రాజ్యం పై సాయుధ పోరాటానికి అనుకూలంగా లేని వారి గురించి మాట్లాడుతునాను).

వరవరరావు: నేను అలా భావించడం లేదు. సిపిఐ మావోయిస్ట్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పంధా లో కలిసినట్లైతే , అది నూతన ప్రజాస్వామ్య విప్లవం సాధించడానికి సాయుధ పోరాటాలతో వర్గ పోరాటంలో విప్లవ పార్టీగా ఉండదు. నేటి సిపిఐ మావోయిస్టుల కర్తవ్యం సామ్రాజ్యవాదం, ఫాసిజం మరియు బ్రాహ్మణ హిందూత్వ ఫాసిజం కు వ్యతిరేకంగా పోరాటం - అది అన్ని సామ్రాజ్యవాద వ్యతిరేక మరియు భూస్వామ్య వ్యతిరేక శక్తుల సమైక్య వాణి, ధీర్ఘ కాల సాయుధ విప్లవం యొక్క విస్తృత ప్రజాస్వామ్య రూపం.

(source:https://thebengalstory.com/english/thoothukudi-firing-reminds-me-of-nandigram-kalinganagar-vested-interest-of-big-companies-is-causing-these-killings-maoist-ideologue-varavara-rao/)

Keywords : maoists, varavararao, thoottukudi, tamil nadu, chattisgarh, vedantha
(2018-08-13 04:52:11)No. of visitors : 1075

Suggested Posts


తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

మందుపాతరలతో దాడి చేశాం అని ఒప్పుకున్నారు కదా..ఇది యుద్దం అని ప్రకటించండి - పాలకుల‌కు వరవరరావు సవాల్

మందుపాతరలు ఉపయోగించాం అని పోలీసు అధికారులే చెప్పారు కాబట్టియుద్దం చేస్తున్నామని ప్రకటించండి. ఇది యుద్దక్షేత్రమని మీరు ఒప్పుకోండి మరో దేశం మీద యుద్దంజరిగితే ఏం జరగాలో అదే ఇక్కడా జరగాలి. రెడ్ క్రాస్ రావాలల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ ఆమ్నెస్టీ రావాల్సి ఉంటుంది. జెనీవా సూత్రాలను అంగీకరించాల్సి ఉంటుంది.

కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?

విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు...

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

తూత్తుకుడి... గడ్చిరోలీ - వరవరరావు

రాగి కంపెనీ మూతపడకుండా నా బిడ్డ అంత్యక్రియలు చేయనని ఒక తల్లి ప్రతిఙ చేసింది. పదమూడు కుటుంభాలు పట్టుబట్టాయి. ప్రజలు వాళ్ళకు అండగా ఉన్నారు. నీ పక్క గదిలో శవం కుళ్ళుతూ ఉంటే వచ్చే దుర్వాసన ఇంకెంత మాత్రం ప్రైవేటు వ్యవహారం కాదంటాడు సర్వేశ్వర్ దయాల్ సక్సేనా అనే హిందీ కవి.

కూతురుకు... జి.ఎన్‌.సాయిబాబా జైలు లేఖ

ప్రియమైన మంజీర మనకిప్పుడు మరింత స్వేచ్ఛ లభించింది ఆ రోజు రోహిత్‌ వేముల తనకు తాను ఉరి వేసుకొని ʹనేను నా గుర్తింపుకు కుదించబడకూడదʹని ప్రకటించిన నాడు...

యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు

చారు మజుందార్‌ కన్న ముందే 1970 జూలై 28ననే మరొక గొప్ప విప్లవకారుడు కామ్రేడ్‌ భుజాసింగ్‌ పంజాబ్‌లో అమరుడయ్యాడు. అది పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్‌ హత్య...102 సంవత్సరాల క్రితం సాయుధ పోరాటం చేపట్టిన గదర్‌ పార్టీ మొదలు నక్సల్బరీ వసంత మేఘగర్జన దాకా ఆయన సాయుధ విప్లవంతో కొనసాగిన కమ్యూనిస్టు.....

Search Engine

జేఎన్యూ విద్యార్థి ఉమర్ ఖలీద్ పై ఢిల్లీ లోహత్యా యత్నం...ఇది సంఘ్ పరివార్ పనేనన్న ప్రజా సంఘాలు
ఓ అమ్మాయికి రక్షణగా నిల్చినందుకు దళిత యువకుడిని కొట్టి చంపిన ఉగ్రకుల మూక‌ !
IIT Bombay Students Question Decision to Invite Modi to Convocation Ceremony
అగ్రకులోన్మాదం:దళితుడిని పెళ్ళి చేసుకున్నందుకు కూతురును హత్య చేసిన తండ్రి!
అది ఎన్ కౌంట‌ర్ కాదు, మావాళ్ల‌ను వెంటాడి చంపేశారు‍: బోరుమ‌న్న ఆదివాసీలు
మరణశిక్ష - రాజ్యాంగమే ఆమోదించినపుడు రాజ్యం ఊరుకుంటుందా? - వరవరరావు
రాపూర్ దళితులపై దుర్మార్గమైన దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి - విరసం
ʹఅవి ఎదురుకాల్పులు కాదు.. ఆదివాసీల హత్యలుʹ
మోడీ రాజ్యం: మోసాన్ని బహిర్గతం చేసినందుకు ఉద్యోగాలు పోగొట్టుకున్న‌జర్నలిస్టులు !
people organise rally in national capital in protest against the state high handedness on rights activists
Martyrs Week: Maoists organise Huge meeting in Malkangiri
తెలంగాణొస్తే ఏమొచ్చింది ? - ‍ ఎన్.వేణు గోపాల్
అమరుల సంస్మరణ సభను జరుపుకున్న వేలాది మంది ఆదివాసులు
Historic Eight Documents of Charu Majumdar (8th Document)
Historic Eight Documents of Charu Majumdar (7th Document)
Historic Eight Documents of Charu Majumdar (6th Document)
Historic Eight Documents of Charu Majumdar (5th Document)
Historic Eight Documents of Charu Majumdar (4thDocument)
Historic Eight Documents of Charu Majumdar (3rd Document)
Historic Eight Documents of Charu Majumdar(2nd Document)
Historic Eight Documents of Charu Majumdar (1st Document)
చేపలమ్ముకుంటూ చదువుకోవడమే నేరమయ్యింది !
ఎర్ర బారిన మన్యం... ర్యాలీలు, సభలతో అమరులకు నివాళులు అర్పించిన జనం
రేపటి నుండి అమరుల సంస్మరణ వారోత్సవాలు.. పల్లె పల్లెనా మోహరించిన పోలీసు బలగాలు
ఎక్కువమంది పిల్లలను కనాలన్న హిట్లర్ వారసుల పిలుపు ఎవరిపై దాడుల కోసం?
more..


విప్లవ