అట్టుడుకుతున్న కశ్మీర్.. ముగ్గురి మృతితో రగిలిపోతున్న శ్రీనగర్

సీఆర్‌పీఎఫ్ వాహనం సృష్టించిన విధ్వంసంలో ముగ్గురు మృతి చెందిన తర్వాత కశ్మీర్ లోయ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. ముఖ్యంగా సంఘటన అనంతరం తీవ్ర గాయాలతో కైసర్ అహ్మద్ అనే 21 ఏళ్ల యువకుడు మృతి చెందిన తర్వాత ప్రజలు వందల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా సంఘటన జరిగిన పాత శ్రీనగర్‌లోని నౌహట్టా ప్రాంతంలో ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలియజేస్తున్నారు.

ముఖ్యంగా నిన్నటి సంఘటన తర్వాత పాత శ్రీనగర్ ప్రాంతం మరింతగా రగిలిపోతోంది. మృతి చెందిన వారి అంత్యక్రియల్లో పాల్గొనకుండా హురియత్ కాన్ఫెరెన్స్ చైర్మన్ ఉమర్ ఫారూఖ్‌ను గృహనిర్భంధం చేశారు. మరో వైపు కశ్మీర్ లోయ ప్రాంతంలోని శ్రీనగర్, బుద్‌గావ్ జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది.

వందలాది మంది ఆందోళనకారులు శ్రీనగర్ లోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ నినాదాలు చేస్తున్నారు. అయితే ఆందోళనలు తీవ్రతరం కాకుండా రక్షక దళాలు భాష్పవాయువును ప్రయోగించారు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వతంత్ర్యం కావాలంటూ భారీ ఎత్తున నినాదాలు చేస్తూ ప్రజలు ప్రదర్శనలు చేస్తున్నారు. అయితే రంజాన్ మాసంలో కాల్పుల విరమణ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా ఇలాంటి సంఘటన జరుగుతుండటంతో ఆందోళనలు తగ్గడం లేదు.

Keywords : కశ్మీర్, సీఆర్పీఎఫ్,ఆందోళనలు, శ్రీనగర్, kashmir, crpf, jeep, vehicle, ran over,
(2024-03-26 12:46:32)



No. of visitors : 655

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


అట్టుడుకుతున్న