ఇజ్రాయేల్ కౄరత్వానికి.. శాంతి ప్రేమికురాలి బలి

ఇజ్రాయేల్

కౄరత్వం, కర్కశత్వం అనే వాటికి సమానర్థం అంటే ఇజ్రాయేల్ సైన్యమే. పాలస్తీనాపై దురాక్రమణ చేసి ఇజ్రాయిల్ అనే ఒక దుర్మార్గమైన దేశాన్ని సృష్టించింది అమెరికా. ఆ అమెరికా మద్దతుతో ఇజ్రాయేల్ చేస్తున్న అకృత్యాలకు అంతూ పొంతూ లేదు. పాలస్తీనా భూభాగంపై ప్రతిరోజూ ఇజ్రాయిల్ చేస్తున్న దుర్మార్గమైన దాడుల్లో ఎంతో మంది అమాయకులు బలైపోతున్నారు. ఇజ్రాయేల్ లాంటి ఉగ్రదేశానికి అమెరికా వంటి అగ్రదేశం తోడవటంతో వీరి అకృత్యాలకు అంతే లేకుండా పోతోంది. తాజాగా వీరి దాడిలో ఒక నర్సు చనిపోవడం యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది.

గాజా ప్రాంతంలో 21 ఏండ్ల రజన్ అల్ నజ్జర్ అనే యువతి నర్సుగా సేవలందిస్తోంది. ఇజ్రాయేల్ దేశం నిత్యం జరిపే దాడుల్లో గాయపడి, నెత్తురోడుతున్న ఎంతో మంది ప్రాణాలు కాపాడింది నజ్జర్. తాను స్వయంగా నిరసనలు జరిగే ప్రదేశాలకు వెళ్ళి ప్రదర్శనల్లో గాయపడ్డవారికి చికిత్స చేసేది నజ్జర్. ఒక వైపు ఇజ్రాయిల్ తూటాలు వచ్చి పడుతున్నా లెక్క చేయక తన ప్రాణాలను ఫణంగా పెట్టి వేలాది మందిని రక్షించింది నజ్జర్. పాలస్తీనా పట్ల, ప్రజల పట్ల నజ్జర్ ప్రేమ.. శాంతి పట్ల ఆమె ఆకాంక్ష పాలస్తీనాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అమెకు అభిమానులను సంపాదించి పెట్టింది.

బాధితుల పట్ల, అణగారిన ప్రజలపట్ల ఆమె ప్రేమకు ప్రపంచమే ఫిదా అయ్యింది. అట్లాంటి ఓ శాంతి ప్రేమికురాలిని ఇజ్రాయిల్ హత్య చేసింది. ఆమె గాయాలపాలైన వారికి చికిత్స చేయడమనే తనకిష్టమైన పని చేస్తూనే చివరి ఊపిరి వదిలింది. గత శుక్రవారం నిరసనలు జరుగుతున్న సమయంలో గాయపడిని ఒక వ్యక్తికి చికిత్స చేస్తోంది. అప్పటికే కాల్పులు మొదలు పెట్టిన సైన్యం.. నిరసనకారులను ఆ ప్రదేశం ఖాళీ చేయాలని హెచ్చరించారు. అప్పటికే కొంత మంది వెనుదిరిగారు. కాని గాయపడిన వ్యక్తికి చికిత్స చేస్తున్న రజన్‌కు గురి చూసి ఇజ్రాయిల్ సైన్యం కాల్పులు జరిపింది. ఆ కర్కశ, దురాక్రమణ సైన్యాలు కాల్చిన బుల్లెట్ ఆమె గుండెల్లోంచి దూసుక పోయింది.

గతంలో ఇజ్రాయేల్ సైన్యం దాడి చేసినప్పుడు ఆమె ఎంతో మందికి చికిత్స చేసింది. అలా ఆమె సహాయక చర్యల్లో పాల్గొన్నప్పుడు ఎంతో మంది ఫొటోలు కూడా తీశారు. చివరికి అలా సేవలందిస్తూనే ఇజ్రాయేల్ సైన్యం చేతిలో బలైపోవడం యావత్ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచింది. రజన్ అంతిమ యాత్ర గాజా స్ట్రిప్‌లోని వీధుల మధ్యగా సాగినపుడు వేలాది మంది పాలస్తీనీయులు వెంట వచ్చారు. వారంతా తమ కుమార్తెను కోల్పోయామన్న వేదనతో రోధించారు.

మరోవైపు పిల్లలు, మహిళలు అనే తేడా లేకుండా ఇజ్రాయేల్ సైన్యం దారుణాలకు పాల్పడుతోంది. గత కొన్నేండ్లుగా పాలస్తీనీయులు తమ భూభాగం కోసం గొడవ పడుతున్నారు. ఇరు దేశాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. పాలస్తీనా లోని గాజా ప్రాంతంలో ఈ ఘర్షణలు మరింత తీవ్రంగా మారాయి. ఇటీవల అమెరికా ప్రధాని ట్రంప్ తమ దేశ రాయబార కార్యాలయాన్ని జెరుసలేంకు మార్చడంపై పాలస్తీనాలో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. అసలు ఆ నగరం తమదేనని పాలస్తీనీయులు వాదిస్తున్నారు. కాని పాలస్తీనా ప్రజల ఆవేదనను ఐక్యరాజ్య సమితితో సహా ఏ దేశం కూడా వినట్లేదు.

అమెరికాను ఎదిరించి ఇజ్రాయేల్‌కు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లే కరువవడంతో ఆ దేశ సైన్యం మరింతగా రెచ్చిపోతోంది. మరోవైపు రజన్ మృతిపై విచారణ చేపడతామని ఇజ్రాయేలీ సైన్యం ప్రకటించడం హాస్యాస్పదం. వీరి అరాచకాలకు ఇంకెంతమంది రజన్ లాంటి వాళ్లు మరణించాలో..!

Keywords : రజన్ నజ్జర్, పాలస్తీనా, నర్స్, వలంటీర్, ఇజ్రాయేల్, సైన్యం, అమెరికా, rajan al najjar, palastine, gaja strip, nurse, volenteer, israyel, army, america
(2024-03-23 21:36:48)



No. of visitors : 1459

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఇజ్రాయేల్