ʹమావూర్లో మారాజ్యంʹ అంటూ పోరు జండాలు ఎగరవేసిన ఆదివాసీలు


ʹమావూర్లో మారాజ్యంʹ అంటూ పోరు జండాలు ఎగరవేసిన ఆదివాసీలు

ʹమావూర్లో

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలోని ఎజెన్సీ గ్రామాల్లో జూన్ రెండవ తేదీ నుంచి స్వయం పాలన ప్రకటించుకున్న‌ ఆదివాసీ సంఘాలు గ్రామ శివారుల్లో ʹమావూళ్ళో మారాజ్యంʹ అంటూ బోర్డులు ఏర్పాటు చేసి స్వయం పాలనకు నడుంభిగించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా స్వయం పాలన ప్రకటించి నిరసన తెలుపారు . లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేవరకు ఉద్యమాన్ని ఉదృతం చేయాలని ఆదివాసులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో గురువారం అర్ధరాత్రి 12:00 నుండి ఆదివాసుల సమస్యలపై నిర్లక్ష్యం
వారి పోరాటలపై ప్రభుత్వం చిన్న చూపుచూసుకోవడాన్ని నిరసిస్తు స్వయం పరిపాలనకై తుడుం మోగించి మా ఊర్లో మరాజ్యం అంటూ గళం ఎత్తారు . దోపిడి నుంచి తమకు తాము రక్షించుకోవాల్సిన అవసరముందని ఆదివాసిలు భావిస్తున్నారు. చదువుకున్న వారు సాటివారిని మేల్కొల్పడం ప్రారంభించారు. తరతరాల నుంచి తమకు జరుగుతున్న అన్యాయాలపై పోరుబాట పట్టారు.
రాజ్యంగం కల్పించిన హక్కులను ఉల్లంగుస్తూ .. మైదాన ప్రాంత వలసదారుల కుట్రలతోతమ భూములను తమ ఉద్యోగాలను కొల్లగొడుతున్న వర్గాలను ఎస్టీ జాబితాలో అన్యాయంగా చేర్చడంతో తమ మనుగడకే ప్రమాదం ఏర్పడిందన్న ఆదివాసులు ఎన్నో ఎండ్లుగా పోరటాలు చెస్తున్నారు ..ఓ వైపు గిరిజనేతరులు తమ ప్రాంతాలకు వచ్చి తమ తమ పై పెత్తనం చెలాయించడం...మరో వైపు గిరిజనులుగాచెప్పుకుంటున్న మహారాష్ట్ర నుండి వలస వచ్చిన లంబాడిలు అక్కడ బిసిలుగా ఉండి ఉపాదికోసం ఇక్కడకు వలసలు వచ్చి లాబియింగా ద్వారా గత ప్రభుత్వాల వద్ద గిరిజనులుగా సర్టిఫికెట్ లు సంపాదించి ఆదివాసిల అవకాశలన్నింటిని కొల్లగోడుతున్నారని మండిపడుతు కుట్రలు కుతంత్రాలు రాజకీయాలు లాబియింగ్ లు తెలియని తమకు తెలిసిన ఎకైక మార్గమైన పోరుబాటను ఎంచుకున్నారు అడవిబిడ్డలు...లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఉద్యమం మొదలుపెట్టారు. గత ఏడు నెలల నుంచి ఆదివాసులు అస్థిత్వ కోసం పోరాటం చేస్తున్నారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్న డిమాండ్‌తో సాగుతున్న ఉద్యమం అడవి ఒడిలోకి దూసుకుపోయింది. ఎజెన్సీ ప్రాంతాల్లోని పాఠశాలల్లో పనిచేస్తున్న లంబాడ ఉపాద్యాయులను ఆదివాసులు బహిష్కరించారు. పీసా చట్టం మేరకు గ్రామ సభల ద్వారా తీర్మానాలు చేసి లంబాడ ఉపాధ్యాయులు తమ గ్రామాల్లోకి రావద్దని హుకుం జారీ చేయడంతో జిల్లాలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. అనేక సందర్భాల్లో లంబాడాలు, ఆదివాసుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
లంబాడాలు ఆక్రమించి సాగుచెసుకుంటున్న వందల ఎకరాల్లో కూలిలుగా పనిచెస్తున్న ఆదివాసిలు తిరగబడ్డారు..శంకర్ లొద్ది అనె
ప్రాంతంలో ఓ లంబాడ వ్యక్తికి ఎకంగా 120 ఎకరాల అటవి భుమి ఉంది దానిని ఎదోవిదంగా పట్టాభమిగా సైతం మార్పించుకున్నాడు
అట్లా చాలామంది లంబాడాలు వందల ఎకరాలను ఆక్రమించి ఇదే ఆదివాసిలను కూలిలుగా మార్చి పత్తి పండిస్తున్నారు నిజానికిఆభూములకు నిజమైన హక్కుదార్లు ఆదివాసిలే కాని ఇవన్ని తెలియని అమయకులను చెసి వారిని భమిలేని వారిగా మార్చేసారు ..అయినా భ‌రించారు...ఐటిడిఎ ద్వారా వచ్చే అన్ని సహాయ పథకాలను గద్దల్లా తన్నుకపోతున్నారనే విషయాన్ని గ్రహించామని ఎజెన్సి ప్రాంత ఉధ్యోగాలను ఎగరేసుకపోవడమే కాదు చదువురాని తెలివిలేని అంగుట్ గాల్లు అంటు అవహేళనగా మాట్లాడుతుండడాన్నిసహించలెకపోతున్నామని ఆదివాసిలు ఆగ్రహం వ్యక్తం చెస్తున్నారు.. రాజకీయంగా ఎదిగడానికి వలసలను ప్రోత్సహించి తమ ప్రాంతంలో తమను మైనార్టిలుగా మార్చి ప్రభుత్వలచే వారికి అనుకలంగా వ్యవహరించే వారి వర్గాలనే అదికారులుగా పోస్టింగ్ లు వెయించుకోని ఆదివాసి తెగలను తివ్రంగా అనిచివెస్తు తమ సంస్కృతిపై దాడి చెస్తూ ఆదిలాబాద్ జిల్లా అంటే ఆదివాసిల జిల్లా గా ఉండేదాన్ని గోండ్వాన రాజ్యాన్ని పూర్తిగా తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకోనితమ ఉనికినే దెబ్బతియలని ప్రయత్నిస్తున్న వారిని తరిమికోడతాం అని తుడుం
మోగిస్తున్నాయి ఆదివాసి గుడాలు.

మొన్నటిదాకా జరిగిన గొడవలవల్ల ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో పరిస్థితి చల్లబడ్డ్డా ఎజెన్సీ ప్రాంతాల్లో సమస్య కార్చిచ్చులా రగులుతూనే ఉంది. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేవరకు ఉద్యమాన్ని ఉదృతం చేయాలని ఆదివాసులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఎజెన్సీ ప్రాంతాల్లో స్వయం పాలనను ప్రకటించాలని నిర్ణయించారు. మాహనాటే మావా రాజ్ (మా ఊళ్లో మారాజ్యం) నినాదంతో ఎజెన్సీ గ్రామాల్లో వచ్చే జూన్ రెండో తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా స్వయం పాలనను ప్రకటించారు ఈ మేరకు ఎజెన్సీ ప్రాంతాల్లో రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు నల్లజెండాలు ఎగరవేసారు

కొత్త రాష్ట్రం ఏరడ్డప్పటికీ దోపిడీ ఆగలేదని అందోళన వ్యక్తం చేస్తున్న ఆదివాసులు వలసవాదులను ఎజెన్సీ ప్రాంతాల నుంచి తరిమికొట్టాలని అవతరణ రోజు గ్రామాలలో నల్ల జెండాలు ఎగురవేసి నిరసన తెలుపారు నిర్ణయించారు. ఎజెన్సీ ప్రాంతాల్లో పీసా చట్టాన్ని అనుసరించే తమ గ్రామాల్లో స్వయం పాలన సాగిస్తామంటున్నారు. ఆదివాసులు, జూన్ 2వ తేది నుంచి లంబాడ తెగకు చెందిన ఉద్యోగులెవరిని ఏజెన్సీ గ్రామాల్లో అనుమతించేది లేదని పేర్కొంటున్నారు. విద్యా, వైద్య, అటవీశాఖ, పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ, ఎక్సైజ్, నీటి పారుదలశాఖ, తాగు నీటి శాఖ, గిరిజన సంక్షేమ శాఖతోపాటు ఇతర శాఖల్లోను పనిచేస్తున్న లంబాడ ఉద్యోగులను గ్రామాల్లోకి రానివ్వ కూడదని నిర్ణయించారు. స్వయం పాలన ప్రకటించి లంబాడాలను అడ్డుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆది వాసులు నిర్ణయించారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పాత 44 మండలాల్లో ఆదివాసులు విస్తరించి ఉన్నారు. ఉట్నూర్, నార్నూర్, జైనూర్, సిర్పూర్(యు), ఇంద్రవెల్లి పాత మండలాలు పూర్తిగా షెడ్యూల్డ్ గ్రామాలున్నాయి. ఉమ్మడి జిల్లాలో 844 గ్రామాల్లో ఆదివాసులు మనుగడ సాగిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం డివిజన్‌లో ఎనిమిది మండలాలు పూర్తిగా షెడ్యూల్ ప్రాంతమే పాల్వంచ, కొత్తగూడెం డివిజన్‌లలోను ఆదివాసులు విస్తరించి ఉన్నారు. వరంగల్ జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోను ఆదివాసులున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గోండ్, కొలాం, తోటి, ప్రదాన్, నాయక్‌ఫోడ్, కోయ ఆదివాసీ తెగలుండగా, ఖమ్మం జిల్లాలో కొండరెడ్డి, కోయ, ఎర్కల, యానాది, ఏటురునాగారం ఐటీడీఎ పరిధిలో చెంచు, కొండరెడ్డి, నాయక్‌పోడ్‌లు మనుగడ సాగిస్తున్నారు.

లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల ఆదివాసులు హక్కులు, ఉద్యోగాలు, భూములు కోల్పోతున్నారని ఆదివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పడ్డ తుడుందెబ్బ ఆదివాసులకు అండగా ఉండి పోరాటాన్ని ఉదృతం చేస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాల్లో ఆందోళనలు ఉదృతంగా సాగుతున్నాయి. ఎజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసులు స్వయం పాలనను ప్రకటించుకుంటే రాబోయే రోజుల్లో ఎజెన్సీ ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయోనని ఆందోళన వ్యక్తమవుతుంది.

****************************************

- ʹమా ఊళ్లో మారాజ్యంʹ నినాదంతో ఉద్యమం
- తుడుం దెబ్బ ఆద్వర్యంలో ఆదివాసీల పోరు
- జూన్ 2 నుండి గిరిజన సంఘాల సమరశంఖం
- లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి
- గూడెంల నుంచి లంబాడా టీచర్ల బహిష్కరణ
- లంబాడాల మీద ఆదివాసీ తెగల పోరాటం

*************************"**"""""********""*
- శ్రీధర్ అంకుల‌

Keywords : adivasi, telangana, lambada, adilabad
(2019-04-19 19:48:19)



No. of visitors : 1002

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.

మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

ఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్‌ ముట్టడి, పెరేడ్‌ గ్రౌండ్స్‌లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్‌ ఉద్యమాలు నిర్వహించారు.

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

ʹనీ బాంచెన్ దొరా కాల్మొక్తʹ

జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ఖిల్లాలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పాదాభివందనం చేస్తున్నానంటూ ...

మహాజనాద్భుత సాగరహారానికి నాలుగేళ్ళు

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపుత్రుల దేహాల సంరంభాన్ని అనుభవించవలసిన సందర్భం అది....

Search Engine

ఇంద్రవెల్లి ఘటన జరిగిన మూడురోజులకు రాడికల్స్ వేసిన కరపత్రం పూర్తి పాఠం
పోలీసుల వలయంలో ఇంద్రవెల్లి...స్వరాష్ట్రంలోనూ అమరులకు నివాళులు అర్పించుకోలేని దుస్థితి
ఇంద్రవెల్లి ఇంగలం - వరవరరావు
అతడు ఓటేయలేదు..!
ʹఆ తొమ్మిది మందిʹ అద్భుత మానవుల కరచాలనం
మోడీ విధానాలే తన వైఖరి అని తేల్చి చెప్పిన కెసిఆర్
వికీలీక్స్‌ ఫౌండర్‌ జూలియన్ అసాంజే అరెస్ట్‌
బీజేపీకి ఓటు వేయకండంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న‌ రైతు !
ʹప్రొఫెసర్ సాయిబాబాను తక్షణమే విడుదల చేయాలిʹ
Condemn the denial of bail to human rights defender Dr. GN Saibaba
Open Letter to KCR from Varavara Raoʹs wife
కేసీఆర్‌కు వరవరరావు సహచరి బహిరంగ లేఖ
ఓట్లడిగే నైతిక హక్కు.. ఈ పార్టీలకు లేదు...!!
లేబర్ ఆఫ్ లవ్... ఇది మన కథే..!
ఈ దేశం మరోసారి మోసపోకూడదు.
బీమా కోరేగావ్ కేసులో మరో మంగళవారం.. పూణే కోర్టులో ఆ రోజు ఏం జరిగింది..?
సాయిబాబా,వరవరరావులని విడుదల చేయాలి - వివిధ పార్టీలకు 100మంది మేధావుల లేఖ
After 12 Years In Jail For 157 Charges, Nirmalakka Is Set Free
విద్వేష‌ రాజకీయాలను ఓడించండి - 200 పైగా రచయితల విఙప్తి
ఫాసిజమై మారుతోంది ప్రజాస్వామ్య నాటకం
బీజేపీ వ్యతిరేక ప్రచారానికి డైరెక్టర్ ʹపా రంజిత్ʹ మద్దతు
మోడీ, బీజేపీ సర్కారును కూలదోయండి : దేశానికి ఫిల్మ్ మేకర్స్ అభ్యర్థన
Solidarity Statement from the US Coalition to Free Professor G.N. Saibaba
పోలీసుల ప్రయత్నం విఫలం... నక్కా వెంకట్రావుకు బెయిల్ మంజూరు
వరవరరావు సహచరి హేమలత‌ ఛీఫ్ జస్టిస్‌కు రాసిన బహిరంగ లేఖ
more..


ʹమావూర్లో