కశ్మీర్‌లో ఘోరం.. పౌరులపై దూసుకెళ్లిన సీఆర్పీఎఫ్ వాహనం.. ముగ్గురు మృతి


కశ్మీర్‌లో ఘోరం.. పౌరులపై దూసుకెళ్లిన సీఆర్పీఎఫ్ వాహనం.. ముగ్గురు మృతి

కశ్మీర్‌లో

కశ్మీర్‌లో మరో దుర్ఘటన చోటు చేసుకుంది. రంజాన్ మాసంలోని శుక్రవారం ప్రార్థనల కోసం శ్రీనగర్‌లోని ఒక ప్రాంతం రోడ్డుపై ఉన్న పౌరులపై ఒక సీఆర్పీఎఫ్ వాహనం దూసుకొని పోయింది. సీఆర్పీఎఫ్ డ్రైవర్ విచక్షణా రహితంగా వాహనం నడిపి పౌరులను తొక్కించడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. దీంతో కోపోద్రిక్తులైన ప్రజలు సీఆర్‌పీఎఫ్ వాహనాన్ని ధ్వంసం చేశారు. అసలు ఏనాడూ తమ ప్రాంతానికి రాని వాహనం.. సరిగ్గా శుక్రవారం ప్రార్థనల సమయంలోనే ఎందుకు వచ్చిందో తమకు అర్థం కావడం లేదని స్థానికులు చెబుతున్నారు.

ఘోరం జరిగిందిలా..
సాధారణంగా ప్రతీ శుక్రవారం ఈ ప్రాంతంలో ప్రార్థనలు జరుగుతుంటాయి. అయితే ఇది రంజాన్ మాసం కావడంతో ఎక్కువ సంఖ్యలో ముస్లింలు ప్రార్థనల నిమిత్తం రోడ్లపై చేరారు. సరిగ్గా అదే సమయంలో ఒక ఉన్నతాధికారిని ఇంటి వద్ద దిగబెట్టి వస్తున్న సీఆర్‌పీఎఫ్ జిప్సీ వాహనం అంత్యంత వేగంగా వచ్చి పౌరులపైకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు వ్యక్తులు వాహనం కింద పడి అక్కడికక్కడే చనిపోగా.. మరో వ్యక్తి ఆసుపత్రిలో మరణించాడు. ఈ హఠాత్పరిమాణంతో స్థానికులు వాహనాన్ని వెంబడించి ధ్వంసం చేశారు. అయితే వాహన డ్రైవర్ మాత్రం అక్కడి నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై పలు రాజకీయ పక్షాలు మండిపడ్డాయి. ఎన్సీపీ నేత ఒమర్ అబ్ధుల్లా మాట్లాడుతూ.. రంజాన్ మాసంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు తావు ఇవ్వరాదనే కాల్పుల విరమణ ప్రకటించారు. కాని కాల్పుల విరమణ ప్రకటించి వాహనాలతో మనుషులను చంపేస్తారా అని ప్రశ్నించారు. అయితే త్వరలో అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుండటంతో ఈ ఘటన దానిపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

Keywords : కశ్మీర్, సీఆర్పీఎఫ్, వాహనం, ముగ్గురు మృతి, kashmir, crpf, vehicle, run over,
(2018-06-24 04:06:51)



No. of visitors : 529

Suggested Posts


0 results

Search Engine

నయీ పీష్వాయీ నహీ చలేగీ - వరవరరావు
ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 22 యేండ్లు !
అన్యాయాన్ని ప్రశ్నించాడని.. దళితుడిని పెట్రోల్ పోసి తగులబెట్టారు..!
declaration by the ʹStruggle Associationʹ, an underground Maoist organization in China
కోలుకొండ దళితుల భూ పోరాటానికి విరసం సంఘీభావం
Members of European Parliament, condemn the presence of Sushma Swaraj on Yoga Day
Dalits In Haryana Allege Social Boycott, Threaten To Convert To Buddhism
ఆర్ఎస్ఎస్ ఎన్నికల వ్యూహంలో కాశ్మీర్ సమిద కానున్నదా?
ముస్లిం ఇంజనీర్ మాట్లాడాడని.. మతోన్మాదంతో రెచ్చిపోయిన మహిళ
బంధాలను నాశనం చేసిన నేటి వ్యవస్థ.. ఆర్థిక బంధాలకే ప్రాధాన్యం..!
Long live the national truck driversʹ strike!
గుర్రంపై ఊరేగుతున్న దళిత పెండ్లి కొడుకుపై అగ్రకులస్థుల దాడి
చెడ్డీ గ్యాంగ్ బరి తెగింపు.. లౌకికవాదులపై అనుచిత వ్యాఖ్యలు
సినిమాల్లో ʹస్త్రీʹ పాత్ర మారుతోంది..!
రాజ్యమే కుట్ర చేస్తే...
ఉద్యమ స్పూర్తి రగిలించిన ʹచేʹ
ఇదో దుర్మార్గం.. మతోన్మాదం ఒక ఆడపిల్లని పిచ్చిదానిలా చిత్రించింది..!
ఈ హత్యలకు అంతే లేదా..?
Bengaluru techie arrested for Maoist links
ఇక్కడ కవిత్వం కూడా తీవ్రవాదమేనా..?
Leftist Publisher Shot Dead as Blogger Deaths Return to Haunt Bangladesh
ʹదుర్గాప్రసాద్‌ను మధ్యాహ్నంలోగా కోర్టులో హాజరుపరచాలిʹ
ప్రధాని మోడీపై హత్యకు కుట్ర నిజంగానే జరిగిందా..?
పేదవాడి నిజమైన సమస్యను చర్చించిన ʹకాలాʹ..!
వరవరరావుపై ప్రభుత్వం కుట్ర.. ప్రజా, హక్కుల సంఘాల అణచివేతలో భాగమే - విరసం
more..


కశ్మీర్‌లో