ʹమోడీ హత్యకు కుట్రʹ అనేది ఓ బూటకం.... ప్రజా ఉద్యమాలను అణచడానికి పాలకులాడే నాటకం


ʹమోడీ హత్యకు కుట్రʹ అనేది ఓ బూటకం.... ప్రజా ఉద్యమాలను అణచడానికి పాలకులాడే నాటకం

ʹమోడీ

మోడీ ప్రభుత్వం మరో దుర్మార్గమైన కుట్రకు తెరలేపింది. అసత్యాలే ఆలంభనగా కట్టుకథల లేకను సృష్టించి ప్రజా కార్యకర్తలను జైళ్ళపాలు చేసి హింసించే క్రూరత్వానికి ఓడిగట్టింది. దేశవ్యాప్తంగా వీస్తున్న మోడీ వ్యతిరేక పవనాలనుండి ప్రజల దృష్టి మరల్చడానికి, దేశవ్యాప్తంగా బ్రాహ్మణీయ హిందుత్వ‌ దోపిడీ అణిచివేతలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటాలపై ఉక్కుపాదం మోపేందుకు కట్టుకథలను ఆసరా చేసుకుంటున్నది. దళితుల ఆత్మగౌరవ పతాక భీమా కోరేగావ్ లో దళితులపై దాడులు చేసిన వారిని వదిలేసి దళితులే అల్లర్లకు కారణమంటూ 5గురు దళిత కార్యకర్తలు ఎల్గార్ పరిషత్ నిర్వాహకుడు సుధీర్ ధావలే, ఢిల్లీకి చెందిన రాజకీయ ఖైదీల విడుదల కమిటీకి చెందిన రోనా విల్సన్, నాగ్‌పూర్‌కు చెందిన న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్ ఉన్నారు. వీరితో పాటు నాగ్‌పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ షోమ సేన్, మాజీ పీఎంఆర్డీ అధికారి మహేష్ రౌత్ ల‌ను అరెస్టు చేసిన పాలకులు. వాళ్ళ దగ్గర ఓ లేఖ దొరికిందంటూ మరో నాటకానికి తెరలేపారు. పోలీసులే సృష్టించిన, తప్పుల తడకగా ఉన్న ఆ లేఖ ఆదారంగా మోడీని హత్య చేయడానికి కుట్ర జరిగిదంటూ గగ్గోలు పెడుతూ మరిన్ని అరెస్టులకు సిద్దమవుతున్నారు. విప్లవ రచయిత వరవరరావు తమకు సహకరిస్తాడు అంటూ ఆలేఖలో ఉందంటూ ప్రచారాన్ని లంకించుకొని ఆయననూ అరెస్టు చేయడానికి కుట్ర చేస్తున్నారు. అసలు ఆ లేఖనే బూటకమని, పోలీసుల సృష్టి అని చెప్పేందుకు లేఖలోనే ఎన్నో ఉదహరణలున్నాయి. సీనియర్ జర్నలిస్టు, వీక్షణం పత్రిక సంపాదకులు ఎన్. వేణుగోపాల్ ఆ లేఖ ఎంత బోగసో తన ఫేస్ బుక్ టైమ్ లైన్ పై రాశాడు. వేణుగోపాల్ రాసినది యదాతథంగా...

మిత్రులారా, 1971లో అప్పటి పోలీసులు విప్లవోద్యమ సానుభూతిపరుల ఇళ్ల మీద దాడులు చేస్తూ పుస్తకాలు ఎత్తుకు పోతున్నప్పుడు, ఆ పుస్తకాలలో కొన్ని నిషేధించబడినవని కేసులు పెడుతున్నప్పుడు,
"ఆలోచన మీద నిఘా
వేస్తున్న లఫంగులు
పోలీసుల మారుపేరు
పుస్తకాల దొంగలు"
అని మహాకవి శ్రీశ్రీ రాశాడు.

ఈ ఐదు దశాబ్దాలలో ఆలోచనల మీద నిఘావేసే పని నుంచీ, పుస్తకాల దొంగతనం నుంచీ పోలీసులు చాల దూరం ప్రయాణించి, ఎన్నెన్నో ఘనతలు సాధించినట్టున్నారు. విప్లవకారులను పట్టుకుని హత్య చేసిన ప్రతి సందర్భంలో ఒక అభూత కల్పన కథ, ప్రతి లాకప్ హత్య సందర్భంలో ఒక సస్పెన్స్ థ్రిల్లర్, ప్రశ్నించే ప్రజల మీద లాఠీలు ఝళిపించిన, తూటాలు పేల్చిన ప్రతి సందర్భంలో ఒక డిటెక్టివ్ క్రైం స్టోరీ రాస్తున్నారు. చెప్పిందల్లా విని చిలుకపలుకుల్లాగ వల్లించే ప్రచారసాధనాలలో ప్రచారం చేయించుకోవడం పోలీసులకు కొట్టిన పిండి అయింది. అయినా పాపం, ఈ అసాధారణ కాల్పనిక రచనా నైపుణ్యానికి వారికి ఏ సాహిత్య అవార్డులూ దక్కడం లేదు!!

ఇప్పుడు పుణె పోలీసులు, మహారాష్ట్ర పోలీసులు, కేంద్ర సంస్థలు, ఫడ్నవీస్ – మోడీ ప్రభుత్వాలు కలిసి కొత్త అసందర్భ అసాధ్య విచిత్ర సర్రియలిస్టు మాజికల్ రియలిస్టు కథా రచనకు పూనుకున్నాయి. భీమా కోరేగాం దళితుల యాత్ర మీద హిందూత్వ శక్తులు జరిపిన హింసాకాండకు, ఒకరిని బలి తీసుకున్న ఘటనకు బాధ్యులైన హిందుత్వ తీవ్రవాదులను అరెస్టు చేయాలని, విచారణ జరపాలని కోరినందుకు నాగపూర్, ముంబై, ఢిల్లీలలో ఉన్న ప్రజాస్వామిక హక్కుల, దళిత కార్యకర్తలను అరెస్టు చేసి అబద్ధపు కేసు బనాయించారు. వారి దగ్గర దొరికాయని అబద్ధపు ఉత్తరాలను సృష్టించారు. సృష్టిస్తున్నారు.

కాని ఎంత సమర్థుడైన దొంగ అయినా ఆధారాలు వదిలి పెడతాడన్నట్టు, ఇప్పటికి బైటపెట్టిన ఒక ఉత్తరంలో అది అబద్ధపు ఉత్తరమని, కట్టుకథ అని చెప్పడానికి అంతర్గత ఆధారాలు ఎన్నో ఉన్నాయి. రోనా విల్సన్ కు మహారాష్ట్ర మావోయిస్టు పార్టీ నాయకుడు మిళింద్ తేల్ తుంబ్డే రాసినట్టు చెపుతున్న ఈ ఉత్తరం సంబోధన ఎప్పుడూ ఏ విప్లవకారుడూ రాయని పద్ధతిలో "లాల్ జోహార్" అని మొదలయింది!! జనవరి 2న రాసినట్టు చెపుతున్న ఆ ఉత్తరంలో డిసెంబర్ లో జరగబోయే కార్యక్రమం ఎలా జరపాలో సూచనలున్నాయి! ప్రకాశ్ అంబేడ్కర్ నూ జిగ్నేష్ మేవానీ నీ కామ్రేడ్ అని సంబోధించడం ఉంది! ʹమన కార్యక్రమాలకు కాంగ్రెస్ నిధులు సమకూరుస్తున్నదిʹ అని విప్లవోద్యమ నాయకుడు రాసినట్టు ఉంది! రానున్న ఒకటి రెండు రోజుల్లో మరెన్ని అబద్ధాల ఉత్తరాలు సృష్టిస్తారో! ఆ అబద్ధాల ఆధారంగా ఎన్ని చర్యలు జరుగుతాయో...

Keywords : varavararao, maoists, police, arrests, modi
(2018-11-15 19:12:57)



No. of visitors : 1422

Suggested Posts


తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

మందుపాతరలతో దాడి చేశాం అని ఒప్పుకున్నారు కదా..ఇది యుద్దం అని ప్రకటించండి - పాలకుల‌కు వరవరరావు సవాల్

మందుపాతరలు ఉపయోగించాం అని పోలీసు అధికారులే చెప్పారు కాబట్టియుద్దం చేస్తున్నామని ప్రకటించండి. ఇది యుద్దక్షేత్రమని మీరు ఒప్పుకోండి మరో దేశం మీద యుద్దంజరిగితే ఏం జరగాలో అదే ఇక్కడా జరగాలి. రెడ్ క్రాస్ రావాలల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ ఆమ్నెస్టీ రావాల్సి ఉంటుంది. జెనీవా సూత్రాలను అంగీకరించాల్సి ఉంటుంది.

కామ్రేడ్ కాకరాల పద్మ ఎక్కడ ?

విప్లవ కార్యకర్త, విప్లవ మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ కాకరాల పద్మ ఏమైంది. నాలుగు రోజుల కింద తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సెన్నిమలై దగ్గర ఆమెను కిడ్నాప్ చేసిన ʹగుర్తు తెలియని వ్యక్తులుʹ పద్మను ఏం చేశారు...

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

తూత్తుకుడి... గడ్చిరోలీ - వరవరరావు

రాగి కంపెనీ మూతపడకుండా నా బిడ్డ అంత్యక్రియలు చేయనని ఒక తల్లి ప్రతిఙ చేసింది. పదమూడు కుటుంభాలు పట్టుబట్టాయి. ప్రజలు వాళ్ళకు అండగా ఉన్నారు. నీ పక్క గదిలో శవం కుళ్ళుతూ ఉంటే వచ్చే దుర్వాసన ఇంకెంత మాత్రం ప్రైవేటు వ్యవహారం కాదంటాడు సర్వేశ్వర్ దయాల్ సక్సేనా అనే హిందీ కవి.

Search Engine

తెలంగాణ వ‌స్తే ఏమొచ్చింది? - చింత‌కింది కాశీం
తిత్లీ బాధితులకు బియ్యం పంచుతుంటే అరెస్టు చేసిన ప్రజాసంఘాల నాయకులను వెంటనే విడుదల చేయాలి : విరసం
పదమూడేండ్లుగా ఓటెయ్యని గ్రామం.. ఈ సారి కూడా ఓటెయ్యొద్దని తీర్మానించుకున్నారు..!
ఆర్టికల్497, శబరిమల తీర్పులు.. ప్రగతిశీలమైనవేనా ?
అరుణ్ ఫెరీరాను కస్టడీలో విచారణ పేరుతో చిత్రహింసలు పెడుతున్న పూణే పోలీసులు
కిడారి, సోమ హత్యలపై మావోయిస్టు పార్టీ 14 పేజీల లేఖ విడుదల
ʹమేదావులు, హక్కుల కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలిʹ
కొమురం భీం వర్ధంతి ఎన్నడు ? అసత్యాలు ఎందుకు ప్రచారం చేస్తున్నారు ?
Maoists call for boycott of Telangana polls
అనారోగ్యంతో ఉన్న మీనాను పట్టుకొని కాల్చి చంపారు - స్పష్టం చేస్తున్న ఆదివాసులు
గ్రేహౌండ్స్ బలగాలను చుట్టుముట్టిన వేలాది ఆదివాసులు - మావోయిస్టు ప్రమీల‌ మృతదేహం కోసం పోరాటం
హిందుత్వ హింసను, రాజ్య హింసను సమర్థిస్తారా - ‍ స్వామి అగ్నివేశ్, సందీప్ పాండే
అక్రమాల యుద్ధ విమానాల రెక్కల చప్పుడు - ఎన్. వేణుగోపాల్
CBI carried out ʹbiasedʹ investigation, says JNU student Najeeb Ahmedʹs mother; claims probeʹs purpose was to shield assaulters
CPI Maoist Announces ʹOperation Ghamasanʹ To Counter Governmentʹs ʹOperation Samadhanʹ
నజీబ్ లేడా.. సీబీఐకి కూడా దొరకలేదు
దండకారణ్యంలో నుల్కతోంగ్ నిజాలు
ఏవోబీలో పోలీసు పదఘట్టనల మధ్య దిగ్విజయంగా మావోయిస్టుల బహిరంగ సభ‌
ముందు బాక్సైట్‌ సంగతి చూడండి - పాణి
70వేల మంది రైతులపై పోలీసుల అరాచకం.. బాష్పవాయు గోళాలు.. వాటర్ క్యానన్‌ల ప్రయోగం.. వందలాది మందికి గాయాలు
భీమా-కోరేగావ్ కేసు : నవ్‌లఖా నిర్బంధాన్ని కొట్టేసిన హైకోర్టు
ʹʹహక్కుల కార్యకర్తల అరెస్టుల‌ను ఖండించిన మావోయిస్టు పార్టీ - దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపుʹʹ
హిట్లర్ నిజంగానే తిరిగొచ్చాడు!!
The Maoist party condemned the arrests of rights activists and called for a national agitation to fight against the arrests
Bima Koregaon Case : Delhi High Court frees activist Gautam Navlakha from house arrest
more..


ʹమోడీ