పౌర హక్కుల నాయకుల అక్రమ అరెస్టుపై వెల్లువెత్తుతున్న నిరసన


పౌర హక్కుల నాయకుల అక్రమ అరెస్టుపై వెల్లువెత్తుతున్న నిరసన

పౌర

భీమా - కోరేగావ్ ఘటనకు కారకులంటూ అక్రమ కేసులు బనాయించి నేడు పూణే పోలీసులు పలు ప్రాంతాల నుంచి ఐదుగురు ప్రజా సంఘ నాయకులను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు, ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాల నుంచి తీవ్రమైన నిరసన ఎదురైంది. విరసం నాయకులు వరవరరావు ఈ రోజు సోమాజీగూడలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భీమా కోరేగాం ఆందోళ‌న వెన‌క మావోయిస్టులు ఉన్నార‌నే నెపంతో ఆ ఉద్య‌మానికి నాయ‌క‌త్వం వ‌హించిన ద‌ళిత, ఆదివాసీ, హ‌క్కుల కార్య‌క‌ర్త‌లను పోలీసులు అరెస్టు చేయ‌డాన్ని విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు సుధీర్ దావ్లే, సురేంద్ర గ‌డ్లింగ్‌, రోనా విల్స‌న్‌, షోమాసేన్‌, తుషార్ కాంత్‌, మ‌హేష్‌ రావత్ అరెస్టులు అక్రమమని.. ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా పని చేస్తోన్న బీజేపీ ప్రభుత్వం చేసిన అరెస్టులని వారు అన్నారు. అరెస్టు చేసిన హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం డిమాండ్ చేసింది. అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం వైపు ఎస్‌సీ / ఎస్టీ అట్రాసిటీ యాక్టును నిర్వీర్యం చేస్తూ మ‌రోవైపు ద‌ళితులు, ఆదివాసీల‌ను అక్ర‌మ కేసుల్లో ఇరికిస్తోంది. ఓవైపు ఆప‌రేష‌న్ గ్రీన్‌హంట్ పేర దేశ ప్ర‌జ‌ల‌పై యుద్ధం చేస్తున్న రాజ్యం, మ‌రోవైపు ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డిన హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల‌పై మావోయిస్టులు, దేశ‌ద్రోహులు అనే ముద్ర వేస్తోందని ఆయన ఆరోపించారు.

టీవీవీ నిరసన..
మావోయిస్టులతో సంబంధాలున్నాయనే నెపంతో ఐదుగురు హక్కుల కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని తెలంగాణ విద్యార్థి వేదిక ఒక ప్రకటనలో ఖండించింది. పౌర హక్కుల నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని.. ఆదివాసీలకు వ్యతిరేకంగా నడుస్తోన్న గ్రీన్ హంట్‌ను ఆపేయాలని వారు ఒక ప్రకటనలో కోరారు.

రోడ్లపై నిరసన..
పౌర హక్కుల నాయకుల అక్రమ అరెస్టును నిరసిస్తూ వందలాది మంది ప్రజలు గోరేగావ్ సమీపంలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేని దిగ్భంధం చేశారు. వందలాది మంది ప్రజలు, సానుభూతి పరులు రోడ్డుపై నిరసన తెలపడంతో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు ఆగిపోయాయి. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు.

Keywords : bhima - koregaon,maoists, human rights activists,virasam, tvv,భీమా కోరేగావ్, విరసం, నిరసన,పౌర హక్కులు, ప్రజా సంఘాలు, టీవీవీ
(2019-05-17 07:10:29)No. of visitors : 863

Suggested Posts


0 results

Search Engine

కోరాపుట్ ఎన్ కౌంటర్: నిజ నిర్దారణ బృందాన్ని అడ్డుకున్న పోలీసుల స్పాన్సర్ సంఘం
ఒడిశా బూట‌కపు ఎన్ కౌంటర్ కు నిరసనగా దండకారణ్య బంద్
ʹవీరన్న దూరమైనా పీడిత వర్గాల పోరాటంలో జీవించే ఉంటాడుʹ
ప్రొ.సుజాత సూరేపల్లికి TVV కి విరసం సంఘీభావం
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు నేడు మావోయిస్టులా..?
సాయిబాబా నుండి సూరేపల్లి సుజాత వరకూ...! -ఎస్.ఏ. డేవిడ్
నిర్వాసితుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్తే.... హ‌క్కుల‌ కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేశారు
బీజేపీ మళ్ళీ అధికారానికొస్తే....
Saibaba being denied even food by jail authorities. humiliation under humid conditions
వరంగల్ లో విద్యార్థులు, రచయితలు, మహిళలతో సహా ప్రజా సంఘాల నేతల అరెస్టు..ఖండించిన విరసం
#CloudyModi మేఘాల చాటున మోడీ యుద్దం... నెటిజనుల సెటైర్లు
ఈ దేశ విముక్తి పోరాటంలో తన నెత్తురుతో ఎర్రజెండాను మరింత ఎరుపెక్కించిన కామ్రేడ్ స్వరూపకు జోహార్లు !
నరేద్ర‌ మోడీపై టైమ్ మ్యాగజైన్ సంచలన కథనం
సంస్కరణలు-ప్రజాస్వామ్యం
రాజస్థాన్ లో దళిత మహిళపై సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ రేపు హైదరాబాద్ లో నిరసన ప్రదర్శన
ఈ దేశం దళితులకేమిచ్చింది ?
భారత మాతకు పాకిస్తాన్ బిడ్డ రాసిన ఉత్తరం
ఎడ్సిమెట్ట ఆదివాసులపై హత్యాకాండ ‍- ఆరేళ్ళ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు
అవును నేను మావోయిస్టునే..!
సీజేకు క్లీన్ చిట్ ఇవ్వడంపై సుప్రీం కోర్టు ముందు ఆందోళ‌న నిర్వహించిన‌ మహిళల అరెస్ట్
తమ పక్కన కూర్చొని భోజనం చేశాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకుల అహంకారులు
దళితుణ్ణి పెళ్ళి చేసుకున్నందుకు యువతిని పెట్రోల్ పోసి కాల్చి చంపిన కన్న‌ తండ్రి
ప్రజాపోరాటాల సాక్షిగా ఆ గొంతు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది - అరుణోదయ రామారావుకు అరుణారుణ జోహార్లు.
అరుణోదయం ఆయన గానం..విప్లవం ఆయన ప్రాణం
సర్జికల్ దాడుల రాజకీయాలు
more..


పౌర